NNS September 27th Episode: రాథోడ్‌ను చితకొట్టిన భాగీ.. బుర్ఖాలో మనోహరి.. మిస్సమ్మ తలకు గన్ గురి పెట్టిన టెర్రరిస్ట్
Nindu Noorella Saavasam September 27th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ సెప్టెంబర్ 27వ తేది ఎపిసోడ్‌లో రెస్టారెంట్‌లో ఉన్న అమర్, భాగీలను చూసి మనోహరి కుళ్లుకుంటుంది. ఓ బుర్ఖా వేసుకుని వాళ్ల పక్కనే కూర్చుంటుంది. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 27th September Episode) అరవింద్ ఒక దగ్గర బైక్ ఆపి ఇప్పుడు ఆ అమర్ కంటపడితే వదిలిపెట్టడు, వాళ్లు ఇటువైపు వస్తున్నారో వెనక్కి వెళ్తున్నారో ఎలా తెలుసుకోవడం అనుకుంటాడు.
అప్పుడే స్కూటర్ మీద అమర్, భాగీ రావడం చూసి పక్కకు వెళ్లి దాక్కుంటాడు. వాళ్లు వెళ్లాక వెనకాలే ఫాలో అయితే బెటర్ అనుకుంటాడు. అమర్ స్కూటర్ తీసుకొచ్చి అరవింద్ బైక్ పక్కనే ఆపి పక్కనే ఉన్న హోటల్‌లోకి వెళ్తాడు. ఇంతలో అరవింద్ అనుచరుడు గన్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్తాడు. గన్ తీసుకుని లోపలికి వెళ్తాడు అరవింద్.
డైరెక్ట్‌గా చెప్పేస్తున్నారు
ఏంటీ మనం బయలుదేరినప్పటి నుంచి అటూ ఇటూ చూస్తూనే ఉన్నారు అంటుంది భాగీ. ఏం లేదు మిస్సమ్మ. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎప్పుడూ నా పక్కనే ఉండు దూరంగా వెళ్లకు అంటాడు అమర్. అయ్యో ఈనేంటి మరీ ఇంత డైరెక్టుగా చెప్పేస్తున్నారు. దేవుడా నువ్వు ఉన్నావయ్యా అని మనసులో అనుకుని సరేనండి అంటుంది భాగీ.
నేనెప్పుడూ నీ పక్కనే ఉంటాను నువ్వు కంగారు పడకు అంటాడు అమర్. నా గురించి ఇంతలా ఆలోచించే భర్తను ఇచ్చావా? దేవుడా? అని మనసులో అనుకుంటుంది మిస్సమ్మ. అరవింద్ గన్ తీసి అమర్‌కు ఎయిమ్ చేస్తాడు. మరోవైపు కారులో వస్తున్న అరుంధతి ఈయన, మిస్సమ్మ ఏంటి ఇంకా కనబడరు అనుకుంటుంది. త్వరగా పోనీ మను అంటుంది.
ఇంతలో రాథోడ్ మనోహరి గారు దాబా వెళ్లిపోతుంది గాడి రుక్ జావ్ అంటాడు. దీంతో మనోహరి, అరుంధతి షాక్ అవుతారు. రాథోడ్ కంగారుపడతాడు. అవును మను పేరు ఇతనికి చెప్పలేదు కదా? అనుకుంటుంది అరుంధతి. నా పేరు నీకెలా తెలుసు? హలో నిన్నే నా పేరు నీకెలా తెలుసు? అంటుంది మనోహరి. అది ఇందాకా మీది చెప్పింది అంటాడు రాథోడ్.
నోరు ఇచ్చింది అందుకే
నేను మాటల్లో చెప్పానా? నేనెప్పుడు మాట్లాడాను. నీకెప్పుడు చెప్పాను అని మనోహరి అనగానే అవును కదాజీ.. మీది మాటలాడా లేదు కదా? అయినా ఎందుకు మాటలాడలేదు జీ.. దేవుడు మనుషులకు ఎందుకు నోరు ఇచ్చింది. మాటలాడటానికే కదా? నెక్ట్ టైం అయినా ఈసారి లాగా కాకుండా మాట్లాడండి జీ అంటూ కారు దిగిపోతాడు రాథోడ్.
ఇంతలో రాథోడ్ వైపు చూస్తూ అక్కడే ఉన్న స్కూటర్ చూసి బాబ్జీ చెప్పిన బండి అనుకుంటూ హోటల్‌లోకి చూడగానే అక్కడ అమర్, భాగీ కనబడతారు. వాళ్లను చూసిన మనోహరి కుళ్లుకుంటుంది. అరుంధతి మాత్రం ఎలాగైనా అక్కడకు వెళ్లి మిస్సమ్మకు నిజం చెప్పాలనుకుంటుంది. మనోహరి బుర్ఖా వేసుకుని లోపలకు వెళ్తుంది. భాగీకి గన్ ఎయిమ్ చేసి ఉంటాడు అరవింద్. ఇంతలో రాథోడ్ గన్‌కు అడ్డం వస్తాడు.
భాగీకి సైగ చేస్తుంటే భాగీ తిడుతుంది. మనోహరి బుర్ఖా వేసుకుని వెళ్లి అమర్ వాళ్ల పక్కన కూర్చుంటుంది. కొంచెం స్పేస్ దొరికినా వాడుకోవాలి. మిస్సమ్మను కాపాడుకోవాలి అనుకుంటుంది అరుంధతి. మా ఆయన్ను చూశావా? కండలు చూశావా? చంపేస్తారు అని సింగ్ వేషంలో ఉన్న రాథోడ్‌ని బెదిరిస్తుంది మిస్సమ్మ. మిమ్మల్ని చంపేస్తారు. అటూ ఇటూ చూస్తూ ఉండు అంటాడు రాథోడ్.
ఆడుకోడానికి కాదు
అయ్యో ఇప్పుడు మిస్సమ్మకు నిజం చెప్పాలంటే నా గురించి అడుగుతుంది. ఎలా చెప్పాలి ఇప్పుడు. వీడెవడు మిస్సమ్మకు ఏవో సైగలు చేస్తున్నాడు అనుకుంటుంది అరుంధతి. ఏయ్ లూజు.. జ్యూస్ ఉన్నది తాగడానికి . ఇలా అడుకోవడానికి కాదు అంటాడు అమర్. అవునా జ్యూస్ తాగడానికి ఇచ్చారా? నేనింకా ఇలా ముందు పెట్టుకుని మీలా ఇలా దిక్కులు చూడటానికి ఇచ్చారనుకున్నా.. నేను వాష్ రూం కి వెళ్లి వస్తాను అంటుంది భాగీ.
నేను కూడా తోడు వస్తానన్న అమర్‌తో మిస్టర్ మొండి మొగుడు గారు ఈ లోపు నన్ను ఎవ్వరూ కిడ్నాప్ చేయరులేండి అని చెప్పి భాగీ వాష్‌రూంకు వెళ్తుంది. వెనకే రాథోడ్ వెళ్తాడు. అరుంధతి చూసి తిట్టుకుంటుంది. వాష్‌రూంలోంచి బయటకు వస్తున్న భాగీని రాథోడ్ పక్కకు లాక్కెళ్లతాడు. దీంతో భాగీ రాథోడ్‌ను పిచ్చకొట్టుడు కొడుతుంది. తర్వాత రాథోడ్ నిజం చెప్పగానే భాగీ బాధపడుతుంది.
తర్వాత అమర్ దగ్గరకు వచ్చి గుర్రుగా చూస్తుంటుంది. ఎంటి అలా చూస్తున్నావు అని అమర్ అడగుతాడు. బుర్ఖాలో ఉన్న మనోహరి అమర్‌కి దొరికిపోతుందా? అరవింద్ ప్లాన్ అమర్ కనిపెడతాడా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు సెప్టెంబర్ 27న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!