Brahmamudi September 18th Episode: రుద్రాణిని బురిడీ కొట్టించిన స్వప్న.. కావ్యను బతిమిలాడిన రాజ్.. ఇచ్చిపడేసిన కళావతి-brahmamudi serial september 18th episode raj kavya heated clash rudrani plan failed by swapna brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi September 18th Episode: రుద్రాణిని బురిడీ కొట్టించిన స్వప్న.. కావ్యను బతిమిలాడిన రాజ్.. ఇచ్చిపడేసిన కళావతి

Brahmamudi September 18th Episode: రుద్రాణిని బురిడీ కొట్టించిన స్వప్న.. కావ్యను బతిమిలాడిన రాజ్.. ఇచ్చిపడేసిన కళావతి

Sanjiv Kumar HT Telugu
Sep 18, 2024 07:45 AM IST

Brahmamudi Serial September 18th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 18వ తేది ఎపిసోడ్‌లో కావ్యను రాజ్ తీసుకురాకుండా ఉండేందుకు రాహుల్‌తో కలిసి రుద్రాణి ప్లాన్ చేస్తుంది. స్వప్న ద్వారా కావ్య రాకుండా చేద్దామనుకుంటుంది. కానీ, స్వప్న వాళ్లను బురిడీ కొట్టిస్తుంది. కావ్యను రాజ్ బతిమిలాడుతాడు.

బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 18వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 18వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో కావ్యతో మాట్లాడిన సీతారామయ్య, ఇందిరాదేవి దుగ్గిరాల ఇంటికి వస్తారు. కావ్య రాకపోవడంతో రుద్రాణి సంతోషిస్తుంది. నేను చెప్పాను కదా కావ్య రాదని, ఏదో పొడిచేస్తామని ఇద్దరూ వెళ్లారు అని రాహుల్‌తో అంటుంది రుద్రాణి. మీ మహారాణి, మనవరాలు కళవాతి ఎక్కడ అని రాజ్ వెటకారంగా అంటాడు.

రాజ్‌ను ఆపమని కావ్య ఎక్కడని అపర్ణ అడుగుతుంది. రానని చెప్పిందని సీతారామయ్య అంటాడు. తను రాదని నేను చెప్పానా. మీరు వెళ్తే ఇలాగే అవమానంతో తిరిగి వస్తారని, మీరేళ్లి ఏం సాధించారు. మీ పెద్దరికం తక్కువ చేసుకోవడం తప్పా అని రాజ్ అంటాడు. అవునురా.. మా పెద్దరికి కావ్య ఇంటి ముందు నిలుచుంది. కానీ, దానికి కారణం నువ్వు కాదా. మీరు వెళ్తే రాదని అపర్ణ చెప్పిన ఒక చిన్న ఆశ ఉండేది. కానీ, అక్కడికి వెళ్లాకే అర్థమైంది తన మనసు గాయమైందో అని ఇందిరాదేవి అంటుంది.

అడుక్కుంటావో తెలియదు

అర్థమైందిగా ఇక ఆ ఇంటికి వెళ్లడం మానేయండి అని రాజ్ అంటాడు. మేము మానేస్తాం. కానీ, కావ్య ఇంటికి వెళ్లాల్సింది నువ్వు అని సీతారామయ్య అంటాడు. దాంతో షాక్ అయిన రాజ్ అది మాత్రం జరగదంటాడు. వెళ్లి తీరాలి. తనను అవమానించి, మనసు గాయం చేసి వెళ్లగొట్టావ్. నువ్వే తీసుకురావాలి. వెళ్లి బతిమిలాడుతావా. అడుక్కుంటావో మాకు తెలియదు అని ఇందిరాదేవి అంటుంది. వీళ్లందరూ రెచ్చగొట్టి కావ్యను తీసుకొచ్చేలా చేస్తున్నారు. ఆపాలి అని రుద్రాణి అనుకుంటుంది.

ఏంటమ్మా ఇది.. తప్పు చేసింది కావ్య. ఎందుకు తప్పు చేశావని అడిగితే చెప్పలేక వెళ్లిపోయింది కావ్య. ఆ మనిషిని వెళ్లి పిలవాలా అని రుద్రాణి అంటుంది. అత్తయ్య.. కావ్య తప్పు చేయదని అందరికీ తెలుసు. అపర్ణ ఆంటీ లేని టైమ్ చూసి నువ్వు అడ్డంగా రెచ్చిపోయావ్. కానీ, ఇప్పుడు అది జరగదు అని స్వప్న అంటుంది. అది నా కొడుకు మీద నిందలు వేసిందని రుద్రాణి అంటుంది. నువ్ ఏం చెప్పినా కావ్య చేసింది తప్పే అని రుద్రాణి అంటుంది.

ఎప్పుడు ఏదో ఒక గొడవ పెట్టి కావ్యపై పడతావేంటీ. కలిపే ఉద్దేశమే నీకు లేదా అని సుభాష్ అంటాడు. అలా అయితే మొగుడుని ఎందుకు వదిలేస్తుందని స్వప్న అంటుంది. స్వప్న అని రుద్రాణి గట్టిగా అరుస్తుంది. నువ్ డైనోసర్‌లా అరిచావనుకుంటున్నావేమో.. డాంకీని కూడా మ్యాచ్ చేయలేకపోయావ్. నీ అరుపులకు నేను భయపడను అని స్వప్న అంటుంది. నువ్విప్పుడు వెళ్లి కావ్యను తీసుకురావాలి అంతే అని ఇందిరాదేవి అంటుంది.

నన్ను వదిలేయండి

ఇప్పుడు ఆవిడగారి కాళ్లు పట్టుకుని తప్పైందని అడగాలా అని రాజ్ అంటాడు. అడిగినా తప్పులేదు. మీ మగవారికి ఆడదాని మనసు ముక్కలు చేయడమే తెలుసు. కానీ, అతికించడం తెలియదని అపర్ణ అంటుంది. సరే మమ్మీ.. నేను వెళ్లి కాళ్లు పట్టుకుని అడుగుతాను. కానీ, ఆవిడగారు రాకపోతే నన్ను వదిలేయండి. మళ్లీ ప్రయత్నించమని అడగకండి. మీరు అడగమన్నట్టే అడుగుతా అని రాజ్ వెళ్తాడు. ఏంటీ ఇలా జరిగిందని రాహుల్ అడుగుతాడు.

ఇప్పుడు ఆ కావ్య వస్తుందని రాహుల్ అంటాడు. అదే నాకు అర్థం కావట్లేదు. రాజ్‌ను ఆపుదామనుకుంటే స్వప్న అడొచ్చింది అని రుద్రాణి అంటుంది. అది శకునికి ఎక్కువ.. సైంధవుడికి తక్కువ అన్నట్లుగా తయారైంది. ప్రతి విషయంలోను అడ్డుపడుతుంది అని రాహుల్ అంటాడు. దాని ద్వారానే కావ్య ఇంట్లోకి రాకుండా చేయాలి అని రుద్రాణి అంటుంది. ఇంతలో స్వప్న వస్తే.. నేను చెప్పినట్లు చేయమని రాహుల్‌తో అంటుంది రుద్రాణి.

స్వప్న వినేలా మాట్లాడుతుంది రుద్రాణి. నేను చెప్పింది ఎవరు వినట్లేదు. ఇప్పుడు వదినా ఆరోగ్యం అంతంతమాత్రమే. ఇప్పుడు కావ్య వస్తే ఏదో ఒక గొడవ జరుగుతుంది. అది పెద్దది అవుతుంది. అప్పుడు వదినకు ఏమైనా జరిగితే కావ్యకు రాజ్ విడాకులు ఇస్తాడు. అందుకే ఇప్పుడే కావ్య రావొద్దని చెప్పాను. వదినా ఆరోగ్యం కుదుటపడ్డాకా వస్తే మంచిది కదా అని రుద్రాణి అంటుంది. అది విని స్వప్న వెళ్లిపోతుంది. కావ్యకు కాల్ చేస్తుంది.

ఒక్కసారి మోసపోతాను

అది రుద్రాణి, రాహుల్ వింటారు. రాజ్ ఇప్పుడు ఇంటికి వస్తున్నాడు. నువ్ ఎంత పిలిచినా రావొద్దు అని స్వప్న అంటుంది. దాంతో ప్లాన్ సక్సెస్ అనుకుంటారు రుద్రాణి, రాహుల్. నువ్ ఇప్పుడు వస్తే మా రుద్రాణి అనుకున్న ప్లాన్స్ ఏవి పనిచేయవు. ఎందుకుంటే వాళ్లు చెప్పిన మాటలు నమ్మేసి నీకు ఇలా ఫోన్ చేస్తున్నాను అని భ్రమ పడుతున్నారు అని కాల్ కట్ చేసి రుద్రాణి వాళ్లవైపు వస్తుంది స్వప్న. నేను ఇలాగే మాట్లాడాలని కోరుకున్నారు కదా. మీరు ఆడే డ్రామాలకు ఒక్కసారి మోసపోతాను. అన్నిసార్లు కాదు అని స్వప్న అంటుంది.

నా చెల్లి ఇంటికి వస్తుంది. దాన్ని ఎవరు మార్చలేరని చెప్పి స్వప్న వెళ్లిపోతుంది. అలా రాహుల్, రుద్రాణి బురిడీ కొట్టిస్తుంది స్వప్న. మరోవైపు కనకం ఇంటికి రాజ్ వస్తాడు. అది చూసి కనకం, కృష్ణమూర్తి సంతోషిస్తారు. రండి లోపలికి వచ్చి కూర్చోండి అని కనకం అంటుంది. మా ఇంటి మహాలక్ష్మీ మీ ఇంటికి వెకేషన్‌కు వచ్చింది. ఎక్కడ సేదతీరుతుంది అని రాజ్ అంటాడు. రండి కూర్చోండి అని కృష్ణమూర్తి అంటాడు. వద్దు మావయ్య గారు. ఆ దృశ్యం మీరు చూస్తే నాకు అవమానంగా ఉంటుంది కదా అని రాజ్ అంటాడు.

ఇంతలో కావ్య వస్తుంది. రాజ్, కావ్య ఇద్దరూ చూసుకుంటారు. కావ్య సైలెంట్‌గా వెళ్లి బొమ్మలకు రంగు వేస్తుంది. ఇదేదో తేడాగా ఉందయ్యా.. తీసుకెళ్తారో.. తిట్టేసి వెళ్తారో అని కనకం అంటే.. అది వాళ్లిద్దరే చూసుకంటారు పదా అని లోపలికి వెళ్లిపోతారు. రాజ్ వచ్చినట్లు సౌండ్ చేస్తాడు. కానీ, కావ్య పట్టించుకోదు. ఏంటీ నేనొస్తే పట్టించుకోకుండా పని చేసుకుంటున్నావ్ అని రాజ్ అంటే.. కావ్య సెటైర్లు వేస్తుంది. ఏం కావాలి అని కావ్య అడిగితే.. రా.. మా ఇంటికి అని రాజ్ అంటాడు.

అగ్గిపెట్టే ఇచ్చి

అయ్యో మీ ఇంటికి ఎందుకు ఉండగా.. మా ఇల్లు ఉండగా అని కావ్య అంటుంది. మా అమ్మ తీసుకురమ్మంది. మా ఇంట్లో చీకటిగా ఉందటా. నువ్ వచ్చి దీపం పెట్టాలట అని రాజ్ అంటాడు. దీపం పెట్టడానికి ఇంకో ఆప్షన్ వెతుక్కోండి. మీరు ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకుని, ఎవరి బలవంతం లేకుండా బూతు బంగ్లాకు తీసుకుని వెళ్లి శోభనం చేసుకుని తెల్లవారే అగ్గిపెట్టే చేతికి ఇచ్చి దీపం పెట్టమనండి. వెళ్లండి అని కావ్య రివేంజ్ తీసుుకుంటుంది.

నువ్ కోరుకుంటున్నట్లే వచ్చాను కదా. నీ కాళ్లు పట్టుకుని బతిమిలాడుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ.. క్షమించమని అడిగి అగ్గిపెట్టే చేతికి ఇచ్చి ఇంట్లో దీపం పెట్టమని అడుక్కోడానికే వచ్చాను అని రాజ్ అంటాడు. మీ అమ్మ చెబితే వచ్చారా.. నానమ్మ తాతయ్య బలవంతం చేస్తే వచ్చారా అని కావ్య అంటే.. ఎందుకో ఒకందుకు వచ్చి చచ్చానుగా అని రాజ్ అంటాడు. చచ్చే వచ్చాను. మళ్లీ వచ్చి చచ్చేంత ఓపిక నాకు లేదు అని కావ్య అంటుంది.

అలా అంటే ఎలా. మా దుగ్గిరాల ఇంటి పరువు ఏం కావాలి. ఎవరొచ్చి ఉద్దరించాలి. నువ్ లోపలికి వస్తేనే.. మహాలక్ష్మీ వస్తుందంట. మీరు రాకుంటే కాళ్లు పట్టుకోడానికైనా రెడీగా ఉన్నాను. ఎందుకంటే అంతకష్టపడి మా అమ్మను కాపాడుకుని వేస్ట్ అవుతుంది, మా నానమ్మ, తాతయ్య మాటలు పెడ చెవినా పెట్టినవాన్ని అవుతాను కదా అని రాజ్ అంటాడు. అంతేతప్పా మీరన్న మాటలు వెనుకకి తీసుకోడానికి కాదన్నమాట, ఆ మాటలు ఆవేశంగా అనలేదన్నమాట, నిజంగానే నాతో బలవంతంగా కాపురం చేశారన్నమాట అని కావ్య అంటుంది.

దయచేయండి

మీలాంటి ఉదారమైన మనుసు ఉన్న మీకు నా బదులు ఈ బొమ్మను ఇస్తాను. దీంతో బలవంతంగా కాపురం చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోంచి వెళ్లిపోతే కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదు. కాళ్లు విరగొట్టి మూలన పడేస్తే చాలు అని కావ్య అంటుంది. నేను వచ్చి అడుక్కున్న నా మొహం మీద రానని చెబుతావని అనుకున్నా అని రాజ్ అంటే.. మీకు చాలా బాగా తెలుస్తున్నాయే అన్ని మొహంమీదే. విజ్ఞాన ప్రదర్శన ఆపి దయచేయండి అని కావ్య అంటుంది.

నీ అసలు స్వరూపం ఇదని ఇంట్లోవాళ్లకు తెలియక.. నేను పిలిస్తే నువ్ వస్తావని ఆశపడ్డారు. ఇంటికెళ్లి ఏం చెప్పాలి అని రాజ్ అంటాడు. మీకు నిజంగా దమ్ముంటే, అంతరాత్మ ఉంటే, మనసాక్షే ఉంటే ఇక్కడ చెప్పిన మాటలే యథాతధంగా చెప్పండి అని కావ్య అంటుంది. ఫోన్ ఇస్తాను మా అమ్మకు చెప్పు రావట్లేదని అని రాజ్ అంటే.. నేనేందుకు చెబుతాను. మీకు దమ్ములేదని ఒప్పుకోండి. మీ అంతరాత్మను చంపేశానను ఒప్పుకోండని కావ్య అంటుంది.

ఇప్పుడు అమ్మకు ఏం చెప్పను అని రాజ్ అంటే.. అది మీ ప్రాబ్లమ్. ఐనో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని కావ్య అంటుంది. ఎందుకే నీకింత పొగరు అని రాజ్ అంటే.. హోల్డ్ యువర్ టంగ్. రావే పోవే అంటే పడటానికి నేను ఇప్పుడు మీ పెళ్లాన్ని కాదు. మీకు నాకు ఏ సంబంధం లేదు అని కావ్య ఇచ్చిపడేస్తుంది. దాంతో రాజ్ షాక్ అయి ఏ సంబంధం లేదా అని అంటాడు. అది మీరు చెప్పిందే మహాశయ. మీరు ఇష్టపడకుండా ప్రేమించకా ఏ సంబంధం ఉందని ఇంతదూరం వచ్చారు అని కావ్య అంటుంది.

ఇదొక్కటే నిర్ణయం

మా మగవారి మాటలు మాటలుగానే ఉంటాయి. కానీ, మీ ఆడవారి చేతులకు వెళ్లగానే బాణాల్లా వదులుతారు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తే ఇంటికి వస్తావ్ అని రాజ్ అడుగుతాడు. మీరు మా ఇంటి ముందు తలకిందులు తపస్సు చేసినా సరే నేను ఈ జీవితంలో మీ ఇంటిగడప తొక్కను. తిరిగి వచ్చే ఆలోచన ఉంటే.. ఆ ఇంటి గడపే దాటను. ఆఖరు, మొదటి అంటూ లేదు ఇదొక్కటే నిర్ణయం అని కావ్య తెగేసి చెబుతుంది.