Kerala Tour Package : మున్నార్ టీ తోటలు, అలెప్పీ హౌస్‌బోట్ స్టే, పెరియార్ సఫారీ-6 రోజుల కేరళ రోడ్డు ట్రిప్ వివరాలివే!
Kerala Tour Package : ఈ వర్షాకాలంలో రోడ్డు మార్గంలో కేరళ అందాలను వీక్షించాలనుకుంటున్నారా? అయితే కేరళ టూరిజం 6 రోజు టూర్ ప్యాకేజీ అందిస్తుంది. మున్నార్, పెరియార్ టైగర్ రిజర్వ్, అలెప్పీ, కొచ్చిన్ లో ఈ టూర్ ఉంటుంది.
మున్నార్ టీ తోటలు, అలెప్పీ హౌస్‌బోట్ స్టే, పెరియార్ సఫారీ-6 రోజుల కేరళ ట్రిప్ (Kerala Tourism Twitter)
Kerala Tour Package : ఈ మాన్ సూన్ సీజన్ లో దక్షిణ కేరళ అందాలు చూసేందుకు మీరు సిద్ధమా? అయితే కేరళ టూరిజం అమేజింగ్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్ లో బ్యాక్ వాటర్స్, సఫారీ, హిల్స్ స్టేషన్ లను వీక్షించవచ్చు. ఆరు రోజుల టూర్ ప్యాకేజీ రూ.38000 - రూ.59000 వరకు అందుబాటులో ఉంది. రోడ్డు మార్గంలో అనయిరంకల్, మున్నార్, పెరియార్ టైగర్ రిజర్వ్, అలప్పుజాలో ఆక్వా టూరిజం, కొచ్చిలో బోటులో విహారం చేయవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో కేరళ విలేజ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
- 1వ రోజు - కొచ్చిన్ విమానాశ్రయం, రైల్వే స్టేషన్ చేరుకున్న పర్యాటకులను మున్నార్‌కు తీసుకెళ్తారు. మున్నార్ లో విశాలమైన టీ తోటలు, సుందరమైన ప్రకృతి అందాలతో మీ యాత్రను ప్రారంభిస్తారు. మార్గమధ్యలో చీయప్పర, వలరా జలపాతాలు వీక్షించవచ్చు. మున్నార్ చేరుకున్న తర్వాత హోటల్‌కి వెళ్లి, రాత్రిపూట బస చేస్తారు. కొచ్చిన్ నుంచి మున్నార్ కు 130 కిమీ ప్రయాణాన్ని 3.5 గంటల్లో పూర్తి చేస్తారు.
- 2వ రోజు - మున్నార్ హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ తర్వాత స్థానిక పర్యాటక ప్రదేశాల సందర్శనకు బయలుదేరతారు. పోతామేడు, మట్టుపెట్టి, కుండలా డ్యామ్, ఎకో పాయింట్, ఎరవికులం నేషనల్ పార్క్, టీ మ్యూజియం సందర్శించడంతోపాటు సరస్సులో బోటింగ్‌ను ఆస్వాదించవచ్చు. మున్నార్ స్థానిక మార్కెట్‌లను షాపింగ్ చేయవచ్చు. రాత్రికి హోటల్‌కు తిరిగి వెళ్లండి.
- 3వ రోజు - తేక్కడి, జంగిల్ సఫారీ, సూర్యోదయాన్ని, రుచికరమైన అల్పాహారాన్ని ఆస్వాదించడానికి మూడో రోజు త్వరగా లేవండి. మున్నార్ నుంచి తేక్కడి కారులో బయలుదేరతారు. తేక్కడి చేరుకుని అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. సాయంత్రం వరకు పెరియార్ నేషనల్ పార్క్‌లో సఫారీని ఆస్వాదిస్తారు. అనంతరం సుందరమైన పెరియార్ రివర్ ను ఆస్వాదించవచ్చు. రాత్రికి తేక్కడిలో బస చేస్తారు. (మున్నార్ నుంచి తేక్కడికి 94 కిమీ దూరం, ప్రయాణ సమయం సుమారు 3 గంటలు)
- 4వ రోజు - తేక్కడి నుంచి అలెప్పీ, హౌస్‌బోట్ లో స్టే కోసం నాల్గవరోజు ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. అలెప్పీ చేరుకుని హౌస్‌బోట్ లో స్టే చేస్తారు. మీ కేరళ టూర్ లో అత్యంత అద్భుత క్షణాలు ఇవే. హౌస్‌బోట్‌లో రుచికరమైన భోజనం చేసి, అలెప్పీ బ్యాక్‌వాటర్‌లో విహరిస్తూ విశ్రాంతి తీసుకోవచ్చు. హౌస్‌బోట్‌లోనే రాత్రిపూట బస చేస్తారు. (తేక్కడి నుంచి అలెప్పీకి దూరం: 140 కిమీ, ప్రయాణ సమయం సుమారు 4 గంటలు)
- 5వ రోజు - ఐదో రోజు టూర్ హౌస్‌బోట్‌లో అల్పాహారంతో ప్రారంభమవుతుంది. హౌస్‌బోట్ ను దిగి అందమైన సర్పెంటైన్ రోడ్ మార్గంలో కొచ్చిన్‌కు బయలుదేరతారు. కొచ్చిన్ చేరుకున్న తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ చేసి విశ్రాంతి తీసుకుంటారు. షికారు కోసం మెరైన్ డ్రైవ్‌ని సందర్శించవచ్చు. అలాగే యూదుల సినాగోగ్, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి, డచ్ ప్యాలెస్‌లను కూడా సందర్శించవచ్చు. రాత్రికి హోటల్‌లో బస చేస్తారు. (అలెప్పి నుంచి కొచ్చిన్ దూరం: 53 కిమీ, ప్రయాణ సమయం సుమారు 1.5 గంటలు)
- 6వ రోజు - ఈ టూర్ లో చివరి రోజు హోటల్ రుచికరమైన అల్పాహారం చేసిన తర్వాత కొచ్చిన్ విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్‌కు బయలుదేరతారు. దీంతో మీ టూర్ ముగుస్తుంది.
దక్షిణ కేరళ టూర్ ప్యాకేజీ బుక్కింగ్, పూర్తి వివరాలకు ఈ కింద లింక్ లో తెలుసుకోవచ్చు.
https://www.keralatourism.org/tour-packages/amazing-kerala-tour-backwaters-safari-hills/MzQ4
సంబంధిత కథనం