తెలుగు న్యూస్ / ఫోటో /
Health: స్వచ్ఛమైన గాలితో శరీరానికి పోషకాలు కూడా: వివరాలివే..
- Health: స్వచ్ఛమైన గాలి వల్ల శరీరానికి కొన్ని పోషకాలు కూడా అందుతాయని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. ఆహారం నుంచే కాకుండా మంచి గాలిలోనూ పోషకాలు ఉంటాయని పేర్కొంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
- Health: స్వచ్ఛమైన గాలి వల్ల శరీరానికి కొన్ని పోషకాలు కూడా అందుతాయని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. ఆహారం నుంచే కాకుండా మంచి గాలిలోనూ పోషకాలు ఉంటాయని పేర్కొంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
(1 / 7)
స్వచ్ఛమైన గాలిలో ఆక్సిజనే కాక పోషకాలు కూడా ఉంటాయి. గాలిలోని పోషకాలతో శరీరానికి కొన్ని రకాల విటమిన్లు అందుతాయని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది.(Freepik)
(2 / 7)
గాలిలోని పోషకాలను ఎయిరోన్యూట్రియెంట్స్ అని అంటారు. వీటివల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. ఈ విషయాన్ని ‘అడ్వాన్స్ ఇన్ న్యూట్రిషన్, సైంటిస్ట్’ ప్రచురితమైన ఓ అధ్యయం వెల్లడించింది.
(3 / 7)
ఎయిరోన్యూట్రియెంట్లలో కొన్ని రకాల మినరల్స్, విటమిన్లు ఉంటాయి. స్వచ్ఛమైన గాలిలో అయోడిన్, జింక్, మ్యాంగనీస్ సహా కొన్ని విటమిన్లు కూడా ఉంటాయి.
(4 / 7)
థైరాయిడ్ తగ్గడంలో అయోడిన్ తోడ్పడుతుంది. మెదడుకు జింక్ మేలు చేస్తుంది. ఎముకల దృఢత్వానికి మ్యాంగనీస్ తోడ్పడుతుంది.
(5 / 7)
ఊపిరితిత్తుల్లో అనేక సున్నితమైన రక్తనాళాలు ఉంటాయి. వీటి ద్వారానే ఆక్సిజన్ రక్తంలో కలుస్తుంది. ఎయిరోన్యూట్రియెంట్స్ కూడా అదే విధంగా రక్తంలో మిళితమవుతాయి.
(6 / 7)
గాలి కాలుష్యం ఎక్కువగా ఉంటే.. అదే ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ప్రమాదం ఉంటుంది. కాలుష్యం కూడా రక్తంలో ప్రవేశించి సమస్యలకు కారణం అవుతుంది.
ఇతర గ్యాలరీలు