Brahmamudi September 12th Episode: బ్రహ్మముడి- పుట్టింటికి కావ్య- రాజ్‌ను ఏకిపారేసిన కల్యాణ్- ప్రతి మాట ఒక్కో డైమండ్-brahmamudi serial september 12th episode raj kalyan dispute kavya went kanakam home for ever brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi September 12th Episode: బ్రహ్మముడి- పుట్టింటికి కావ్య- రాజ్‌ను ఏకిపారేసిన కల్యాణ్- ప్రతి మాట ఒక్కో డైమండ్

Brahmamudi September 12th Episode: బ్రహ్మముడి- పుట్టింటికి కావ్య- రాజ్‌ను ఏకిపారేసిన కల్యాణ్- ప్రతి మాట ఒక్కో డైమండ్

Sanjiv Kumar HT Telugu
Sep 12, 2024 07:45 AM IST

Brahmamudi Serial September 12th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 12వ తేది ఎపిసోడ్‌లో రాజ్ అన్న మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటూ పుట్టింటికి వెళ్తుంది కావ్య. కూతురుని గుండెలకు హత్తుకుని ఇంట్లోకి తీసుకెళ్తుంది కనకం. మరోవైపు రాజ్‌ను నిలదీసిన కల్యాణ్ ఇంటిల్లిపాది ఏకిపారేస్తాడు.

బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 12వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 12వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో రాజ్ అన్న మాటలకు కావ్య గుండె ముక్కలవుతుంది. ఏమి లేని ఇంట్లో ఎవరు లేనిదానిగా ఉండటం కన్నా.. నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మర్యాదగా నేను వెళ్లిపోవడమే నాకు మంచిది.. మీకు మంచిది అని కావ్య అంటుంది. దాంతో అంతా బాధపడతారు.

చీరలు లాగడమేనా

దీంతో ఈ ఇంట్లో మీ భార్యగా నా పాత్ర ముగిసిపోయింది. ఇక సెలవు అని చేతులతో నమస్కరిస్తుంది కావ్య. అనుకున్నది సాధించినట్లుగా రుద్రాణి గర్వంగా చూస్తుంది. రాజ్‌ను చూస్తూ ఇంట్లోంచి వెళ్లిపోతుంది కావ్య. స్వప్న, ఇందిరాదేవి ఆపిన ఆగదు. ఏంటీ బావ మనవరాలు వెళ్లిపోతుంది. ఎందుకు ఆపడం లేదు అని ఇందిరాదేవి అడుగుతుంది. వస్త్రాపహరణం అంటే.. చీరలు లాగడమేనా చిట్టీ.. ఒక స్త్రీ ఆత్మగౌరవాన్ని పదిమందిలో దెబ్బతీయడం కాదా.. అది చూస్తూ దృతరాష్టుడుని అయిపోయాను. ఏం మాట్లాడని లేని స్థితిలో మిగిలిపోయాను అని సీతారామయ్య అంటాడు.

గుమ్మం దగ్గర స్వప్న, సుభాష్ ఆపుతారు. అత్తింటి గడపకు ఇదే నా కడసారి వీడ్కోలు అని చెప్పి కాలు బయటపెడుతుంది కావ్య. తొలిసారి అడుగుపెట్టింది గుర్తు చేసుకుంటూ ముందుకు బాధగా కదిలిపోతుంది. రాజ్ మాత్రం కోపంగా అలా చూస్తూనే ఉంటాడు. సుభాష్ వచ్చి మాట్లాడదమని చూస్తే వెంటనే పైకి తన గదిలోకి వెళ్తాడు. పైనుంచి కావ్యను బాధగా, కోపంగా చూస్తూ ఉంటాడు. గేట్ బయట చివరిగా ఇల్లు చూసుకుని వెళ్లిపోతుంది కావ్య.

పుట్టింటికి నడుచుకుంటూ వెళ్తుంది కావ్య. మరోవైపు కావ్య వెళ్లిపోయిన విషయం తెలిసి కల్యాణ్ షాక్ అవుతాడు. పుట్టించి మెట్లపై కూర్చుని రాజ్ అన్న మాటలు తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది కావ్య. మా అమ్మ కూడా చెప్పడం వల్ల నీతో బలవంతంగా కాపురం చేశాను అని రాజ్ అన్న మాటలు గుర్తు చేసుకుని కుమిలిపోతుంది. మెట్లపై కావ్యను చూసి కనకం షాక్ అవుతుంది. ఏమైందని, ఒంటరిగా వచ్చావని కనకం, కృష్ణమూర్తి అడుగుతారు.

గుండెలకు హత్తుకున్న కనకం

ముందు లోపలికి రమ్మంటుంది కనకం. నేను ఇంట్లోకి రావాలంటే మీ అనుమతి కావాలి. నేను పండగకో పబ్బానికో రాలేదు. నేను అత్తింటి గడప దాటి వచ్చాను. నాకు ఇంకో దారిలేదు. మీ కూతురు పుట్టెడు దుఖాన్ని గుండెల్లో దాచుకుని పుట్టింటికి వచ్చిందమ్మా. నేనుండటానికి కాస్తా చోటు ఇస్తారా.. కాస్తా అన్నముద్ద పెడతారా అని కావ్య అడుగుతుంది. దాంతో కన్నీరుమున్నీరు అయి కూతురుని గుండెలకు హత్తుకుంటుంది కనకం.

పరాయిదానిలా అడుగుతున్నావ్. ఇది నీ ఇల్లు అమ్మ అని కృష్ణమూర్తి అంటాడు. పుట్టిపెరిగినంత మాత్రనా నా ఇల్లు అవుతుంది. పెళ్లి చేసి పంపించారు. అత్తారిల్లే నా ఇల్లు. కానీ, ఇప్పుడు అది కూడా వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. అందుకే మిమ్మల్ని ఆశ్రయం కోరి వచ్చాను అని కావ్య అంటుంది. మేము నిన్ను అమ్ముకోలేదు. నీకు ఎంతో కష్టం రాకపోతే ఆ ఇల్లు వదిలి వస్తావో మాకు తెలుసమ్మా అని కనకం అంటాడు. ఇది పేరుకే నా ఇల్లు. కానీ, దీన్ని నిలబెట్టింది నువ్వే. ఇల్లుమీద నాకంటే నీకే ఎక్కువ ఉంది అని కృష్ణమూర్తి అంటాడు.

కావ్యను ఇంట్లోకి తీసుకెళ్తారు. విషయం తెలుసుకున్న కల్యాణ్ ఇంటికి వచ్చి అన్నయ్య అని గట్టిగా అరుస్తాడు. అన్నయ్య బయటకు రా అని గట్టిగా అరుస్తాడు. దాంతో ఏమైందని ధాన్యలక్ష్మీ, ప్రకాశం అడుగుతారు. రాజ్ వస్తాడు. పైన ఉంటాడు. మహారాజులా పైన ఉండటం కాదు. కిందకు రా అని కల్యాణ్ అంటే.. ఏం కావాలి నీకు అని రాజ్ అంటాడు. ఏం ఇవ్వగలవు. ఏముంది నీ దగ్గర అని కల్యాణ్ అంటాడు. సరే నీ దగ్గర ఏముందని రాజ్ ఎదురు ప్రశ్నిస్తాడు.

తల దించుకుని మాట్లాడుతున్నావ్

నా దగ్గర నా భార్య ఉంది. మీ దగ్గర నీ భార్య ఉందా.. అని కల్యాణ్ అంటాడు. రాజీ కుదర్చడానికి వచ్చావా.. రాయబారానికి వచ్చావా అని రాజ్ అంటే.. పైనుండి మాట్లాడేసరికి ఎత్తులో ఉండి మాట్లాడుతున్నావ్ అనుకుంటున్నావేమో.. తల దించుకుని మాట్లాడుతున్నావ్. నేను తలెత్తుకుని మాట్లాడుతున్నాను అని కల్యాణ్ అంటాడు. దాంతో రాజ్ షాక్ అవుతాడు. కాబట్టి, ఇప్పటికైనా దిగిరాక తప్పదు. దిగిరా అన్నయ్య అని కల్యాణ్ అనడంతో రాజ్ కిందకు వస్తాడు.

ఆమె వచ్చి గోడు చెప్పుకుందా అని రాజ్ అంటే.. ఎవరికీ చెప్పుకుంది. చెప్పుకుంటే ఇక్కడే కౌరవ సభలో చెప్పుకునేది కదా. నువ్ చెప్పు ఎందుకు వదినను అవమానించావ్. వెళ్తుండగా ఎందుకు ఆపలేదు గట్టిగా నిలదీస్తాడు కల్యాణ్. చెప్పినవాళ్లు దానికి కారణం చెప్పలేదా అని రాజ్ అంటే.. కారణం వెనుక అకారణమైన నింద కనపడుతుంది. ఆ కారణం వెనుక దారుణంగా అవమానించడమే తెలుస్తుంది. ఆమె గుండెకు ఎంత గాయం కాకపోతే, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే.. అత్తింటి గడపదాటి వెళ్తుంది. ఒక్కసారి అయినా ఆలోచించావా అని కల్యాణ్ అంటాడు.

ఈ ఇంటిని, కుటుంబాన్ని కాదనుకుని వెళ్లిపోయినదాన్ని పట్టించుకోవాలనుకోవట్లేదు అని రాజ్ అంటాడు. నేను కూడా అలాగే వెళ్లిపోయాను. మరి నన్నెందుకు పట్టించకున్నావ్. నన్ను ఇంటికి తీసుకురావడానికి అన్నిసార్లు ఎందుకు ప్రయత్నించావ్. ఎందుకంటే నేను నీ రక్తసంబంధం ఉన్న తమ్ముడుని కాబట్టి. కానీ, వదినా బయటి నుంచి వచ్చిందనా. ఏంటీ అన్యాయం అని నిలదీస్తాడు కల్యాణ్. నీలో నేను గురువును చూశాను, ఏకలవ్య శిష్యుడిగా మారాను. నీ వ్యక్తిత్వం చూశాను, సంస్కారం చూశాను. ఇప్పుడు అవన్నీ ఏమైపోయాయి అని కల్యాణ్ అంటాడు.

పూర్తిగా తెలుసుకునే వచ్చావా

నిన్ను నమ్మి వచ్చిన ఇల్లాలిని చీకట్లోకి పంపేవరకు దిగజారిపోయిందా నీ ఔన్నత్యం అని కల్యాణ్ అంటే.. ఇందిరాదేవి అడ్డుకుంటుంది. మీరు మాట్లాడకండి. అసలు మీకు మాట్లాడే అర్హతే లేదు అని ఇందిరాదేవిని కూడా అంటాడు కల్యాణ్. తల్లిగా నాకు మాట్లాడే హక్కు లేదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. అసలు నీకు తల్లి అనిపించుకునే హక్కే లేదని కల్యాణ్ అనడంతో షాక్ అవుతుంది ధాన్యలక్ష్మీ. నువ్ అసలు పూర్తిగా తెలుసుకునే వచ్చావా అని రాజ్ అడుగుతాడు.

మా వదిన గురించి కొత్తగా ఏం తెలుసుకోవాలి. అమ్మని.. నువ్ అమ్మవని ఏ దేవుడు సర్టిఫికెట్ ఇవ్వాలి. గాలిని రూపం చూపించమని అడగకూడదు. అది విశ్వరూపంతో విజృంభిస్తే ఇలాంటి భవనాలు కుప్పకూలిపోయాయని తెలుసా నీకు అని కల్యాణ్ అంటాడు. తన గొప్పలు నా ముందు చెప్పొద్దు. వెళ్లి వాటితో కవితలు రాసుకుని అచ్చు వేయించుకో పో అని రాజ్ అంటాడు. నేను మగాడిని, మొగుడుని అనే పురుషహంకారం ఎప్పుడు ప్రవేశించింది. వదిన పేరు ఎత్తితే పూచికపుల్లలా తీసిపారేస్తున్నావ్ అని కల్యాణ్ అంటాడు.

ఆమె సహనాన్ని చూడలేదు. అందరిని ఆదరించే మనసు చూడలేదా అని కల్యాణ్ అంటే.. అన్నిటితోపాటు ఆమె నిర్లక్ష్యాన్ని కూడా చూశానురా. ఆ నిర్లక్ష్యం ఖరీదు మా అమ్మ నిండుప్రాణం అని తెలుసుకున్నాను. అలాంటి నిర్లక్ష్యాన్ని నేను ఎప్పటికీ సహించను. మా అమ్మకు ఏదైనా అయితే జీవితంలో కన్నెత్తి చూడను అని రాజ్ అంటాడు. నువ్ కారణం విన్నావా.. వింటే నమ్మావా.. పట్టించుకున్నావా.. లేదా ఆ మందర (రుద్రాణి) మాటలు నమ్మావా.. లేక ఈ కైకేయి (ధాన్యలక్ష్మీ) మాట నమ్మావా అని కల్యాణ్ అంటాడు.

చావుబతుకుల్లో ఉంటే

తప్పును తప్పు అని ఎత్తిచూపే స్థాయి నుంచి తప్పు చేసే స్థాయికి ఎప్పుడు దిగజారిపోయావ్ అన్నయ్య నువ్వు అని కల్యాణ్ అంటే.. రాజ్ కోప్పడతాడు. కవిత్వం వేరు వాస్తవికం వేరు. అయితే ఇలాగే ప్రవరిస్తావా. ఇలాగే వదిలేస్తావా.. ఇంత మూర్ఖంగా అని కల్యాణ్ అంటుంటే.. ప్రకాశం అడ్డుకుంటాడు. నువ్ మాట్లాడేది అన్నయ్యతో అని గుర్తుపెట్టుకో అని ప్రకాశం అంటాడు. సారీ అన్నయ్య అని కల్యాణ్ అంటే.. నువ్ మూర్ఖత్వం పదాన్ని రకరకాల పదాల్లో పొందుపర్చావ్. పర్లేదు. మనం ఒకతల్లికి పుట్టకపోయినా.. ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ములకు పుట్టాం అని రాజ్ అంటాడు.

అయినా, సొంత అన్నదమ్ముల్లా, అరమరికలు లేకుండా పెరిగాం. మా అమ్మను అమ్మలాగే చూశావ్. అలాంటిది ఇవాళ అమ్మ చావుబతుకుల్లో ఉంటే.. దానికి కారణమైన మనిషిని వెనకేసుకొస్తూ నా రక్త సంబంధాన్ని పట్టించుకోవట్లేదు. ఆ మనిషికే సపోర్ట్ చేస్తూ నన్ను తప్పు పడుతున్నావ్ అని రాజ్ బాధగా అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.