Brahmamudi Serial: బ్రహ్మముడి- దుగ్గిరాల ఇంట్లో ఆస్తి చీలికలు- కుండబద్ధలు కొట్టిన ధాన్యలక్ష్మీ- సీతారామయ్య నిర్ణయం ఇదే!
Brahmamudi Serial Latest Episode: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్‌లో కల్యాణ్ ఎవరితో అయినా వెళ్లిపోని వాడికి మాత్రం న్యాయం జరగాలని ధాన్యలక్ష్మీ అంటుంది. ఎలాంటి న్యాయం అని అపర్ణ అడుగుతుంది. ఆస్తిని ముక్కలు చేయమని, కల్యాణ్ వాటా ఇచ్చేయమని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. దాంతో ఇంటిల్లిపాది అంతా షాక్ అవుతారు.
Brahma Mudi Serial Latest Episode: బ్రహ్మముడి సీరియల్ తాజా ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లో దీపావళి వేడుకలు జరుగుతుండగా.. రుద్రాణి చిచ్చు పెడుతుంది. టీవీలో పెద్ద బాంబ్ పేలుతుందని అందరిని ఇంట్లోకి పిలుస్తుంది. అప్పుడు అనామిక ప్లాన్ చేసిన కల్యాణ్ ఆటో బయోగ్రఫీ టీవీలో బట్ట బయలు అవుతుంది. దాంతో దుగ్గిరాల కుటుంబం అంతా షాక్ అవుతుంది.
నిరూపించుకునేవరకు
దుగ్గిరాల ఇంటి వారసుడివి అని, ఆటో నడుపుకోవాల్సిన గతి పట్టలేదని, ఇదంతా జరిగింది అప్పును పెళ్లి చేసుకోవడం వల్లే అని ధాన్యలక్ష్మీ నానా మాటలు అంటుంది. కనకం కుటుంబాన్ని కూడా నిందిస్తుంది ధాన్యలక్ష్మీ. తల్లి ఎంత చెప్పిన తాను ఇంటికి రానని, ఆటో నడుపుకోవడం తప్పు కాదని, తన కాళ్ల మీద నిలబడేవరకు, తానేంటో నిరూపించుకునేవరకు రానని కల్యాణ్ బదులిస్తాడు.
చచ్చినా ఒప్పుకోను
రాజ్, ఇంట్లోవాళ్లందరూ ఇంటికి వచ్చేయమని రిక్వెస్ట్ చేస్తారు. కానీ, కల్యాణ్ వినడు. దాంతో అప్పు మొహం మీద ఎంతో కొంత పడేస్తాను. దాన్ని వదిలేసి ఇక్కడే ఉండమని, అప్పును కోడలిగా చచ్చినా ఒప్పుకోను అని ధాన్యలక్ష్మీ తెగేసి చెబుతుంది. దాంతో ఇంటిల్లిపాది షాక్ అవుతారు. తెలుసు, అందుకే నేను చచ్చేదాకా ఈ ఇంటికి రాకూడదని అనుకున్నానని కల్యాణ్ అంటాడు.
న్యాయం జరగాలి
ఎవరు ఏం చెప్పిన అప్పు తన భార్య అని, తనకోసం ఆటో నడపడం తప్పు కాదని, ఆటో నడుపుతూనే కవిగా తానేంటో నిరూపించుకుంటానని శపథం చేసి దుగ్గిరాల ఇంటి నుంచి కల్యాణ్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కల్యాణ్ వెళ్లిపోవడంతో ధాన్యలక్ష్మీ మరింత బాధపడుతుంది. వాడు దేంతో అయినా పోనివ్వండి. కానీ, వాడికి న్యాయం జరగాలి అని ధాన్యలక్ష్మీ అంటుంది.
వాటా ఇచ్చేయండి
న్యాయం అంటే ఏం కావాలి, ఏం కోరుకుంటున్నావ్ నువ్ అని అపర్ణ ప్రశ్నిస్తుంది. ఆస్తిని ముక్కలు చేయండి. నా కొడుకు వాటా వాడికి ఇవ్వండి అని ధాన్యలక్ష్మీ కుండ బద్దలు కొట్టినట్లు చెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. మీకెందుకు ఇలాంటి బుద్ధి పుట్టింది అని కావ్య అడుగుతుంది. దానికి మరింత కోప్పడుతుంది ధాన్యలక్ష్మీ.
కొడుకుని నిలదీసిన అపర్ణ
నువ్వెవరే నాకు నీతులు చెప్పడానికి, మొగుడు వద్దు, అత్తగారిల్లు వద్దు అని పోయి పుట్టింటికి వెళ్లినదానివి. నీకు మా ఇంటి విషయాలు మాట్లాడటానికి ఏం హక్కు ఉంది అని ధాన్యలక్ష్మీ అంటుంది. దాంతో రాజ్ సైలెంట్‌గా చూస్తూ ఉంటాడు. ఏం అనడు. అది గమనించిన అపర్ణ రాజ్‌ను నిలదీస్తుంది. నీ భార్యను అలా అంటుంటే ఏం అనట్లేదేంటీ అని ప్రశ్నిస్తుంది.
ఒక్కటై వస్తున్నారా
రాజ్‌ను ఎందుకు బలవంతపెడతావ్ అని చెప్పిన ధాన్యలక్ష్మీ నీ కొడుకు ఆస్తిని బాగా ఎంజాయ్ చేస్తుంటే నా కొడుకు వాటా అడిగేసరికి అత్తాకోడళ్లు ఒక్కటై వస్తున్నారా అని ధాన్యలక్ష్మీ నోరు పారేసుకుంటుంది. ప్రకాశం పంచ్‌లు వేస్తూ ధాన్యలక్ష్మీని తప్పుపడతాడు. అయినా ధాన్యలక్ష్మీ వినదు. ఇదంతా చూసిన రుద్రాణి తెగ సంబరపడిపోతుంది. తనలో తానే పైశాచిక ఆనందాన్ని పొందుతుంటుంది.
నిజం చేయలేను
ఈసారి ఎలాగైనా నాన్న ఆస్తిని పంచుతాడని, లేకుంటే ధాన్యలక్ష్మీ ఊరుకోదని మనసులో అనుకుంటుంది రుద్రాణి. తర్వాత ధాన్యలక్ష్మీ మాటలతో రెచ్చిపోవడంతో సీతారామయ్య రంగంలోకి దిగుతాడు. కల్యాణ్ ఆటో నడపడం గురించి ఇంకేమైనా ఆలోచించాల్సిందే అని, దుగ్గిరాల ఇంటి వారసుడు ఆటో నడపడం పరువుకు నష్టమేనని అంటాడు. అలా అని ఆస్తిని ముక్కలు చేసి టీవీలో చెప్పిందాన్ని నిజంచేయలేనని అని చెబుతాడు సీతారామయ్య.
చీలికలు ఉండవు
తాను చచ్చేంతవరకు దుగ్గిరాల కుటుంబం ఉమ్మడిగానే ఉంటుందని, ఆస్తిలో చీలికలు ఉండవని, కల్యాణ్ విషయంలో న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని సీతారామయ్య తెగేసి చెప్పి కౌంటర్ ఇచ్చి వెళ్లిపోతాడు. దాంతో అంతా వెళ్లిపోతారు. ఆస్తి ముక్కలు అయి తన, అనామిక ప్లాన్ సక్సెస్ అవుతుందని అనుకుంటే నాన్న ఇలా చెప్పేసి వెళ్లిపోయాడేంటీ అని రుద్రాణి నిరాశ పడినట్లు తెలుస్తోంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.
టాపిక్