TG Inter Fee: డిసెంబర్ 3 వరకు తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫీజుల చెల్లింపు గడువు, లేట్‌‌ఫీతో జనవరి 2వరకు అవకాశం-telangana inter exam fee payment deadline till december 3 possibility till january 2 with late fee ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Inter Fee: డిసెంబర్ 3 వరకు తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫీజుల చెల్లింపు గడువు, లేట్‌‌ఫీతో జనవరి 2వరకు అవకాశం

TG Inter Fee: డిసెంబర్ 3 వరకు తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫీజుల చెల్లింపు గడువు, లేట్‌‌ఫీతో జనవరి 2వరకు అవకాశం

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 26, 2024 01:40 PM IST

TG Inter Fee: తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువును పొడిగిస్తున్న ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింద.ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం రెగ్యులర్‌, సప్లిమెంటరీ విద్యార్ధులు ఫీజులు చెల్లించడానికి గడువు పొడిగించారు.

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజులకు గడువు
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజులకు గడువు

TG Inter Fee: తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫీజుల చెల్లింపు గడువును బోర్డు పొడిగించింది. ఇంటర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు పరీక్ష ఫీజులు చెల్లింపు గడువును పొడిగిస్తూ బోర్డు కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్‌ రెగ్యులర్, ఒకేషనల్ చదువుతున్న విద్యార్థులు 2025 వార్షిక పరీక్షలకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు కాలేకి వెళ్లకుండా ప్రైవేట్‌‌గా ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యే ఆర్ట్స్‌, హ్యుమనిటీస్ విద్యార్థులు కూడా పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు పెంచారు.

మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ ఫీజుల్ని ఎలంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 27వరకు చెల్లించే అవకాశం ఉండగా దానిని డిసెంబర్ 3వరకు పొడిగించారు. 100 రుపాయల ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించడానికి గడువును డిసెంబర్ 10వ తేదీ వరకు రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 17వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో డిసెంబర్ 24వరకు, రూ.2వేల ఆలస్య రుసుముతో జనవరి 2వరకు ఫీజులు చెల్లించవచ్చు.

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్టు ప్రకటించింది. నవంబర్‌ 6 నుంచి 26 వరకు పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు, ఫెయిల్ అయిన అభ్యర్థులకు (జనరల్, వొకేషనల్), హాజరు నుంచి మినహాయింపు పొందిన ప్రైవేట్ అభ్యర్థులకు, ఆర్ట్స్/హ్యూమానిటీస్ గ్రూపుల విద్యార్థులకు ఈ ఫీజు గడువు వర్తిస్తుందని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

పరీక్ష ఫీజులు ఇలా

తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 6 నుంచి 26 వరకు ఫీజుల చెల్లింపు గడువు ప్రకటించారు. రూ.100 ఆలస్య రుసుముతో నవంబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 4 వరకు ఇంటర్ ఫీజు చెల్లించవచ్చు. ఇంటర్ ఫస్టియర్‌, సెకండియర్‌ జనరల్‌ విద్యార్థులకు రూ.520, ఒకేషనల్‌ విద్యార్థులకు రూ.750 చెల్లించాలని ఇంటర్ బోర్డు తెలిపింది. సెకండియర్‌ జనరల్‌ సైన్స్‌ విద్యార్థులకు రూ.750, సెకండియర్‌ జనరల్‌ ఆర్ట్స్‌ విద్యార్థులకు రూ.520 ఫీజులు నిర్ణయించింది.

  • ఇంటర్ ఫస్టియర్ జనరల్ రెగ్యులర్ కోర్సుల ఫీజు- రూ.520/-
  • ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ రెగ్యులర్ (థియరీ 520 + ప్రాక్టికల్స్ 230) కోర్సుల ఫీజు- రూ.750
  • ఇంటర్ సెకండియర్ జనరల్ ఆర్ట్స్ కోర్సుల ఫీజు - రూ.520
  • సెకండియర్ జనరల్ సైన్స్ (థియరీ 520 + ప్రాక్టికల్స్ 230) కోర్సుల ఫీజు- రూ.750
  • సెకండియర్ ఒకేషనల్ (థియరీ 520 + ప్రాక్టికల్స్ 230) కోర్సుల ఫీజు- రూ.750

Whats_app_banner