Gunde Ninda Gudi Gantalu Today Episode: అర్ధనగ్నంగా బాలు, మనోజ్- భార్యతో ఇంటికి రవి- రోహిణి తల్లి ఎంట్రీ- నిజం బయటకు!-gunde ninda gudi gantalu serial november 20th episode meena experiences joy ravi going home with wife star maa serial ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gunde Ninda Gudi Gantalu Today Episode: అర్ధనగ్నంగా బాలు, మనోజ్- భార్యతో ఇంటికి రవి- రోహిణి తల్లి ఎంట్రీ- నిజం బయటకు!

Gunde Ninda Gudi Gantalu Today Episode: అర్ధనగ్నంగా బాలు, మనోజ్- భార్యతో ఇంటికి రవి- రోహిణి తల్లి ఎంట్రీ- నిజం బయటకు!

Sanjiv Kumar HT Telugu
Nov 20, 2024 09:55 AM IST

Gunde Ninda Gudi Gantalu Serial November 20 Episode: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 20 ఎపిసోడ్‌లో బాలును బ్లాక్ మెయిల్ చేసి కాళ్ల దగ్గర కూర్చోపెట్టుకుని కుచ్చీళ్లు సరిచేయించుకుంటుంది మీనా. ఈ క్రమంలో ఇద్దరు రొమాటింగ్‌గా చూసుకుంటారు. సుశీల కాల్ చేసి ఇంటికి రమ్మనడంతో రవి వస్తానంటాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 20 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 20 ఎపిసోడ్‌

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో నీకు బాలుకు సమస్య ఏంటని మీనాను అడుగుతుంది సుశీల. వాడిని పెంచింది నేను. వాడి మొహం చూసి చెప్పలేనా. మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్య ఉందా. వాడు మళ్లీ నిన్ను అపార్థం చేసుకున్నాడా అని సుశీల అడుగుతుంది. ఆ మాటలు వింటున్న బాలును చూస్తుంది మీనా.

బతిమిలాడిన బాలు

ప్లీజ్ చెప్పొద్దు అని బతిమిలాడుకుంటాడు బాలు. దాంతో సుశీలను హగ్ చేసుకుంటుంది మీనా. ఈ ఇంట్లో నన్ను అందరికంటే ముందు అర్థం చేసుకుంది మీరే. ఏదైనా ఉంటే మీకు చెప్పకుండా ఎందుకుంటాను. ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం. చిన్న చిన్న కోపాలు సహజం. అది నేను చేసిన పనులవల్లే తప్పా నా వల్ల కాదు. మీ మనవడి కోపం ఎంత అమ్మమ్మ వేడి నీళ్లు చన్నీళ్లు అయినంత సేపు. కాసేపట్లో చూడండి మీనా అనుకుంటూ వచ్చి మాట్లాడుతాడు అని మీనా అంటుంది.

అన్నట్లుగానే బాలు వచ్చి గుడికి వెళ్లాలి కదా రెడీ అవ్వండి అని బాలు అంటాడు. ఆగండి అని బాలు, మీనాను ఒక్కటి చేర్చి మురిసిపోతుంది సుశీల. నా చేతిలో మునిమనవడిని ఎప్పుడు పెడుతున్నారు అని సుశీల అడుగుతుంది. దాంతో ఇద్దరు సిగ్గు పడతారు. అదొక్కటే మిగిలి ఉంది అని బాలు అంటాడు. సరే అని కారు తీసుకెళ్లేందుకు వెళ్తున్న బాలును ఆపి పండక్కి స్నానం చేయకుండా బయటకు వెళ్లడమేంట్రా అని అంటుంది సుశీల.

దాంతో సరేనని వెళ్తాడు బాలు. వీన్ని ఇలాగే వదిలేస్తా లాభం లేదు. నేను వెళ్లేలోపు వీడి చిరాకు పోయి నీ కొంగుపట్టుకుని తిరిగేలా చేస్తాను చూడు అని సుశీల అంటుంది. దాంతో సరేనని మీనా నవ్వుతుంది. తర్వాత మనోజ్, బాలు స్నానానికి వస్తారు. ఈరోజుల్లో తలపెట్టుకుని స్నానం చేయడమేంటని మనోజ్ అంటాడు. మీ అమ్మ ఇలా చేయించడంలేదా అని సుశీల అడిగితే.. అంతా టైమ్ ఎక్కడిది. అందరూ బిజీగా ఉంటున్నారు కదా అని ప్రభావతి అంటుంది.

తలలో ఉన్న కుళ్లు

అలా చెప్పి ఇలాగే వదిలేస్తావా. వీళ్ల తల ఎలా ఉందో చూడు. నూనె పట్టించి తలంటితే కుళ్లు పోయి తలంతా శుభ్రం అవుతుంది అని సుశీల అంటుంది. అలా అయితే ఇది వీడికి చాలా అవసరం. వీడి తలంతా కుళ్లు కుతంత్రాలతో నిండిపోయింది అని బాలు అంటాడు. దాంతో ప్రభావతి కవర్ చేస్తుంది. రేయ్ ముందు నీ తలలో ఉన్న కుళ్లు గురించి చూసుకోరా అని మనోజ్ అంటాడు. రేయ్ ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండరేమిట్రా అని సుశీల అంటుంది.

అలా గడ్డి పెట్టమ్మా. ఇంకా చిన్నపిల్లల్లా ఇంట్లో గొడవే అని సత్యం అంటాడు. అవును చిన్న పిల్లలు అంటే గుర్తొచ్చింది. చిన్నోడు ఏడిరా అని సుశీల అడుగుతుంది. దాంతో అంతా షాక్ అవుతుంది. ఎక్కడ వాడు. ఇంకా లేవలేదా. వాడు ఇంట్లో లేడా. పండగ పూట ఎటు వెళ్లాడు. ప్రభా రవి ఎక్కడ అని సుశీల అడుగుతుంది. రవి ఊరెళ్లాడని, ఏదో సర్టిఫికేట్ తెచ్చుకోవాలని మీనా అబద్థం చెబుతుంది. పండగ పూట కాలేజీ ఉండదు కదా అని సుశీల అంటుంది.

వెళ్లి రెండు రోజులు అయింది ఇవాళ రేపో వస్తాడు అని మీనా అంటుంది. అబ్బా అబద్ధం చెప్పడానికి అరక్షణం కూడా పట్టదు అని బాలు అనుకుంటాడు. పండగ పూట పనులు పెట్టుకుంటే ఎలా అని సుశీల అంటే.. వినేవాడికి చెప్పొచ్చు. ఆగకుండా వెళ్తే ఎలా అని బాలు అంటాడు. అదేంట్రా అలా అంటున్నావ్. వాడితో కూడా గొడవ పడ్డావా ఏంటీ అని సుశీల అంటుంది. లేదని మీనా కవర్ చేస్తుంది. మళ్లీ లేట్ అయితే సర్టిఫికెట్స్‌కు లేట్ అవుతుందని వెళ్లాడని మీనా అంటుంది.

అర్ధనగ్నంగా ఎండలో

ఎంత అలవోకగా అబద్ధాలు చెబుతుందో అని బాలు అనుకుంటాడు. సరిపోయింది ఉండండి నేనే ఫోన్ చేస్తాను అని సుశీల ఫోన్ చూస్తుంది. ఆ ఫోన్ లాక్కున్న బాలు మమ్మల్ని ఇలా అర్ధనగ్నంగా ఎండలో నిల్చోబెట్టి నువ్ వేరే పని చేస్తున్నావా. ముందు మా పని చూడు అని బాలు అంటాడు. అవును నానమ్మ. చాలా అవమానంగా ఉంది. ఇలా ఎవరైనా చూస్తే పరువు పోతుంది మనోజ్ అంటాడు. నీకు పరువు ఉందారా అని బాలు సెటైర్ వేస్తాడు.

తర్వాత మనోజ్‌కు నూనె పట్టించమని రోహిణికి చెబుతుంది సుశీల. బాలుకు నూనె పెట్టమని సుశీల అంటుంది. నాకు నువ్వు పెట్టాల్సిన అవసరం లేదని బాలు అంటే.. మరి ఎవరు పెడతార్రా అని సుశీల అంటుంది. నేనే పెట్టుకుంటాను అని తలమీద టీ పోసుకుంటాడు బాలు. దాంతో అంతా నవ్వుతారు. ఇప్పుడు అర్థమైందా ఎవరు చేయాల్సిన పని వాళ్లే చేయాలి అని మీనాను చేయమంటుంది సుశీల. బాలుకు మీనా, మనోజ్‌కు రోహిణి తలంటుతారు.

తర్వాత మీనా చీర మార్చుకుంటుండగా బాలు వస్తాడు. ఇద్దరు వాదించుకుంటారు. కుచ్చీళ్లు సరిగా కుదరట్లేదు. సరిచేయండి అని మీనా అంటుంది. కొట్టానంటే కోమాలోకి వెళ్తావ్. మీ ఆయన మగాడు. పైట, కుచ్చీళ్లు సరిచేయడు అని బాలు అంటాడు. చేయకుంటే అమ్మమ్మ గారికి నిజం చెబుతా అని బ్లాక్ మెయిల్ చేస్తుంది మీనా. అమ్మమ్మ అని మీనా పిలుస్తుంటే వెంటనే వచ్చి మీనా నోరు మూస్తాడు బాలు. అప్పుడే ఒకరిపై ఒకరు తూలినట్లుగా అవుతారు.

నా కొంప ముంచే పని

ఒకరినొకరు చూసుకుంటారు. అదంతా చాలా రొమాంటిక్‌గా ఉంటుంది. తర్వాత తేరుకున్న బాలు ఎక్కువ చేయకు. నోరు మూసుకుని ఉండు అని అంటాడు. కుచ్చీళ్లు సరిచేయమని మీనా చూడటంతో చేసేది లేక మీనా కాళ్ల దగ్గర కూర్చుంటాడు. పెద్ద పెద్ద మోనార్ఖులకో తలవంచలేదు. అలాంటిది నీ కాళ్ల దగ్గర కూర్చోపెట్టుకుని కుచ్చీళ్లు సరిచేయించుకుంటున్నావ్ కదా. నీ సంగతి చెప్తా అని బాలు అంటాడు. మీనా చాలా సంతోషిస్తుంది.

తర్వాత అంతా దేవుడుకి దండం పెట్టుకుంటారు. మీనా, బాలును చూసిన ప్రభావతి డౌట్ పడుతుంది. వాడేంటీ చిరాకుగా ఉన్నాడు. అదేమో సిగ్గు పడుతుంది. కొంపదీసి లోపల నా కొంప ముంచే పని చేశారా ఏంటీ అని ప్రభావతి భయపడుతుంది. తర్వాత అత్త చెప్పడంతో అందరికి హారతి ఇస్తుంది ప్రభావతి. బాలు, మీనాకు వచ్చే ఏడాదికి పండండి బిడ్డను తన చేతిలో పెట్టాలని సుశీల ఆశీర్వదిస్తుంది. నేను ఒప్పుకోను అని ప్రభావతి అంటుంది.

దాంతో అంతా షాక్ అవుతారు. వీళ్లకంటే పెద్దవాళ్లు మనోజ్, రోహిణి ఉన్నారు కదా. ముందు వాళ్లకంటే బాగుంటుంది అని ప్రభావతి అంటుంది. ఎవరికి ముందు అయిన ఇంటికి వారసుడే కదా అని సుశీల అంటుంది. రోహిణి దానిపై దృష్టిపెట్టు అని ప్రభావతి అంటుంది. రవిగాడు కూడా ఉంటే బాగుండు అని సుశీల అంటుంది. తర్వాత మౌనిక టాపిక్ డైవర్ట్ చేసి ఆశీర్వదం తీసుకుంటుంది. అనంతరం రవికి కాల్ చేస్తుంది సుశీల.

కుటుంబంతో కలపాలని

మా విషయం తెలిసి కాల్ చేస్తుందా అని కాల్ లిఫ్ట్ చేస్తాడు రవి. రేయ్ ఏంట్రా నువ్ చేసిన పని. అలా ఎలా చేశావ్‌రా. కుటుంబం అంటే గౌరవం లేకుండా పోయింది. నాకు అంతా తెలిసింది. మీ అమ్మ చెప్పింది. నేను మీ ఇంటికి వచ్చాను అని సుశీల అంటుంది. నా చేయి దాటిపోయే పరిస్థితి కాబట్టే అలా చేయాల్సివచ్చింది అని రవి అంటాడు. సరే ఇంటికి రా అందరు బాధపడుతున్నారు. పండగ పూట బయటివాడిలా ఉండటం ఏంట్రా. సాయంత్రం దీపం వెలిగించే టైమ్‌కు ఇంటికి రారా అని సుశీల అంటుంది.

అంటే నానమ్మ ఇంట్లోవాళ్లకు నచ్చజెప్పిందా అని అనుకున్న రవి సరే వస్తాను అని చెబుతాడు. దేవుడు నా బాధను చూసి ఈ పండగ పూట నా కుటుంబంతో కలపాలని అనుకుంటున్నాడు. ఈ గుడ్ న్యూస్ శ్రుతికి చెప్పాలి అని సుశీలకు కాల్ చేస్తాడు రవి. ఇంటికి వస్తున్నానడంతో సరే ఇంటికి రా గుడ్ న్యూస్ చెప్పాలని అంటాడు రవి. మరోవైపు ఓ కారు చూసుకుంటూ ఎమోషనల్ అవుతాడు బాలు. మరోవైపు రోహిణికి జ్వరం రావడంతో తడిబట్ట వేస్తుంది ప్రభావతి.

ఇంతలో ఇంట్లోకి అయ్యయ్యో అయ్యయ్యో రోహిణి అంటూ వచ్చేస్తుంది రోహిణి తల్లి. అది చూసి అంతా షాక్ అవుతారు. వీళ్లెందుకు ఇక్కడ ఉన్నారని సత్యం అంటాడు. మీరెందుకు రోహిణి చూసి అంతలా కంగారుపడాలి అని ప్రభావతి అంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner