road turns red in hyderabad: ఎర్రగా మారిన వీధి రోడ్లు.. షాకైన జనం
- HYD: హైదరాబాద్ లోని జీడిమెట్ల పారిశ్రామికవాడను ఆనుకొని ఉన్న సుభాష్ నగర్ డివిజన్ వెంకటాద్రి నగర్‌లో సోమవారం సాయంత్రం మ్యాన్‌హోల్ నుంచి ఎరుపు రంగు నీరు ఒక్కసారిగా ఉబికి వచ్చింది. రెండు రోడ్లలో ఈ ఎరుపు నీరు పారుతూ తీవ్ర దుర్గంధం రావడంతో నివాసితులు ఊపిరి తీసుకునేందుకు ఉక్కిరిబిక్కిరయ్యారు. కాలనీలోని కొన్ని గోదాముల నిర్వాహకులు రసాయనాలను నేరుగా డ్రైనేజీలో కలిపేస్తున్నారని వాపోయారు. అందుకే ఈ పరిస్థితి అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.