NNS October 12th Episode: భాగీ కోసం అమర్​ ఆరాటం.. షాక్ ఇచ్చిన కరుణ.. అరుంధతిలో మొదలైన అనుమానం.. పాపం రాథోడ్​​!-nindu noorella saavasam serial october 12th episode karuna twist to bhagamathi nindu noorella saavasam today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns October 12th Episode: భాగీ కోసం అమర్​ ఆరాటం.. షాక్ ఇచ్చిన కరుణ.. అరుంధతిలో మొదలైన అనుమానం.. పాపం రాథోడ్​​!

NNS October 12th Episode: భాగీ కోసం అమర్​ ఆరాటం.. షాక్ ఇచ్చిన కరుణ.. అరుంధతిలో మొదలైన అనుమానం.. పాపం రాథోడ్​​!

Sanjiv Kumar HT Telugu
Oct 12, 2024 03:52 PM IST

Nindu Noorella Saavasam October 12th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 12వ తేది ఎపిసోడ్‌‌లో భాగమతి ఫ్రెండ్ కరుణను ఇంటికి పిలుస్తాడు అమర్. కానీ, భాగీకి తెలియకుండా పిలిపిస్తాడు. కానీ, ఇంటికి సడెన్‌గా వచ్చి షాక్ ఇస్తుంది కరుణ. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో..

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 12వ తేది ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అక్టోబర్ 12వ తేది ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌ (NNS 12th October Episode)లో భాగీ గురించి తెలుసుకునేందుకు కరుణను రమ్మంటాడు అమర్‌. స్కూటీ మీద వచ్చిన కరుణ రాథోడ్‌‌కు డాష్‌ ఇస్తుంది. ఎందుకొచ్చావని రాథోడ్ అడుగుతాడు. అమరేంద్ర గారిని కలవడానికి వచ్చానని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది.

పాట పాడిన కరుణ

అదేంటి భాగీకి తెలియకుండా కలవాలనుకుంటే ఇప్పుడు డైరెక్టుగా లోపలికే వెళ్లింది. నిజం చెప్తుందేమో అని రాథోడ్‌ కంగారు పడతాడు. గార్డెన్‌‌లో అంతా గమనిస్తున్న ఆరు.. ఆయన ఎందుకు భాగీ ఫ్రెండును సీక్రెట్‌‌గా కలవాలనుకున్నారు అని అడుగుతుంది. గుప్త నాకు తెలియదు అంటాడు. అక్కడికి వెళ్లి చూద్దాం పదండి అంటే నేను రానని గుప్త చెప్పగానే అరుంధతి ఒక్కతే వెళ్లి కిటికీలోంచి చూస్తుంది. లోపలికి వెళ్లిన కరుణ.. భాగీని చూసి పాట పాడుతుంది. భాగీ కూడా పాడుతుంది.

ఎట్లున్నవే.. అంటుంది కరుణ. నువ్వెలాగున్నావే.. అంటున్న భాగీతో నేను మస్తుగున్న.. అంటుంది. నేను ఇంకా బాగున్నా.. ఏయ్‌ నువ్వేంటి ఇక్కడ..? అని అడుగుతుంది భాగీ. తను వచ్చిందేంటి? రాథోడ్‌‌కు చెప్పిన అర్థం కాదు అనుకుంటాడు అమర్​. హాయ్‌ సార్‌.. అంటుంది కరుణ. రాథోడ్‌ కరుణ ఇక్కడేం చేస్తుంది అని అడుగుతాడు అమర్​.

ఆపడానికి చాలా ట్రై చేశాను ఆగకుండా తుర్రున వచ్చేసింది అని ఇద్దరూ కళ్లతో మాట్లాడుకుంటారు. శివరామ్ వచ్చి ఏమ్మా బాగున్నావా? అంటూ మీరిద్దరేంటి అట్ల చూసుకుంటున్నారు అని అడుగుతాడు. ఆ మంచిగున్న అంకుల్‌ మీరెట్టున్నారు అంటుంది కరుణ. నేను బాగున్నాను అమ్మా.. అని శివరామ్​ అనగానే వాళ్ల సంగతి పక్కన పెట్టు కానీ నువ్వేంటి సడెన్‌‌గా వచ్చి షాక్‌ ఇచ్చావు అంటుంది భాగీ.

అబద్ధం చెప్పడం రాదు

సడెన్‌‌గా రావడం ఏందే. అమరేంద్ర గారు ఫోన్‌ చేసి రమ్మంటే మరీ వచ్చిన. మీ ఆయన నీకు చెప్పలేదా? అంటుంది కరుణ. ఏవండి మీరే రమ్మని చెప్పారా? ఎప్పుడండి..? ఎక్కడండి..? ఏంటండి ఏమీ మాట్లాడరు అని అడుగుతుంది భాగీ. ఆఫీసుకు రమ్మన్న అమ్మాయి సడెన్‌గా ఇంటికి వస్తే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఎలా కవర్‌ చేయాలో ఆలోచించుకోవద్దా మా సారు. అసలే మా సారుకు అంజు పాపలా అబద్దం చెప్పడం రాదు.. దేవుడా.. అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు అంటాడు రాథోడ్​.

కవర్‌ చేయడం ఏంటి..?, అబద్దం చెప్పలేకపోవడం ఏంటి? అని నిర్మల అనగానే రాథోడ్‌ రాత్రి సరిగ్గా పడుకోలేదమ్మా అందుకే ఇలా తిక్కతిక్కగా మాట్లాడుతున్నాడు అని అమర్ అంటాడు. అవును సార్‌ నిద్ర వస్తుంది అంటాడు రాథోడ్‌. నీతో కొంచెం పర్సనల్‌‌గా మాట్లాడాలి పద రాథోడ్‌ అంటూ అమర్ బయటకు వెళ్తారు.

కిటికీలోంచి గమనిస్తున్న ఆరు కచ్చితంగా వీళ్లు ఏదో చేస్తున్నారు. కనుక్కుంటాను అని అనుకుంటుంది. బయటకు వెళ్లిన రాథోడ్‌, అమర్‌ ఎదురెదురుగా నిలబడితే ఆరు పక్కన ఉండి చూస్తుంది. సార్‌ నిజంగా ఆ అమ్మాయి ఇంటికి వస్తుందనుకోలేదు. ఆఫీసుకు వెళ్లిందంట. మీరు ఇంటికి వెళ్లారు అని చెప్పగానే ఇంటికి వచ్చింది అంటాడు రాథోడ్​.

అర్థం కావడం లేదే

ఆ అమ్మాయిని ఆపోచ్చు కదా? అంటాడు అమర్​. ఆపడానికి చాలా ట్రై చేశాను సార్‌. కానీ, ఆ తలతిక్క పిల్ల ఎవరి మాట వినదు అని మీకు తెలుసు కదా? సార్‌. మిస్సమ్మకు తెలియకుండా చేద్దామంటే ఇప్పుడు మొత్తం తెలిసిపోతుంది రాథోడ్‌ అని అంటాడు అమర్. మిస్సమ్మకు తెలియకుండా ఏం చేద్దామనుకుంటున్నారు. అయ్యో ఏమీ అర్థం కావడం లేదే.. అనుకుంటుంది ఆరు.

సార్‌ ఆ అమ్మాయిని బయటకు పిలుస్తాను మీరు మాట్లాడతారా? అంటాడు రాథోడ్. చేసింది చాలు ఇంకేం చేయకు వెళ్లు అంటాడు అమర్​. రాథోడ్‌.. మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు. నాకు అసలు అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగింది. మిస్సమ్మ ఫ్రెండును ఎందుకు రమ్మన్నారు. అయ్యో నా వాయిస్‌ వినపడదు కదా? అనుకుంటుంది ఆరు.

అంకుల్‌‌ను పిలుద్దామనుకున్నానే.. అని రామ్మూర్తికి ఫోన్‌ చేస్తాడు అమర్‌. రేపు అంజలి బర్త్‌డే మీరు మంగళ గారు మార్నింగ్‌ వచ్చేయండి. రేపు రోజంతా ఇక్కడే ఉండాలి అని మాట్లాడుతుంటాడు అమర్‌. ఇంతలో భాగీని తీసుకుని లోపలి నుంచి వస్తుంది కరుణ. అమర్‌‌ను పిలిచి భాగీ మీతో మాట్లాడాలి అంట అనగానే రా అని అమర్‌ సైగ చేస్తాడు. దగ్గరకు వెళ్లిన భాగీ, రామ్మూర్తిని ఇంటికి రమ్మని చెప్పమని చెప్తుంది.

అమర్ ఏం చేస్తాడు

దీంతో అమర్‌ ఫోన్ భాగీకి ఇచ్చి మాట్లాడు అంటాడు. భాగీ రామ్మూర్తితో మాట్లాడుతూ ఎమోషనల్‌ అవుతూ వెంటనే అమర్‌‌ను హగ్‌ చేసుకుంటుంది. అరుంధతి షాక్‌ అవుతుంది. ఏడుస్తూ భాగీ వైపు కోపంగా చూస్తుంది. పక్కనే ఉన్న రాథోడ్‌‌ను కొడుతుంది. అసలు అమర్​ ఏం చేస్తున్నాడు? ఎందుకు అందరినీ పిలుస్తున్నాడు? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు అక్టోబర్​ 12న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner