ఈ చలికాలం శరీరంలో వెచ్చదనం కోసం తప్పక తీసుకోవాల్సిన ఆహారం ఇదే

Pexel

By HT Telugu Desk
Nov 26, 2024

Hindustan Times
Telugu

బెల్లం పొంగలి: బెల్లం, పప్పు, కొబ్బరితో తయారు చేసే పొంగలి శీతాకాలంలో వెచ్చదనం ఇస్తుంది

Pixabay

మెంతి కూర: మెంతి కూర చలికాలంలో వెచ్చదనం ఇస్తుంది. మెంతి కూరను పప్పుతో కలిపి వండొచ్చు. లేదా సూప్ గా తాగవచ్చు.

Pixabay

కరివేపాకు పచ్చడి: కరివేపాకు విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. కరివేపాకు పచ్చడిని అన్నం, ఇడ్లీ, దోస తో తినవచ్చు.

Pixabay

బొప్పాయి పండు: బొప్పాయి విటమిన్ సి, ఫైబర్ తో నిండి ఉంటుంది. బొప్పాయిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Pexel

మిల్లెట్స్: కొర్రలు, రాగులు, జొన్నలు, సజ్జలు వంటి మిల్లెట్స్ శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి.

Pexel

నువ్వులు: నువ్వులు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతో నిండి ఉంటాయి. శీతాకాలంలో నువ్వులను తినడం చాలా మంచిది.

Pixabay

స్వీట్ పొటాటో కూడా శరీరానికి వెచ్చదనం ఇస్తుంది. అలాగే చలికాలంలో వరి అన్నం తగ్గించి గోధుమ రొట్టెలు తినడం వల్ల ఒంట్లో వేడిగా ఉంటుంది.

Pexel

వేరుశెనగ అన్ని సీజన్లలో తింటారు. కానీ శీతాకాలంలో తింటే మరికొన్ని ప్రయోజనాలు దక్కుతాయి. అవేంటో ఇక్కడ చూసేద్దాం..

Unsplash