OTT Mystery Thriller Web Series: ఓటీటీలోకి వస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్..
OTT Mystery Thriller Web Series: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. తాజాగా శుక్రవారం (నవంబర్ 22) ఈ సిరీస్ ట్రైలర్ రిలీజైంది. ఈ వెబ్ సిరీస్ పేరు హరికథ.
OTT Mystery Thriller Web Series: థ్రిల్లర్, మిస్టరీ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీస్, వెబ్ సిరీస్ లకు ఓటీటీల్లో మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో చాలా వరకు మేకర్స్ వీటిలోనే కంటెంట్ ను తీసుకొస్తున్నారు. తాజాగా మిస్టరీ థ్రిల్లర్ కు మైథాలజీని జోడించి తెలుగులో హరికథ సంభవామి యుగే యుగే అనే వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ ట్రైలర్ శుక్రవారం (నవంబర్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
హరికథ ట్రైలర్ రిలీజ్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ సరికొత్త మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్ 13 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు హాట్‌స్టార్ వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది. హరికథ అనే టైటిల్ కు సంభవామి యుగే యుగే అనే ట్యాగ్‌లైన్ తో హాట్‌స్టార్ తీసుకొస్తున్న ఈ వెబ్ సిరీస్ ఎంతో ఆసక్తి రేపుతోంది.
పైగా ఈ సిరీస్ ను ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండటం విశేషం. టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా ఉన్నాడు. ఈ వెబ్ సిరీస్ ను మ్యాగీ డైరెక్ట్ చేశారు. రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్, బిగ్ బాస్ ఫేమ్ దివి, పూజిత పొన్నాడ, అర్జున్ అంబటిలాంటి వాళ్లు ఈ సిరీస్ లో నటిస్తున్నారు.
హరికథ ట్రైలర్ ఎలా ఉందంటే?
ధర్మం నశించి, అధర్మం పెరిగినప్పుడు తాను మళ్లీ పుడతానని, ధర్మాన్ని స్థాపిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు.. పరశురాముడు, నరసింహుడు, వామనమూర్తి.. ఇలా శ్రీవిష్ణు అవతారాల రూపంలో ఊరిలో నేరస్తులను శిక్షిస్తుంటాడో అపరిచిత వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? అనే కోణంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది.
ఈ విచారణలో పోలీస్ ఆఫీసర్ కు ఎదురైన సవాళ్లు ఏంటి అనేది ఆసక్తికరంగా ట్రైలర్ లో చూపించారు. నాటకాల్లో దేవుడి పాత్రలు పోషించే నటుడిగా రాజేంద్రప్రసాద్ కనిపించగా.. పోలీస్ ఆఫీసర్ గా శ్రీరామ్ నటించారు. మైథాలజీ టచ్ తో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ గా సాగిన "హరికథ" ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
ఈ ట్రైలర్ చూసి అభిమానులు థ్రిల్ ఫీలవుతున్నారు. చాలా అద్భుతంగా ఉందని కామెంట్స్ చేశారు. ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. అయితే కొందరు దీనిని ఓ సినిమాగా కూడా పొరపడ్డారు.
హరికథ సంభవామి యుగే యుగే వెబ్ సిరీస్ డిసెంబర్ 13 నుంచి హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మధ్యకాలంలో మైథాలజీకి ఇలాంటి మిస్టరీ, థ్రిల్లర్ జానర్స్ జోడించి తీస్తున్న మూవీస్, వెబ్ సిరీస్ ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ హరికథ ఎంతమేర ప్రేక్షకులకు నచ్చుతుందో చూడాలి.
టాపిక్