Kanguva OTT: కంగువా కలెక్షన్ల కంటే బెటర్‌గా ఓటీటీ ధర.. ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కొనుగోలు చేసిందంటే? స్ట్రీమింగ్ డేట్ రివీల్-suriya film kanguva box office collection crossed 100 crore ahead of ott release in amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kanguva Ott: కంగువా కలెక్షన్ల కంటే బెటర్‌గా ఓటీటీ ధర.. ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కొనుగోలు చేసిందంటే? స్ట్రీమింగ్ డేట్ రివీల్

Kanguva OTT: కంగువా కలెక్షన్ల కంటే బెటర్‌గా ఓటీటీ ధర.. ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కొనుగోలు చేసిందంటే? స్ట్రీమింగ్ డేట్ రివీల్

Galeti Rajendra HT Telugu
Nov 26, 2024 11:00 AM IST

Kanguva Box Office Collection: కంగువా సినిమా రూ.2,000 కోట్లు వసూళ్లు సాధిస్తుంటూ రిలీజ్‌కి ముందు ప్రొడ్యూసర్ కె.ఇ.జ్ఞానవేల్ బాహాటంగా ప్రకటించాడు. కానీ.. డిజాస్టర్‌గా మిగిలిన ఈ సినిమా ఇప్పటి వరకూ ఎంత వసూళ్లు రాబట్టిందంటే?

కంగువాలో సూర్య, బాబీ డియోల్
కంగువాలో సూర్య, బాబీ డియోల్

Kanguva Collection: హీరో సూర్య నటించిన కంగువా సినిమా ఎట్టకేలకు రూ.100 కోట్ల మార్క్‌ను దాటింది. నవంబరు 14న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో రిలీజైన కంగువా సినిమా.. బాక్సాఫీస్ వద్ద అంచనాల్ని అందుకోలేకపోయింది. విడుదలైన రోజే నెగటివ్ టాక్ రావడంతో.. ఆ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కంగువా సినిమాలో సూర్య సరసన దిశా పటాని నటించగా.. బాబీ డియోల్ విలన్‌గా చేశారు. రూ.350 కోట్లతో తెరకెక్కిన ఈ కంగువా సినిమా.. సూర్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రం.

దెబ్బతీసిన నెగటివ్ రివ్యూస్

కంగువా సినిమా విడుదలకి ముందు తమిళ్ బాహుబలి అంటూ చెన్నై మీడియా తెగ ఊదరగొట్టింది. అంతేకాదు.. రూ.2,000 కోట్లు వసూళ్లు రాబడుతుందంటూ ప్రొడ్యూసర్ కె.ఇ.జ్ఞానవేల్ రాజా బాహాటంగా ప్రకటించాడు. దాంతో సినిమాపై అంచనాలు పతాక స్థాయికి చేరిపోగా.. కథ, కథనం ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. దాంతో రిలీజ్ రోజే పెద్ద ఎత్తున కంగువాపై ట్రోల్స్ నడిచాయి.

తమిళనాడు ప్రొడ్యూసర్స్ కఠిన నిర్ణయం

కంగువా రిలీజ్ రోజు రూ.6 కోట్లు వసూళ్లు రాబట్టగా.. ఆ తర్వాత రెండో రోజుకే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. తెలుగులోనూ సూర్యాకి క్రేజ్ ఉన్నా.. కంగువాపై తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. అలానే తమిళనాడులోనూ ఈ సినిమా మెప్పించలేకపోయింది. సినిమాకి ఇలా రోజు వ్యవధిలో కలెక్షన్లు పడిపోవడానికి కారణం నెగటివ్ రివ్యూస్ అని భావించిన.. తమిళనాడులోని నిర్మాతలు, థియేటర్ల యజమానులు.. థియేటర్ల వద్ద రివ్యూస్ చెప్పడాన్ని నిషేధించారు.

వారం రోజుల్లోనే ఔట్

తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ అక్కడక్కడ థియేటర్లలో కంగువా నడుస్తున్నా.. కర్నాటక, కేరళలోని థియేటర్లలో మాత్రం రిలీజైన 7 రోజుల్లోనే మాయమైపోయింది. కంగువా సినిమాకి మద్దతు తెలుపుతూ.. చాలా మంది సినీ సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు. కానీ.. కలెక్షన్లు మాత్రం పుంజుకోలేదు.

ఓటీటీలోకి కంగువా ఎప్పుడంటే?

కంగువా ఇప్పటి వరకూ భారత్‌లో రూ.80.11 కోట్లు వసూళ్లు రాబట్టగా.. ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి రూ.103.11 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే? కంగువా సినిమాకి వచ్చిన హైప్‌తో రిలీజ్‌కి ముందే ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.80 కోట్లకి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ లెక్కన థియేటర్లలో వసూళ్ల కంటే.. ఓటీటీలో కంగువాకి వచ్చిన డబ్బు బెటర్. కంగువా సినిమా ఓటీటీలో డిసెంబరు 13 నుంచి స్ట్రీమింగ్‌కి వచ్చే అవకాశం ఉంది.

నోరుజారి నవ్వులపాలైన ప్రొడ్యూసర్

కోలీవుడ్‌లో ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా రూ.1000 కోట్ల మార్క్‌ని చేరుకోలేదు.. కంగువాతో ఆ ఫీట్‌ను మీరు సాధిస్తారా? అని కంగువా సినిమా రిలీజ్‌కి ముందు ప్రొడ్యూసర్ కె.ఇ.జ్ఞానవేల్‌ను ప్రశ్నించగా.. అతను చాలా బాహాటంగా సమాధానమిచ్చారు. ‘‘నేను రూ .2000 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లను ఆశిస్తున్నాను. మీరు ఎందుకు రూ.1,000 కోట్లు అంటూ తక్కువ అంచనా వేస్తున్నారు?’’ అని చెప్పుకొచ్చారు. కానీ.. కంగువా సినిమా కేవలం రూ.100 కోట్ల మార్క్‌ని చేరుకోవడానికి ఏకంగా రెండు వారాలు పట్టింది.

Whats_app_banner