IPL 2025 Auction Unsold Players List: ఐపీఎల్ 2025 వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా ఇదే..లిస్ట్‌లో సన్‌రైజర్స్ స్టార్స్
IPL 2025 unsold players: ఐపీఎల్ 2025 వేలంలో చాలా మంది స్టార్ క్రికెటర్లకి మొండిచేయి ఎదురైంది. ఒకప్పుడు ఇదే ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించిన ఫ్రాంఛైజీలు.. చౌకగా వస్తున్నా కనీసం పట్టించుకోలేదు.
ఐపీఎల్ 2025 వేలంలో అన్‌సోల్డ్ ప్లేయర్స్
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఒకవైపు అనామక ఆటగాళ్లకే ఫ్రాంఛైజీలు కోట్ల వర్షం కురిపించాయి. కానీ.. చాలా మంది స్టార్ క్రికెటర్లకి నిరాశే ఎదురైంది. వేలంలో తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చినా.. అమ్ముడుపోని వారు చాలా మందే ఉన్నారు.
అంతర్జాతీయ మ్యాచ్‌లలో అనుభవం, క్రేజ్ ఉన్న ఆటగాళ్లని సైతం ఐపీఎల్ ఫ్రాంఛైజీలు పక్కన పెట్టేశాయి. ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా ఉండటం గమనార్హం. అలానే భారత్ ప్లేయర్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ తదితరుకి కూడా నిరాశ తప్పలేదు.
ఏ ప్లేయర్.. ఎంత ధరకి ఐపీఎల్ 2025 వేలంలోకి వచ్చి అన్‌సోల్డ్‌గా మిగిలారంటే?
- డేవిడ్ వార్నర్, బ్యాటర్, - రూ.2 కోట్లు
- జానీ బెయిర్‌స్టో, వికెట్ కీపర్ - రూ.2 కోట్లు
- ముస్తాఫిజుర్ రెహ్మాన్, బౌలర్, 2 కోట్లు
- నవీన్ ఉల్ హక్ , బౌలర్, 2 కోట్లు
- ఉమేశ్ యాదవ్, బౌలర్లు, 2 కోట్లు
- స్టీవ్ స్మిత్, బ్యాటర్, 2 కోట్లు
- పీయూష్ చావ్లా, బౌలర్, 30 లక్షల
- కేన్ విలియమ్సన్, బ్యాటర్, రూ. 2 కోట్లు
- మయాంక్ అగర్వాల్, బ్యాటర్, రూ. 2 కోట్లు
- పృథ్వీ షా, బ్యాటర్, రూ. 75 లక్షలు
- శార్దూల్ ఠాకూర్, ఆల్‌రౌండర్,రూ. 2 కోట్లు
- డారిల్ మిచెల్, ఆల్‌రౌండర్, రూ. 2 కోట్లు
- వకార్ సలాంఖేల్, బౌలర్, రూ.75 లక్షలు
* క్రివేత్సో కేన్స్, అన్క్యాప్డ్ ఆల్‌రౌండర్,రూ. 30 లక్షలు
- యశ్ ధూల్, అన్క్యాప్డ్ బ్యాటర్- 30 లక్షలు
- ఉత్కర్ష్ సింగ్, అన్క్యాప్డ్ ఆల్రౌండర్- 30 లక్షలు
- ఉపేంద్ర యాదవ్, అన్క్యాప్డ్ వికెట్ కీపర్, 30 లక్షల
- షై హోప్ వికెట్ కీపర్ -1.25 కోట్లు
- అకీల్ హుస్సేన్, బౌలర్, 1.5 కోట్లు
- ఆదిల్ రషీద్, బౌలర్, 2 కోట్లు
- కేశవ్ మహారాజ్, బౌలర్, 75 లక్షల
- సికందర్ రజా, ఆల్రౌండర్, 1.25 కోట్లల
- సర్ఫరాజ్ ఖాన్ , ఆల్రౌండర్, 75 లక్షల
- కైల్ మేయర్స్, ఆల్రౌండర్, 1.5 కోట్లు
- మాథ్యూ షార్ట్, ఆల్రౌండర్, 75 లక్షల
- జాసన్ బెహ్రెన్డార్ఫ్, బౌలర్, 1.5 కోట్ల
- శివమ్ మావి, బౌలర్, 75 లక్షలు
- నవదీప్ సైనీ అన్క్యాప్డ్ ఆల్రౌండర్, 30 లక్షలు