Bigg Boss Telugu 8: పృథ్వీ మేల్ ఇగోను చంపేసిన రోహిణి.. బాడీ షేమింగ్ చేసి జీరో అన్నోడిపైనే హీరోలా గెలిచింది!
Bigg Boss Telugu 8 Rohini Is New Mega Chief: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌కు ఆఖరి మెగా చీఫ్‌గా జబర్దస్త్ రోహిణి గెలిచి పృథ్వీ పురుష అహంకారాన్ని ఒక్కసారిగా చంపేసింది. ఎందుకంటే తనను బాడీ షేమింగ్ చేసి, జీరో అన్న పృథ్వీపైనే గెలిచి మెగా చీఫ్ అయి హీరో అయింది రోహిణి.
Bigg Boss 8 Telugu November 22 Episode Highlights: బిగ్ బాస్ షో ఒక్కోసారి ఎన్నో గుణపాఠాలకు అడ్రస్‌గా నిలుస్తుంటుంది. బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్ల మధ్య పక్షపాతం చూపించినప్పటికీ కొన్ని విషయాల్లో పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌గా ఈ తెలుగు రియాలిటీ షో ఉపయోగపడుతుంది.
ఆఖరి మెగా చీఫ్‌గా రోహిణి
కొందరికి గెలుపు రుచి చూపిస్తే మూర్ఖత్వం, అహంకారంతో ఊగిపోయే మరికొందరికి మంచి గుణపాఠం చెబుతుంది బిగ్ బాస్ షో. అలాంటి సన్నివేశమే తాజాగా బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో చోటు చేసుకుంది. బిగ్ బాస్ 8 తెలుగు సీజన్‌లో ఆఖరి మెగా చీఫ్‌గా జబర్దస్త్ రోహిణి గెలిచి అదరగొట్టింది. బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 22 ఎపిసోడ్‌లో మెగా చీఫ్ టాస్క్ నడిచింది.
మూడు రోజులపాటు సాగిన బిగ్ బాస్ 8 తెలుగు ఫైనల్ మెగా చీఫ్ టాస్క్‌లో కంటెండర్స్‌గా యష్మీ, రోహిణి, పృథ్వీ, విష్ణుప్రియ, టేస్టీ తేజ నిలిచారు. వీరికి ఒక్కో టాస్క్ నిర్వహించారు. వాటిలో ఒక్కొక్కరు అవుట్ అవుతూ చివరిగా పృథ్వీ, రోహిణి, టేస్టీ తేజ మిగిలారు. వీరికి మట్టితో నిండి ఉన్న కుండను కాలుతో ఆపే టాస్క్ ఇచ్చారు. ఇందులో ముందుగా టేస్టీ తేజ అవుట్ అయిపోయాడు.
3 గంటల పాటు ఆడి
తర్వాత పృథ్వీ, రోహిణి ఇద్దరే టాస్క్‌ను కంటిన్యూ చేశారు. మూడు గంటల సమయం తర్వాత కుండను వదిలేశాడు పృథ్వీ. దాంతో రోహిణి గెలిచి మెగా చీఫ్ అయింది. మూడు గంటల పాటు ప్రాక్చర్ అయిన కాలుతో మట్టి కుండను బ్యాలెన్స్ చేసి సత్తా చాటింది రోహిణి. గెలవడంతోనే రోహిణి చాలా ఎమోషనల్ అయిపోయింది. తాను జీరో కాదు, మెగా చీఫ్‌ను అయ్యాను అంటూ ఆనందబాష్పాలతో అవినాష్, తేజ, గౌతమ్, ప్రేరణతో పంచుకుంది.
నువ్ హీరోవి రోహిణి అంటూ విష్ణుప్రియ అరిచింది. ఇక ఓడిపోయిన బాధతో పృథ్వీ కుప్పకూలిపోయాడు. దాంతో నబీల్, అవినాష్, నిఖిల్ అతన్ని ఓదార్చారు. అయితే, కొన్ని వారాల క్రితం జరిగిన నామినేషన్స్‌లో రోహిణిని నామినేట్ చేస్తూ తను ఆటలో జీరో అని అన్నాడు. అలాగే, నడవలేవు, అందరివల్ల నడవం కాదు అని కింది నుంచి పై దాకా రోహిణిని చూస్తే ఆమె పర్సనాలిటీపై బాడీ షేమింగ్ చేశాడు పృథ్వీరాజ్.
బాడీ షేమింగ్ చేయడంతో
అప్పుడు బాడీ షేమింగ్ చేయడంపై రోహిణి బాగానే ఇచ్చుకుంది. వీకెండ్‌లో నాగార్జున కూడా అలా చూడటం తప్పుగానే ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చాడు. ఇక పృథ్వీ హౌజ్‌లో ఎంత పొగరుగా ఉంటాడో తెలిసిందే. ఇతరులపై గౌరవం ఉండదు కానీ, వారి నుంచి రెస్పెక్ట్ కోరుకుంటాడు. అందరితో రూడ్‌గా బిహేవ్ చేస్తూ అదే యాటిట్యూడ్ అనే ఫీలింగ్‌లో ఉంటాడు. అలాంటి పృథ్వీ పురుష అహంకారాన్ని ఒక్క గెలుపుతో చంపేసింది రోహిణి.
ఎంటర్టైనర్‌వే కానీ ఆటలో జీరో, మెగా చీఫ్ కాలేదు, ఫిజికల్‌గా వీక్ అంటూ పొగరుగా మాట్లాడిన పృథ్వీపైనే గెలిచి మెగా చీఫ్ అయి హీరో అనిపించుకుంది రోహిణి. ఆమె గెలుపును ప్రశంసిస్తూ బిగ్ బాస్ శివంగివే అనే సాంగ్ కూడా డెడికేట్ చేసి రెస్పెక్ట్ ఇచ్చాడు. అమ్మాయి అయిన రోహిణిపై ఓడిపోవడంతో పృథ్వీ ఇగో బాగా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. తను అందరికంటే స్ట్రాంగ్ అని రోహిణి, బేబక్కలను వీక్‌గా అన్న పృథ్వీ జబర్దస్త్ రోహిణిపై ఓడిపోవడంతో ఒక్కసారిగా ఇగో చనిపోయినట్లు అయింది.
అవమానంగా పృథ్వీ
అందుకే అవమానంగా ఫీల్ అవుతూ మౌనంగా కూర్చున్నాడు పృథ్వీ. ఇక చివరి మెగా చీఫ్ కూడా కాకుండా పోయాడు పృథ్వీరాజ్ శెట్టి. అనంతరం అవినాష్, తేజతో తన ఆనందాన్ని పంచుకుంది రోహిణి. "ఎవరైతే జీరో అన్నారో వాళ్లపైనే గెలిచాను. ఇది నిజంగా ఇంత బాగుంటుంది అనుకోలేదు. గౌతమ్ నా మీద నమ్మకం పెంచాడు" అని రోహిణి చెప్పింది.
టాపిక్