Today OTT Releases Telugu: ఇవాళ (అక్టోబర్ 11) ఓటీటీలో మూవీ ఫెస్టివల్ అన్నట్లుగా సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఏకంగా 24 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో చూడాల్సినవిగా 16 ఉండగా.. వాటిలో హారర్, సైకలాజికల్, మిస్టరీ, డిటెక్టివ్, సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలు రొమాంటిక్ వెబ్ సిరీసులు ఉన్నాయి. మరి అవేంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో లుక్కేద్దాం.
మత్తు వదలరా 2 (తెలుగు సినిమా)- అక్టోబర్ 11
లోన్లీ ప్లానెట్ (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 11
అప్ రైజింగ్ (కొరియన్ సినిమా)- అక్టోబర్ 11
డౌట్ (కొరియన్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 11
బ్రేకింగ్ ది సైలెన్స్ ది మరియా సోలెడాడ్ కేస్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- అక్టోబర్ 11
ది గ్రేట్ ఇండియన్ కపిల్ న్యూ ఎపిసోడ్ (హిందీ కామెడీ టాక్ షో)- అక్టోబర్ 12
ఉత్సవం (తెలుగు మూవీ)- అక్టోబర్ 11
గుటర్ గూ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 11
నందన్ (తమిళ సినిమా)- అక్టోబర్ 11
పెపె (తెలుగు డబ్బింగ్ కన్నడ సినిమా)- అక్టోబర్ 11
బోన్‌యార్డ్ (ఇంగ్లీష్ డిటెక్టివ్ మూవీ)- అక్టోబర్ 11
అంబర్ అలర్ట్ (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 11
కన్స్యూమ్‌డ్ (ఇంగ్లీష్ హారర్ చిత్రం)- అక్టోబర్ 11
వెయ్ దరువెయ్ (తెలుగు చిత్రం)- అక్టోబర్ 11
లెవెల్ క్రాస్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సినిమా)- అక్టోబర్ 11
లాంతర్ (Landhar OTT) (తమిళ చిత్రం)- అక్టోబర్ 11 (ఆహా తమిళ్ ఓటీటీ)
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ
సర్ఫిరా (హిందీ సినిమా)- అక్టోబర్ 11
వాళై (తెలుగు డబ్బింగ్ తమిళ చిత్రం)- అక్టోబర్ 11
జై మహేంద్రన్ (తెలుగు డబ్బింగ్ మలయాళ చిత్రం)- అక్టోబర్ 11
రాత్ జవానీ హై (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 11
ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది గన్ (ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబర్ 11
పూల్‌మ్యాన్ (అమెరికన్ సినిమా)- అక్టోబర్ 11
శబరి (తెలుగు చిత్రం)- సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ- అక్టోబర్ 11
టీకప్ (ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ మూవీ)- జియో సినిమా ఓటీటీ- అక్టోబర్ 11
డిస్‌క్లైమర్ (ఇంగ్లీష్ సినిమా)- యాపిల్ ప్లస్ టీవీ- అక్టోబర్ 11
ఇలా ఇవాళ ఒక్కరోజే ఏకంగా 24 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో తెలుగు సినిమాలు మత్తు వదలరా 2, శబరి, వెయ్ దరువెయ్, ఉత్సవం, తెలుగు డబ్బింగ్ మలయాళ సినిమా లెవెల్ క్రాస్, తెలుగు డబ్బ్‌డ్ చిత్రం వాళై స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే వీటితో పాటు ఇతర భాషల్లోని సినిమాలు, వెబ్ సిరీసులు తెలుగు డబ్బింగ్‌లో ఉన్నాయి.
వాటిలో మలయాళం నుంచి జై మహేంద్రన్, హిందీ వెబ్ సిరీస్ రాత్ జవానీ హై, ఇంగ్లీష్ హారర్ సర్వైవల్ థ్రిల్లర్ టీకప్, పెపె, గుటర్ గూ సీజన్ 2 ఉన్నాయి. వీటితోపాటు హిందీ చిత్రం సర్ఫిరా, హారర్ మూవీ కన్స్యూమ్‌డ్, కొరియన్ థ్రిల్లర్ సిరీస్ డౌట్, డిటెక్టివ్ థ్రిల్లర్ బోన్‌యార్డ్, మిస్టరీ థ్రిల్లర్ అంబర్ అలర్ట్ చిత్రాలు కూడా చాలా స్పెషల్‌గా ఉన్నాయి.