Gunde Ninda Gudi Gantalu Today Episode: పుట్టింటికి మీనా, కూతురుని చితకొట్టిన తల్లి- రవికి శోభనం- వీధిలో బాలుకు అవమానం
Gunde Ninda Gudi Gantalu Serial October 21 Episode: గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 21 ఎపిసోడ్‌లో భర్త వెళ్లమంటేనే వెళ్తాను అని మీనా చెబుతుంది. దాంతో ఫోన్‌లో బాలు మీనాను వెళ్లిపోమ్మని, ఇక ఇద్దరికి సంబంధం లేదని చెబుతాడు. దాంతో పుట్టింటికి మీనా వెళ్తుంది. మరోవైపు రవితో శోభనం ప్లాన్ చేస్తుంది శ్రుతి.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మావయ్యకు చెబితే వింటారు అని మీనా చెబుతుంది. అలా వినే ఇలా జరిగింది. నేను కాపురానికి వచ్చాకా ఆయనకు ఇంత అవమానం జరగలేదు అని ప్రభావతి అంటుంది. తప్పుచేశావ్ మీనా అని రోహిణి అంటుంది.
నేను తప్పు చేయలేదు. రవి ప్రేమించిన విషయం మావయ్యకు తెలిస్తే బాధపడతారని బాలునే చెప్పకన్నాడు అని మీనా అంటుంది. మాకైనా చెప్పి చావచ్చు కదా. మీ పెంపకం అలాంటిది అని ప్రభావతి అంటుంది. నేను పడుతున్నాను కదా. మళ్లీ మావాళ్లను ఎందుకు లాక్కొస్తారు. నేను ఏం చేయలేదు. రవి చేతిలో కూడా ఏం లేదు. తన పెళ్లి చేస్తున్నారని శ్రుతినే తొందరపెట్టింది అని మీనా చెబుతుంది. హో అంటే ఇదంతా నీకు తెలుసా అని ప్రభావతి అంటుంది.
పెళ్లి గురించి తెలీదు
ఎందుకు తెలీదు అత్తయ్య. ఆరోజు శ్రుతి ఇంటికి వచ్చి మీనాను కలిసింది కదా. ఈ ప్లాన్ అంతా ఆరోజు నుంచే మొదలైంది అన్నమాట అని రోహిణి ఇంకా ఇరికిస్తుంది. అది గుర్తు చేసుకున్న ప్రభావతి నేనే పట్టించుకోలేదు. ఇంత కథ నడిపిస్తావా. నా ఇంట్లో ఉంటూ నాకో వెన్నుపోటు పొడుస్తావా. నువ్ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు వెళ్లు అని అంటుంది. ఆరోజు వచ్చింది నిజమే. కానీ, పెళ్లి చేసుకుంటున్నట్లు తెలీదు. నేను ఎలాంటి మాట ఇవ్వలేదు అని మీనా అంటుంది.
శ్రుతి వచ్చిందంటేనే నీకు పరిచయం ఉందని అర్థమవుతోంది. మాకు ఆరోజు చెబితే మేము ఎలాగైనా పెళ్లి ఆపేవాళ్లం కదా. దాచిపెట్టడం వల్లే కదా అందరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది అని మనోజ్ అంటాడు. ఇది సంతకం పెట్టినట్లు తెలిసిన తర్వాతే ఇంట్లోకి రానిచ్చేది లేదని డిసైడ్ అయ్యాను అని ప్రభావతి అంటుంది. నా భర్త లేనప్పుడు నేను ఇంట్లోంచి వెళ్లను. నాకు తాళి కట్టిన భర్త చెబితేనే వెళ్లిపోతాను అని ప్రభావతి అంటుంది.
హో.. అది చూసుకునా. చెవుల్లోంచి రక్తాలు కారేటట్టు చెబుతాడు. మనోజ్ ఫోన్ చేయి అని ప్రభావతి అంటుంది. దాంతో మనోజ్ కాల్ చేస్తాడు. మీనా చెప్పిందే ప్రభావతి చెబుతుంది. దాంతో మీనాతో బాలు మాట్లాడుతాడు. నేను చెప్పేది వినండి అని మీనా అంటుంది. ఏం లేదు. నేను ముందే చెప్పాను. మా నాన్నకు గౌరవం ఇవ్వనివాడి కూతురుని రవి పెళ్లి చేసుడానికి వీళ్లేదని వాడికి చెప్పాను. నీకు చెప్పాను. అయినా వెళ్లి జరిపించావ్. చేసుకున్న వాడిని వదలను. నిన్ను జీవితంలో క్షమించను అని బాలు అంటాడు.
బాలు గొడవ
నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. దాన్ని ఇంట్లో వాళ్లంతా గెంటేయండి అని బాలు అంటాడు. నీ తాళి కట్టినవాడు చెప్పాడుగా వెళ్లు అని ప్రభావతి అంటుంది. నా కడుపు నిండిపోయింది. వెళ్తాను. మళ్లీ ఆయనే పిలుస్తే కానీ రాను అని మీనా అంటుంది. వాడి మనసు విరిగితే ఎవరి మాట వినడు. ఆ తిక్కలోడికి తిక్కరేగింది. వాడు వచ్చి నిన్ను పిలవడు వెళ్లు అని తోసేస్తుంది ప్రభావతి. దాంతో మీనా షాక్ అయి వెళ్లిపోతుంది.
మరోవైపు రెస్టారెంట్‍కు వెళ్లి రవి గురించి గొడవ చేస్తాడు బాలు. అక్కడ పనిచేస్తున్న అతను బాలును బయటకు తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానని పది రోజులు లీవ్ అడిగి వెళ్లాడు. నువ్వంటే రవికి చాలా ఇష్టం అని చెబుతాడు. ఇష్టముంటే ఎంత లేకుంటే ఎంత. మా నాన్నకంటే వాడినే ఎక్కువ చూసుకున్నాను. వాడే మా నాన్నను ఇరికించాడు. రెండు రోజులు అయిపోయాయి మళ్లీ వాడు రాక మానడు. అప్పుడు చెబుతాను అని బాలు అంటాడు.
తర్వాత పూల కుండీ పగలగొడతాడు. రవిగాడి తల పగులగొడదామని వచ్చాను. అందుకే పూల కుండీ పగులగొట్టా అని డబ్బులు ఇస్తాడు. వాచ్‌మెన్‌కు ఫోన్ నెంబర్, డబ్బులిచ్చి రవి వస్తే కాల్ చేసి చెప్పమని వెళ్లిపోతాడు బాలు. మరోవైపు సుమతీని తల్లి పార్వతి చితకబాదుతుంది. ఆ రవిగాడితో మాట్లాడకని చెప్పాను కదే. ఇప్పుడు వాడు బాగానే ఉన్నాడే. కానీ, మనల్ని ఎవరు అర్థం చేసుకోరు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావే. నీ వల్ల మీ అక్క ఎన్ని మాటలు పడుతుందో అని ఏడుస్తుంది పార్వతి.
పుట్టింటికి మీనా
దాంతో కిందకూలపడిపోతుంది సుమతి. అప్పుడే అత్త, భర్త మాటలు తలుచుకుంటూ పుట్టింటికి వెళ్తుంది మీనా. నువ్ చేసిన పనికి అక్క జీవితాంతం అక్కడ పడి ఏడవాల్సి వస్తుంది. మీ బావ ఇప్పుడిప్పుడే మారుతున్నాడనుకుంటే.. మొత్తం తిరగబడిపోయింది. ఇక దాని కాపురం ఏమైపోతుందో ఆ భగవంతుడికే తెలియాలి అని పార్వతి అంటుంది. ఇంతలో మీనా వచ్చి అమ్మ అంటూ హగ్ చేసుకుంటుంది. ఏం జరిగిందే అని పార్వతి అడుగుతుంది.
ఇక ఆ ఇంట్లో నాకు చోటులేదు. ఇంట్లోనుంచి నన్ను వెలివేశారు. జీవింతలో ఇంట్లో అడుగుపెట్టొద్దని గెంటేశారు. ఇక ఆయన జంతువును తరిమినట్లు తరిమారు. రవి ఇంటికి వస్తే ఒకలా ఉండేది. కానీ, రవి రాలేదు. మావయ్యను జైళ్లో పెట్టడానికి కారణం నేనే అని గెంటేశారు అని మీనా చెబుతుంది. ఏ తప్పు చేయకున్నా మనకే ఇలా జరుగుతున్నాయేంటే అని పార్వతి ఏడుస్తుంది. దాంతో సుమతిని తిడుతూ మళ్లీ కొడుతుంది.
అక్కా సారీ అక్కా అని మీనా కాళ్ల మీద పడుతుంది సుమతి. ఇంత పెద్ద గొడవ జరుగుతుందని అనుకోలేదు. ఏం జరిగినా సరే ముందు నీకు చెప్పకపోవడం నా తప్పే అని సుమతి అంటుంది. నువ్ కూడా నన్ను కొట్టు అక్క. నన్ను చంపెయ్ అక్క. నేను పాపం చేశాను అని సుమతి అంటుంది. నా రాతను ఆ దేవుడే ఇలా రాశాడు. ఇదొక కారణం అయింది. ఇప్పుడు ఎవరిని అని ఏం లాభం. ఏం చెప్పిన ఎవరు వినేలా లేరు అని మీనా అంటుంది.
నా మొహం ఎలా చూపించను
మంచిగా ఆలోచించడం తప్పే అని తెలిసేలోపు అత్తగారి తలుపులు మూసుకుపోయాయి అని మీనా అంటుంది. అందరూ కలిసి నిన్ను నిలువెల్లా ముంచేశారు అని పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ పెళ్లి నా కాపురానికే ముప్పు తెస్తుందని అనుకోలేదమ్మా అని మీనా అంటుంది. ఇప్పుడు మీ మావయ్య కాళ్ల మీద పడి ఎలా అడగను. ఆయనకు నా మొహం ఎలా చూపించను అని కిందకూలపడిపోతుంది పార్వతి. మరోవైపు తనను బాలు కొట్టింది, ప్రభావతి అన్నది, తండ్రి చేసింది గుర్తు చేసుకుంటాడు రవి.
గుడ్ మార్నింగ్ శ్రీవారు. ఎప్పుడు లేచావ్ అని శ్రుతి అంటుంది. ఇంట్లో వాళ్లను బాధపెట్టి మనం ఎలా హ్యాపీగా ఉండాలి. తలంతా పట్టేసినట్లు ఉంది అని రవి అంటాడు. నా తలనొప్పి పోయేలా ఏం చేయాలో నాకు తెలుసు. స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకురా అని శ్రుతి అంటుంది. ఎందుకు అని రవి అంటాడు. దాంతో చిరాకు పడిన శ్రుతి ఇవాళ మనకు స్పెషల్ డే కదా. నీకు అన్ని తెలుసని నాకు తెలుసు. ఈలోపు నేను రూమ్‌ను డెకరేట్ చేస్తాను అని శ్రుతి అంటుంది.
మరోవైపు వీధిలో తండ్రి అరెస్ట్ గురించి మాట్లాడుతారు. తప్పులేకున్న అరెస్ట్ చేశారని బాలు అంటాడు. తప్పులేకుండా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు అని ఓ తాగుబోతు అవమానిస్తాడు. దాంతో అతన్ని చితక్కొడతాడు బాలు. అత్తింటికి వెళ్లమని, పెళ్లయిన కూతురు పుట్టింట్లో ఉంటే నలుగురు నా మొహంపై ఉమ్మేస్తారు అని పార్వతి అంటుంది. అక్కడితే నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగుస్తుంది.
టాపిక్