Brahmamudi September 26th Episode: కావ్య మాట వినకుండా పెద్ద తప్పు చేశానన్న సీతారామయ్య- రాహుల్ చెంప పగులగొట్టిన రుద్రాణి
Brahmamudi Serial September 26th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 26వ తేది ఎపిసోడ్‌లో ఇంటికొచ్చిన సీతారామయ్య ఫ్రెండ్ రాహుల్ చేసిన అవమానం గురించి చెబుతాడు. దాంతో కావ్య చెప్పిన వినకుండా పెద్ద తప్పు చేశానని సీతారామయ్య అంటాడు. తర్వాత రుద్రాణిపై రాహుల్ కోప్పడుతాడు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంటికి వచ్చిన సీతారామయ్య ఫ్రెండ్ తన మనవడు స్వరాజ్ కంపెనీతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకున్నాడని, తన మనవడు శ్రీకాంత్ కంపెనీకి వస్తే.. రాహుల్ అవమానించి పంపించాడని చెబుతాడు. దాంతో అంతా రాహుల్‌ను కోపంగా చూస్తారు.
మీకు ఎన్నోసార్లు మెయిల్స్ పంపించాను. కలవాలని మెసేజ్ చేశాను. అందుకే వచ్చాను అని శ్రీకాంత్ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటాడు రాహుల్. మీకు కావాల్సిన డిజైన్స్ పంపించాం కదా. ఇంకెందుకు కలవడం అని రాహుల్ రూడ్‌గా అంటాడు. ఆ డిజైన్స్ నాకు నచ్చలేదు. వాటిని మారచి కొత్త డిజైన్స్ పంపించమని శ్రీకాంత్ అడుగుతాడు. అవేమైనా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడతారా. నువ్విస్తున్న బిజినెస్‌కు నేనుస్తున్న డిజైన్స్ చాలా ఎక్కువ అని రాహుల్ అంటాడు.
రిక్వెస్ట్ చేసుకుంటే
మీరు చాలా ఇన్సల్టింగ్‌గా మాట్లాడుతున్నారు అని శ్రీకాంత్ అంటాడు. నువ్ ఏమైనా అనుకో. నచ్చితే డిజైన్స్ తీసుకో లేకుంటే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపో. ఇక్కడెవరు నీ కంపెనీపై ఆధారపడట్లేదు అని రాహుల్ అంటాడు. నేను ఓసారి రాజ్‌తో మాట్లాడి క్యాన్సిల్ చేసుకుంటానని శ్రీకాంత్ అంటాడు. దాంతో రాజ్ ఏంటీ రాజ్. ఇక్కడ ఎండీని నేను. నేనే చూసుకుంటాను. నువ్ రిక్వెస్ట్ చేసుకుంటే మార్చేవాన్ని. ఇలా మాట్లాడి నువ్ ఇగోను టచ్ చేశావు. గెట్ అవుట్ అని రాహుల్ కోపంగా అంటాడు.
మీరు కాదు నేను చెబుతున్నాను. నేను మీతో మళ్లీ బిజినెస్ చేయను అని శ్రీకాంత్ అంటాడు. చచ్చినా ఆ అవసరం రాదు గెట్ అవుట్ అని రాహుల్ అంటాడు. అలా జరిగింది చూపిస్తారు. దాంతో సుభాష్ ఏంటిది అని నిలదీస్తాడు. రాహుల్ కవర్ చేయాలని చూస్తే.. తాతయ్యకు సారీ చెప్పమని సుభాష్ అంటాడు. ఇప్పుడు నేను సారీ చెప్పించుకునేందుకు రాలేదు. ఇంత జరిగాక కూడా నా ఫ్రెండ్‌కు ఈ విషయం చెప్పకపోతే బాగుండదని చెప్పాను. బిజినెస్ నా మనవడే చూసుకుంటున్నాడు. నా చేతుల్లో లేదని, సారీ అని సీతారామయ్య ఫ్రెండ్ అంటాడు.
నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలిరా. మా వెనుక మాకు తెలియకుండా జరుగుతున్నవి తెలిసాయి అని సీతారామయ్య అంటాడు. ఇక తనకు ఫ్లైట్ టైమ్ అవుతుందని సీతారామయ్య ఫ్రెండ్ వెళ్లిపోతాడు. దాంతో అంతా రాహుల్ వైపు కోపంగా చూస్తారు. నీకు అసలు బుద్ధుందా. కంపెనీ నీ చేతుల్లో పెడితే ఇలా చేస్తావా. నీ వల్ల కంపెనీకి ఎంత నష్టం జరిగిందో చూసావా అని రుద్రాణి డ్రామా చేస్తుంది. ఇక మీ డ్రామాలు ఆపుతారా. మేము ఎక్కడ ఏమంటామో అని నువ్వే ముందు అనేసి మా నుండి వాడిని కాపాడాలని చూస్తున్నావా అని ఇందిరాదేవి అంటుంది.
నష్టాన్ని పూడ్చలేం కదా
నామీద నమ్మకం లేదా అమ్మా. నిజంగానే వాడిని తిడుతున్నాను అని రుద్రాణి అంటుంది. తప్పు చేసిన ప్రతిసారి తిడితే ఇలా ఎందుకు తయారు అవుతాడని స్వప్న అంటుంది. తిట్టడానికి, తిట్టినట్లు నటించడానికి తేడా తెలుసోకోలేనంత చిన్నపిల్లలు ఎవరు లేరని అపర్ణ అంటే.. సరే చేసినదానికి వాడికి శిక్ష వేయండి అని రుద్రాణి అంటుంది. దాంతో రాహుల్ షాక్ అవుతాడు. శిక్ష వేసినంత మాత్రాన జరిగిన నష్టాన్ని పూడ్చలేం అని సుభాష్ అంటాడు.
సుభాష్ ఇప్పుడు నా ఫ్రెండ్ చెబితే తెలిసింది. కానీ, మనకు తెలియకుండా ఎంతమందితో ఇలా మాట్లాడాడో. ఎంతమంది వెళ్లిపోయారో. ఎంతమంది వెళ్లాలనుకుంటున్నారో అంచనా వేయగలవా. తప్పు చేశానురా. ఆరోజు కావ్య చెబుతున్న వినకుండా రాజ్‌ను కంపెనీ బాధ్యతల నుంచి తీసేసి పెద్ద తప్పు చేశానురా. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కావ్య ఆరోజు ముందుగానే హెచ్చరించింది. కానీ, నేనే బంధాలకు లొంగిపోయి ఎక్కడ కుటుంబం విడిపోతుందేమో అని ఆవేశంతో ఆ నిర్ణయం తీసుకున్నానని సీతారామయ్య అంటాడు.
కంపెనీ ఇలా నష్టాల్లోకి వెళ్లిపోతుంటే చూస్తూ ఊరుకోవడం నావల్ల కాదు. ఎవరేవమనుకున్న నాకు పర్వాలేదు. ఇక నుంచి కంపెనీ బాధ్యతలు రాజ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను అని సీతారామయ్య అంటాడు. మా మనసుల్లో కూడా అలాగే ఉందని ప్రకాశం అంటాడు. రాహుల్ కూడా కంపెనీకి వెళ్లను అన్నాడు కదా. రాజ్ కంపెనీ బాధ్యతలు తీసుకోవడమే కరెక్ట్. రాజ్ ఏమంటావ్ అని ఇందిరాదేవి అడిగితే.. రాజ్ ఒప్పుకోడు.
గుర్తుపెట్టుకుంటే చాలు
పిన్నికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నేను కంపెనీకి వెళ్లాలంటే పిన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే వెళ్తాను అని రాజ్ అంటాడు. ఎందుకు ఒప్పుకోదు. నీకు ఇష్టమే అని రాజ్‌కు చెప్పు అని ప్రకాశం అంటాడు. నేను అడిగింది ఒకే ఒక్కటి. నా కొడుక్కు న్యాయం జరగాలి. ఇంటికి రావాలి అని. దానిగురించి అందరూ మర్చిపోయారు. ఈరోజు కంపెనీ సమస్యల్లో ఉందని ఇచ్చిన మాటను మర్చిపోయారు. సరే రాజ్ ఆఫీస్‌కు వెళ్లడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, కల్యాణ్‌ను తీసుకొచ్చే బాధ్యత తనకే ఉంది. అది గుర్తుపెట్టుకుంటే చాలు అని ధాన్యలక్ష్మీ అంటుంది.
ఇక నీకు ఎలాంటి అభ్యంతరం లేదుకదా అని ప్రకాశం అంటాడు. సరే అని రాజ్ అంటాడు. రాహుల్ పైకి వెళ్తాడు. మరోవైపు మీ ఆయన అంటూ కావ్యకు కనకం విషయం చెప్పబోతుంటే తనకేం చెప్పొద్దని కావ్య అంటుంది. దాంతో మన అల్లుడు గారు ఆఫీస్‌కు వెళ్లేందుకు ఒప్పుకున్నారట. అందరూ ఒప్పుకున్నాడట. రాహుల్ ఏదో తప్పు చేశాడని రాజ్ ఒప్పుకున్నాడట అని కనకం అంటాడు. ఆయనకు మంచి చెప్పేవాళ్లందరు శత్రువులే. చేతులు కాల్చుకున్నాకా తెలుసొస్తుంది అని కావ్య అంటుంది.
దాంతో కావ్యపై సెటైర్లు వేస్తుంది కనకం. ఆఫీస్‌కు వెళ్తానని నిర్ణయం తీసుకున్నవాడు రేపు భార్యను కూడా తీసుకెళ్తాడు కదా అని కనకం అంటుంది. కొందరికి పురుషాహాంకారం నిలువెల్లా ఉంటుంది. అది ఆఫీస్‌లో చూపించరు. భార్యలపై చూపిస్తారు అని కావ్య అంటుంది. మరోవైపు రాహల్ కోపంతో ఉంటాడు. ఫీల్ అయినట్లున్నాడు అనుకుని రుద్రాణి మాట్లాడుతుంది. అసలు నాతో మాట్లాడకు రుద్రాణిపై చాలా కోపంగా ఉంటాడు రాహుల్.
పది లక్షలు లంచం ఇస్తే
సరే అలా అరిచినందుకు సారీ అని రుద్రాణి అంటుంది. నీ స్వార్థం కోసం ఇంట్లో అందరిముందు కొడుకుపై అరుస్తావా అని రాహుల్ అంటాడు. దాంతో రాహుల్ చెంప చెల్లుమనిపిస్తుంది రుద్రాణి. నేను గనుక అలా అరవకపోయి ఉంటే ఇంట్లో అందరు చివాట్లు పెట్టేవాళ్లు. అందరితో తిట్టించుకునే బదులు తల్లితో తిట్టించుకోవడం బెటర్ కదా అని రుద్రాణి అంటుంది. ఆ ముసలోడు అబద్ధం చెప్పాడు. నాకు పది లక్షలు లంచం ఇస్తే డిజైన్స్ ఎన్నిసార్లు అయిన మార్చి ఇస్తాను. ఎలాంటి ఛార్జ్ లేకుండా అని చెప్పాను అని రాహుల్ అంటాడు.
అది విన్న స్వప్న చప్పట్లు కొడుతుంది. దాంతో ఇద్దరూ షాక్ అవుతారు. వావ్ సూపర్, ఎక్సలెంట్. సొంత కంపెనీలోనే లంచం అడిగిన ప్రబుద్ధిన్ని నిన్నే చూస్తున్నాను. కనకం సింహాసనంపై కుక్కను కూర్చోబెడితే అదే బుద్ధి చూపించినట్లు.. కంపెనీకి ఎండీ అయిన లంచం అడిగావంటే.. ఛీ ఛీ.. అని స్వప్న అంటుంది. నువ్ నా కొడుకునే కుక్కతో పోలుస్తావ్ ఎంత ధైర్యం నీకు అని రుద్రాణి అంటుంది. అలా పోలిస్తే ఆ కుక్కకే అవమానం అని స్వప్న కౌంటర్ ఇస్తుంది.
రాహుల్ నువ్ లంచం అడిగినందుకు ఇంట్లో ఎవరికి చెప్పకు. నీ భార్య అయినందుకు నన్ను చీప్‌గా చూస్తారు. పైగా ఇంట్లోంచి తరిమేస్తారు. ఐదేళ్లలో ఈ ప్రపంచం చాలా మారింది. మీరిద్దరు తప్పా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మారండి అని స్వప్న అంటుంది. నువ్ చేసిన పనికి నాకే చీప్‌గా అనిపించింది. అది ఒక్కటి మాత్రం నిజం చెప్పింది. నువ్ చీప్‌గా ఇలా లంచాలకు కకృత్తి పడటం మానేసి నా కొడులా ఆలోచించటం మంచిది అని రుద్రాణి వెళ్లిపోతుంది.
గర్వంగా చెప్పుకుంటా
మరోవైపు నువ్ ఇలా చదివి పోలీస్ అయితే అందరికీ గర్వంగా చెప్పుకుంటా అని కల్యాణ్ అంటాడు. కలలు కనమన్నారు. కథలు కాదు అని అప్పు అంటుంది. తర్వాత మ్యాథ్స్, కవితలు, తెలుగుపై మాట్లాడుకుంటారు. అప్పుకు తినిపిస్తాడు కల్యాణ్. మరి కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవ్వమని కల్యాణ్ అంటాడు. అది డబ్బుతో వ్యవహారం. అది ఇప్పుడు మనవల్ల కాదు అని అప్పు అంటే.. కల్యాణ్ ఆలోచనలో పడతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.