NNS November 6th Episode: భాగీని కొట్టబోయిన అమర్​- మనోహరి సంబురం- రామ్మూర్తితో పిల్లల గొడవ- మిస్సమ్మ​​​​​​​​ రివేంజ్!-nindu noorella saavasam serial november 6th episode amar angry on bhagamathi for using aru saree zee telugu serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nns November 6th Episode: భాగీని కొట్టబోయిన అమర్​- మనోహరి సంబురం- రామ్మూర్తితో పిల్లల గొడవ- మిస్సమ్మ​​​​​​​​ రివేంజ్!

NNS November 6th Episode: భాగీని కొట్టబోయిన అమర్​- మనోహరి సంబురం- రామ్మూర్తితో పిల్లల గొడవ- మిస్సమ్మ​​​​​​​​ రివేంజ్!

Sanjiv Kumar HT Telugu
Nov 06, 2024 08:45 AM IST

Nindu Noorella Saavasam November 6th Episode: నిండు నూరేళ్ల సావాసం నవంబర్ 6 ఎపిసోడ్‌‌లో భాగమతిని అమర్ కొట్టబోయి ఆగుతాడు. అరుంధతి చీరను కర్టెన్‌గా కట్టడంపై ఫైర్ అవుతాడు. తర్వాత మనోహరి వచ్చి నువ్ బయటకు వెళ్లే సమయం వచ్చిందని సంతోషంగా చెబుతుంది మనోహరి. గుప్తాతో మనోహరిపై కోపంగా మాట్లాడుతుంది ఆరు.

నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నవంబర్ 6 ఎపిసోడ్‌‌
నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నవంబర్ 6 ఎపిసోడ్‌‌

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం ఈరోజు ఎపిసోడ్‌ (NNS 6th November Episode)లో అరుంధతి చీరని కర్టెన్​గా చేసి కడుతుంది భాగీ. ఇంటికి వచ్చిన అమర్‌ అనుమానంగా దేవుడి రూమ్ వైపు చూసి దగ్గరకు వళ్లి ఈ పని ఎవరు చేశారు? అని అడుగుతాడు. భాగీ దగ్గరకు వెళ్లి నేనే చేశానని చెప్తుంది.

నా దగ్గర ఉన్న జ్ఞాపకం

ఎందుకు చేశావని అమర్‌ అడగ్గానే పాత చీర పాడేయడం ఎందుకని కర్టెన్‌‌గా కట్టానని చెప్పడంతో అమర్‌ కోపంగా భాగీని కొట్టబోయి.. ఆగి తిడతాడు. ఇది అరుంధతి చీర నా దగ్గర ఉన్న జ్ఞాపకం ఇది అంటూ కోప్పడతాడు అమర్. అందరూ షాకింగ్‌‌గా చూస్తుంటారు. ఇంతలో మనోహరి వచ్చి మరింత రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.

అయ్యయ్యో ఏం చేశావు మిస్సమ్మ. అరుంధతి చీరను ఇలా మార్చడానికి నీకు మనసెలా వచ్చింది. అసలు నువ్వు ఆరు చీరను ఎందుకు ముట్టుకున్నావు. అమర్‌ ఆరు వస్తువుల్ని ప్రాణంగా చూసుకుంటాడు. అలాంటిది ఇవాళ నువ్వు ఆరు ప్రాణాలనే ముక్కలు చేశావు అంటుంది. నువ్వు ఆగమ్మా.. అసలే వాడు కోపంగా ఉంటే నువ్వు ఇలా మాట్లాడి వాడి కోపాన్ని ఇంకా పెంచుతావా..? అమర్‌.. మిస్సమ్మ ఇది తెలియక చేసింది. నిజంగా తెలిస్తే ఇలా చేయదు అంటాడు శివరామ్​.

భాగీ చెప్పేది కూడా

సారీ అండి నిజంగా ఇది అరుంధతి అక్క చీర అని నాకు తెలియదు అంటుంది భాగీ. మాట్లాడకు మిస్సమ్మ నువ్వు చెప్పే ఏ ఎక్స్‌ప్లనేషన్‌ నా బాధను, నా కోపాన్ని తగ్గించలేవు. తప్పు చేశావు మిస్సమ్మ చాలా పెద్ద తప్పు చేశావు. సరిదిద్దుకోలేని తప్పు చేశావు. ఈ బాధ విలువ నీకు చెప్పినా అర్థం చేసుకోలేవు అని అమర్‌ కోపంగా వెళ్లిపోతుంటే.. నిర్మల, శివరాం ఆగమని భాగీ చెప్పేది కూడా వినమని చెప్పినా అంటారు. కానీ, అమర్ మాత్రం అదేం వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

రాథోడ్‌ ముందు ఆ శారీ తీసేయ్‌ అంటాడు శివరామ్. అలాగే సార్‌.. అంటూ శారీ తీసుకుని వెళ్లిపోతాడు రాథోడ్​. మిస్సమ్మ ఆ చీర తీసుకునే ముందు ఒకసారి అడగాలి కదమ్మా.. అంటుంది నిర్మల. సరేలేవే అయిందేదో అయిపోయింది. మిస్సమ్మ ఇదేది మనసులో పెట్టుకోకు. అమర్‌ కోపం నీటి మీద బుడగ లాంటిది అని చెప్పి ఇద్దరూ వెళ్లిపోతారు.

బయటకు వెళ్లాల్సిన సమయం

మనోహరి హ్యాపీగా ఏంటి..? నేనే నీకు ఆ కర్టెన్‌ ఇచ్చానని అమర్‌‌‍కు చెప్తామనుకుంటున్నావా..? చెప్తే నీ తప్పును కప్పిపుచ్చుకుంటున్నావని అనుకుంటాడు. కానీ నిజం చెప్తున్నావని అసలు అనుకోడు. ఇంక నీ సామన్లు సర్దేసుకో మిస్మమ్మ. ఈ ఇంట్లో నుంచి అమర్‌ జీవితంలో నుంచి బయటకు వెళ్లాల్సిన టైం వచ్చింది అంటూ వెళ్లిపోతుంది. భాగీ ఏడుస్తూ అన్ని విషయాలు గుర్తు చేసుకుంటుంది.

ఆరు కోపంగా అటూ ఇటూ తిరుగుతూ గుప్తతో మాట్లాడుతుంది. అసలు ఆ మనోహరి మనిషేనా గుప్త గారు. పాపం మిస్సమ్మను ఆయనతో తిట్టించింది. ఆయినా ఆయన్ని కాదు ముందు మిస్సమ్మను అనాలి. ఇదంతా మనోహరి పని అని ఒక్కమాట చెప్పాలి కదా..? అంటుంది. చెప్పినా నీ పతి దేవుడు నమ్మునా..? తను ప్రేమించుచున్న వారి బాధకు తనే కారణం అయినానని ఎంత బాధపడుతుందో తెలుసా..? అంటాడు గుప్త.

దివ్యమైన గడియల్లో

ఈ మంచోళ్లు ఉన్నారే.. వీళ్లేప్పుడు ఇంతే గుప్త గారు ముంచే వాళ్ల చేతుల్లో మోసపోతూనే ఉంటారు. ఇలా నా వల్ల కాదు. మీరు నన్ను వెంటనే పైకి తీసుకెళ్లిపోండి. నేనే చెప్తున్నాను మీరు ఈ మాట కోసమే కదా? నా చుట్టూ తిరిగారు. నేనే చెప్తున్నాను నన్ను పైకి తీసుకెళ్లండి అంటుంది ఆరు. నేను ఇప్పుడు తీసుకెళ్లలేననే కదా? నువ్వు అడిగేది. దివ్యమైన గడియల్లో తప్పా నేను నిన్ను పైకి తీసుకెళ్లలేను అంటాడు గుప్త.

అన్ని తెలిసి కూడా ఆ మనోహరిని ఏమీ చేయలేకపోతున్నాను అనుకుంటుంది అరుంధతి. స్టోర్‌ రూంలో ఆరు చీరను పెట్టడానికి వెళ్లిన రాథోడ్‌‌ను ఆగమని వెళ్లి చీర తీసుకుని భాగీ బాధపడుతుంది. దీని కంతటికి మనోహరి కారణం అని జరిగింది చెప్పి.. ఎమోషనల్ అవుతుంది. పిల్లలు స్కూల్‌‌లో లంచ్‌ చేస్తుంటారు.

పిల్లల గొడవ

రామ్మూర్తి వారి దగ్గరకు వెళ్లి పిల్లలు మీకోసం అంతా వెతుకుతున్నాను అని చెప్పగానే పిల్లలు అక్కడి నుంచి వెళ్లిపోతుంటారు. మీరే ఇక్కడ కూర్చోండి నేనే వెళ్లిపోతాను అని రామ్మూర్తి వెళ్లిపోతుంటే.. బంటి వచ్చి రామ్మూర్తి టిఫిన్‌ బాక్స్‌ కింద పడేలా చేస్తాడు. పిల్లలు వెళ్లి బంటిని తిడతారు. దాంతో పిల్లల మధ్య గొడవ మొదలు అవుతుంది. అక్కడితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner