Zee5 OTT Movies: జీ5 ఓటీటీలో చూడాల్సిన ది బెస్ట్ 5 సినిమాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ టు యాక్షన్ మూవీస్ వరకు!
OTT Kannada Movies On Zee5: ఓటీటీల్లో ఎన్నో రకాల కంటెంట్ ఉంటోంది. ఎలాంటి జోనర్ అయిన టేకింగ్ బాగుంటే ఆడియెన్స్‌కు నచ్చేస్తుంది. అలా ప్రముఖ ఓటీటీ జీ5లో చూడాల్సిన ది బెస్ట్ కన్నడ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
(1 / 6)
ఇతర భాషలతో పోలిస్తే ఈ మధ్య కన్నడ సినిమాలు ఓటీటీలో తక్కువగా వస్తున్నాయి. అయితే కొన్ని కన్నడ సినిమాలకు ఇప్పటికీ ఓటీటీలో ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. కాబట్టి జీ5 ఓటీటీలో ఎలాంటి బ్లాక్ బస్టర్ కన్నడ సినిమాలు చూడవచ్చో ఓ లుక్కేద్దాం.
(2 / 6)
కాటేరా: ప్రస్తుతం జైల్లో కస్టడీలో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన కాటేరా చిత్రం శాండిల్ వుడ్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
(3 / 6)
ఘోస్ట్: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన 'ఘోస్ట్' మూవీ మంచి అప్లాజ్ అందుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా కూడా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
(4 / 6)
జీ5లో స్ట్రీమింగ్ అయ్యే బ్లాక్ బస్టర్ చిత్రాల్లో హాస్టల్ బాయ్స్ ఒకటి. హీరో రక్షిత్ శెట్టి నిర్మించిన ఈ సినిమాలో రిషబ్ శెట్టి, పవన్ కుమార్ తదితరులు అతిథి పాత్రల్లో నటించారు.
(5 / 6)
గరుడ గమన వృషభ వాహనం సినిమా కన్నడ నాట అత్యంత భారీగా హిట్ అయిన సినిమా. ఈ సినిమాలో రిషబ్ శెట్టి, రాజ్ బి శెట్టి కలిసి నటించారు. ఈ చిత్రంలో రాజ్ బి శెట్టి రగ్డడ్ లుక్, నటన అందరి దృష్టిని ఆకర్షించింది.
(6 / 6)
ఇటీవల కన్నడ నాట భారీ హిట్ అందుకున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా బ్లింక్. కన్నడకు చెందిన ఈ సినిమా జీ5లో కాకుండా అమెజాన్ ప్రైమ్ లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో యువ, సప్త సాగరాలు దాటి, కాంతారా, ఓ2, కేస్ ఆఫ్ కొండన, బనదరి వంటి తదితర కన్నడ బ్లాక్ బస్టర్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు