తెలుగు న్యూస్ / ఫోటో /
Cristiano Ronaldo: అల్ నసర్ క్లబ్‌కు గుడ్ బై చెప్పిన క్రిస్టియానో రొనాల్డో.. ఆ రెండు క్లబ్స్‌లో ఒకదానితో ఒప్పందం!
- Cristiano Ronaldo: క్రిస్టియానో రొనాల్డో అల్ నసర్ క్లబ్ కు గుడ్ బై చెప్పేశాడు. ఈ నేపథ్యంలో అతడు తర్వాత ఏ క్లబ్ కు వెళ్తాడన్న చర్చ మొదలైంది. అయితే సీఆర్.. అల్ హిలాల్ కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్ గాయపడటంతో అతని స్థానంలో రొనాల్డో వెళ్లొచ్చన్న ప్రచారం జరుగుతోంది.

(1 / 6)
Cristiano Ronaldo: క్రిస్టియానో రొనాల్డో 2022లో సౌదీ ఫుట్‌బాల్ క్లబ్ అల్ నసర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏడాదికి 200 మిలియన్ యూరోలకు ఈ ఒప్పందం కుదరడం విశేషం. ఇది చాలా పెద్ద మొత్తం అని చెప్పాలి.(Reuters)
(2 / 6)
Cristiano Ronaldo: రొనాల్డో రెండేళ్లలోనే అల్ నసర్ క్లబ్ కు వీడ్కోలు చెప్పబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడతడు అల్ హిలాల్ కు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.(Reuters)
(3 / 6)
Cristiano Ronaldo: బ్రెజిల్ స్టార్ ఫుట్ బాలర్ నెయ్‌మార్ గాయపడటంతో అతని స్థానంలో రొనాల్డోతో అల్ హిలాల్ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సమాచారం. అటు నెయ్‌మార్ రాబోయే ట్రాన్స్‌ఫర్ విండోలో ఇంటర్ మియామీకి వెళ్లనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.(Reuters)
(4 / 6)
Cristiano Ronaldo: అల్ నసర్ క్లబ్ తో చేరిన తర్వాత రొనాల్డో ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. ఈ సీజన్ లో 14 మ్యాచ్ లలో 10 గోల్స్ చేయడంతోపాటు 3 గోల్స్ చేయడంలో సాయపడ్డాడు.(Reuters)
(5 / 6)
Cristiano Ronaldo: నిజానికి రొనాల్డో సౌదీ క్లబ్ వదిలి కెరీర్ చివరి రోజుల్లో యూరప్ వెళ్తాడని అభిమానులు భావిస్తున్నారు. అక్కడ ఛాంపియన్స్ లీగ్ లో అతడు ఆడితే చూడాలని అనుకుంటున్నారు. 2021లో చివరిసారి అతడు మాంచెస్టర్ యునైటెడ్ తరఫున ఆడాడు.(Reuters)
ఇతర గ్యాలరీలు