Brahmamudi September 13th Episode: రాహుల్ రుద్రాణిపై స్వప్న డౌట్- ఒంటరిగా బతుకుతానన్న కావ్య- కోమా నుంచి బయటకొచ్చిన అపర్ణ
Brahmamudi Serial September 13th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 13వ తేది ఎపిసోడ్‌లో కావ్యను ఇంటికి తీసుకురాను రాజ్ అంటాడు. ఏం జరిగిందని ఇందిరాదేవికి కాల్ చేస్తుంది కనకం. ఏం చేయలేమని తమని క్షమించని కనకంను అడుగుతుంది ఇందిరాదేవి. కోమా నుంచి బయటకు వచ్చిన అపర్ణ కోడలి గురించి అడుగుతుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో అమ్మ చావుబతుకుల్లో ఉండేలా చేసిన మనిషిని సపోర్ట్ చేస్తున్నావ్. వద్దు. ఎవరిగురించే మన ఆప్యాయతను మర్చిపోయి మాట్లాడొద్దు. మన అన్నదమ్ముల బంధం వదులుకునేంతగా ఆవేశం పెంచుకోవద్దు. మన మధ్య దూరాన్ని పెంచే ఏ విషయమైన ఇంతటితో వదిలేస్తే మంచిదిరా. ప్రశాంతంగా వెళ్లు అని రాజ్ అంటాడు.
నేను ప్రశాంతంగా వెళ్లాలంటే నువ్వెళ్లి వదినను ఇంటికి తీసుకురావాలి అని కల్యాణ్ అంటాడు. నేను ఎప్పటికీ అలా చేయను. తను తప్పు చేసిందని ఫీల్ అయింది కాబట్టే వెళ్లిపోయింది. తప్పుని నిలదీసే మనిషి ఎందుకు పారిపోయింది అని రాజ్ అంటాడు. వదినా పారిపోలేదు. భర్తగా నువ్ నిలబడాల్సిన విధంగా, నమ్మాల్సిన విధంగా నమ్మలేదు కాబట్టి మనసు విరిగిపోయి వెళ్లిపోయింది. శ్రీమహాలక్ష్మీ వైకుంఠాన్ని వదిలి వెళ్తే.. వైకుంఠమే చీకటి అయిపోయింది. శ్రీ మహావిష్ణువే ఒంటరైపోయాడు. మనమెంత అన్నయ్య అని కల్యాణ్ అంటాడు.
ఎలా మారావ్
తన ఉనికికే భంగం కలిగితే.. అస్థిత్వానికే ఆటంకం కలిగిదే ఏ స్త్రీ ఉండలేదు. అందుకే వెళ్లిపోయింది. అది గుర్తుపెట్టుకో అన్నయ్య. అయితే నువ్ వదినను తీసుకురావా అని కల్యాణ్ అంటాడు. నేను వెళ్లమనలేదు. రమ్మనలేను. నేను ఏ తప్పు చేయలేదు. తీసుకొచ్చే ప్రసక్తే లేదు అని రాజ్ తెగేసి చెబుతాడు. ఇంత బండరాయిలా ఎలా మారావ్ అన్నయ్య. ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. అప్పుడే నీకు వదిన విలువ తెలుస్తుంది. ఆరోజు నువ్ చాలా బాధపడతావ్. నీ తప్పుకు సరిదిద్ధుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చు అని కల్యాణ్ అంటాడు.
ఆరోజు ఏరోజు రాదని రాజ్ అంటే.. అది నీ భ్రమ అన్నయ్య.. నేను వెళ్తున్నాను. గుర్తుపెట్టుకో అని కల్యాణ్ వెళ్లబోతుంటాడు. పరాయి ఇంటి నుంచి వచ్చిన ఆడదాన్ని బాగా అర్థం చేసుకున్నావ్. మరి ఈ కన్నతల్లి మనసు అర్థం చేసుకోకుండా అలాగే వెళ్లిపోతున్నావ్ అని ధాన్యలక్ష్మీ అంటుంది. వదిన ఇల్లు వదిలి వెళ్లిపోవడంలో నీ పాత్ర ఎంత అని అడుగుతాడు కల్యాణ్. దాంతో అంతా షాక్ అవుతారు. కల్యాణ్ వెళ్లిపోతాడు. అప్పుడు స్వప్న చప్పట్లు కొడుతుంది.
ఇంతసేపు అంతా మౌనంగా ఉన్నారు. కల్యాణ్ మాట్లాడిన ఒక్కో మాటకు సమాధానం చెప్పలేకపోయారు. పంతాలు వదులుకున్నావని అనుకున్నాం రాజ్. కానీ కావ్యనే వదులుకుంటావని అనుకోలేదు. నీకు మనసాక్షి, అంతరాత్మ ఉంటే కల్యాణ్ అడిగే ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉండేది. నేను వెళ్లిపోయానంటే అర్థం ఉంది. కావ్య వెళ్లిందంటే ఎన్ని అనర్థాలకు మూలం అవుతుందో మీ అమ్మగారు తిరిగి ఇంటికి వచ్చిన రోజే నీకు అర్థం అవుతుందని స్వప్న వెళ్లిపోతుంది.
మనదే రాజ్యం
మరోవైపు అనుకున్నది సక్సెస్ అయిందని రుద్రాణి, రాహుల్ సంతోషంగా డ్యాన్స్ చేస్తుంటారు. డీజే టిల్లు పాటకు అవే స్టెప్పులేస్తుంటారు. కల్యాణ్‌ను రాకుండా చేశాం, కావ్యను కూడా పంపించాం, మా వదిన ప్రాణాలకు మనమే కారణం ఎవరని తెలియదు అని రుద్రాణి అంటుంది. అత్తయ్య తిరిగి ప్రాణాలతో రాదు. దాంతో రాజ్ పిచ్చోడు అయిపోతాడు. అప్పుడు ఆస్తి గురించి పట్టించుకోడు. సో.. మనదే రాజ్యం అని రాహుల్, రుద్రాణి అంటుంటారు. ఇంతలో స్వప్న వస్తుంది.
మనదే రాజ్యం అని రాహుల్ అంటూ స్వప్నను చూసి షాక్ అవుతాడు. ఇది వినేసిందా అని రాహుల్ అంటే.. వింటే ఇది ఊరుకుంటుందా మీదకు వచ్చేది కదా అని రుద్రాణి అంటుంది. ఆపారు, బాగా చిందిలేస్తున్నారు. బాగా తాగినట్లు ఉన్నారు. తల్లీకొడుకులు కలిసి చిందిలేస్తున్నారు. అంత పెద్ద గొడవ అయింది, అపర్ణ అత్త హాస్పిటల్‌లో ఉన్నారు. అవేం పెట్టించుకోకుండా ఉన్నారు. సిగ్గులేదా. కొంచెం మనుషుల్లా ప్రవర్తించండి ఛీ.. అని స్వప్న వెళ్లిపోతుంది.
మళ్లీ తిరిగి వచ్చి అవును.. మా చెల్లెలు వెళ్లిపోయింది, అపర్ణ అత్త హాస్పిటల్‌లో ఉంటే మీరు పార్టీ చేసుకుంటున్నారేంటీ.. ఆ రెండు జరగడంలో మీ హస్తం ఏమైనా ఉందా అని డౌట్‌గా స్వప్న అడుగుతుంది. అలాంటిదేం లేదు. లాఫింగ్ గ్యాస్ ఎఫెక్ట్ వారం ఉంటుందట. ఆపుకున్నా నవ్వు వస్తుందని రుద్రాణి అంటుంది. నా చెల్లెలు వెళ్లిపోడానికి కారణం మీరే అని తెలియాలి. అప్పుడు మీ తల్లీకొడుకులకు ఇత్తడి అవుతుంది అని స్వప్న వెళ్లిపోతుంది.
మరింత సిగ్గు పడేలా
డోర్ సరిగ్గా పెట్టవా. ప్రతిసారి దాని ఎంట్రీ.. అది వినుంటే నిజంగానే ఇత్తడి అయ్యేది అని రుద్రాణి అంటుంది. మరోవైపు తుఫాను వచ్చి అంతా కొట్టుకుపోయినట్లు అనిపిస్తుందని కృష్ణమూర్తి అంటాడు. కావ్య రావడం గురించి ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఎలా సరిదిద్దాలా తెలియట్లేదు అని కనకం అంటుంది. అక్కడ ఏం జరిగిందో తెలిస్తేనే ఏమైనా చేయగలం. కానీ, మనం అక్కడికి వెళ్తే సమస్య పెద్దది కావచ్చు అని కృష్ణమూర్తి అంటాడు.
ఇలా చూస్తూ ఉండలేను అని ఇందిరాదేవికి కాల్ చేస్తుంది కనకం. మీరు చేసింది న్యాయమేనా అని అడిగితే ఏం చెప్పను బావ అని ఇందిరాదేవి అంటే.. తప్పు చేస్తే తలవంచకా తప్పదు అని సీతారామయ్య అంటాడు. ఇందిరాదేవి కాల్ లిఫ్ట్ చేయగానే కనకం నమస్కారం అంటుంది. కూతురు పుట్టింటికి వచ్చినా ఇంకా నమస్కారం చెబుతున్న నీ సంస్కారం నన్ను ఇంకా సిగ్గుపడేలా చేస్తుందని ఇందిరాదేవి అంటుంది. తప్పు చేస్తే నిలదీసే పెద్దరికి మీకుంది. అలాగే నా కూతురు తప్పు చేయదన్న నమ్మకం నాకుంది. అసలు ఏం జరిగిందో తెలియక కంగారుపడుతున్నామని కనకం అంటుంది.
అత్తింట్లో జరిగే విషయాలు పుట్టింట్లె చెప్పడం నా కూతురుకు రాలేదండని కనకం అంటుంది. దాంతో జరిగిందంతా ఇందిరాదేవి చెబుతుంది. తప్పు చేసింది నీ కూతురు కాదు కనకం. నా మనవడు అని ఇందిరాదేవి అంటుంది. కానీ, శిక్ష పడింది నా కూతురుకు. ఇప్పుడు దారి ఏంటని కనకం అడుగుతుంది. మా పెద్దరికాన్ని పక్కన పెట్టి ఎవరి నిర్ణయాన్ని వారే తీసుకున్నారు. నువ్ అడిగే ఏ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. నన్ను క్షమించు కనకం. కాలమే సమాధానం చెప్పాలి అని ఇందిరాదేవి కాల్ కట్ చేస్తుంది.
అక్క ఊరుకోదు
మరోవైపు కల్యాణ్ ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఎందుకురా అక్కడ గొడవ పెట్టుకున్నావ్. ఎవరైనా మారారా అని అప్పు అంటుంది. నన్ను అన్నందుకు కాదు. వదినా అలా వెళ్లిపోయినందుకు ఫీల్ అవుతున్నాను. తిరిగి వదినను ఇంటికి ఎలా తీసుకువెళ్లాలో తెలియట్లేదు. వాళ్ల గురించి తెలిసే నిన్ను బయటకు తీసుకొచ్చాను. వదినకు ఎలా నచ్చజెప్పాలి. అన్నయ్య రాయిలా ఉన్నాడు. తను వెళ్లి వదినను తీసుకురాడు అని కల్యాణ్ అంటాడు.
బావ వెళ్లిన కూడా మా అక్క కన్విన్స్ అవుతుందని అనుకోవట్లేదు. తను తప్పు చేయదు. చేసిన తప్పుకు అంటే ఊరుకోదని అప్పు అంటుంది. ఇలా అయితే ఎలా. ఇద్దరు విడిపోవాల్సి వస్తుందని, ఈ విషయంలో మనమే ఏదో ఒకటి చేయాలని కల్యాణ్ అంటాడు. మరోవైపు అపర్ణ దగ్గర రాజ్ ఉంటాడు. పుట్టింట్లో కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. అంతా బాధపడుతూ కనిపిస్తారు. రుద్రాణి, రాహుల్ సంతోషంగా ఉంటారు. బ్యాక్ గ్రౌండ్‌లో ఓ పాట ప్లే అవుతుంది.
రోజులు గడుస్తూ ఉంటాయి. కట్ చేస్తే రాజ్‌తో ఇందిరాదేవి మాట్లాడుతుంది. మీ అమ్మ కోమా నుంచి ఎప్పుడు బయటపడుతుందో తెలియదు. మీ తాతయ్య కుమిలిపోతున్నాడు. ఇవన్ని చూడటానికారా మేము బతికున్నాం. అపర్ణకు అలా జరగడం విధి. కావ్య కారణం కాదు. నిందలు వేసి వెళ్లేలా చేశావ్. నీ కోపాలు, తాపాలు అన్ని నీ భార్య భరించింది. నువ్ మాత్రం ఈ ఒక్క పొరపాటు క్షమించలేవా. ఒక వారసుడు ఇంట్లోంచి వెళ్లిపోయాడు. మహాలక్ష్మిలాంటి పెద్ద కోడలు ఆస్పత్రిలో ఉంది. మరో వారసుడు కాపురం ముక్కలు చేసుకోవాలనుకుంటున్నాడు అని ఇందిరాదేవి అంటుంది.
కావ్య ఎక్కడ
మా అమ్మకు ఇలా జరగడానికి కారణమైన దాన్ని నేను తీసుకురాను. వస్తే ఊరుకోను అని రాజ్ అంటాడు. మరోవైపు ఆయన మనసులో నాకు స్థానం దొరకలేదు. అలాంటప్పుడు నేను అక్కడ ఉండి ప్రయోజనం ఏంటీ. ఒంటరిగా జీవించాలని నిర్ణయించుకున్నాను అని అప్పుతో కావ్య అంటుంది. తర్వాత కోమా నుంచి బయటకు వచ్చిన అపర్ణ కావ్య ఎక్కడ అని అడుగుతుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు.