Brahmamudi November 25th Episode: బ్రహ్మముడి- కనకంకు బానిసలా అపర్ణ- రాజ్‌కు తిప్పలు, కావ్య సెటైర్లు- ఇందిరాదేవికి అపాయం-brahmamudi serial november 25th episode raj request to aparna to come home star maa brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi November 25th Episode: బ్రహ్మముడి- కనకంకు బానిసలా అపర్ణ- రాజ్‌కు తిప్పలు, కావ్య సెటైర్లు- ఇందిరాదేవికి అపాయం

Brahmamudi November 25th Episode: బ్రహ్మముడి- కనకంకు బానిసలా అపర్ణ- రాజ్‌కు తిప్పలు, కావ్య సెటైర్లు- ఇందిరాదేవికి అపాయం

Sanjiv Kumar HT Telugu
Nov 25, 2024 07:25 AM IST

Brahmamudi Serial November 25th Episode: బ్రహ్మముడి నవంబర్ 25 ఎపిసోడ్‌లో అపర్ణ చెప్పగానే రాజ్‌ను ఇంట్లో అంతా తిడతారు. కావ్య ఇంటికి వెళ్లికి తీసుకురమ్మని చెబుతారు. దాంతో కనకం ఇంటికి వెళ్లిన కావ్యతో గొడవ పడతాడు రాజ్. దానికి రాజ్‌పై అదిరిపోయే పంచ్‌లు వేస్తుంది కావ్య. అలాగే కనకంకు అపర్ణ బానిసలా ఉంటుంది.

బ్రహ్మముడి సీరియల్‌ నవంబర్ 25వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ నవంబర్ 25వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో తనతో మాట్లాడలన్నల, చెప్పేది వినాలన్న కావ్య ఇంటికి వచ్చి వినాలని అపర్ణ అంటుంది. దాంతో కనకం కాల్ కట్ చేస్తుంది. అపర్ణ చెప్పింది విని కూడా సైలెంట్‌గా ఉంటావేంట్రా. అపర్ణ కాళ్లు పట్టుకుంటావో, కావ్య గడ్డం పట్టుకుని బతిమిలాడుతావో వెళ్లి మీ అమ్మను తీసుకురా అని సుభాష్ అంటాడు.

నేను అడిగిన రాదు

మమ్మీ మాటలు చూస్తుంటే అర్థం కావట్లేదా డాడ్. నేను చెప్పి వెళ్లి అడిగిన రాదు అని రాజ్ అంటాడు. అలా అని ఊరుకుంటావా. నీ పెళ్లాం లేకుండా నువ్ ఉంటావేమో నా పెళ్లాం లేకుండా నేనుండలేను అని సుభాష్ అంటాడు. అయితే నువ్వెళ్లి తీసుకు రా అన్నయ్య. రాజ్‌ను ఎందుకు ఇబ్బంది పెడతావ్ అని రుద్రాణి అంటుంది. తప్పు చేసింది వాడు అయితే నేనెందుకు వెళ్లాలి. అపర్ణ ఏం చెప్పిందే వినావ్ కదా. వాడిని గారాబం చేసి నేను చెడగొట్టానట. మొండితనం, పొగరుతనం నా వల్ల వచ్చిందని అన్నది అని సుభాష్ అంటాడు.

నాకు అంత పొగరుంటే కావ్య సీఈఓగా ఉంటే మేనేజర్‌గా ఎందుకు చేస్తాను అని రాజ్ అంటాడు. అందుకేగా మోసం చేసి ఆఫీస్ నుంచి తరిమేశావ్ అని సీతారామయ్య అంటాడు. కావ్య వచ్చి సంవత్సరం కాలేదు. తనను ఎందుకుంత నమ్మారు. నన్ను నెత్తిన పెట్టుకున్న చూసుకున్నారు. సడెన్‌గా నేను విలన్ అయ్యానా అని రాజ్ అంటాడు. అప్పుడు రాముడులా ఉండేవాడివి. ఇప్పుడు రాక్షసుడిలా మారావ్. పెళ్లాన్ని టార్చర్ పెట్టడమే కాకుండా ఇప్పుడు ఆ లిస్ట్‌లో తల్లిని కూడా చేర్చావ్ అని ఇందిరాదేవి అంటుంది.

అలా మారడానికి కారణం ఎవరు ఆ కావ్య. అసలు నా అనుమానం ఏంటంటే వదిన తనంతట తాను వెళ్లలేదు. ఆ కావ్య రెచ్చగొట్టి పిలిపించుకుంది అని రుద్రాణి అంటుంది. నువ్ నోర్మూయ్. ఇది నాకు నా కొడుకు సంబంధించిన మధ్యలోకి రాకు అని రుద్రాణిని హెచ్చరిస్తాడు. అంతా కలిసి రాజ్‌ వెళ్లి అపర్ణను తీసుకురావాలి అని అరుస్తారు. దాంతో సరే సరే. నేనే వెళ్తాను. అక్కడికి వెళ్లి తేల్చుకోవాల్సినవి తేల్చుకుని వస్తాను అని రాజ్ అంటాడు.

కావ్యను తీసుకెళ్లాలి

రాజ్ వెళ్లగానే అపర్ణకు ఇందిరాదేవి కాల్ చేస్తుంది. నీ ఐడియా ఫలించింది. నీ కొడుకు నీకోసం ఆవేశంతో బయలుదేరాడు. ఇక నువ్వే చూసుకోవాలి అని ఇందిరాదేవి అంటుంది. సరే అని చెప్పిన అపర్ణ ఇవాళ కూరగాయలు అన్నింటిని ఇక్కడ పెట్టు. నేను కట్ చేస్తాను అని అంటుంది. దాంతో అయ్యో మీకెందుకు ఆ శ్రమ అని కనకం అంటే.. నా కొడుకు వచ్చి నాతోపాటు కావ్యను కూడా తీసుకెళ్లాలి. అందుకే ఇదంతా అని అపర్ణ అంటుంది.

సరే అన్న కనకం మహారాణిలా ఉండేది. నాతో చేరి ఇలా అయిపోయిందని అని మనసులో అనుకుంటుంది. మరోవైపు రాజ్ వెళ్లడం గురించి రుద్రాణి టెన్షన్ పడుతుంది. కావ్యను రాజ్ తీసుకురాడు. సీఈఓ నుంచి కావ్యను మనలా చీటింగ్ చేసి పంపించాడు. రాజ్ ఒక్క అత్తను మాత్రమే తీసుకొస్తాడు అని రాహుల్ అంటాడు. రాజ్ చెప్పగానే వదినా వస్తుందా. కావ్య కూడా రావాలి అంటుంది. రాజ్ సెంటిమెంటల్ ఫూల్. అడ్డగాడిదలా పెరిగినా అమ్మ లేకుండా ఉండలేడు అని రుద్రాణి అంటుంది.

అత్తయ్య కండిషన్ పెట్టిన కావ్య వస్తుందా. రాజ్ మోసం గురించి తెలిసి ఎందుకొస్తుందని రాహుల్ అంటాడు. అలా రాదు కాబట్టే అక్కడికి వెళ్లి అపర్ణ వదిన డ్రామా ఆడుతుంది. ఆ డ్రామా వర్కౌట్ అయి కావ్య తిరిగి ఇంటికి వస్తే మళ్లీ మొదటికి వస్తుంది. ధాన్యలక్ష్మీని రెచ్చగొట్టి ఆస్తి పంపకాలు చేసేవరకు తీసుకొచ్చాను. ఇప్పుడు కావ్య వస్తే మొత్తం రివర్స్ అవుతుంది. ఏదో ఒకటి చేసి అడ్డుకోవాలి అని రుద్రాణి తెగ భయపడిపోతుంది.

ఇంట్లో అడుగుపెట్టను

మరోవైపు రాజ్ కనకం ఇంట్లోకి వెళ్తుండగా కావ్య బయటకు వెళ్తూ ఎదురవుతుంది. రాజ్‌ను చూసి పక్కకు వెళ్లిపోతుంది కావ్య. ఎంత పొగరు. పంపించు అని రాజ్ అంటే కావ్య సెటైర్లు వేస్తుంది. మనుషుల్లోని అసలు రంగు కనుక్కున్న సైంటిస్ట్‌గా మీ పేరు చరిత్రలో చిరస్థాయిగా లిఖించాలి అని కావ్య అంటుంది. మా అమ్మను పిలువు. నేను మీ ఇంట్లో అడుగుపెట్టను. నీ పొగరు వల్లే ఇక్కడిదాకా తెచ్చుకున్నావ్ అని రాజ్ అంటాడు.

మీరు చేసిన పనివల్లే ఆవిడ మనసు ముక్కలు అయి ఇక్కడికి వచ్చారు అని కావ్య అంటే.. మా అమ్మ అలిగిందో మీరు రప్పించుకున్నారో నాకు తెలియదు అనుకున్నావా అని రాజ్ అంటాడు. అబ్బా బాగా కనిపెట్టారు. మా అత్తగారు వచ్చారు. ఆవిడ కోసం సరుకులు తీసుకురావాలి అని కావ్య అంటే.. ఎన్నాళ్లు మా అమ్మను మీ ఇంట్లో దాచిపెడతారు అని రాజ్ అంటాడు. దాచిపెట్టడానికి మా ఇల్లేం జైలు కాదు. మీ అమ్మ గారు ఏం ఖైదీకాదు. ఆవిడంతట ఆవిడ వచ్చారు. ఇంట్లో ఉన్నవాళ్లను వెళ్లిపోమ్మని అనేవాళ్లు మా ఇంట్లో ఎవరు లేరు అని కావ్య అంటుంది.

మా అమ్మను ఇంట్లో దాచుకున్నది. ఉన్నదంతా మీ అమ్మ దోచుకోడానికి కాకపోతే ఇంకా దేనికే అని రాజ్ అంటే కావ్య కోపంగా చూస్తుంది. మా అమ్మ తనంతట తానే ఇక్కడికి వచ్చిందంటే నమ్మేస్తానా. ఆఫీస్ నుంచి నిన్ను పంపించాను కాబట్టి ఇలా చేశారు కదే. అది తెలుసుకోలేనంత చిన్నపిల్లాడిని కాదే అని రాజ్ అంటాడు. మీరు ఎంత చిన్నపిల్లాడో ఆఫీస్‌లోనే తెలిసింది. దొంగతనం చేయడం పెద్దమనుషుల లక్షణమా. నేను ఆరోజే చూశాను. కానీ, కావాలనే వచ్చాను. సీసీ టీవీ ఫుటేజ్ బయటపెడితే ఏమవుతుంది అని కావ్య అంటుంది.

జీవితంలో అర్థం చేసుకోను

గెలిచినా కూడా తలవంచుకుని వచ్చాను. ఇంకెప్పుడు నన్ను అర్థం చేసుకునేది అని కావ్య అంటుంది. కర్ర పట్టుకుని నడిచే స్థితికి వచ్చిన నేను అర్థం చేసుకోను. మా అమ్మను పంపిస్తావా లేదా అని రాజ్ అంటాడు. నాకు తప్పక మా ఇంట్లో ఉంటున్నాను. కానీ, మీ అమ్మగారు మా ఇంట్లో ఉంటే మీకు గౌరవం కాదు. ఆమె వస్తానంటే నచ్చజెప్పి తీసుకెళ్లండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని కావ్య వెళ్లిపోతుంది. దాంతో చేసేది లేక రాజ్ ఇంట్లోకి వెళ్తాడు.

తను ఇంట్లోకి రానన్నది గుర్తు చేసుకుంటాడు. ఎన్ని తిప్పలు పెట్టావ్ మమ్మీ అని రాజ్ అనుకుంటాడు. రాజ్ అడుగుపెట్టగానే అపర్ణ కూరగాయలు కోస్తూ, చెమట తుడుచుకుంటూ కనిపిస్తే కనకం దర్జాగా రాణిలా కనిపిస్తుంది. కనకం ఉక్కపోస్తుంది. ఫ్యాన్ కిందకు వెళ్లి కూర్చోనా అని అపర్ణ అంటే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని కనకం అంటుంది. కాళ్లు పట్టేస్తున్నాయి కూరగాయలు కట్ చేయడం ఆపేయనా అని అపర్ణ అంటే వంకాయలు కూడా కట్ చేయమని కనకం అంటుంది.

అపర్ణ ఏది అడిగిన మధ్య తరగతి కుటుంబంలో అలా ఉండదంటూ ఇద్దరు డ్రామా చేస్తుంటారు. అదంతా చూసిన రాజ్ షాక్ అయి అరుస్తాడు. అల్లుడు గారు ఎప్పుడు వచ్చారని కనకం అంటే.. మీరు కాలు మీద కాలు వేసుకుని మా అమ్మను బానిసలా చూస్తున్నప్పటి నుంచి వచ్చాను అని రాజ్ అంటాడు. తర్వాత అపర్ణను లేపి సోఫాలో కూర్చోబెడతాడు. ప్లేట్‌తో గాలి విసురుతాడు. ఏం కర్మ మమ్మీ నీకు. ఎలాంటి స్థితికి నిన్ను తీసుకొచ్చారో. నీకు భయపడే క్యాన్సర్ కనకం నీకే పనులు చెబుతోంది. ఇలాంటి మనుషుల మధ్య ఎందుకు అని రాజ్ అంటాడు.

లెక్కలేసుకునే ఇంట్లో

కనకం బాగా చూసుకుంటుందని చద్దన్నం పెట్టింది అని అపర్ణ అంటుంది. అవమానాలు పడుతు ఇక్కడ ఎందుకు అని రాజ్ అంటే.. కావ్య కూడా మనింట్లో ఎందుకుందిరా. అన్ని అవమానాలు పడుతూ మన ఇంట్లో ఉన్నందుకు నాకు నేనుగా వేసుకున్న శిక్ష. పెద్దలు చేసిన పాపం పిల్లలకు తగులుతుంది అంటారు. ఇక్కడ కొడుకు చేసిన తప్పుకు నాకు పాపం తగిలింది అని అపర్ణ అంటుంది. పావుకిలో, అర్దకిలో అనే లెక్కలేసుకునే ఇంట్లో వద్దు మమ్మీ. మనింటికి రా అని బతిమిలాడుతాడు రాజ్.

కావ్యతో అయితేనే వస్తాను. నాకోసం వచ్చినట్లు భార్యకోసం రాలేదా. తల్లి కావాలి కానీ భార్య వద్దా. వస్తే కావ్యతో వస్తాను. లేకుంటే ఇదే ఇంట్లో కావ్యలాగే బొమ్మలకు రంగులేసుకుంటూ బతుకుతాను అని అపర్ణ అంటుంది. ఇదే ఆఖరి మాట అని రాజ్ అంటాడు. ఆఖరి మాట, చివరి మాట ఇదే అని అపర్ణ అంటుంది. సరే చూస్తాను. ఎన్నిరోజులు ఇక్కడ ఉంటావో అని చెప్పిన రాజ్ హలో పావుకిలో చికెన్ గారు. మా అమ్మను బాగా చూసుకోండి అని వెళ్లిపోతాడు.

మీరు చెప్పారని మహారాణిలాంటి మిమ్మల్ని అలా అనాల్సి వచ్చిందని కనకం అంటుంది. కావ్యను వాడు బయట అవమానించినందుకే ఇలాంటి ట్రీట్‌మెంట్ ఇచ్చాను. బతిమిలాడితే నెత్తిన ఎక్కే రకం వాడు. అందుకే ఈ రకంగా వాడిలో కదలిక తెప్పించాను అని అపర్ణ అంటుంది. సరే ఫ్యాన్ వేస్తాను, బిర్యానీ చేస్తాను, ఈ కూరగాయలు అన్ని కట్ చేస్తాను. కానీ, ఎవరొచ్చిన ఇంత దీనంగా నటించకండి అని కనకం అంటుంది. నువ్వేనా క్యాన్సర్ కనకంలా నటిస్తావా అని అపర్ణ అంటుంది.

ఏ హక్కుతో అరుస్తున్నావ్

తర్వాత మరోవైపు రాజ్‌తో అమ్మను ఎందుకు తీసుకురాలేదు అని సుభాష్ అంటాడు. కావ్యను తిట్టి వచ్చాను అని రాజ్ అంటాడు. కావ్య వస్తుందని ఎంతో టెన్షన్ పడ్డాను. దాన్ని ఆపడానికి ఎన్నో ప్లాన్స్ కూడా వేశాను. కానీ, రాజ్ మొండితనమే గెలిచిందని రుద్రాణి సంతోషిస్తుంది. తల్లిని తీసుకురమ్మంటే కావ్యను ఎందుకు తిట్టావ్ అని సీతారామయ్య ఫైర్ అవుతాడు. దానివల్లే కదే మా అమ్మను విడదీసింది. అమ్మను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి రప్పించుకుంది. మీరంతా కళావతి మాయ నుంచి బయటపడండి అని రాజ్ అంటాడు.

నువ్ నీ పెళ్లాం ఏం మాట్లాడుకుంటారో నాకు అనవసరం. నాకు నా పెళ్లాం కావాలి అని సుభాష్ అంటాడు. ఇలా అయితే ఇల్లు ఎవరు చూసుకుంటారు అని ప్రకాశం అంటాడు. పిన్ని ఉంది కదా అని రాజ్ అంటే.. తను వేరు కుంపటి పెట్టుకుని వండుకుంటుంది. తనెలా చూసుకుంటుంది అని ప్రకాశం అంటాడు. తర్వాత వంటింట్లో ఇందిరాదేవి చేయి కాల్చుకుందని కావ్య ఫోన్ ద్వారా అపర్ణకు తెలిసేలా చేస్తాడు రాజ్.

నిజంగా తాతయ్య నానమ్మలై గౌరవం ఉంటే మా అమ్మను పంపించు అని కావ్యతో అంటాడు రాజ్. ఇంటి నుంచి పంపించావ్ కదా. ఏ హక్కుతో అరుస్తున్నావ్. వచ్చి కావ్యను భార్యగా తీసుకెళ్లు అని అపర్ణ రాజ్‌తో అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner