OTT: ఓటీటీలో వీకెండ్‌కు చూడాల్సిన టాప్ 8 సినిమాలు- స్టార్ హీరోవే 2- ఫ్యామిలీతో చూసేవి 6- ఎక్కడంటే?-top 8 ott movies to watch this weekend on netflix amazon prime ott platform sarfira stree 2 vaazhai digital streaming ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ott: ఓటీటీలో వీకెండ్‌కు చూడాల్సిన టాప్ 8 సినిమాలు- స్టార్ హీరోవే 2- ఫ్యామిలీతో చూసేవి 6- ఎక్కడంటే?

OTT: ఓటీటీలో వీకెండ్‌కు చూడాల్సిన టాప్ 8 సినిమాలు- స్టార్ హీరోవే 2- ఫ్యామిలీతో చూసేవి 6- ఎక్కడంటే?

Published Oct 10, 2024 03:46 PM IST Sanjiv Kumar
Published Oct 10, 2024 03:46 PM IST

Top 8 OTT Movies To Watch: ఓటీటీలో ఈ వీకెండ్‌కు చూడాల్సినవిగా 8 సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒక్క స్టార్ హీరోవే రెండు మూవీస్ ఉండటం విశేషం. అలాగే, ఎనిమిదింటిలో ఆరింటిని ఎంచక్కా ఫ్యామిలీతో చూస్తూ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ, 2 మాత్రం రొమాంటిక్ జోనర్ కావడంతో ఫ్యామిలీతో చూడలేం. మరి అవేంటో లుక్కేద్దాం.

ఈ వారం పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో విడుదల కానున్నాయి. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'స్త్రీ 2' ఇవాళ ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేసింది. వీటితోపాటు వీకెండ్‌కు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

(1 / 9)

స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన మల్టీస్టారర్ చిత్రం 'ఖేల్ ఖేల్ మే' ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రం అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్‌తో పాటు వాణి కపూర్, తాప్సీ పన్ను, అమీ విర్క్, ఫర్దీన్ ఖాన్ నటించారు.

(2 / 9)

బరున్ సోబ్తి, అంజలి ఆనంద్, ప్రియా బాపట్ నటించిన కామెడీ డ్రామా సిరీస్ 'రాత్ జవాన్ హై' అక్టోబర్ 11న ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.

(3 / 9)

శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ జంటగా నటించిన కామెడీ హారర్ మూవీ 'స్త్రీ 2' అక్టోబర్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి ఎలాంటి రెంటల్ విధానం లేకుండా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

(4 / 9)

స్టార్ హీరో నటించిన మరో సినిమా సర్ఫిరా. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అక్టోబర్ 11 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇదివరకే ఓటీటీలో అక్షయ్ కుమార్ నటించిన 'ఖేల్ ఖేల్ మే' డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. దీంతో ఈ వారంలో ఈ స్టార్ హీరోవి రెండు సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి.  

(5 / 9)

అక్టోబర్ 11 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానున్న తమిళ చిత్రం 'వాళై'. ఒక అమాయక బాలుడి హృదయ విదారక బాల్య కథగా తెరకెక్కిన ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ మూవీగా నిలిచింది. 

(6 / 9)

సిటాడెల్ ఫ్రాంఛైజీలో వచ్చిన మరో వెబ్ సిరీస్ 'సిటాడెల్: డయానా'. ఈ  ఇటాలియన్ వెబ్ సిరీస్ అక్టోబర్ 10 అంటే నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

(7 / 9)

అక్టోబర్ 11 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కానున్న రొమాంటిక్ వెబ్ సిరీస్ 'లోన్లీ ప్లానెట్'. ఈ వీకెండ్‌కు చూడాల్సిన రొమాంటిక్ సిరీస్ అయినప్పటికీ ఫ్యామిలీతో మాత్రం చూడటం కష్టం.

(8 / 9)

'ఔటర్ బ్యాంక్' నాలుగో సీజన్ కూడా ఈ వీకెండ్‌కు ఓటీటీలో చూసే వెబ్ సిరీస్ కానుంది. అయితే, అక్టోబర్ 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌ను ఫ్యామిలీతో చూడటం కాస్తా కష్టమనే చెప్పాలి. 

(9 / 9)

ఇతర గ్యాలరీలు