Gunde Ninda Gudi Gantalu Today Episode: అత్త ఎంట్రీ, హడలిపోయిన ప్రభావతి- ఇంటి ముందు బాలు పంచాయతీ- రవికి సత్యం తల్లి ఫోన్
Gunde Ninda Gudi Gantalu Serial November 19 Episode: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 19 ఎపిసోడ్‌లో పుట్టింటి నుంచి వచ్చిన మీనాపై ఫైర్ అవుతాడు బాలు. ఇంతలో సత్యం తల్లి సుశీల ఎంట్రీ ఇస్తుంది. అది చూసి హడలిపోతుంది ప్రభావతి. టీ కప్పులో తుఫాన్ పుట్టిస్తుందని భయపడిపోతుంది.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో తను పుట్టింట్లో ఉంటే మీనా అత్తింటికి వెళ్లడం ఏంటని బాలు కోప్పడతాడు. మేము ఎంత చెప్పిన వినలేదని పార్వతి అంటుంది. నేను ఇక్కడ ఉంటే నన్ను వదిలేసి అక్కడికి వెళ్లిపోయింది. అంత పౌరుషమా. ఒక్క మాట అంటే పడలేదా. ఇప్పటికైనా అర్థమైందా. మీ కూతురు ఏంటో అని బాలు అంటాడు.
పండక్కి బంగారం
ఒంటినిండా పొగరు, పౌరుషం దానికి ఆత్మాభిమానం అని పేరు. ఇక ఇక్కడ నేనేందుకు అని బాలు వెళ్లబోతుంటే ఆపుతారు. నేను వెళ్లి తీసుకొస్తాను అని శివ, ఫోన్ చేస్తానని సుమతి అంటారు. బామ్మర్ది, మరదలికి ఉంటే సరిపోదు. కట్టుకున్న పెళ్లానికి భయం ఉండాలి. మా నాన్న కంగారుపడుతుంటారు. వెళ్లి కవరింగ్ ఇవ్వాలి కదా అని బాలు అంటే ఆపుతారు. శివ తీసుకొచ్చి రింగ్ ఇస్తాడు. పండక్కి నీకు పెట్టాలనుకున్నాం అని సుమతి అంటుంది.
పెట్టింది చాలు. ఇదేం వద్దని బాలు వెళ్తుంటాడు. ఒక్క నిమిషం అని చెప్పిన పార్వతి నా మాట విను. మీనా మిమ్మల్ని బాధపెట్టింది. దాన్ని క్షమించండి. ఏదో మాకు తోచినంత పెడుతున్నాం. ఇది తీసుకోండి. మాకు కాస్తా సంతోషం ఉంటుంది అని పార్వతి అంటుంది. దాంతో రింగ్ పెట్టించుకుంటాడు బాలు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనవసరమై ఖర్చు. సరే జాగ్రత్తగా ఉండండి అని వెళ్లిపోతాడు బాలు. అత్తింట్లో ముగ్గులు వేస్తుంది మీనా. బాలు అన్న మాటలు తలుచుకుంటుంది మీనా.
ఇంతలో మీనా ముగ్గులు వేయడం చూసి మౌనిక షాక్ అవుతుంది. దాంతో ప్రభావతి, సత్యంను పిలుస్తంది మౌనిక. వాళ్లు మీనాను చూసి షాక్ అవుతారు. ఏంటో ఎందుకు వచ్చావ్. పండుగ నాడు కూడా కూతురుని, అల్లుడిని చూసుకునే దిక్కులేదా మీకు అని ప్రభావతి తిడుతుంది. అయిందా. తెల్లారిందా అని ప్రభావతిని ఆపుతాడు సత్యం. ఏమైందని మీనాను అడుగుతాడు సత్యం. ఆయన అక్కడికి వచ్చారే కానీ, మనసంతా ఇక్కడే ఉంది. మీరు టైమ్‌కు ట్యాబ్లెట్స్ వేసుకున్నారో లేదో, తిన్నారో అని ఆలోచిస్తూనే ఉన్నారు. అందుకే ఇద్దరం వచ్చేశాం అని మీనా అంటుంది.
దినదినగండంగా ఉందని
పోనిలే పండక్కి ఒక్కదాన్నే పనంతా చేసుకోవాలి అనుకున్నాను సరే అంతా చేసేయ్ అని వెళ్లిపోతుంది ప్రభావతి. ఇంతలో బాలు వచ్చి మీనాను నిలదీస్తాడు బాలు. ఎందుకు వచ్చావే అని అడుగుతాడు. రాత్రి తాగొచ్చి నన్ను ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. దాంతో మా అమ్మ వాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. నా బతుకు ఇక్కడ సంతోషంగా ఉందనుకున్నారు. కానీ, దినదినగండంగా ఉందని అర్థమైపోయిందని మీనా అంటుంది.
ఇక్కడ అక్కడ ఉంటే ఇంకెన్ని మాటలు అంటారో అని వచ్చేశాను. ఈ రెండు రోజులు అయినా మావాళ్ల సంతోషం కోసం అనకండి అన్నాను. కానీ, రెండు పెగ్గులు వేసేసరికి అంతా బయటకొచ్చింది. ఎప్పుడైనా నా మాట విన్నారా అని మీనా అంటుంది. నేనేమైనా మీ నాన్ననా చెప్పిన మాటలు వినడానికి. ఆయనకు చెప్పావా అని బాలు అంటాడు. చెప్పేశాను. మొత్తం చెప్పాను. తాగింది, వాగింది. నాలుగు కల్పించి చెప్పాను అని మీనా అంటుంది.
ఇప్పుడు ఏమంటారో అని బాలు భయపడితే.. అంత భయపడేవాళ్లు నోరు అదుపులో పెట్టుకోవచ్చు కదా. ఓనర్ ఆంటీ తలుపు కొట్టింది కూడా చెప్పాను. చివరకు లక్కీ డ్రాప్స్ అని ఉంటాయి కదా అవి కూడా చెప్పాను అని మీనా అంటుంది. దాంతో మరింత భయపడిపోతాడు బాలు. అది చూసి మీకు లేకున్న నాకు జ్ఞానం ఉంది. ఆయనకు ఏం చెప్పలేదు. మీరు ఎలా ఉన్నారో కంగారుపడతారని వచ్చామని మీనా చెబుతుంది.
ఇంటి ముందు పంచాయతీ
ఇప్పుడు చెబుతానే నీ సంగతి. నన్ను అలా వదిలేసి వస్తావా. నాకు ఎంత అవమానంగా అనిపించింది. నిన్ను తిరిగి ఇంటికి తీసుకురావడమే తప్పే. మీవాళ్లు రింగ్ పెట్టారు. నాకెందుకు ఇది. వాళ్లను బాధపెట్టకూడదని తీసుకుని నువ్వే తీసుకో అని బాలు అంటాడు. బాలు ఏదో అనబోతుంటే సత్యం తల్లి వస్తుంది. అమ్మమ్మ వచ్చారని మీనా చెబుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ. ఇంటి ముందు ఏంటీ పంచాయతీ. మీనాను ఏమంటున్నాడు అని సుశీల నిలదీస్తుంది.
నువ్ చెప్పు మీనా అని సుశీల అంటే.. ఏం జరిగింది అంటే.. ఏయ్ ఆపు అని పక్కకు తీసుకెళ్లి సత్యంకు హార్ట్ ఎటాక్ వచ్చింది తెలియదు. అది కూడా చెబుతావా అని బాలు అంటాడు. నా మీద ఎగిరితే ఇలాగే చెబుతాను అని మీనా అంటుంది. తర్వాత ఇద్దరిని బెదిరించి రమ్మంటుంది సుశీల. తర్వాత మా వాళ్లు ఉంగరం పెడితే బ్రేస్‌లెట్ పెట్టట్లేదని తిరిగి ఇస్తున్నారని మీనా అంటుంది.
ఎవరో తిప్పి పంపించేది. మూతి పళ్లు రాలగొడతాను. వాళ్ల స్థోమత తెలిసే కదా చేసుకున్నావ్. అత్తగారిని బంగారం కోసం పిశాచీలా పీడిస్తావా పింజారి వెధవ తీసుకో అని గద్దిస్తుంది సుశీల. రాక్షసి. నన్నే ఇరికిస్తావా అని బాలు అంటుంది. నా ముందే తిడతావా. కర్ర ఎక్కడ అనేసరికి బాలు ఉంగరం పెట్టుకుంటాడు. ఇంట్లోకి వస్తుంది సుశీల. అత్త వచ్చిందని తెలియగానే ప్రభావతి తెగ భయపడిపోతుంది. ఈ దీపావళి పండుగ అంతా నన్ను ఎగతాళి చేయడంతోనే అయిపోతుంది అని ప్రభావతి అనుకుంటుంది.
జ్వరానికే చిక్కిపోయావేంట్రా
తర్వాత వచ్చి కావాలనే అత్తపై ప్రేమ వెలకబొస్తుంది ప్రభావతి. దాంతో ప్రభావతిని ఆపి.. ఏంటమ్మా ఇది ఇక్కడికి రావాలంటే రాత్రి బయలుదేరాలి. పొద్దున బయలుదేరుతేమవు అని సత్యం అంటాడు. నువ్ హాస్పిటల్‌లో ఉన్నట్లు. ఏవేవే చెబుతున్నట్లు కలలు వస్తున్నాయని సుశీల్ అంటుంది. నాకు కూడా నువ్ వస్తున్నట్లు కల వచ్చిందని బాలు చెబితే.. ఏడ్చావులే అని సుశీల అంటుంది. జ్వరానికి ఇంత చిక్కిపోయావేంట్రా, ముఖంలో కళ లేదేంట్రా అని సుశీల అంటుంది.
హాస్పిటల్ నుంచి వచ్చిన మనిషి ఇంకెలా ఉంటారు అని ప్రభావతి నోరు జారుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. నా కొడుకును హాస్పిటల్‌లో జాయిన్ చేయించారా.. ఎందుకురా ఏమైందిరా అని సుశీల కంగారుపడుతుంది. మా అమ్మ నోటి నుంచి మంచి మాటలే రావా.. పెద్ద హాస్పిటల్ కాదు. చిన్న హాస్పిటల్. జ్వరం అని వెళితే నీరసంగా ఉందన్నారు. దానికి మా అమ్మ ఐదు లక్షలు ఖర్చు అయినట్లు చెబుతుంది అని బాలు అంటాడు.
అంతేనా. నా పీడకలలే నిజమైనట్లు కంగారుపడ్డానురా అని సుశీల అంటుంది. దాంతో ప్రభావతిపై కోప్పడుతుంది సుశీల. తర్వాత బాలును మీనాను తిడుతున్న విషయంలో కోప్పడుతుంది. తర్వాత ప్రభావతి ఏదో చెప్పబోతుంటే సత్యం ఆపుతాడు. తర్వాత మనోజ్, రోహిణి వస్తారు. ఇంట్లో అందరికి కుంకుడు రసంతో స్తానం చేయించాల్సిందే అని సుశీల అంటుంది. తర్వాత మన కారు ఇంటి ముందు కనిపించడంలేదేంటీ. నేను ఎంతో ముచ్చటపడి కొనిచ్చిన కారురా. దేనికైనా గుద్దేయలేదు కదా అని సుశీల అంటుంది.
చిన్నోడు ఎక్కడ్రా
లేదే ట్రిప్‌కు వెళ్లిందని బాలు అంటాడు. సరే త్వరగా తెప్పించు. నేను గుడికి వెళ్లాలి అని సుశీల లోపలికి వెళ్లిపోతుంది. తర్వాత పండగ పూట అత్తింట్లో ఉండకుండా వస్తే వాళ్లెంత బాధపడతారు. ఒక్కపూటలో నాకు ఏమైనా అయిపోతుందా. సరే బామ్మ కారు గురించి అడుగుతుంది. ప్రేమగా కొనిచ్చిన కారు అమ్మేశానని చెబితే బాధపడుతుంది. నీ అద్దెకారు ఉందిగా అని బాలుని నిలదీస్తాడు సత్యం. అది ఓనర్‌కు ఏదో పని ఉందంటే ఇచ్చాను అని బాలు అంటాడు.
సరే వెళ్లి తీసుకురా. బామ్మకు ఎందుకురా లేనిపోని అనుమానాలు తెప్పించడం అని సత్యం అంటాడు. తెప్పించను. నువ్వెళ్లు అని బాలు అంటాడు. తర్వాత నీకు వాడికి ఏంటీ సమస్య. మీ ఇద్దరి మధ్య ఏదో సమస్య ఉంది. అదేంటో చెప్పు అని మీనాను అడుగుతుంది సుశీల. తర్వాత ఆయిల్ పెట్టుకుని స్నానం చేయడమేంటని మనోజ్ అంటాడు. తర్వాత చిన్నోడు ఏడిరా అని రవి గురించి అడుగుతుంది సుశీల. దాంతో అంతా షాక్ అవుతారు. ఉండండి నేనే ఫోన్ చేస్తాను అంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగుస్తుంది.
టాపిక్