OTT Telugu: ఓటీటీలోకి రెండు తెలుగు సినిమాలు- ఒకటి కామెడీ, మరోటి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా- స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?-janaka aithe ganaka ott release on aha maa nanna super hero digital streaming in zee5 ott telugu movies release date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu: ఓటీటీలోకి రెండు తెలుగు సినిమాలు- ఒకటి కామెడీ, మరోటి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా- స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

OTT Telugu: ఓటీటీలోకి రెండు తెలుగు సినిమాలు- ఒకటి కామెడీ, మరోటి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా- స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu

OTT Telugu Movies Release Date: ఓటీటీలోకి నిన్న థియేటర్లలో రిలీజైన మా నాన్న సూపర్ హీరో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అలాగే, ఇవాళ విడుదలైన జనక అయితే గనక కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో జనక అయితే గనక ఓటీటీ ప్లాట్‌ఫామ్, మా నాన్న సూపర్ హీరో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఏంటో తెలుసుకుందాం.

ఓటీటీలోకి రెండు తెలుగు సినిమాలు- ఒకటి కామెడీ, మరోటి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా- స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

OTT Telugu Movies Release Date: ప్రతి వారం థియేటర్లలో సరికొత్త సినిమాలు విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదం పంచుతుంటాయి. అలా ఎప్పటిలాగే ఈ వారంలో కూడా రెండు, మూడు తెలుగు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒకటి జనక అయితే గనక, మరొకటి మా నాన్న సూపర్ హీరో.

మంచి రెస్పాన్స్

వర్సటైల్ హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ కామెడీ సినిమానే జనక అయితే గనక. ఇందులో సుహాస్‌కు జోడీగా సంగీర్తన హీరోయిన్‌గా నటించింది. సందీప్ రెడ్డి బండ్ల అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. అక్టోబర్ 12 అంటే ఇవాళ విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

జనక అయితే గనక సినిమాలో సుహాస్ యాక్టింగ్ చాలా బాగుందని, మూవీ స్టోరీ ఆకట్టుకునేలా ఉందని రివ్యూలు చెబుతున్నారు. కండోమ్ కంపెనీపై కేసు వేస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన జనక అయితే గనక మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ వివరాలు తాజాగా లీక్ అయ్యాయి.

ఆహా ఓటీటీలో

జనక అయితే గనక సినిమాను తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా మంచి ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. అలాగే, ఇవాళ రిలీజైన ఈ సినిమాను నెల కాకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారట. నవంబర్ మొదటి వారంలో ఇంకా చెప్పాలంటే నవంబర్ 5న ఆహాలో జనక అయితే గనక ఓటీటీ రిలీజ్ కానుందని సమాచారం. అయితే, ఈ డేట్ మారే అవకాశం కూడా ఉంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఓటీటీలోకి రాబోతున్న మరో తెలుగు మూవీ మా నాన్న సూపర్ హీరో. నవ దళపతిగా పేరు తెచ్చుకుంటోన్న సుధీర్ బాబు యాక్ట్ చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీనే మా నాన్న సూపర్ హీరో. ఒక కొడుకు ఇద్దరు తండ్రులు అనే సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 11న విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది.

కీలక పాత్రల్లో సీనియర్ యాక్టర్స్

మా నాన్న సూపర్ హీరో సినిమాకు అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించారు. అలాగే, ఈ చిత్రాన్ని క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి వీ సెల్యులాయిడ్స్ పతాకంపై సునీల్ బలుసు నిర్మించారు. ఇందులో సుధీర్ బాబుకు హీరోయిన్‌గా ఆర్ణ నటించింది. ఇక సుధీర్‌కు తండ్రి పాత్రల్లో సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషించారు.

ఒకరు కన్నతండ్రి, మరొకరు పెంచిన తండ్రి, ఒక కొడుకు ఇలా ట్రయాంగిల్ ఎమోషనల్ లవ్, ఫ్యామిలీ ఫన్ రైడ్‌గా రూపొందిన ఈ మూవీ పర్వాలేదనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మా నాన్న సూపర్ హీరో ఓటీటీ రిలీజ్ డేట్ ఆసక్తికరంగా మారింది. మా నాన్న సూపర్ హీరో ఓటీటీ రైట్స్‌ను జీ5 డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ కొనుగోలు చేసినట్లు టాక్.

జీ5 ఓటీటీలో

ఈ సినిమాను కూడా నెల కాకముందే ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ చేయనున్నారని సమాచారం. నవంబర్ 8 నుంచి జీ5లో మా నాన్న సూపర్ హీరో ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది. అలాగే, ఓటీటీలో ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుందట. మరి దీనిపై అధికారికంగా క్లారిటీ రావాలి.