Brahmamudi November 6th Episode: బ్రహ్మముడి- దుగ్గిరాల ఇంట్లో అనామిక రుద్రాణి ఆటో బాంబ్- అత్తింట్లో కావ్య- ఇల్లు ముక్కలు
Brahmamudi Serial November 6th Episode: బ్రహ్మముడి నవంబర్ 6 ఎపిసోడ్‌లో దీపావళి రోజున కావ్యతో జరిగిన సన్నివేశాలను ఊహించుకుంటాడు రాజ్. ఇంతలో కావ్య నిజంగా రావడం చూసి షాక్ అవుతాడు రాజ్. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో ఆటో బాంబ్ పేల్చడానికి రెడీ చేస్తుంటారు రుద్రాణి, అనామిక.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కల్యాణ్ ఇంటికి వచ్చి దీపావళికి రమ్మని ధాన్యలక్ష్మీ పిలుస్తుంది. కొడుకుని పిలిచి కోడలిని పిలవడం మర్చిపోయావు. ఇప్పుడు నాకు పెళ్లి అయింది. ఆ సంగతి నీకు గుర్తులేనట్లుంది అని కల్యాణ్ అంటాడు. నేను నిన్ను మాత్రమే రమ్మంటే రావని తెలుసురా. కానీ, పండగకి నువ్ రావాలని కోరుకుంటున్నాను. ఇంతకంటే నేను చెప్పలేను అని ధాన్యలక్ష్మీ అంటుంది.
రాజ్‌ను లేపిన నానమ్మ
రేయ్ ఇంకా అర్థం కావట్లేదా. ఇద్దరిని పిలవడానికే వచ్చింది. పనికిరాని ఇగో అడ్డొస్తుంది. నేను పిలుస్తున్నాను. నువ్ నా కోడలు పండగకి రండి. సరే అనండ్రా అని ప్రకాశం అంటాడు. వస్తాం మావయ్య. నావల్ల గొప్ప కుటుంబానికి కవి దూరం అయ్యాడు. ఇలా అయినా వాళ్లందరిని కలిస్తే సంతోషిస్తాడు అని అప్పు అంటుంది. ఇక పదండి అని ధాన్యలక్ష్మీ, ప్రకాశం వెళ్లిపోతారు. మరోవైపు దీపావళి రోజు ఇంకా పడుకున్నాడేంటీ అని రాజ్‌ను లేపుతుంది ఇందిరాదేవి.
కానీ, నిద్రలేవడు అని రాజ్. లేపుతుంటే గారాలు పోతున్నాడు అని రాజ్ మొహంపై నీళ్లు కొడుతుంది ఇందిరాదేవి. దాంతో కోపంగా నిద్రలేచిన రాజ్.. అరుస్తాడు. ఇలా నిద్రలేపుతారా. అయినా పండుగకు నేనేం చేస్తాను. మీకు పని అని రాజ్ అంటాడు. ఇన్నాళ్లు నీ భార్య ఉండి అన్ని చూసుకునేది. కానీ, దానికి ఎగ్జిట్ పాస్ ఇచ్చి పంపించేశావ్ కాబట్టి నువ్వే అన్ని పనులు చేయాలి. పూజలోపు ఇల్లంత డెకరేట్ అయిపోవాలి అని ఆర్డర్ వేసి ఇందిరాదేవి వెళ్లిపోతుంది.
ఆ కళావతే చేసినప్పుడు మనం చేయలేమా అని అనుకుంటాడు రాజ్. మెట్లకు పూలు కడుతూ బిలియనర్‌ని బికారిని చేశారు. ఈ పనులు నేను చేయలేనా. చేసి చూపిస్తా అని రాజ్ అనుకుంటాడు. ఇంతలో గుమ్మం దగ్గర పూలు పెట్టడానికి కావ్య ట్రై చేస్తుంది. అది రాజ్ చూస్తాడు. రాజ్ వచ్చి ఏం చేస్తున్నావ్ అని అడిగితే.. గుమ్మానికి దండం కట్టాలి హెల్ప్ చేస్తారా భర్త గారు అని అడుగుతుంది కావ్య. అదెంత భాగ్యం అని రాజ్ ట్రై చేస్తాడు. కానీ, రాజ్‌కు గుమ్మం అందదు.
కావ్య, రాజ్ రొమాన్స్
మీ వల్ల కాదు కానీ, నన్ను ఎత్తుకోండి అని కావ్య అడిగితే.. రాజ్ ఎత్తుకోను అని అంటాడు. మీ భార్యనే కదా ఎత్తుకోండి అని కావ్య పదే పదే అడుగుతుంది. కానీ, రాజ్ ఎత్తుకోడు. దాంతో రాజ్‌ను కావ్య ఎత్తుకుంటుంది. చూస్తే జిమ్ బాడీ. ఎత్తుకుంటే స్లిమ్ బాడీ అని కావ్య అంటుంది. దండ కట్టిన తర్వాత రాజ్ కిందపడిపోతుంటే కావ్య పట్టుకుంటుంది. ఇద్దరు ప్రేమగా, రొమాంటిక్‌గా చూసుకుంటారు. ఏవండి కావాలనే పడ్డారు కదా అని కావ్య అంటుంది. ఇంతలో రాజ్ కలలో నుంచి తేరుకుంటాడు.
ఈ పీడకలలు అన్ని ఇప్పుడే గుర్తుకువస్తున్నాయేంటీ. పనిలో నిమగ్నమవ్వాలి అని రాజ్ అనుకుంటాడు. ఇంతలో మరోసారి కావ్యతో జరిగింది కల కంటాడు రాజ్. తర్వాత తేరుకున్న రాజ్ ఇదేంటీ ఈరోజు పదే పదే గుర్తుకు వస్తుందేంటీ అని రాజ్ అనుకుంటాడు. ఇంతలో ఆటోలో కావ్య నిజంగానే వస్తుంది. ఇదేంటీ మళ్లీ వస్తుందని రాజ్ అనుకుంటాడు. వెళ్లిపోయేటప్పుడు కావ్య అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటుంది.
కావ్యను అలాగే చుట్టూ తిరిగి చూస్తాడు రాజ్. పక్కనే ఇందిరాదేవి, అపర్ణ ఉంటారు. ఏంట్రా నీ ఆవిడ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నావ్ అని అపర్ణ అంటాడు. మీరెవరు మాట్లాడటానికి డైలాగ్స్ లేవు. నేనే మాట్లాడాలి. ఈ సన్నివేశానికి ఫుల్ రైట్స్ నావే అని రాజ్ అంటాడు. దాంతో కావ్య గిల్లుతుంది. ఏంటే కలలో కూడా నీ డామినేషన్ ఏంటే అని వెళ్లిపోతాడు రాజ్. ఇది వరుస. ఊహల్లో కూడా నా రాకను తట్టుకోలేకపోతున్నారు. నేను బోనస్ ఇస్తే మరింత రెచ్చిపోతారు అని కావ్య అంటుంది.
దుగ్గిరాల ఇల్లు ముక్కలు
నేను అంత చెప్పి తీసుకొస్తే మళ్లీ మొదటి కొచ్చింది. ఏం చేద్దామని ఇందిరాదేవి అంటుంది. ఒక్కటి ఇస్తే పెళ్లాం మొగుడు ఇద్దరు దారిలోకి వస్తారు అని అపర్ణ అంటుంది. కావ్య షాక్ అవుతుంది. అది విన్న రాజ్ ఇది నిజంగానే వచ్చినట్లుంది అని గిల్లింది గుర్తు చేసుకుంటాడు. తిరిగి వచ్చి ఎవరు నువ్వు అని రాజ్ అంటాడు. ఆపీస్‌లో సీఈఓ, ఇక్కడ నీ పెళ్లాం అని ఇందిరాదేవి అంటంది. నాకు పెళ్లాం లేదని రాజ్ అంటే.. ఇంట్లో పూజకు సీఈఓను ఛైర్మన్ గారు పిలిచారు అని అపర్ణ చెబుతుంది.
దాంతో షాక్ అవుతాడు రాజ్. రాజ్ సెటైర్లు వేసి వెళ్లిపోతాడు. పూజకే ఇలా అంటే బోనస్ కోసం వచ్చానని తెలిస్తే ఎలానో అని కావ్య అంటుంది. నువ్ సీఈఓ, వాడు మేనేజర్. ఇంట్లో ఉంది ఛైర్మన్. ఏం కాదు పదా అని కావ్యను లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు అనామికకు రుద్రాణి కాల్ చేస్తుంది. ఈరోజు ఇంట్లో బాంబ్ పేలుస్తున్నా, ఇల్లు ముక్కలు చేయబోతున్నా అని అన్నావ్. అది ఏమైంది. ఏం బాంబ్ పేల్చుతున్నావ్ అని రుద్రాణి అడుగుతుంది.
ఆటో బాంబ్ అని అనామిక అంటే.. ఏదో ఆటంబాంబ్ అని చెప్పావ్. కానీ, పేరు వింటేనే తుస్సుమనేలా ఉందని రుద్రాణి అంటుంది. దాంతో కల్యాణ్ ఆటో నడపడుతున్నాడు అని అనామిక చెబుతుంది. ఆటోనా. నా కొడుకే నయం చీటింగ్ చేసయినా గొప్పగా బతుకుతున్నాడని రుద్రాణి అంటుంది. అందరికీ మనలా కన్నింగ్ తెలివితేటలు ఉండవు కదా. ఇప్పుడు ఆటో గురింతి ఇంట్లో అందరికీ తెలిస్తే అని అనామిక అంటుంది.
ఇల్లు తగలబెట్టేస్తాను
ఆటో బాంబ్ ఆటమ్ బాంబ్‌లా పేలి ఫ్యామిలీలో రచ్చ మొదలవుతుంది అని రుద్రాణి అంటుంది. నేను న్యూస్ ఛానెల్‌లో టెలీకాస్ట్ అయ్యేలా చేశాను. కానీ, అది అందరూ చూసేలా మీరే చేయాలి అని అనామిక అంటుంది. ఇంతమంచి అవకాశం ఇస్తే వదులుకుంటానా. ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూస్తాను. ధాన్యలక్ష్మీ రెచ్చిపోతుంది. దానికి ఆజ్యం పోస్తూ ఇల్లు తగలబెట్టాలే చేస్తాను. ఆటో గాడి ఆటో బ్రయోగఫీ ఎప్పుడు టెలీకాస్ట్ చేస్తావో మేసేజ్ పెట్టు అని రుద్రాణి అంటుంది.
సరేనని అనామిక కాల్ కట్ చేస్తుంది. ఇప్పుడు నాకు నిజమైన దీపావళి మొదలు అయిందని రుద్రాణి అనుకుంటుంది. ఇంతలో రుద్రాణి పక్కనే బాంబ్ పేలుతుంది. దాంతో ఉలిక్కిపడి పక్కకు వెళ్లిపోతుంది. అ్పపుడే ఎంట్రీ ఇచ్చిన స్వప్న ఏంటీ ఆంటీ ఇంత చిన్న బాంబ్‌కే ఇలా భయపడ్డారు అని అంటుంది. పక్కనే బాంబ్ పెడతావా. బుద్ధిలేదా. కాస్తా ఉంటే నా గుండె ఆగిపోయేది అని రుద్రాణి అంటుంది. కొంపలు కూల్చే మీకు బాంబులు పేల్చడం పెద్ద లెక్క కాదనుకున్నాను. ఇలా సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాను అని స్వప్న అంటుంది.
నీ మొహంలాగే ఉంది వెళ్లు అని రుద్రాణి అంటే.. బాంబ్ పక్కన కాదు. నెత్తిమీద పేల్చాల్సింది అని స్వప్న అనుకుంటుంది. వినపడిందని రుద్రాణి అంటే.. వినాలనే అన్నాను అని వెళ్లిపోతుంది స్వప్న. నా మీద కాదే మీ అందరి మీద ఆటో బాంబ్ పేల్చబోతున్నా. దానికి సిద్ధంగా ఉండండి అని రుద్రాణి అనుకుంటుంది. మరోవైపు అపర్ణ పాయసం తీసుకొస్తుంది. చేతులు ఖాలీ లేవు. నువ్వే తినిపించు అని సుభాష్ అంటాడు. వయసుకు తగ్గ మాటలు మాట్లాడండి. మనవళ్లను ఎత్తుకునే వయసులో ఏంటిది అన్నట్లుగా అపర్ణ అంటుంది.
అపర్ణ, సుభాష్ రొమాన్స్
అయినా సరే నువ్వు తినిపిస్తేనే తింటా అని సుభాష్ అంటాడు. దాంతో రొమాంటిక్‌గా అపర్ణ పాయసం తినిపిస్తుంది. రాజ్‌కు మొండితనం మీ నుంచే వచ్చిందనుకుంటా. ఎలా ఉంది అని అపర్ణ అడిగితే.. సూపర్‌గా ఉంది అత్తయ్య అని కావ్య ఎంట్రీ ఇస్తుంది. దాంతో ఇద్దరు సిగ్గు పడిపోతారు. పాయసం కాదు అత్తయ్య. మీరు తినిపించే స్టైల్ చాలా బాగుంది అని ఇద్దరిని ఫొటో తీస్తుంది కావ్య. దాంతో సిగ్గులేదే నీకు. అడక్కుండానే లోపలికి వచ్చి ఫొటోలు తీస్తావా అని చెవులు మెలిపెడుతుంది అపర్ణ.
ఫొటో తీయడం గురించి మళ్లీ కావ్య అల్లరి చేస్తుంది. తోలు తీస్తా అని కర్ర కోసం అపర్ణ వెతుకుంటే వద్దంటూ వెళ్లిపోతుంది కావ్య. కంపెనీకి సీఈవో అయినా ఇంకా చిన్నపిల్ల చేష్టలు పోలేదు అని అపర్ణ అంటుంది. తను ఇంటికి తిరిగి వస్తే మరింత బాగుంటుంది అని సుభాష్ అంటుంది. అవును, వాడి మనసు మారి కావ్యను ఇక్కడే ఉండిపోమ్మంటే బాగుంటుంది అని అపర్ణ అంటుంది. జరగాల్సింది జరుగుతుందని సుభాష్ అంటాడు.
మరోవైపు బోనస్ ఎవరెవరికీ ఎంత ఇవ్వాలనే లిస్ట్ ఉంది. తాతయ్య గారు ఇచ్చారు. చెక్ చేయి అని కావ్యకు ఇందిరాదేవి ఇస్తుంది. కట్ చేస్తే.. రాజ్ దగ్గరికి వెళ్లిన కావ్య తాతయ్య బోనస్‌లు తనను ఇవ్వమన్నారని, కానీ, మీరు ఇవ్వండని అంటుంది. అంటే తాతయ్య నీకు ఇచ్చింది నాకు దానం చేస్తున్నావా. దానం చేస్తే రాజ్ తీసుకోడు. ఏదైనా సరే సాధించుకుంటాడు. తాతయ్య చెప్పింది చేయ్. నీ పని నువ్ చూసుకో. నీ బోనస్‌లు నువ్వే ఇచ్చుకో అని రాజ్ వెళ్లిపోతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.
టాపిక్