Gunde Ninda Gudi Gantalu Today Episode: సత్యం కాళ్లపై పడిన మీనా.. బాలుకు సంసారంపై సలహాలు.. టార్చర్ మొదలుపెట్టిన ప్రభావతి-gunde ninda gudi gantalu serial november 6th episode meena apologises to sathyam for ravi marriage star maa serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudi Gantalu Today Episode: సత్యం కాళ్లపై పడిన మీనా.. బాలుకు సంసారంపై సలహాలు.. టార్చర్ మొదలుపెట్టిన ప్రభావతి

Gunde Ninda Gudi Gantalu Today Episode: సత్యం కాళ్లపై పడిన మీనా.. బాలుకు సంసారంపై సలహాలు.. టార్చర్ మొదలుపెట్టిన ప్రభావతి

Sanjiv Kumar HT Telugu
Nov 06, 2024 10:35 AM IST

Gunde Ninda Gudi Gantalu Serial November 6 Episode: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 6 ఎపిసోడ్‌లో మీనా హాస్పిటల్‌కు వచ్చి తాయత్తు కట్టిన విషయం చెబుతాడు సత్యం. తర్వాత మీనా ఇంటికి వస్తేనే ట్యాబ్లెట్స్ వేసుకుంటానని మొండిపట్టు పడతాడు సత్యం. దాంతో మీనాను ఇంటికి తీసుకొస్తాడు బాలు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 6 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 6 ఎపిసోడ్‌

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో మీనా గురించి ఇంట్లోవాళ్లకు సత్యం చెబుతాడు. ఇప్పుడు అర్థమైందా. మనిషిని అపార్థం చేసుకోవడం సులువు. అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆ కష్టాన్ని ఎవరు పడరు. ఇష్టమొచ్చినట్లు నిందలు వేస్తారు. ఇంటి పత్రాలు బీరువాలోనే ఉన్నాయి. వాడికిచ్చి కారును విడిపించుకోమ్మను అని సత్యం అంటాడు.

దాని దారి అది చూసుకుంది

విడిపించుకోడానికి కారు తాకట్టు పెట్టలేదు. అమ్మేశాడు అని ప్రభావతి అంటుంది. నాకోసం నీ జీవనాధారం వదిలేశావ్ సరే. నాకోసమే మీనాను వదిలేశావే. నువ్ వదిలేసింది నీ జీవితాన్ని కూడా అని సత్యం అంటే.. అది సరే. ముందు మీరు ట్యాబ్లెట్స్ వేసుకోండి అని ప్రభావతి అంటుంది. సరే మీనా ఎక్కడ అని సత్యం అంటే.. ఇప్పుడు దాని గురించి ఎందుకు. దాని దారి అది చూసుకుందని ప్రభావతి అంటుంది. అలా అయితే హాస్పిటల్‌లో నన్ను చూసేందుకు ఎందుకు వస్తుందని సత్యం అంటాడు.

దానికి షాక్ అయిన ప్రభావతి ఎప్పుడు రాలేదే అని అంటుంది. మీనా వదిన వస్తే తట్టి పంపించారు కదా. అదెందుకు చెప్పట్లేదు అని మౌనిక అంటుంది. అవునా. తిట్టి పంపేశారా. మంచిపని చేశారు. దాన్ని అసలు తిరిగి రానివ్వకూడదు అని బాలు అంటాడు. అవును, మనుషులను అపార్థం చేసుకుని మీ అమ్మలాగే జీవితాంతం ఒంటరిగా మిగిలిపో. మీనా గురించి నాకు తెలుసురా. నేను బతకాలని పూజలు చేయించి ఈ తాయిత్తు తీసుకొచ్చింది అని చూపిస్తాడు సత్యం.

నాకు మత్తులో ఉన్న నాకు అన్ని తెలుస్తున్నాయి. అక్కడ రంగారావు కూడా ఉన్నారు. మీనా కట్టింది. నాకు రంగారావు అంతా చెప్పాడు. రేయ్ వెళ్లి మీనాను తీసుకురా. భార్య ఉంటేనే నువ్ కుదురుగా ఉంటావ్. లేకుంటే తెగిన గాలిపటంలా అవుతుంది నీ బతుకు. నీ తండ్రిగా నీ భవిష్యత్ కోసమే చెబుతున్నాను. ఏ తప్పు చేయని మీనాకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండలేను అని సత్యం అంటాడు. అయ్యే దానివల్లే అరిష్టం అని ప్రభావతి అంటుంది.

పప్పులు ఉడకవని

నీ అయిష్టాన్ని అరిష్టంలా మార్చకు అని సత్యం అంటాడు. ట్యాబ్లెట్స్ వేసుకో నాన్న అని బాలు అంటాడు. మీనా వస్తేనే ట్యాబ్లెట్స్ వేసుకుంటాను. మీ అమ్మ మాట ఇంటే నీ కాపురం ముక్కలు అవుతుంది అని ఆవేశపడుతూ గుండె పట్టుకుంటాడు. ఆవేశపడకు అని నాన్న అని బాలు చెబుతాడు. దాంతో మీనాను తీసుకొచ్చేందుకు బాలు వెళ్తాడు. సరే వెళ్లాడు కదా. ఎగురుకుంటూ వస్తుంది అని ప్రభావతి అంటుంది. మీనా రాని. బయటతిరిగి మీనా రాలేదని చెబుతాడు అని సత్యం అంటాడు. ఆ పప్పులు ఏవి ఉడకవని అన్నయ్యకు అర్థమైందని మౌనిక అంటుంది.

మరోవైపు పుట్టింట్లో ఉండకపోవడం గురించి, అత్తింటికి వెళ్లడం గురించి మీనా, పార్వతి వాదించుకుంటారు. బావ పిలిచే వరకు వెళ్లవా అక్క అని శివ అడుగుతాడు. వెళ్లను అని మీనా అంటుంది. అయితే ముసలిదానివి అయ్యేదాక ఇక్కడే ఉంటావా అని శివ అంటాడు. ముగ్గురి పళ్లు రాలగొడతాను అని పార్వతి అంటుంది. ఇంతలో బాలు వస్తాడు. కానీ, అది చూడకుండా మీనా, పార్వతి వాదించుకుంటారు. ఈ పూలగంప నేను రానని ఫిక్స్ అయిపోయినట్లుంది. అరెరె అనవసరంగా వచ్చానే అని బాలు అనుకుంటాడు.

ఇంతలో బాలును శివ చూసి బావ అని చెబుతాడు. ఏ పోరా బండరాయి అయినా దొర్లుకుంటూ వస్తుందంటే నమ్ముతా అని మీనా అంటుంది. నిజంగానే వచ్చారు అని సుమతీ అంటుంది. నాన్నగారికి ఎలా ఉంది. ఆయన బాగుండాలని మీనా గుడిలో ప్రార్థించింది అని పార్వతి అంటే.. అదేదో ముందే చేస్తే మాకు ఐదు లక్షలు మిగిలేవి అత్తగారు అని బాలు అంటాడు. మీ దగ్గరికి వచ్చి మాట్లాడాదమనుకున్నా. కానీ, కోపంగా ఉంటారని రాలేదు. మీనా చేసింది తప్పే అని పార్వతి అంటే. నేనేం చేశాను అని మీనా అంటుంది.

పద్ధతిగా-పొగరుగా

నీకు దండం పెడతాను. నువ్వుండే అని ఆపుతుంది పార్వతి. మీనాకు బదులు నేను క్షమాపణ చెబుతున్నాను అని పార్వతి అంటే.. మీరెందుకు చెబుతారు లెండి. తప్పు చేసినవాళ్లకు చేసినట్లే లేదు. ఇలాంటి వాళ్లను నమ్మినందుకు నా కారు టైర్ కింద నేను కాలు పెట్టి ఇరుకున్నట్లుంది. ఏం చేస్తాం అంతా నా తలరాత అని బాలు అంటాడు. అత్తయ్య గారు మీరు సుమతిని పద్ధతిగా పెంచి మీనాను ఎందుకు పొగరుగా పెంచారు అని అంటాడు బాలు.

తర్వాత మీనాను పంపించండి అని బాలు అంటే.. ఎక్కడికీ అని మీనా అంటుంది. మా ఇంటికి. నా కారు క్లీన్ చేయడానికి ఎవరు లేరు అని బాలు అంటాడు. ఎంత క్లీన్ చేసిన దాని మురికిపోదు. పీపాలు తాగుతూనే ఉంటుంది పెట్రోల్. ఎవరినైనా జీతం పెట్టుకోండి అని మీనా అంటుంది. మీనా అల్లుడుగారు నిన్ను రమ్మంటున్నారే అని పార్వతి అంటుంది. నేను రాను. నన్ను గెంటేశారు అని జరిగినదంతా చెబుతుంది. ఇప్పుడెందుకు అంత జ్ఞానం వచ్చిందో అని మీనా అంటుంది.

ఇన్నాళ్లు లేనిది ఇప్పుడెలా వచ్చింది అని మీనా అంటే.. అంత నా తలరాత. వేరేదారిలేక వచ్చాను అని బాలు అంటాడు. భార్యపై ప్రేమలేదని మీనా అంటుంది. ఏదో భరిస్తున్నాను. మా నాన్న ట్యాబ్లెట్స్ వేసుకోకుండా నిన్ను తీసుకురమ్మన్నారు. నువ్ చేసింది గుర్తుకువస్తే సర్రుమంటుంది. కానీ, మా నాన్న పేషంట్, రావాల్సిందే అని బాలు అంటాడు. వెళ్లను అని మీనా అంటే.. పార్వతి కొట్టాలని చూస్తుంది. దానికి బాలు ఆపి కొట్టొద్దు తిట్టి పంపించండి. వాతలు చూస్తే నేనే చేశాను అనుకుంటాడు మా నాన్న అని బాలు అంటాడు.

లీవ్ క్యాన్సిల్ చేసుకో

వస్తాను. మీకోసం కాదు. మావయ్య గారి మీద గౌరవంతో వస్తాను అని మీనా అంటుంది. ఎవరేమన్నా తిరగబడకు అని పార్వతి జాగ్రత్తలు చెబుతుంది. మీరు అనుకుందే జరిగింది కదా అని బాలుతో వెళ్తుంది మీనా. మరోవైపు మొండిగా ఉండకండి. ట్యాబ్లెట్స్ వేసుకోండి అని ప్రభావతి, మనోజ్ అంటారు. నా సంగతి సరే నువ్ ఆఫీస్‌కు వెళ్లవా అని సత్యం అడుగుతాడు. నేను లీవ్ పెట్టాను అని మనోజ్ అంటాడు. నేను వచ్చాను కదా. లీవ్ క్యాన్సిల్ చేసుకుని వెళ్లు అని సత్యం అంటాడు.

ఇంతలో మీనా ఇంటికి వస్తుంది. ప్రభావతికి పంచ్‌లు వేస్తుంది మౌనిక. అందరి నోరు మూయించి నువ్ మాట్లాడతావా అని మౌనిక అంటుంది. హారతి ఇచ్చి బొట్టు పెట్టి లోపలికి పిలవలేమో అని జరిగినవన్నీ అంటుంది ప్రభావతి. మీనా ఇది నీ ఇల్లు లోపలికి వచ్చేయ్ అని సత్యం అంటే.. మీనా వచ్చి సత్యం కాళ్ల మీద పడుతుంది. మావయ్య నన్ను క్షమించండి. నిజంగా నేను ఏ తప్పు చేయలేదు. ఆరోజు గుడిలో రవి పెళ్లి జరుగుతుందని నాకు తెలియదు అని మీనా అంటుంది.

ఏయ్.. ఇంకెందుకే అబద్ధాలు అని ప్రభావతి అంటుంది. నేను రవితోనే వెళ్లాను. గుడికే వెళ్లాను. కానీ, రవి పెళ్లి జరిపించడానికి కాదు. శ్రుతిని నచ్చజెప్పడానికి అని వెళ్లాను అని మీనా అంటుంది. అదేదో మావయ్యకు చెబితే ఆయన చెప్పేవారు. మేమే ఆ పెళ్లి ఆపేవాళ్లం కదే. మా కుటుంబాన్ని రోడ్డుమీద పడేశావ్ కదే పాపిష్టిదానా అని ప్రభావతి అంటుంది. మావయ్య నన్ను నమ్మండి అని మీనా అంటే.. మరి సాక్షి సంతకం ఎలా వచ్చిందో. అబద్ధం ఆడిన అతికనట్లు ఉండాలి అని బాలు అంటాడు.

మావయ్య తిట్టడం పెద్ద తప్పు

ఇప్పుడెందుకు అన్నయ్య. నాన్న కాళ్లు పట్టుకుంది కదా అని మౌనిక అంటాడు. నాన్నను పోలీస్ స్టేషన్‌లో ఉంచింది మర్చిపోమంటావా అని బాలు అంటాడు. నేను అది మర్చిపోవాలని చూస్తే మీరే గుర్తు చేసేలా ఉన్నారు కదరా అని సత్యం అంటాడు. మావయ్య మీకు నాపై కోపం ఉంటే తిట్టండి అని మీనా అంటుంది. అయ్యో కోడలిని మావయ్య తిట్టడం ఎంత పెద్ద తప్పు. నా కొడుకులే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు అని మనోజ్, రవి, బాలు గురించి చెబుతాడు సత్యం.

ఎవరి అని ఏం లాభం. అంత నా తలరాత అని సత్యం అంటాడు. అన్ని కొడుకుల మీద వేయకండి. దాని వల్ల మన పరువుపోలేదా. దాన్ని మాత్రం ఏం అనరు. అమ్మా మహాతల్లి నీ పీడ విరగడి అయిందనుకుంటే మళ్లీ మా నెత్తికే వచ్చావ్ కదా అని ప్రభావతి అంటుంది. కట్ చేస్తే.. నేనేం నిన్ను మిస్ అయి తీసుకురాలేదు. మా నాన్నకోసం తీసుకొచ్చాను. ఆ బీరువా ఉన్నట్లు, ఈ బల్ల ఉన్నట్లు నా దృష్టిలో నువ్వు ఒక వస్తువ్వే. నువ్ నాతో మాట్లాడకు అని మీనాపై కోప్పడతాడు బాలు.

నువు ఛీ కొట్టిన, చెంపదెబ్బ కొట్టిన నువ్వే కావాలనుకుని వచ్చింది కదరా. నీ కాపురాన్న, నీ సంతోషాన్ని ఇంకెవరి కారణంగా దూరం చేసుకోవద్దురా అని బాలుకు తండ్రి సత్యం సలహాలు ఇస్తాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner