Brahmamudi October 31st Episode: బ్రహ్మముడి- ఒక్క దెబ్బకు మూడు పిట్టలు- కావ్య ట్విస్ట్‌కు అల్లాడిపోయిన అనామిక, రుద్రాణి-brahmamudi serial october 31st episode indiradevi confronts aparna kavya wins auction star maa brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi October 31st Episode: బ్రహ్మముడి- ఒక్క దెబ్బకు మూడు పిట్టలు- కావ్య ట్విస్ట్‌కు అల్లాడిపోయిన అనామిక, రుద్రాణి

Brahmamudi October 31st Episode: బ్రహ్మముడి- ఒక్క దెబ్బకు మూడు పిట్టలు- కావ్య ట్విస్ట్‌కు అల్లాడిపోయిన అనామిక, రుద్రాణి

Sanjiv Kumar HT Telugu
Oct 31, 2024 07:46 AM IST

Brahmamudi Serial October 31st Episode: బ్రహ్మముడి అక్టోబర్ 31 ఎపిసోడ్‌లో సుభాష్‌కు తీవ్ర చలిజ్వరం వస్తుంది. అది చూసి కూడా పట్టించుకోని కోడలు అపర్ణపై అత్త ఇందిరాదేవి ఫైర్ అవుతుంది. రాజ్‌లాగే నువ్ చేస్తున్నావ్. పేర్లు వేరైనా చేసేది ఒక్కటే అని కోప్పడుతుంది ఇందిరాదేవి.

బ్రహ్మముడి సీరియల్‌ అక్టోబర్ 31 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ అక్టోబర్ 31 ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో మన ప్రయత్నం సరిగా ఉన్న శత్రువు కుట్రలు పన్నుతారు. జాగ్రత్తగా ఉండమ్మ అని కావ్యకు సలహాలు ఇస్తాడు సీతారామయ్య. అదంతా విన్న కనకం వేళంపాట నేనెప్పుడు చూడలేదు వస్తాను అని అడుగుతుంది. సరే అని కావ్య తినేసి వెళ్లిపోతుంది.

రాంగ్ డెసిషన్

రాత్రంతా వేళం పాటను బాగా ప్రాక్టీస్ చేసి బాగా పాడాలి. దెబ్బకు కంపెనీకి లాభం రావాలి అని కనకం అనుకుంటుంది. మరోవైపు కళావతి ఎందుకు రాంగ్ డెసిషన్ తీసుకుంది. కచ్చితంగా కంపెనీని ఏదో చేయబోతుంది. తాతయ్య కూడా చాలా ధీమాగా ఉన్నారు. ఏదో జరుగుతుంది. తెలుసుకోవాలి అని రాజ్ ఆలోచిస్తుంటుంది. ఆ చెంచా ఉందిగా అని శ్రుతికి కాల్ చేస్తాడు రాజ్. నిద్రలో ఉన్న శ్రుతి చూడకుండానే ఎవరు అని అడుగుతుంది.

నేను రాజ్‌ని, స్వరాజ్ గ్రూప్ అని రాజ్ చెబుతుంటే.. హో.. మేనేజరా అని శ్రుతి అంటుంది. నేను ఇంకా ఆ పోస్ట్ యాక్సెప్ట్ చేయలేదని రాజ్ అంటే.. ఇప్పుడెందుకు కాల్ చేశారని శ్రుతి అంటుంది. ఆ వేళంపాట గురించి అని రాజ్ అంటాడు. సారీ సర్ పరాయి వాళ్లకు కంపెనీ విషయాలు షేర్ చేయను. ఇప్పుడేగా మేనేజర్ పోస్ట్ యాక్సెప్ట్ చేయను అన్నారు. అంటే పరాయి వాళ్లేగా అని శ్రుతి అంటుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు.

రాహుల్ అడిగితేనే చెప్పలేదు. మీరు అడిగితే ఎలా చెబుతాను. మీరు మేడమ్ పర్మిషన్ తీసుకుంటే చెప్పేవాన్ని అని శ్రుతి అంటుంది. ఊకే మేనేజర్ మేనేజర్ అని డ్యామేజర్‌ను చేయకు. ఏదో ఒకరోజు ఆ సీట్‌లో నేను కూర్చుంటాను. అప్పుడు నీకు సీట్ లేకుండా చేస్తాను. ఛీ ఛీ అదే నీ సీట్‌లో ఇంకొకరిని కూర్చోబెడతాను అని రాజ్ కల్ కట్ చేస్తాడు. ఇంత సీక్రెట్‌గా ఎందుకు ఉంచుతున్నారు. కళావతికి అన్ని తెలివితేటలు లేవే. ఏదో తప్పు చేస్తుంది. చేయని.. అది కూడా మన మంచికే అని రాజ్ అనుకుంటాడు.

సుభాష్‌కు జ్వరం

దాని సంగతి తెలిసి పీకేసి మళ్లీ నన్ను సీటులో కూర్చొబెడతారు అని రాజ్ సంతోషిస్తాడు. తర్వాతి రోజు ఉదయం సుభాష్ ఏంటీ ఇంకా పడుకునే ఉన్నాడా. వాకింగ్ వెళ్లేవాడు కదా అని అపర్ణను అడుగుతుంది ఇందిరాదేవి. నాకేం తెలుసు అత్తయ్య అని పట్టించుకోనట్లు మాట్లాడుతుంది అపర్ణ. దాంతో లోపలికి వెళ్లి చూస్తుంది ఇందిరాదేవి. సుభాష్ వణుకుతూ పడుకుని ఉంటాడు. అది చూసి నిన్నే చెబితే డాక్టర్‌ను పిలిచే వాన్ని అని ఇందిరాదేవి అంటుంది.

ట్యాబ్లెట్స్ వేసుకున్న అని సుభాష్ అంటే.. సొంత వైద్యం చేసుకోడం ప్యాషన్ అయిపోయింది. ఇక డాక్టర్స్, హాస్పిటల్స్ ఎందుకు. జ్వరం వచ్చింది. కానీ, అది ఎందుకు వచ్చిందో తెలుసా. నేను ఇప్పుడే డాక్టర్‌ను పిలుస్తాను అని బయటకు వస్తుంది ఇందిరాదేవి. అపర్ణ నువ్ రోజు రోజు మొండిదానిలా తయారు అవుతున్నావ్. వాడికి అంత జ్వరం వస్తే పట్టనట్లు ఉంటున్నావ్. ఎందుకింత మూర్ఖంగా చేస్తున్నావ్ అని ఇందిరాదేవి అంటుంది.

ఆయన చేసింది నాకు గుర్తుకువస్తుందని అపర్ణ అంటుంది. చాల్లే ఆపు. రోజురోజుకీ మరింత దిగజారిపోతున్నావ్. కావ్య విషయంలో రాజ్‌ తప్పు చేశాడని వాడిని రోజు నిలదీస్తున్నావ్. మరి నువ్ చేసిందేంటీ. పేరులు వేరైనా నువ్వు నీ కొడుకు చేస్తుంది ఒక్కటే. రాజ్ కావ్యను కలపాలని చూస్తున్నావ్. నువ్ మారనప్పుడు నిన్ను చూస్తూ పెరిగిన నీ కొడుకు మాత్రం ఎలా మారతాడు. మనసులో ద్వేషం ఉన్నంతకాలం ఏ మనిషిని అర్థం చేసుకోలం. అంతవరకు జీవితం ఇలాగే ఉంటుంది అని ఫైర్ అయి వెళ్లిపోతుంది ఇందిరాదేవి.

మనకే లాభం

వేళంపాట ఆఫీస్‌కు కావ్య, కనకం వస్తారు. అరవింద్ వచ్చి మిమ్మల్నే నమ్ముకున్నాను. మీరు ఎలా నన్ను బయటపడేస్తారో అని అంటాడు. మీరు ధైర్యంగా ఉండండి అని కావ్య హామీ ఇస్తుంది. వేళం పాట అంటే అంత భయపడుతున్నాడు. ఇది అంత కష్టమా అని కనకం అంటే.. కష్టమో నష్టమో మనకు అయితే లాభమే. కానీ, మా ఆయనే నమ్మట్లేదు అని కావ్య అంటుంది. ఎదురుగా అనామిక వస్తుంది. తల్లీకూతుళ్లు వచ్చారు. ముగ్గుల పోటీ నడుస్తుందా అని అనామిక అంటుంది.

మేము ముగ్గులు వేస్తాం. నువ్ డబ్బున్న వాన్ని అందులోకి లాగు అని కనకం పంచ్ వేస్తుంది. ఏదో ఒక రోజు మా అత్తగారికి మండి రెండు కోట్లకు మీ ఇల్లును వేలంపాటలో పెడతారు. మీ అమ్మ అయ్య చెట్టుకింద ఉండాలి అని కావ్య అంటుంది. వేళం పాటను వేలల్లో కాదు. కోట్లల్లో పాడాలి. ఎందుకు కష్టపడతారు. వెళ్లి బొమ్మలకు రంగులు వేసుకోండి అని అనామిక అంటుంది. వేళంపాట ఎలా ఉంటుందో చూసి వెళ్తాంలే. అయినా నీకు కంపెనీనే లేదు. మనిషికా దిగజారి మెట్టు ఎక్కానని అనుకుంటున్నావ్ అని కావ్య అంటుంది.

ఈ నీతులు చెబితే నీకేం ఒరిగింది. అత్త వారింటి నుంచి గెంటేశారు అని అనామిక అంటుంది. నీకు అలాగే అనిపిస్తుంది. ఆత్మాభిమానంతో నేను బయటకు వచ్చాను. అయినా నన్ను కంపెనీకి సీఈఓను చేశారు. నిన్ను జైలుకు పంపించారు. అదే నీకు నాకు తేడా అని కావ్య అంటుంది. దాంతో నీకు మాటలేంటే.. నువ్ ఊ అను కుర్చీ మడతపెట్టి అని కనకం అంటుంటే.. ఆపి ఇంకెక్కడైనా మడతపెడుదువ్ అని కావ్య అంటుంది. ఇంతలో రాజ్ రుద్రాణి ఎంట్రీ ఇస్తారు.

డ్రామాలతో మాయ

నేను ఓడిపోతే చూద్దామని వచ్చినట్లుందని కావ్య అంటుంది. నిన్ను చూస్తుంటే బాధగా ఉంది రాజ్. నిన్ను వదిలేసి తనను సీఓను చేశారటకదా అని అనామిక అంటే.. ఇవాళ ఆ సీఈఓ భవిష్యత్ ఏంటో తేలిపోతుంది అని రుద్రాణి అంటుంది. దుగ్గిరాల కుటుంబం లేకుంటే నీ భవిష్యత్ ఏంటో అని కనకం అంటుంది. డ్రామాలు ఆడి మాయ చేసే నువ్వు కూడా మాట్లాడుతున్నావా క్యాన్సర్ కనకం అని రుద్రాణి అంటుంది. ఇక్కడ ఎవరకి క్యారెక్టర్ లేదు. మాట్లాడితే మన పరువే పోతుంది అని రాజ్ అంటాడు.

మిస్టర్ మేనేజర్ వేళంపాటలో పాడేందుకు అన్ని సిద్ధం చేశారా అని కావ్య అంటుంది. అన్ని రెడీగా ఉన్నాయని రాజ్ కోపంగా వెళ్లిపోతాడు. ఓడిపోడానికి రెడీగా ఉండు అని అనామిక అంటే.. సేమ్ టు యూ అని కావ్య వెళ్లిపోతుంది. కావ్య ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు అని రుద్రాణి అంటే.. ఈ అనామిక కెపాసిటీ ఏంటో కాసేపట్లో మీరే చూస్తారుగా ఆంటీ ఆని అనామిక అంటుంది. వేళంపాట స్టార్ట్ అవుతుంది. సినిమాలో చూడటమే కానీ ఎప్పుడు పాడలేదే. నేను పాడతానే అని కనకం అంటుంది.

రుద్రాణి ఏదోటి అంటే.. ఇది మీ కొడుకు సంపాదించి కాదు. మా అల్లుడు సంపాదించింది అని కనకం అంటుంది. రాజ్ కూడా వద్దంటే మేనేజర్ మౌనంగా ఉండండి అని కావ్య అంటుంది. బ్యాంక్ వారి పాట 10 కోట్లు అని చెబుతారు. అనామిక 11 కోట్లు చెబుతుంది. తర్వాత 12 కోట్లు అని కనకం అంటుంది. కనకం, అనామిక పెంచుకుంటూ పోతారు. కనకం 25 కోట్లు అనేసరికి అంతా అవాక్కవుతారు. అరవింద్ చాలా సంతోషిస్తాడు.

తగ్గేదే లే..

అనామిక 30 కోట్లు అంటుంది. దాంతో రాజ్ మరింత షాక్ అవుతాడు. మళ్లీ పెంచుకుంటూ పోతారు. ఇకనైనా ఆపుతారా అని రాజ్ అంటే.. తగ్గేదే లే అని కావ్య అంటుంది. అనామిక 40 కోట్లు అంటుంది. అప్పుడు కనకం పాడబోతుంటే కావ్య ఆపుతుంది. కనకం పాడతాను అని ఉవ్విళ్లూరుతుంది. నువ్ ఈ చీర ఎందుకు కట్టుకచ్చావ్ అని కావ్య అంటే.. ఇది వేళం పాటనా. సారీ పాటన. దీన్ని ఎవర్రా సీఈఓను చేసింది. హో.. మా నాన్నే కదా అని రుద్రాణి అంటుంది.

సామంత్ గ్రూప్‌కు అరవింద్ కంపెనీ వెళ్లిపోతుంది. అనామిక సైన్ చేస్తుంది. డాక్యుమెంట్స్ కారులో పెట్టించమని చెప్పి వెళ్లిపోతుంది. దాన్ని గెలిపించేందుకే మనం వచ్చామా అని కనకం అంటుంది. పర్లేదమ్మా పదా అని కావ్య అంటుంది. పిచ్చి కావ్య అనామికను గెలిపించేందుకే వచ్చినట్టున్నావ్ అని రుద్రాణి అనుకుంటుంది. కావ్య, కనకం వెళ్లిపోతారు. ఎందికిలా చేశావ్ అని కనకం అంటే.. అనామికకు అమ్మడానికి వచ్చాను అని కావ్య అంటుంది.

నీకు ఎలా ఉందో. నాకు అవమానంగా ఉంది. కంపెనీ పరువు పోగొట్టింది అని రుద్రాణి అంటుంది. నీ ఓటమికి పునాది వేసింది నేనే అని లోపల సంబరపడిపోతుంది రుద్రాణి. ఇంతలో అనామిక వస్తుంది. ఏదో అన్నారు. నేను ఓడిపోతాను. మీరే గెలుస్తానని శపథం చేశారు. నన్ను గెలిపించడానికేగా మీరు ఇక్కడికి వచ్చారు అని అనామిక పొగరుగా అంటుంది. నువ్ కావ్యకు జీతం ఎంతిస్తుందో. అంటే నీతో చేతులు కలిపేగా ఇదంతా చేస్తుంది అని రుద్రాణి అంటుంది.

కావ్యకు 15 కోట్ల లాభం

నిప్పులేని చోట కూడా పొగ పుట్టిస్తావ్. భార్యాభర్తలను విడదీయడానికి నీకు బాగా కారణాలు దొరుకుతాయి కదా అని కనకం ఫైర్ అవుతుంది. నేను అనామికతో చేతులు కలిపానో లేదో కాసేపట్లో తెలుస్తుంది అని కావ్య అంటుంది. అరవింద్ వచ్చి తనతో కావ్య చేసుకున్న డీల్ గురించి మాట్లాడుతాడు. అనుకున్నట్లుగానే కావ్యకు 15 కోట్ల లాభాలు వచ్చినట్లు చెబుతాడు. దాంతో అనామిక, రుద్రాణి, రాజ్ అంతా షాక్ అవుతారు.

కావ్య ఒక్క దెబ్బకు మూడు పిట్టలు రాలినట్లు అవుతుంది. కావ్య ఇచ్చిన ట్విస్ట్‌తో అటు కంపెనీనికి ఊరికనే 15 కోట్ల లాభంతోపాటు అనామికకు 30 కోట్ల నష్టం వస్తుంది. ఇక రుద్రాణి తనవల్లే ఇదంతా జరిగింది అని బిత్తరపోయి అల్లాడిపోతుంది. అక్కడితే నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.

Whats_app_banner