Brahmamudi November 1st Episode: బ్రహ్మముడి- సామంత్‌కు సగం గుండు- భర్తను క్షమించేసిన అపర్ణ- రుద్రాణిని వదిలేసిపోయిన రాజ్
Brahmamudi Serial November 1st Episode: బ్రహ్మముడి నవంబర్ 1 ఎపిసోడ్‌లో అనామికకు 35 కోట్ల నష్టం వచ్చేలా చేస్తుంది కావ్య. అది తెలిసిన సామంత్ అనామికపై ఫైర్ అవుతాడు. అపర్ణతో కావ్య మాట్లాడి రాజ్‌ను తాను ఎప్పుడో క్షమించినట్లు చెబుతుంది. దాంతో అపర్ణ కూడా మారి భర్త సుభాష్‌ను క్షమించి ప్రేమగా మాట్లాడుతుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో వేలంపాటలో అనామిక గెలవడానికి కారణం కావ్యనే అని రుద్రాణి రాజ్‌ను రెచ్చగొట్టాలని చూస్తుంది. నువ్వేం మాట్లాడవేంటే అని కనకం అంటే.. అమ్మా నేను అనామికతో చేతులు కలిపానో లేదో కొద్ది క్షణాల్లో తెలుస్తుంది అని కావ్య అంటుంది. ఇంతలో సామంత్ వస్తాడు. ఇంక వేలంపాట స్టార్ట్ కాలేదా అని సామంత్ అంటాడు.
40 కోట్లకు పాడాం
ఎందుకు కాలేదు సామంత్. స్టార్ట్ అయింది. నువ్వే లేట్‌గా వచ్చావ్. ఆల్రెడీ విజయం మనదే. అరవింద్ కంపెనీని రూ. 40 కోట్లకు పాడి మనమే సొంతం చేసుకున్నాం అని అనామిక అంటుంది. 40 కోట్లా.. అనామిక ముంచేశావ్. నన్ను నిలువునా ముంచేశావ్ అని సామంత్ అంటాడు. ఏమైందని అనామిక షాక్ అవుతుంది. నీకు ఏమైనా పిచ్చా. దివాళ తీసిన కంపెనీని ఐదారు కోట్లకు కొనడమే ఎక్కువ. పైగా ఆ కంపెనీ పేరు మీద పదికోట్ల అప్పు ఉంది తెలుసా. ఇప్పుడు మనకు 35 కోట్లు నష్టం తెలుసా. మొత్తం మునిగిపోయాం అని సామంత్ కోప్పడతాడు.
సామంత్ ఎంత లాస్ అయింటుంది. 35 కోట్లే కదా. దటీజ్ కావ్య. సామంత్ ఇది మీ అనామిక తెలివి అని కావ్య అంటుంది. ఇప్పుడే అర్థమైంది. మనం కొనడానికి రాలేదా. దీనికి అమ్మడానికి వచ్చామా అని కనకం సంతోషపడుతుంది. లేదమ్మా అమ్మిపెట్టడానికి వచ్చాం అని కావ్య అంటుంది. ఇంతలో అరవింద్ ఎంట్రీ ఇచ్చి థ్యాంక్స్ మేడమ్. మీరు గనుక పాట పెంచకపోయినా, వేలంపాటకు రాకపోయిన నా కంపెనీని ఐదు కోట్లకు మించి ఎవరు కొనకపోయేవారే కాదు అని అరవింద్ అంటాడు.
నా పది కోట్ల అప్పు తీరిపోవడమే కాదు. మీకు పదిహేను కోట్ల లాభం, నాకు పదిహేను కోట్ల లాభం అని చెప్పిన అరవింద్ చెక్ ఇస్తాడు. తీసుకోండి మేడమ్ మీ వాట పదిహేను కోట్లు. భలే గేమ్ ఆడారు మేడమ్. అందుకే మిమ్మల్ని దుగ్గిరాల కుటుంబం నమ్మి ఎండీ సీటులో కూర్చెబెట్టారు. కీప్ ఇట్ అప్ మేడమ్. మీ కంపెనీని నమ్ముకున్న వాళ్లకు ఎప్పుడు అన్యాయం జరగదని రుజువు చేసుకున్నారు అని అరవింద్ అంటాడు. తర్వాత రాజ్ దగ్గరకు వెళ్లి థ్యాంక్యూ సర్ మీ కంపెనీ వల్లే ఇలా ఉన్నాం అని వెళ్లిపోతాడు అరవింద్.
గెలిచి నష్టపోయావ్
ఎవరి వేలుతో వారి కన్నే పొడవడం అంటే ఇదే అనామిక. నువ్ నన్ను మోసం చేసి నీ కంపెనీకి అవార్డ్ వచ్చేలా చేసుకున్నావ్. నేను నీ తెలివితక్కువ తనాన్ని వాడుకుని నీకు కోట్లు నష్టం వచ్చేలా చేశాను. నాకు కోట్లు లాభం వచ్చేలా చేసుకున్నా అని కావ్య అంటుంది. ఇందాకా రుద్రాణి ఏదో వాగింది. ఇప్పుడెందుకు నోరు మూతపడింది. ఏమే అనామకురాలా.. ఇప్పుడు అర్థమైందా. నువ్ గెలిచావ్ కానీ, నష్టపోయావ్. మేము ఓడిపోయాం. కానీ లాభాలు తెచ్చుకున్నాం అని కనకం అంటుంది.
రుద్రాణి గారు హాస్పిటల్‌కు వెళ్లి ఈసీజీ తీయించుకోండి. మీ గుండె ఆగిపోయినట్లు ఉంది అన్న కావ్య రాజ్ వైపు చూస్తుంది. దాంతో కోపంగానే వెళ్లిపోతాడు రాజ్. సామంత్ వీళ్లందరిని షూట్ చేసి పడేయాలి అని అనామిక అంటే.. మరి నేను నిన్నేం చేయాలి అని సామంత్ అంటాడు. దీన్ని ఏం చేయకు. ఇప్పటికైనా కళ్లు తెరిచి దీన్ని వదిలేయ్. ఇంతకుముందు నీకు జుట్టు బాగా ఉండేది. అప్పుడే సగం గుండు అయిపోయింది. ఇప్పటికీ కోట్లు నష్టం తెచ్చింది. తర్వాత రోడ్ మీద నిలబెడుతుంది. జాగ్రత్త అని కనకం అంటుంది.
ఏదో కూత కోశావ్. నాలుక కోసి పడేస్తా. వియ్యపురాలివి అని కూడా చూడను చెబుతున్నా. నీకు దానికి తేడా ఏముందే ఛీ.. అని రుద్రాణిని అని వెళ్లిపోతుంది కనకం. రుద్రాణి వైపు కోపంగా చూస్తుంది అనామిక. తర్వాత ఇప్పటికైనా నమ్ముతున్నారా నన్ను అని కావ్య అంటే.. లేదు. నువ్ ఆ క్యాన్సర్ కనకం కూతురువే కదా. ఆ మోసపు తెలివితేటలే వచ్చాయి. ఇది కూడా ఓ గెలుపేనా. ఎదుటి వాళ్లను మోసం చేసి గెలుస్తారా. మన తెలివితేటలతో గెలవాలి కానీ, మోసం చేసి కాదు అని రాజ్ అంటాడు.
మీరు నేర్పిన విద్యే
ఇలాంటివి అనేటప్పుడు కాస్తా ఆలోచించుకుని అనాలి అని ఇదివరకు రాజ్ చేసింది గుర్తు చేస్తుంది కావ్య. ఎదుటి వాళ్లు మనల్ని దెబ్బకొట్టాలని చూస్తున్నప్పుడు మనం దెబ్బకొట్టాలి. అది చాణక్య నీతి అవుతుంది. ఇదంతా నీ మట్టిబుర్రకు అర్థం కాదు. ఓడిపోయిన వాడికి వంచనలా ఉంటుంది. గెలిచినవాడికి వ్యూహ రచనలా ఉంటుంది అని రాజ్ అన్నది గుర్తు చేస్తుంది కావ్య. దాంతో రాజ్ షాక్ అవుతాడు. మీ బాటలోనే నడిచాను. ఇది మీరు నేర్పిన విద్యే నీరజాక్ష. నా పంచ్‌కు కడుపు మండినట్లుంది అని కావ్య అంటుంది.
దాంతో రాజ్ కోపంగా ఒక్కడే వెళ్లిపోతాడు. రుద్రాణి ఆపమని వస్తున్నా చూడకుండా వదిలేసి వెళ్లిపోతాడు రాజ్. పాపం ఒంటరిగా మిగిలిపోయినట్లున్నారు. మోసం చేయాలని అనుకున్నవాళ్లు ఇలాగే ఒంటరి అవుతారు అని కావ్య అంటుంది. నీతో నాకు మాటలేంటీ అని రుద్రాణి వెళ్లిపోతుంది. ఇంతలో కావ్యకు ఇందిరాదేవి కాల్ చేసి మీ అత్తయ్య పద్ధతి బాగోలేదు. మావయ్యకు మరి దూరం అవుతుంది అని అపర్ణ చేసింది చెబుతుంది.
నేను చూసుకుంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది కావ్య. కట్ చేస్తే కావ్య, అపర్ణ కలుస్తారు. కావ్య చేసిన పనికి మెచ్చుకుంటుంది అపర్ణ. నిజమైన బిజినెస్ వుమెన్ అనిపించుకున్నావ్. తాతయ్యకు తెలిస్తే ఎంతో సంతోషిస్తారు అని అపర్ణ అంటుంది. మీరు మావయ్యను ఇంకా ఎందుకు దూరం పెడుతున్నారు అని కావ్య అడుగుతుంది. ఆయన వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం తప్పు కాదా అని అపర్ణ అంటుంది. తప్పే. కానీ, అది గతం. ఆయన పశ్చాత్తాపపడుతున్నారు అని కావ్య అంటుంది.
క్షమించాను కాబట్టే వచ్చాను
మావయ్య మిమ్మల్ని ఇప్పుడు బాధపెట్టడం లేదు. ఆయనకు రెండో అవకాశం ఇచ్చి చూడండి అని కావ్య అంటే.. నన్ను క్షమించమంటున్నావ్. మరి నా కొడుకును క్షమించగలవా. మా ఇంటికి కోడలిగా రాగలవా అని అపర్ణ అంటుంది. నేను ఆయన్ను ఎప్పుడో క్షమించేశాను. మీరు ఆఫీస్‌కు రమ్మని పిలవగానే ఎందుకు వచ్చాను. ఆయనకంటే గొప్పగా కంపెనీని చూసుకుంటాను అనా. కాదత్తయ్య. ఆయన్ను క్షమించాను కాబట్టే వచ్చాను. ఆయన లోపం మూర్ఖత్వం. అది అర్థం చేసుకున్నాను కాబట్టే ఆయనలోని ప్రేమను బయటపెట్టడానికే వచ్చాను అని కావ్య అంటుంది.
మీ అంత అనుభవం లేని నేనే ఆయనతో కలిసి జీవించాలని అనుకుంటున్నాను. పశ్చాత్తాప పడుతున్న మావయ్యను మీరెందుకు దూరం పెడుతున్నారు. మీ అబ్బాయిగారిలో మార్పు రావాలని అనుకుంటున్నారు. ఒక్కసారి మీరు మారితే భార్యాభర్తల బంధం ఏంటో ఆయనకు అర్థం అవుతుంది. అదంతా వద్దు. మావయ్యకు శిక్ష వేయడమే కావాలంటే మీ ఇష్టం. మీరే ఆలోచించుకోండి అని కావ్య అంటుంది.
మరోవైపు ఇంట్లో అంతా ఉంటారు. ఇంతలో అపర్ణ వస్తుంది. కావ్య మాటలు గుర్తు చేసుకుంటుంది అపర్ణ. ఏంటీ అత్తయ్య ఏమంటున్నారు మీ అబ్బాయి అని అపర్ణ అడిగితే.. ఏ అబ్బాయి అని ఇందిరాదేవి అడుగుతుంది. మా ఆయన. సూప్ తాగను అంటున్నారా. ఏవండి సూప్ చల్లారిపోతుంది తాగండి అని అపర్ణ అంటే.. ఇది కల నిజమా. ఓసారి గిల్లు అని రుద్రాణి అంటుంది. దాంతో స్వప్న చాలా గట్టిగా గిల్లేసరికి రుద్రాణి అరుస్తుంది.
ఒక్కటి కావాల్సిందే
కళ్లల్లో నిప్పులు పోసుకున్నావా. కళ్లు మండుతున్నాయా అని ప్రకాశం అంటాడు. కళ్లు పీకి ఫ్రిజ్‌లో పెట్టమంటారా అత్తయ్య అని స్వప్న అంటుంది. ట్యాబ్లెట్ తెచ్చానండి. వేసుకోవాలి. ముందు సూప్ తాగండి అని అపర్ణ అంటే.. సుభాష్ ఆశ్చర్యపోతాడు. నువ్వు నాతో మాట్లాడుతున్నావా అని సుభాష్ అంటాడు. ఎన్ని అపార్థాలు వచ్చిన చివరికీ భార్యాభర్తలు ఒక్కటి కావాల్సిందే అని అపర్ణ అంటే.. రాజ్ సంతోషిస్తాడు. నా మనవరాలు నా కోడలిని మార్చేసింది అని ఇందిరాదేవి అనుకుంటుంది.
నన్ను క్షమించేశావా అని సుభాష్ అంటే.. అంత పెద్ద పదం ఎందుకులెండి. నా నమ్మకానికి ఎదురుదెబ్బ తగిలేసరికి మీకు దూరంగా ఉన్నది నిజమే. మీ మనసు బాధపెట్టాను. ఎన్నిసార్లు క్షమించినా పట్టించుకోలేదు. మిమ్మల్ని బాధపెట్టినందుకు నేనే క్షమాపణ అడగాలి అని అపర్ణ అంటుంది. లేదు. నేనే అడగాలి. ఇక నుంచి ఏ విషయంలోనూ నిన్ను బాధపెట్టను అని సుభాష్ అంటాడు. నాకు సగ భారం దిగిపోయినట్లుంది. మరో సగభాగం రాజ్ కావ్య కలిస్తే పోతుంది అని సీతారామయ్య అంటాడు.
అందరం సంతోషంగా ఉన్నాం. గార్డెన్‌లో డిన్నర్ ఏర్పాటు చేస్తాను అని ధాన్యలక్ష్మీ అంటే.. మందు కొట్టొచ్చా అని సైలెంట్‌గా అడుగుతాడు ప్రకాశం. మీ ఇష్టం అని ధాన్యలక్ష్మీ అనడంతో సంతోషిస్తాడు ప్రకాశం. రెస్ట్ తీసుకుందురు పదండి అని సుభాష్‌ను గదిలోకి తీసుకెళ్తుంది అపర్ణ. చూశావా రాజ్. ఇన్నాళ్లు వాళ్ల దూరాన్ని ఎవరు తగ్గించలేకపోయారు. కానీ, ఇవాళ కావ్య మాట్లాడటంతోనే మీ అమ్మ నాన్న కలిసిపోయారు అని ఇందిరాదేవి అంటుంది.
ఎలా కలిపిందిరా
ఓహో.. ఇదంతా ఆ కళావతి మాయజాలమా. ఆ క్యాన్సర్ కనకం కూతురు మాయనా ఇది. ఇంకా నేను మామ్ డాడ్ ప్రేమతో కలిసిపోయారని అనుకున్నాను అని రాజ్ అంటాడు. నీకు ఇలా అర్థమైందా. నీ మెదడు వాషింగ్ మేషిన్‌లో ఉతుకుని మారదురా అని ఇందిరాదేవి అంటుంది. తర్వాత రుద్రాణి, రాహుల్ తలపట్టుకుంటారు. ఇంట్లోంచి వెళ్లిపోయిన తర్వాత కూడా కంపెనీని ఎంతతెలివిగా సొంతం చేసుకుందిరా కావ్య. మా అన్నయ్య వదినను అలా ఎలా కలిపిందిరా అని రుద్రాణి అంటుంది.
అనుకుంది ఒక్కటి అయింది ఒక్కటి అని పాట పెడుతుంది స్వప్న. దాంతో రుద్రాణి ఫైర్ అవుతుంది. అసలు ఇలాంటి పరిస్థితి తీసుకురావడానికి కారణమే నేను. ఈ మాత్రం చేయకుంటే ఎలా. అనామికకు వేలంపాటలో పాడమని మీరు చెప్పారు. ఆ ఆలోచన మీకు ఎలా వచ్చింది అని స్వప్న అంటుంది. సుభాష్‌ను అపర్ణ క్షమించింది. తల్లి మారింది. కొడుకే మారాల్సింది అని కావ్యతో ఇందిరాదేవి చెబుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.
టాపిక్