Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణికి బెదిరింపులు- మనోజ్, ప్రభావతికి దెబ్బ- ఇంటికి రవి శ్రుతి దంపతులు-gunde ninda gudi gantalu serial november 11th episode vardhan threatens rohini for 50 thousand star maa serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణికి బెదిరింపులు- మనోజ్, ప్రభావతికి దెబ్బ- ఇంటికి రవి శ్రుతి దంపతులు

Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణికి బెదిరింపులు- మనోజ్, ప్రభావతికి దెబ్బ- ఇంటికి రవి శ్రుతి దంపతులు

Sanjiv Kumar HT Telugu
Nov 11, 2024 10:08 AM IST

Gunde Ninda Gudi Gantalu Serial November 11 Episode: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 11 ఎపిసోడ్‌లో కొరియర్ బాయ్ వేశంలో రోహిణి బాయ్ ఫ్రెండ్ దినేష్ వర్దన్ వచ్చి బ్లాక్ మెయిల్ చేస్తాడు. తను కల్యాణి అనే రహస్యం తన దగ్గర ఉందని 50 వేలు అడుగుతాడు. ఆ డబ్బును మనోజ్‌ను అడుగుతుంది రోహిణి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 11 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 11 ఎపిసోడ్‌

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో వంటింట్లో టిఫిన్ ఏం చేశావ్ అని మీనాను అడుగుతుంది ప్రభావతి. మీరు ఏం చెబితే అది చేస్తాను అని మీనా అంటుంది. దోశలు వేయమంటే ముందే చెప్తే పిండి రుబ్బి పెట్టేదాన్ని అని మీనా అంటుంది. ఇడ్లీ చేయమంటే ఇడ్లీ రవ్వ లేదని అంటుంది మీనా.

టిఫిన్ కోసం పాట్లు

పూరీలు అని ప్రభావతి చెప్పబోయి ఆగి పూరీలు వద్దులే. మరేముందని అడుగుతుంది ప్రభావతి. ఉప్మారవ్వ ఉంది అని మీనా అంటుంది. అంతా నా మీద ఎగురుతారు అని ప్రభావతి అంటుంది. మీకోసం, మనోజ్ కోసం నేను చేస్తాను అని రోహిణి అంటుంది. ఏది మళ్లీ ఆ ఏబీసీ జ్యూసా అని ప్రభావతి అంటుంది. రోజు అదే చేస్తే బోర్ కొడుతుంది. నట్స్ వేసి మిల్క్ షేక్ చేస్తాను. షుగర్ లేకున్నా బాగుంటుంది అని రోహిణి అంటే.. ప్రభావతి మొహం అదోలా పెడుతుంది. మీనా నవ్వుతుంది.

మీనా నవ్వడం ఇద్దరూ చూస్తారు. మీ మావయ్యకు ట్యాబ్లెట్స్ ఇవ్వమని వారిస్తుంది ప్రభావతి. ఇంతలో మనోజ్ వచ్చి బాగా ఆకలేస్తుంది. ఏం చేశారు అనిఅడుగుతాడు. నట్స్ వేసి మిల్క్ షేక్ చేస్తున్నాను అని రోహిణి అంటే.. అబ్బా అని చీదరించుకున్న మనోజ్.. బాగా టైమ్ పట్టేలా ఉంది. వెళ్తాను అని అంటాడు. కడుపులో ఏం లేకుండా ఎలా వెళ్తావ్. ఏబీసీ జ్యూస్ చేస్తానులే. అది అయితే త్వరగా అవుతుందని రోహిణి అంటుంది. దాంతో చిరాకు పడతాడు మనోజ్.

ప్రభావతి వద్దంటున్నాడు కదా అని నచ్చజెబుతుంది. ఇంతకుముందు ఆఫీస్‌కు వెళ్లమని ఫోర్స్ చేస్తే గానీ, వెళ్లలేదు. ఇప్పుడు సిన్సియర్‌గా వెళ్తున్నాడు. త్వరగా పైకి వస్తావ్ అని రోహిణి అంటుంది. దాంతో ప్రభావతి, మనోజ్ మొహాలు చూసుకుంటారు. తర్వాత మనోజ్ ఆఫీస్‌కు వెళ్లడం చూసి కొరియర్ బాయ్ వేషంలో రోహిణి బాయ్ ఫ్రెండ్ వర్దన్ వస్తాడు. మీనాను చూడమని ప్రభావతి చెబుతుంది. మీనా వెళ్లి అడిగితే.. రోహిణి గారికి వచ్చింది. ఆవిడను పిలవండి అని వర్ధన్ అంటాడు.

దీపావళికి గిఫ్ట్

దాంతో సరేనని మీనా వెళ్లిపోతుంది. ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు. రోహిణి ఏమో ఏదో షేక్‌లు మిల్క్‌లు అంటుంది. అవన్నీ తాగాలంటే ఏదోలా ఉంది. పూరీలు చేస్తే బాగుండు అని ప్రభావతి అనుకుంటుంది. రోహిణి నీకే కొరియర్ వచ్చిందని మీనా చెబితే నాకెవరు పంపిస్తారని రోహిణి అనుకుంటుంది. మీ నాన్న గారేమో. దీపావళికి గిఫ్ట్ పంపించారేమో అని ప్రభావతి చెప్పగానే రోహిణి వెళ్లిపోతుంది.

డబ్బులు ఏమైనా పంపారేమో వెళ్లి చూద్దామని వెనుకే వెళ్తుంది ప్రభావతి. కొరియర్ బాయ్‌గా ఉన్న బాయ్‌ఫ్రెండ్ వర్దన్‌ను చూసి షాక్ అవుతుంది రోహిణి. ఇంతలో వచ్చిన ప్రభావతి ఏమొచ్చిందని అడుగుతుంది. తెలీదు మేడమ్ అని చెప్పిన వర్దన్ రోహిణి నీతో మాట్లాడాలి అని మెల్లిగా చెబుతాడు. దాంతో స్టవ్ మీద పాలు పెట్టాను చూడండి అని ప్రభావతికి చెబుతుంది రోహిణి. అది మీనా చూసుకుంటుంది అని అక్కడి నుంచే చెబుతుంది ప్రభావతి.

రోహిణి సంతకం చేస్తుంది. ఒక కవర్ వర్దన్ ఇస్తుంటే అది ప్రభావతి తీసుకుంటుంది. ఇదేంటీ చెక్‌లా ఉంది అని ప్రభావతి ఓపెన్ చేయబోతుంటే రోహిణి ఆపుతుంది. ఇది నాన్న పంపించలేదు. ఏటీఎమ్ కార్డ్ కోసం అప్లై చేసుకున్నా కదా. వాళ్లు పంపించారేమో అని రోహిణి చెబుతుంది. దాంతో పండక్కి బట్టలు తీసుకోమ్మని మీ నాన్న పంపించారేమో అనుకున్నా అని నిరాశపడి వెళ్లిపోతుంది ప్రభావతి. ఏంటిది అని రోహిణి బాయ్‌ఫ్రెండ్‌ను నిలదీస్తుంది రోహిణి.

నీ రహస్యం ఉంది

నా బతుకు మీద దెబ్బకొట్టి నువ్ హాయిగా బతుకుతానంటే ఎలా ఊరుకుంటాను. నా నెంబర్ బ్లాక్ చేస్తే ఇంటికి రాకుండా ఏం చేస్తాను. మీ నాన్న లక్షలు పంపిస్తారని అత్త అనుకుంటుంది. అసలు నీకు నాన్న లేడని తెలిస్తే.. చెప్పనా అని వర్ధన్ అంటాడు. ఏం కావాలని రోహిణి అడిగితే.. డబ్బులు కావాలని అని వర్ధన్ అంటాడు. నా దగ్గర లేవని రోహిణి అంటే.. నా దగ్గర నీ రహస్యం ఉందని వర్ధన్ అంటాడు. ఇంకా ఎన్ని రోజులు ఇలా బ్లాక్ మెయిల్ చేస్తావ్ అని రోహిణి అంటుంది.

నా ఉద్యోగం తీయించి నా కాపురం కూల్చేశావ్. చేతిలో డబ్బులేదు. ఓ 50 వేలు ఇస్తే వెళ్లిపోతాను. రేపు సాయంత్రం వరకు ఇవ్వాలి. లేకుంటే ఇంటికి వచ్చి అంతా చెప్పేస్తాను కల్యాణి అని వర్ధన్ అంటాడు. దాంతో రోహిణి షాక్ అవుతుంది. సరే నువ్ వెళ్లిపో అని రోహిణి వెనక్కి తిరగ్గానే అక్కడ మీనా ఉంటుంది. అది చూసి ఇద్దరూ అవాక్కవుతారు. దొరికేసామో అని భయపడుతారు. అత్తయ్యతో నువ్ చెబుతావా నేను చెప్పనా అని మీనా అంటుంది.

దేని గురించి అని రోహిణి అడుగుతుంది. ఉప్మాలో ఆయిల్ ఎంత వేయాలో అనేది అని మీనా అనగానే నేనే వస్తాను అని మీనాను పంపిస్తుంది రోహిణి. తర్వాత దినేష్ వర్దన్‌ను పంపిస్తుంది రోహిణి. ఏంటీ ఈ దినేష్ గాడు ఇప్పుడు వచ్చి చచ్చాడు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అని ఆలోచిస్తుంది రోహిణి. ఇంతలో మనోజ్ మొబైల్ మర్చిపోయాను అని వస్తాడు. నీకు దీపావళి బోనస్ ఎప్పుడు వస్తుందని రోహిణి అడుగుతుంది.

బోనస్ అడుగుతోంది

ఆ మాటలు ప్రభావతి చాటుగా వింటుంది. ఐడియా లేదు. ఎందుకు అని మనోజ్ అంటాడు. పార్లర్‌లో వర్కర్స్‌కు బోనస్ ఇవ్వాలి. అడుగుతున్నారని రోహిణి చెబుతుంది. మొన్నే జాయిన్ అయ్యాను కదా. ఇస్తారో కూడా తెలీదు. ఎండీని అడగాలి అని మనోజ్ అంటాడు. సరే అడుగు. ఇవ్వకుంటే స్టాఫ్ ముందు పరువు పోతుంది అని రోహిణి అంటుంది. సరే అని మనోజ్ బయటకు వచ్చేసరికి ప్రభావతి ఉంటుంది. ఇద్దరు పక్కకు వెళ్లి మాట్లాడుకుంటారు.

మొన్నే నెల జీతానికి అప్పు చేశాను. మళ్లీ అప్పు ఎవరు ఇస్తారు. నువ్ అడ్జస్ట్ చేయొచ్చు కదా అని మనోజ్ అంటాడు. నా దగ్గర ఎక్కడివిరా నేనేమైనా ఏటీఎమ్ మేషిన్‌నా అని ప్రభావతి అంటుంది. పెళ్లి చేశావ్‌గా మరి నెల నెల జీతం. పండక్కి బోనస్ అడుగుతుంది. ఈ ఒక్కసారికి చూడమ్మా. ఇంకెప్పుడు అడగను. ప్లీజ్ సేవ్ చేయొమ్మ అని మనోజ్ అంటాడు. నీ మొహం, మన పరిస్థితి చూస్తే జాలేస్తుందని, సరే చూస్తానని ప్రభావతి అంటుంది.

దాంతో మనోజ్ వెళ్లిపోతాడు. ఇంకెంతకాలంరా మనకు ఈ తిప్పలు అని ప్రభావతి అనుకుంటుంది. మరోవైపు బాలు తల పట్టుకుని ఉంటే మజ్జిగ ఇచ్చి వెళ్లిపోతుంది మీనా. నేను పొద్దున్నే పాలు తాగను అని బాలు అంటే.. రాత్రి తాగింది ఇంకా దిగలేదా అని మజ్జిక అని చెబుతుంది మీనా. తర్వాత తల పట్టుకుని కిందకు దిగిన బాలు సత్యంను గుద్దుతాడు. చూసుకోరా అని సత్యం అంటాడు. బాలు తల పట్టుకోవడం చూసి ఏమైందిరా రాత్రి పానియం పుచ్చుకున్నావా అని సత్యం అంటాడు.

అది అదృష్టం

లేదు మజ్జిగ తాగితే పోతుంది అని బాలు అంటాడు. సరే మీనాకు సత్యం చెప్పబోతుంటే మీనా మజ్జిగ ఇస్తుంది. దాంతో చేసేదిలేక మజ్జిగ తాగి వెళ్లిపోతాడు బాలు. వాడు నీతో ఎలా ఉంటున్నాడని సత్యం అడిగితే.. టైమ్ పడుతుందని మీనా అంటుంది. ఇందాకే చెబితే అడిగేసేవాన్ని కదా అని సత్యం అంటాడు. అది నా మీద కోపం కాదు. మీ మీద ప్రేమ. అది నావైపు మళ్లలాంటే మాటలా అని మీనా అంటుంది. నీ ఓర్పే నీకు శ్రీరామరక్ష అని సత్యం అంటాడు.

మరోవైపు గుడికి వెళ్తుంది ప్రభావతి. అక్కడికి కామాక్షి వచ్చి సత్యం గురించి అడుగుతుంది. మెల్లిమెల్లిగా కోలుకుంటున్నాడు. ఆ ముదనష్టపు సంత వచ్చి ఇలా చేశారు. ఏమైనా కానీ, మేము కాపాడుకున్నాం. నా ఒంటి మీది నగలు అమ్మాం. బాలుగాడు కారు అమ్మేశాడు అని ప్రభావతి అంటుంది. వస్తువులు మళ్లీ కొనుక్కోవచ్చు. మనిషి ముఖ్యమని కామాక్షి అంటుంది. ఆ మనిషికి బుద్ధిలేదు. మళ్లీ ఆ పూలకత్తెరను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. అంతా మా దురదృష్టం అని ప్రభావతి అంటుంది.

దురదృష్టం కాదు. అదృష్టం. మీనా చెల్లెలు సుమతీని రవిగాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు బాలుగాడు. అది జరగలేదని సంతోషపడు అని కామాక్షి అంటుంది. హుమ్ అదే జరిగితే అక్కా చెల్లెలు కలిసి ఇంటిని పూలసంత చేసేవారు. నువ్ అన్నట్లు ఒక గండం గట్టెక్కినట్లు అయింది. నేనే మీ ఇంటికి వద్దామనుకున్నా. ఇక్కడికి ఫోన్ చేసి రమ్మన్నావ్. ఏంటీ విషయం అని కామాక్షి అంటుంది. 50 వేలు కావాలి. పెద్ద మొత్తమే. పార్లర్ పిల్లలకు బోనస్ ఇవ్వాలని రోహిణి చెప్పింది. మనోజ్ జాబ్ చేయట్లేదని తెలుసు కదా. వాడు నన్ను అడిగాడు అని ప్రభావతి అంటుంది.

దీపావళికి పిలుద్దాం

నా సంగతి తెలుసు కదా. నా దగ్గర అంత డబ్బులేదు. కానీ, నా దగ్గర చిట్టీ డబ్బులు పాతికవేలు ఉన్నాయి. అవి ఇస్తాను అని కామాక్షి అంటుంది. కట్ చేస్తే దీపావళికి ఊరు వచ్చేయమని, ఇక్కడే అందరం పండుగ చేసుకుందామని సత్యం తల్లి కాల్ చేస్తుంది. సరేనని సత్యం అంటాడు. రవికి కొత్తగా పెళ్లయింది కదా. దీపావళికి వాళ్లను పిలుద్దాం అని ప్రభావతి అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. నువ్వేనా ఆ మాట మాట్లాడిందని బాలు అంటాడు.

పరాయిదాన్ని నీ పెళ్లాన్నే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. వాడు నీ తమ్ముడే కదరా. రక్త సంబంధం ఎలా వదులుకుంటాం అని ప్రభావతి అంటుంది. వాడు గానీ ఇంటికి వస్తే గుమ్మం ముందే నరికి పారేస్తాను. మళ్లీ వాడి పేరు ఈ ఇంట్లో వినపడటానికి వీళ్లేదు అని బాలు హెచ్చరిస్తాడు. నీ పెళ్లాం మాత్రం తక్కవ చేసిందా. దాన్ని మాత్రం ఇంట్లో పెట్టుకుంటావా అని ప్రభావతి నిలదీస్తుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner