Brahmamudi Serial: బ్రహ్మముడి- కావ్యపై రగిలిపోయిన రుద్రాణి, అనామిక- కంపెనీకి పూర్వ వైభవం- రాజ్‌ను ఆటాడుకున్న కళావతి-brahmamudi serial latest episode a good news for kavya rudrani anamika cunning plans star maa brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi Serial: బ్రహ్మముడి- కావ్యపై రగిలిపోయిన రుద్రాణి, అనామిక- కంపెనీకి పూర్వ వైభవం- రాజ్‌ను ఆటాడుకున్న కళావతి

Brahmamudi Serial: బ్రహ్మముడి- కావ్యపై రగిలిపోయిన రుద్రాణి, అనామిక- కంపెనీకి పూర్వ వైభవం- రాజ్‌ను ఆటాడుకున్న కళావతి

Sanjiv Kumar HT Telugu
Nov 03, 2024 06:12 AM IST

Brahmamudi Serial Latest Episode: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్‌లో కావ్య చేసిన పనికి రుద్రాణి రగిలిపోతుంది. తనను సీఈఓ నుంచి తప్పించాలని అనుకుంటుంది. మరోవైపు కావ్య తెలివితేటలను సామంత్ పొగుడుతుంటాడు. దుగ్గిరాల ఫ్యామిలీని రోడ్డు మీద పడేసి కావ్య సంగతి చూస్తాను అని అనామిక ఛాలెంజ్ చేసుకుంటుంది.

బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్

Brahma Mudi Serial Latest Episode: బ్రహ్మముడి సీరియల్‌ తాజా ఎపిసోడ్‌‌లో వేలంపాట గురించి తన వల్లే తెలిసిందని స్వప్న గుర్తు చేస్తుంది. నువ్, నీ చెల్లి కలిసి ఆడిన డ్రామానా ఇది అని రుద్రాణి అంటుంది. లేకపోతే ఆరోజు రాహుల్ ఏదో కంపెనీలో తప్పు చేస్తున్నాడని నన్ను, కావ్యను నమ్మించి ఇంట్లో వాళ్ల ముందు పిచ్చోళ్లల నిలబెట్టారు. అందుకే మిమ్మల్ని నిలబెట్టాను. దెబ్బ అదుర్స్ కదూ అని స్వప్న అంటుంది.

వడ్డీతో సహా ఇచ్చేస్తుంది

దీనివల్ల మా అమ్మకు వచ్చిన నష్టం ఏం లేదని రాహుల్ అంటే.. అలా ఎలా అంటావ్ రాహుల్. మీ అమ్మకు నష్టం లేదు కానీ, సీఈఓగా మా కావ్య గెలిచిందనే విషయం మర్చిపోతున్నావ్. తనకు ఇంట్లో సపోర్ట్ లేనప్పుడే మీకు చుక్కలు చూపించింది. అలాంటప్పుడు సీఈఓగా గెలిస్తే మిమ్మల్ని వదిలేస్తుందా. ఈరోజు అనామిక వంతు. తర్వాత మీ వంతు. మీరు చేసిన తప్పులన్నింటికి వడ్డీతో సహా ఇచ్చేస్తుంది అని స్వప్న వెళ్లిపోతుంది.

కావ్య సీఈఓగా ఉన్నంతకాలం ఇది ఇలాగే ఉంటుంది. ముందు దాని సంగతి చూడాలి అని రుద్రాణి అంటుంది. అపర్ణ దగ్గరకు వెళ్లిన ఇందిరాదేవి నువ్ వాన్ని క్షమిస్తావనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది అంటుంది. దాంతో అపర్ణ ఏడుస్తుంది. ఇవి కన్నీళ్లు కాదు అత్తయ్య. ఇన్నాళ్లుగా నాలో ఉన్న భారం అని అత్తను హగ్ చేసుకుంటుంది అపర్ణ. ఇందిరాదేవి ఓదార్చుతుంది. లేదత్తయ్య ఇన్నిరోజులు ఆయన మీద కోపంగా నాలుగు గోడల మధ్య నాకు నేనే ఎంతో ఏడ్చుకున్నానో నాకే తెలుసు అని అంటుంది అపర్ణ.

ఆయన్ను చూసిన ప్రతిసారి మోసమే గుర్తుకు వచ్చేది. మనసులోని ద్వేషాన్ని పక్కన పెట్టి చూస్తేనే మనిషిని అర్థం చేసుకోగలం అని కావ్య చెప్పాకే నాకు అర్థమైంది. నేను ఎంత పెద్ద తప్పు చేశానో. మనిషికి రెండో అవకాశం ఇవ్వాలని గుర్తు చేశాకే నాలో భారం దిగిపోయింది. ఈరోజు ఆయనలో నిజమైన పశ్చాత్తాపం చూశాను. నేను క్షమించానని తెలిసి ఆయన కళ్లలో ఆనందం చూశానో నాకు తెలుసు. మిమ్మల్ని కూడా చాలా బాధపెట్టాను. నన్ను క్షమించండి అని అపర్ణ అంటుంది.

మావయ్యను క్షమించేసింది

ఊరుకో. పెద్ద మాటలు ఎందుకు ఇన్నాళ్లకు కావ్య వల్ల మీ ఇద్దరు దగ్గరయ్యారు. అంతకు మించి నాకు కావాల్సింది ఏముంది అని ఇందిరాదేవి అంటుంది. సుభాష్‌కు పాలు ఇవ్వడానికి అపర్ణ వెళ్తుంది. మరోవైపు కనకం, కృష్ణమూర్తి భోజనం చేస్తుంటారు. కావ్య ఒంటరిగా తిరుగుతుంటుంది. ఇంతలో కావ్యకు ఇందిరాదేవి కాల్ చేస్తుంది. మీకోసమే ఇందాకటి నుంచి ఎదురుచూస్తున్నాను అని కావ్య అంటుంది. మీ అత్తయ్య మీ మావయ్యను క్షమించేసింది. వాళ్లిద్దరు ఒక్కటైపోయారు అని ఇందిరాదేవి చెబుతుంది.

ఇంత మంచి గుడ్ న్యూస్‌ను ఇంత ఆలస్యంగానా చెప్పేది. నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా అని కావ్య అంటుంది. తల్లి మారిపోయింది. ఇక కొడుకు మారాల్సింది అని ఇందిరాదేవి అంటే.. అది చాలా కష్టం. అత్తయ్య ఆలోచించే రకం. ఆయన మొండి ఘటం. తప్పు ఆయనదే అయినా నెగ్గాలని అనుకుంటారు అని కావ్య అంటుంది. వెళ్లి దేవుడుకి దండం పెట్టుకుంటుంది. అత్త మామలు కలిశారని సంబంరపడుతుంది. కానీ, తాను ఇంకా పుట్టింట్లోనే ఉందని కనకం అంటుంది.

అల్లుడు గారు మారాలి కదా అని కృష్ణమూర్తి అంటాడు. ఆయన మారతారని నేను అనుకోవట్లేదు అని కనకం అంటుంది. దేవుడే దారి చూపిస్తాడని కృష్ణమూర్తి అంటాడు. తర్వాత కావ్యకు రాజ్ కాల్ చేస్తాడు. అది చూసి ఆశ్చర్యపోతుంది కావ్య. అమ్మనాన్నలు కలిసిపోయినందుకు థ్యాంక్స్ చెప్పడానికేమో అని నో మెన్షన్, వెల్‌కమ్ అని కావ్య అంటుంది. నువ్వేం ఘనకార్యం చేశావని థ్యాంక్స్ చెబుతాను అని రాజ్ అంటాడు.

ఒక్క పని చేశావా

ఈ సారి ఏ నాటకం వాడి వాళ్లను మార్చావ్. నీ గారడీలన్నీ మా అమ్మనాన్నల మీద ప్రయోగిస్తే ఊరుకోను. వాళ్లు అండర్‌స్టాండ్ పెరిగిన రోజే కలిసేవాళ్లు. నీలాంటి చెప్పినవారి మాటల వల్ల బంధం ఎప్పుడు శాశ్వతంగా నిలబడదు అని రాజ్ అంటాడు. దాంతో మిస్టర్ మేనేజర్ అని కావ్య అరుస్తుంది. ఆఫీస్‌లో గోల్లు గిల్లుకోవడం తప్పా నీకు ఏం తెలుసు. ఏనాడైన ఒక్క పని అయినా చేశావా. ఊరికే కూర్చుకుని తాతముత్తాల ఆస్తులను కరగదీయడం తప్పా ఏం తెలుసయ్యా నీకు అని కావ్య అంటుంది.

కొత్త డిజైన్స్ పంపించాను. ప్రింటింగ్‌కు పంపించావా. సీఈఓకు రాత్రిపూట కాల్ చేస్తావా. నీ లిమిట్స్‌లో నువ్ ఉండు అని కావ్య అంటుంది. దానికి దీనికి సంబంధం ఏంటీ అని రాజ్ అంటే.. షటప్ మేనేజర్. ఇలాగే చేస్తా వారం రోజులు సస్పెండ్ చేస్తాను. ఇంట్లో కూర్చుని ఆవాలు లెక్కపెట్టుకో. పెట్టేయ్ ఫోన్ అని కావ్య అంటుంది. దాన్ని తిట్టడానికి మంచి సాకు దొరికిందనుకుంటే రివర్స్‌లో నన్నే తిట్టింది అని రాజ్ అంటాడు. ఒక్కసారైన మనిషి గురించి ఆలోచించారా అని కావ్య అనుకుంటుంది.

ఇక నా జోలికి జన్మలో రాకుండా చేస్తాను. మంచి పని చేస్తే మెచ్చుకుంటారు, గిఫ్ట్స్ ఇస్తారు. ఈయనేంటీ. మెచ్చుకోవచ్చు కదయ్యా మొగుడు గారు మీ సొమ్ము ఏం పోతోంది అని కావ్య అనుకుంటుంది. మరోవైపు సామంత్ ఆఫీస్‌‌లో ఫ్లవర్ వాజ్ పగులగొడుతుంది అనామిక. ఫారెన్‌లో ఎంబీఏ చేసి వచ్చాను. ఆ కుండలకు రంగులు వేసుకునేది నన్ను ఇంత ఈజీగా మోసం చేస్తుందని అనుకోలేదు అని అనామిక అంటుంది. మనకు 30 కోట్లు నష్టం వచ్చింది అని సామంత్ అంటాడు.

సలామ్ కొట్టాల్సిందే

అయినా నేను చెప్పాను. అరవింద్ గాడికి ఫారెన్ ఇన్వెస్టర్స్ లేరు. వద్దు అని. అయినా వినకుండా చేశావ్. మనకే పంగనామాలు పెట్టింది. కావ్యలాంటి బిజినెస్ మ్యాన్‌ను చూడలేదు. ఎప్పుడు ఎదుటివాళ్ల మీద గెలవాలని ప్రయత్నం చేస్తుంటాం. కానీ, ఎదుటి వాళ్లు చేసే మోసాన్ని ఇలా కూడా దెబ్బకొట్టొచ్చు అని దాన్ని చూశాకే అర్థమైంది. కావ్య తెలివితేటలకు సలామ్ కొట్టాల్సిందే అని సామంత్ అంటాడు. ఆపుతావా అని అనామిక అరుస్తుంది.

పోయినా డబ్బు ఎలా తిరిగి తీసుకురావాలో. కావ్యను ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు. దానికి ఎన్ని తెలివితేటలు అయినా ఉండొచ్చు. కానీ, బంధాలకు లొంగిపోతుంది. దానిమీదే కొడుతాను. ఆ ఫ్యామిలీ మొత్తాన్నే రోడ్డుమీదకు తీసుకొస్తాను అని అనామిక అంటుంది. తర్వాతి రోజు ఉదయం కావ్య గురించి మాట్లాడుకుంటారు ఇందిరాదేవి, సీతారామయ్య. కావ్య కష్టపడి పనిచేస్తుంది అనుకున్నాను. కానీ, నిన్న పనిచేసిన వల్ల బుర్రతో కూడా పనిచేయగలదగని రుజువు చేసిందని సీతారామయ్య అంటాడు.

రాజ్ చెబితే నేను కూడా డౌట్ పడ్డాను. జాగ్రత్తగా ఉండమని సలహా కూడా ఇచ్చాను. కానీ, తను మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఇప్పుడు అర్థమైంది. తన తెలివితేటలు ఏంటో అని సీతారామయ్య అంటాడు. ఆ మాటలు పై నుంచి వస్తున్న రాజ్ వింటాడు. అది ఇందిరాదేవి చూస్తుంది. మరి నా మనవరాలు అంటే ఏమనుకున్నావ్ బావా. ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటుందనుకుంటున్నావా. దెబ్బకొట్టేవాళ్లను కూడా ఆచి తూచి తిరిగి దెబ్బకొడుతుంది అని ఇందిరాదేవి అంటుంది.

కావ్య దగ్గరికే క్లైంట్స్

మీరు మరి ఎక్కువగా పొగడకండి. పక్కవాళ్ల ఓటమిలో మన విజయం వెతుక్కోవడం చేతకానితనమే అవుతుంది అని రాజ్ అంటాడు. అదేంట్రా మనల్ని దెబ్బకొట్టాలనుకున్నవాన్ని తిరిగి దెబ్బ కొట్టడం చాలా గొప్ప విషయమే కదా. అది మర్చిపోయావా అని సీతారామయ్య అంటాడు. అదెందుకు గుర్తు ఉంటుంది. పెళ్లాం మీద మాత్రం అరవడానికి ముందుంటాడు అని ఇందిరాదేవి అంటుంది. మరి మన క్లైంట్స్ వెళ్లిపోయారు. వారు తిరిగి వచ్చారా. దానిసంగతేంటీ అని రాజ్ అంటాడు.

ఇంతలో రాజ్‌కు కాల్ వస్తుంది. వేలం పాటలో అనామిక చేసిన పని వల్ల మాకు భయమేసింది. మీతోనే బిజినెస్ చేయాలని అనుకుంటున్నాం. ఒకసారి కావ్య మేడమ్ అపాయింట్‌మెంట్ ఇప్పించండి. మీరే మేనేజర్ అని మీకే చెప్పమని చెబుతున్నారు అని సాత్విక్ అనే బిజినెస్ మేన్ చెబుతాడు. అదంతా సీతారామయ్య, ఇందిరాదేవి విని నవ్వుతారు. ఏంట్రా అని రాజ్‌ను అడిగితే అబద్ధం చెప్పి వెళ్లిపోతాడు. కారులో వెళ్తున్న రాజ్‌కు మరో కాల్ వస్తుంది.

మరో క్లైంట్ కాల్ చేసి కంపెనీతో మళ్లీ బిజినెస్ చేయాలని అనుకుంటున్నాను అని, కావ్య మేడమ్‌తో అపాయింట్‌మెంట్ ఇప్పించాలని అడుగుతాడు. మీరే మేనేజర్ అంట కదా సార్ మీరే ఇప్పించాలి అని అతను అంటాడు. కానీ, రాజ్ కోపంగా షటప్ అని కాల్ కట్ చేస్తాడు. ఇలా రాజ్‌కు కావ్య అపాయింట్‌మెంట్ కోసం కాల్స్ వస్తూనే ఉంటాయి. వీళ్లకు కామెడీ అయిపోయింది. హీరోలా ఉండాల్సినవాన్ని దానికింద పనివాడిని అయిపోయాను అని రాజ్ అనుకుంటాడు.

ఆడుకున్న కావ్య

తర్వాత క్లైంట్స్ కలవాలని అనుకుంటుంది కావ్యతో చెబుతాడు రాజ్. మరి ఆరోజు నమ్మకం లేదని మాట్లాడారు. అలాంటప్పుడు నాతో మాట్లాడటానికి ఏముంది అని కావ్య అంటుంది. వాళ్లతో బిజినెస్ చేస్తే మనకు లాభం అని తెలిసి కూడా ఎందుకు ఆడుకుంటున్నావ్ అని రాజ్ అంటాడు. మీరు ఇంతలా బతిమిలాడుతున్నారు కాబట్టి లంచ్ తర్వాత మీటింగ్ ఏర్పాటు చేయండి అని కావ్య అంటుంది. అలాగే మేడమ్ అని రాజ్ వెళ్లిపోతాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner