OTT: ఓటీటీలో సత్తాచాటుతున్న సుహాస్ సినిమా.. ట్రెండింగ్‍లో టాప్.. రెండు రోజుల్లోనే ఆ మార్క్‌కు చేరువలో..-ott movie prasanna vadanam streaming suhas movie trending top on aha ott platform ott top telugu films ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఓటీటీలో సత్తాచాటుతున్న సుహాస్ సినిమా.. ట్రెండింగ్‍లో టాప్.. రెండు రోజుల్లోనే ఆ మార్క్‌కు చేరువలో..

OTT: ఓటీటీలో సత్తాచాటుతున్న సుహాస్ సినిమా.. ట్రెండింగ్‍లో టాప్.. రెండు రోజుల్లోనే ఆ మార్క్‌కు చేరువలో..

Prasanna Vadanam OTT Streaming: ప్రసన్న వదనం సినిమా ఓటీటీలో దుమ్మురేపుతోంది. సుహాస్ నటించిన ఈ థ్రిల్లర్ మూవీకి భారీగా వ్యూస్ వస్తున్నాయి. దీంతో ట్రెండింగ్‍లో టాప్‍కు వచ్చేసింది.

OTT: ఓటీటీలో సత్తాచాటుతున్న సుహాస్ సినిమా.. ట్రెండింగ్‍లో టాప్.. రెండు రోజుల్లోనే ఆ మార్క్‌కు చేరువలో..

Prasanna Vadanam OTT: కమెడియన్ నుంచి హీరోగా మారిన టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ మంచి ఫామ్‍లో ఉన్నారు. గతేడాది రైటర్ పద్మభూషణంతో హిట్ కొట్టిన ఆయన ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‍తో మరో విజయం అందుకున్నారు. శ్రీరంగనీతులు నిరాశపరిచినా.. ఈనెలలో రిలీజైన ప్రసన్న వదనంతో సుహాస్ మరో డీసెంట్ హిట్ సాధించారు. అయితే, సుహాస్ చిత్రాలు ఓటీటీల్లోనూ మంచి వ్యూస్ సాధిస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రసన్న వదనం కూడా ఇదే రిపీట్ చేసింది. ఓటీటీలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ట్రెండింగ్‍లో టాప్‍కు వచ్చేసింది. ఆ డీటైల్స్ ఇవే..

టాప్‍లో ట్రెండింగ్

ప్రసన్న వదనం సినిమా మే 24వ తేదీన ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మే 3న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నాలుగు వారాల్లోనే ఓటీటీలో అడుగుపెట్టింది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చిన రెండు రోజుల్లోనే ప్రసన్న వదనం సినిమా ట్రెండింగ్‍లో టాప్‍ ప్లేస్‍కు వచ్చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం సత్తాచాటుతూ ఆహాలో ఫస్ట్ ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది.

50 మిలియన్ మార్క్ చేరువలో..

ప్రసన్న వదనం సినిమా ఆహాలో రెండు రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మార్క్‌కు సమీపించిందని తెలుస్తోంది. మరొక్క రోజునే ఈచిత్రం ఆ మైల్‍స్టోన్ దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ప్రసన్న వదనం చిత్రానికి అర్జున్ వైకే దర్శకత్వం వహించారు. ఫేస్ బ్లైండ్‍నెస్ అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ డిజార్డర్ ఉన్న హీరో సుహాస్.. ఈ చిత్రంలో మనుషుల ముఖాలను గుర్తించలేని సమస్యతో ఉంటాడు. ఫేస్‍బ్లైండ్‍నెస్ ఉన్న వ్యక్తిగా ఈ థ్రిల్లర్ మూవీలో సుహాస్ యాక్టింగ్ మెప్పించింది. అతడి నటనపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు.

ప్రసన్న వదనం చిత్రంలో సుహాస్ సరసన పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‍గా చేశారు. వైవా హర్ష, రాశి సింగ్, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా.. ఎస్.చంద్రశేఖరన్ సినిమాటోగ్రఫీ చేశారు. లిటిల్ థాట్స్ సినిమాస్ పతాకంపై మణికంఠ, ప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు.

ఆహాలో ప్రస్తుతం ట్రెండింగ్‍లో ఇవి..

ఆహాలో ఓటీటీలో ప్రసన్న వదనం సినిమా ప్రస్తుతం (మే 26) ట్రెండింగ్‍లో టాప్‍లో ఉంది. సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న సర్కార్ సీజన్ 4 గేమ్‍షోలో ‘లవ్ మీ’ టీమ్ పాల్గొన్న ఎపిసోడ్ ప్రస్తుతం రెండో ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది. విద్యావాసుల అహం, గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాలు ఆ తర్వాతి ప్లేస్‍ల్లో ఉన్నాయి. బేబీ చిత్రం కూడా టాప్-5లో ట్రెండ్ అవుతోంది. ప్రేమలు, మై డియర్ దొంగ చిత్రాలు కూడా టాప్-10లో ప్రస్తుతం ఉన్నాయి.

ఆహా ఓటీటీలో మంచి సక్సెస్ అయిన సింగింగ్ రియాల్టీ షో తెలుగు ఇండియన్ ఐడల్‍కు మూడో సీజన్ త్వరలోనే వచ్చేస్తోంది. తెలుగు ఇండియన్ ఐడల్ 3 జూన్ 7వ తేదీన మొదలుకానుంది. ఈ విషయాన్ని ఆహా ఇటీవలే వెల్లడించింది. ఈ షోకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్, సింగర్లు కార్తీక్, గీతామాధురి జడ్జిలుగా ఉన్నారు.