NNS November 25th Episode: భాగీకి సాంబ్రాణి వేసిన అమర్.. ఇంట్లోవాళ్లతో యుద్ధం.. మనోహరికి పెద్ద షాక్.. భయపడిన ఆనంద్!
Nindu Noorella Saavasam November 25th Episode: నిండు నూరేళ్ల సావాసం నవంబర్ 25 ఎపిసోడ్‌లో భాగీకి కరుణ్ కాల్ చేస్తే అమర్ లిఫ్ట్ చేసి మాట్లాడుతాడు. భర్తతో సాంబ్రాణి వేయించుకోవడం అంటే భాగీ ఇష్టమని, అవసరం ఉన్న అడగడదని గొప్పగా చెబుతుంది కరుణ. దాంతో భాగీకి అమర్ సాంబ్రాణి వేస్తాడు. అందుకోసం తంటాలు పడతాడు.
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్ (NNS 25th November Episode)లో కరుణ, మిస్సమ్మకు ఫోన్ చేస్తుంది. కానీ, అమర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఓ పోరీ ఫోన్ ఎత్తడానికి ఎందుకు లేట్ చేస్తున్నావు. ఎప్పుడు నీ పిల్లలు మీ ఆయనేనా..? నువ్వు మీ ఆయన కలిసిపోయారా..? అసలు మీ ఆయనకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా..? ఆయన కళ్లల్లో తెలిసిపోతుంది అంటూ అసలు నేను మాట్లాడుతున్నాను కానీ నువ్వేమీ మాట్లాడటం లేదు ఎందుకు అంటుంది కరుణ.
అవసరమైనా అడగడం రాదు
దీంతో అమర్ నేను మాట్లాడటానికి నువ్వు గ్యాప్ ఇచ్చావా..? అంటాడు. అమర్ మాట విని కరుణ షాక్ అవుతుంది. తర్వాత మిస్సమ్మకు బైక్ నేర్పిస్తామన్నారు నేర్పించవచ్చు కదా..? అని అడుగుతుంది కరుణ. అప్పుడప్పుడు దాని గురించి జరంత పట్టించుకోండ్రి అని చెప్తుంది. దానికి ఇవ్వడమే తెలుసు కానీ అవసరమైనా అడగడం మాత్రం తెలియదు అని చెబుతుంది కరుణ.
నేనేమైనా తప్పుగా మాట్లాడితే సారీ అంటుంది కరుణ. తప్పేం కాదు అంటాడు అమర్. అయితే దానికి స్నానం చేశాక సాంబ్రాణి వేసుకోవడం అంటే చాలా ఇష్టం. పెళ్లి అయ్యాక మొగుడితో సాంబ్రాణి వేయించుకుంటానని ఎప్పుడు చెప్పేది అంటూ కరుణ ఫోన్ కట్ చేస్తుంది. అమర్ మెల్లిగా కిచెన్‌లోకి వెళ్లి ఎవ్వరూ చూడకుండా సాంబ్రాణి తీసుకుని వెళ్తుంటే నిర్మల చూస్తుంది.
ఏం దాస్తున్నావ్ అమర్
అమర్ ఏమైనా కావాలా..? అని అడుగుతుంది నిర్మల. అమర్ కంగారుగా ఏమీ వద్దని మీకేమైనా కావాలంటే రాథోడ్ ఉన్నాడేమోనని చూస్తున్నాను అంటూ వెళ్లిపోతుంటే శివరామ్ వస్తాడు. ఏమైంది అమర్ చేతులు ఎందుకు వెనక్కి పెట్టుకున్నావు అని అడుగుతాడు. నేనేం దాయలేదని అమర్ చెప్తాడు. శివరామ్ అనుమానంగా వెళ్లిపోతాడు. ఇంతలో మనోహరి వచ్చి అమర్ ఏంటది దాస్తున్నావని అడుగుతుంది.
ఏమీ లేదని చెప్తూ.. అమర్ వెళ్లిపోతాడు. ఇంట్లో ఒక్క పని చేయడానికి ఇంత యుద్దం చేయాలా..? అనుకుంటూ రూంలోకి వెళ్లి సాంబ్రాణి దూపం వేస్తాడు అమర్. స్నానం చేసి బయటకు వచ్చిన మిస్సమ్మ ఆశ్చర్యంగా చూస్తుంది. ఏంటది అని వెళ్లి అమర్‌ను అడుగుతుంది. సాంబ్రాణి అని అమర్ చెప్పగానే అత్తయ్య ఇచ్చారా..? నేను తల స్నానం చేస్తానని గుర్తుపెట్టుకుని మరీ ఇచ్చారా..? సారీ నేనే తెచ్చుకోవాల్సింది అంటుంది భాగీ.
నేనే సాంబ్రాణి వేస్తాను
మిస్సమ్మను అమర్ రోమాంటిక్‌గా చూస్తూ.. అమ్మ ఇవ్వలేదు. నేనే తీసుకొచ్చానని చెప్తాడు. ఎందుకని అమర్ నీకోసమే తీసుకొచ్చానని ఎలా చెప్పాలి అని మనసులో అనుకుంటుంటే.. నాతో ఏదైనా మాట్లాడారా..? అనగానే అవును సాంబ్రాణి నీకోసమే తీసుకొచ్చా అని అమర్ చెప్తాడు. సరేనని సాంబ్రాణి తీసుకుని మిస్సమ్మ వెళ్తుంటే.. సాంబ్రాణి నేనే వేస్తాను అంటాడు అమర్. సరే అంటుంది మిస్సమ్మ.
అమర్ సాంబ్రాణి వేస్తుంటే మిస్సమ్మ రొమాంటిక్‌గా ఫీలవుతుంది. కిటికీలోంచి చూస్తున్న అరుంధతి బాధపడుతుంది. అరుంధతిని చూసిన గుప్త హ్యాపీగా ఫీలవుతాడు. నేను ఇది చూడటానికే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావా..? అంటూ గుప్తను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆరు. తర్వాత టిఫిన్ చేయడానికి పిల్లలను పిలుస్తాడు శివరామ్. పిల్లలందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తారు. అందరూ టిపిన్స్ చేస్తుంటారు.
మనోహరికి షాక్
ఇంతలో అక్కడకు వెళ్లిన ఆనంద్ డాడీ గదిలో పొగలు వస్తున్నాయేంటి అని భయపడి కిందకు వచ్చి అందరికీ చెప్తాడు. అందరూ భయంగా ఏంటో చూద్దాం పదండి అని పైకి వెళ్తుంటే.. మనోహరి కూడా ఎందుకు అందరూ పైకి వెళ్తున్నారు అని అడుగుతుంది. పైన పొగలు వస్తున్నాయంట అని చెప్పగానే వాళ్లతో పాటు మనోహరి కూడా వాళ్లతో పైకి వెళ్తుంది.
శివరామ్, మిస్సమ్మను పిలిచి గదిలోంచి పొగలు వస్తున్నాయేంటి అని అడగ్గానే సాంబ్రాణి పొగ వేసుకుంటున్నాను అని చెప్తుంది మిస్సమ్మ. నేనేమైనా సాయం చేయాలా..? అని నిర్మల అడుగుతుంది. నేనే వేసుకుంటాను అని చెప్పమంటున్నాడు అంటూ మిస్సమ్మ చెప్పగానే నిర్మల, శివరాం నవ్వుకుంటారు. దాంతో మనోహరి షాక్ అవుతుంది. అక్కడితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ముగుస్తుంది.
టాపిక్