NNS November 21st Episode: పాముగా మారిన యముడు, పాములు పట్టేవాడిగా గుప్త- గజగజ వణికిన మనోహరి- భాగీ స్ట్రాంగ్ వార్నింగ్​​-nindu noorella saavasam serial november 21st episode yamudu gupta changed getup zee telugu serial nns today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns November 21st Episode: పాముగా మారిన యముడు, పాములు పట్టేవాడిగా గుప్త- గజగజ వణికిన మనోహరి- భాగీ స్ట్రాంగ్ వార్నింగ్​​

NNS November 21st Episode: పాముగా మారిన యముడు, పాములు పట్టేవాడిగా గుప్త- గజగజ వణికిన మనోహరి- భాగీ స్ట్రాంగ్ వార్నింగ్​​

Sanjiv Kumar HT Telugu
Nov 21, 2024 10:44 AM IST

Nindu Noorella Saavasam November 21st Episode: నిండు నూరేళ్ల సావాసం నవంబర్ 21 ఎపిసోడ్‌‌లో అరుంధతిని ఎలాగైనా ఘోరా బంధించేలా చేయాలని మనోహరి అనుకుంటుంది. ఇంతలో డౌర్ సౌండ్ వినిపించడంతో అరుంధతి అనుకుని గజగజ వణికిపోతుంది మనోహరి. ఇంతలో భాగీ వచ్చి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నవంబర్ 21 ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నవంబర్ 21 ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్‌ (NNS 21st November Episode)లో అరుంధతి ఆత్మని ఎలాగైనా ఘోరా బంధించేలా చూడాలి అనుకుంటుంది మనోహరి. అమావాస్య వచ్చింది అరుంధతి శక్తులు తగ్గి ఉంటాయి. ఘోర ఏమైనా ప్లాన్‌ చేశాడా..? అని మనోహరి ఆలోచిస్తుంటే వెనక నుంచి డోర్‌ సౌండ్‌ వినిపిస్తుంది.

గజగజ వణికిన మనోహరి

డోర్ సౌండ్‌కు భయంతో ఏయ్‌ నేను నిన్ను ఏమీ అనలేదు. నా దగ్గరకు రావొద్దు అంటుంది మనోహరి. వెనక నుంచి ఎవరో వచ్చి వీపు మీద చేయి వేయగానే భయంతో గజగజలాడుతుంది మనోహరి. ఇంతలో ఎందుకు మనోహరి అంత భయపడుతున్నావు అని భాగీ అడుగుతుంది. భాగీ వాయిస్‌ విన్న మనోహరి రిలాక్స్‌‌గా ఊపిరి పీల్చుకుంటుంది.

చూడు మను సాటి ఆడపిల్లగా నీకొక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను. నీది కాని దానికోసం యుద్దం చేయడం వృథా. మనిషి ఏం చేసినా.. ఎంత సాధించినా దాన్ని పంచుకోవడానికి ఎవరూ లేకపోతే ఆ గెలుపుకు విలువ ఉండదు. నువ్వు చేసే యుద్దంలో గెలుసు నీదే అయితే నువ్వు అందరినీ కోల్పోతావు. నా మాట విని ఇదంతా ఇంతటితో ఆపేసి.. ఈ ఇంటికి ఇంట్లో వాళ్లకు దూరంగా వెళ్లిపో.. అంటుంది భాగీ.

ఇంట్లోంచి పంపించేస్తాను

ఏయ్‌ ఏంటి పిచ్చి కానీ పట్టిందా..? తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు. నేను నీ గురించి సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టి నువ్వు ఇంకా ఇంట్లో ఉంటున్నావు. అదే నేను తలుచుకుంటే.. అంటుంది మనోహరి. తలుచుకో.. నాకు చూడాలని ఉంది నువ్వు తలుచుకుంటే ఏం జరుగుతుందో.. కానీ, నేను తలుచుకుంటే ఎం జరుగుతుదో తెలుసా..? పదే పది నిమిషాల్లో నిన్ను ఇంట్లోంచి పంపించేస్తాను భాగీ అంటుంది.

చూడు మను.. అక్క చావుకు నువ్వే కారణం అని అనుమానంగా ఉంది. అది నిజం అని చిన్న సాక్ష్యం దొరికినా.. నిన్ను వదిలిపెట్టను. నా సహనానికి పరీక్ష పెట్టాలని చూస్తే నేను తీసుకోబోయే నిర్ణయంతో చాలా బాధపడతావు అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది భాగీ. మనోహరి ఇరిటేటింగ్‌‌గా చూస్తుంది. అమర్‌ పక్కన బెడ్ మీద పడుకుని ఉంటుంది అరుంధతి.

లేకున్న ఉన్నట్లు

అమర్‌ కూడా నిద్ర మత్తులో ఆరు పక్కన ఉన్నట్లు మాట్లాడతాడు. నిద్ర లేవమని చెప్తాడు. ఆరు ఇవాళ ఆదివారం అని చెప్పడంతో అమర్‌ తిరిగి చూసి షాక్‌ అవుతాడు. ఇంతలో కాఫీ తీసుకుని భాగీ వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. దీంతో ఎవరో చేయి వేసినట్టు అనిపించింది అని అమర్‌ చెప్పగానే నేను లేకున్నా ఉన్నట్టు కలగంటున్నారా..? అని భాగీ అంటుంది. దాంతో అమర్‌ కోపంగా భాగీని తిడతాడు.

అయినా ఎప్పుడు లేనిది ఇప్పుడెందుకు ఎవరో చేయి వేసినట్టు అనిపించింది అంటుంది భాగీ. అది ఎవరో కాదు.. అరుంధతి అంటాడు అమర్​. గుండెల మీద తను వేసిన చేయి అచ్చం ఆరులానే అనిపించింది. తనను ఎంత మిస్‌ అవుతున్నానో నాకే తెలుసు. కానీ, ఎందుకో తెలియదు తను నా చుట్టూనే ఉందన్న ఫీలింగ్‌ ఉంది అని చెప్పి వెళ్లిపోతాడు అమర్.

ఇక్కడే ఉండాలని

భాగీ, అక్కడే ఉన్న అరుంధతి ఎమోషనల్ అవుతారు. యముడు మయపాశం పట్టుకుని ఆరు కోసం రెడీగా ఉంటాడు. గుప్తను ఆ బాలిక వచ్చిందా..? అని అడుగుతాడు.. రాలేదని గుప్త చెప్తాడు. ఆ బాలికను తీసుకుని యమపురికి వెళ్లవలెనని నీకు ఉన్నదా..? లేదా..? అంటాడు యముడు. ఉన్నది ప్రభు అని గుప్త అనగానే అటులైన ఆ బాలిక కొరకు చూడకుండా నాకెందుకు లేదు అని చెప్తున్నావు. నిజము చెప్పు గుప్త. ఆ బాలిక సాకుతో నువ్వు కూడా ఇక్కడ సకల భోగాలు అనుభవిస్తున్నావు కదా..? అంటాడు యముడు.

ఏమని సెలవిచ్చితిరి ప్రభు.. ఆ మాట అనుటకు మీకు నోరు ఎటుల వచ్చింది ప్రభు. ఈ పాపుల మధ్య నేను నలిగిపోతుంటిని ప్రభు అంటూ భూలోకం వచ్చినప్పటి నుంచి గుప్త పడిన కష్టాలు చెప్పి బాధపడుతాడు. దీంతో యముడు సరే కానీ ఆ బాలికను త్వరగా కనిపెట్టి మన లోకమునకు తీసుకెళ్లవలెను అంటాడు యముడు. తర్వాత ఇద్దరూ కలిసి వేషాలు మారుస్తారు.

మారువేషాలు

పాముగా యముడు.. పాములు పట్టేవాడిగా గుప్త మారిపోతారు. ఈ వేషాల్లో నాటకం ఆడి ఆ బాలికను యమపురికి తీసుకెళ్లాలని అనుకుంటారు. అక్కడితే నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner