Brahmamudi August 28th Episode: రుద్రాణి చెంపచెల్లుమనిపించిన ధాన్యలక్ష్మీ- కావ్య రాజ్ కామకేళి- భర్తను పట్టించిన స్వప్న
Brahmamudi Serial August 28th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 28వ తేది ఎపిసోడ్‌లో లాఫింగ్ గ్యాస్ బెలూన్లు పగులగొట్టిన రుద్రాణి, రాహుల్ నవ్వుతూనే ఉంటారు. మీపై లాఫింగ్ రివేంజ్ తీసుకున్న అని స్వప్న చెబుతుంది. మరోవైపు తల్లిదండ్రులకు సెనగల టిఫిన్ చేసి ఇస్తుంది అప్పు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో హ్యాపీ బర్త్ డే మమ్మీ అంటూ స్వప్న అరేంజ్ చేసిన లాఫింగ్ గ్యాస్ బెలూన్‌ను పగులగొడతాడు రాహుల్. దాంతో ఇద్దరూ తెగ నవ్వుకుంటారు. మళ్లీ హ్యాపీ బర్త్ డే అని రాహుల్ చెబుతాడు. నీ బొంద ఇవాళ నా బర్త్ డే కాదు. ఎవరో బర్త్ డేకి నా రూమ్‌లో బెలూన్స్ ఉన్నాయి అని రుద్రాణి నవ్వుకుంటూ అంటుంది. ఇద్దరూ అలా నవ్వుతూనే ఉంటారు.
నవ్వి నవ్వి చావాలి
ఎందుకు నవ్వుతున్నాం. నాకు తెలియకుండానే నవ్వోస్తోందని ఇద్దరూ అనుకుంటారు. అదంతా చూస్తూ స్వప్న నవ్వుతుంది. కల్యాణ్ వెళ్లిపోయాడు కదా. అందుకే ఆనందంలో నవ్వుతున్నాం అని బెలూన్స్‌ను అన్నింటిని ఒక్కొక్కటిగా పగులగొడుతుంటారు. నా చెల్లెలిని ఏడిపిస్తారా. అసలు విషయం ఆ బెలూన్‌లో ఉంది. ఇలాగే ఇవాళ అంతా నవ్వి చావండి అని స్వప్న అంటుంది. అరేయ్ రాహుల్ నవ్వి నవ్వి చచ్చేలా ఉన్నాం బయటకు పోదాం అని రుద్రాణి అంటుంది.
ఇద్దరూ కష్టంగా బయటకు వెళ్లిపోతారు. ధాన్యలక్ష్మీని చూసి పాపం పిచ్చిది నేను చెప్పిన మాటలు నమ్మి కొడుకును దూరం చేసుకుంది అని రుద్రాణి అంటుంది. నువ్ ఈ ఇంటికి పట్టిన దరిద్రం అని తెలియదు అని రాహుల్ అంటాడు. తర్వాత ఇద్దరూ వెళ్లి ధాన్యలక్ష్మీ దగ్గరికి వెళ్లి నవ్వుతూ ఉంటారు. నేను ఇంత బాధలో ఉంటే మీకెల నవ్వోస్తుంది అని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. మేము చాలా బాధపడుతున్నాం. దయనీయ పరిస్థితి చూసి జాలి పడుతున్నాం అని నవ్వుతూనే రుద్రాణి, రాహుల్ అంటారు.
కల్యాణ్‌ను ఇంటికి అప్పు రానియ్యదు. అప్పును చిన్నత్త కోడలిగా ఒప్పుకోదు అని రాహుల్ అంటాడు. నీ పరిస్థితి చూస్తుంటచే బాధగా ఉందని రుద్రాణి అంటుంది. ఇలాగే ఇద్దరూ నవ్వడంతో ఇరిటేట్ అయిన ధాన్యలక్ష్మీ రుద్రాణి చెంప పగులగొడుతుంది. దాంతో రుద్రాణి షాక్ అయిన మళ్లీ వెంటనే ఇంకా ఎక్కువగా నవ్వుతుంది. సాటి మనిషి బాధలో ఉంటే జాలిపడటం మానేసి నవ్వుతారా. రేపు చెబుతా మీ సంగతి అంటూ వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మీ.
పగ తీర్చుకున్నాను
మమ్మీ నీ బుగ్గ ఎర్రబడింది అని రాహుల్ చెబుతాడు. ఏంట్రా నవ్వడం ఆపకుండా ఉండలేకపోతున్నాం అని రుద్రాణి అంటుంది. అది ఎలాగో నేను చెప్పనా అంటూ స్వప్న ఎంట్రీ ఇస్తుంది. మీ గదిలో నేనే లాఫింగ్ గ్యాస్ వదిలాను కాబట్టి అని స్వప్న అంటుంది. షాక్ కావాలి కానీ, నవ్వుతున్నాం ఏంటీ అని ఇద్దరూ అనుకుంటారు. మీరు ఆపుకున్న నవ్వు ఆపలేరు. అప్పును అవమానించడమే కాకుండా కావ్యను దూరం చేసి రాజ్‌ను ఇంటి నుంచి వెళ్లగొట్టేందుకు ప్లాన్ చేస్తారా. అందుకే ఇలా పగ తీర్చుకున్నాను అని స్వప్న అంటుంది.
ఇలా నవ్వి చావడం ఎక్కడ చూసిండరు. తెల్లార్లు నవ్వి నవ్వి పొట్ట పగిలి చావండి. ఇదే నా లాఫింగ్ రివేంజ్ అని స్వప్న వెళ్లిపోతుంది. ఒసేయ్ రాక్షసి అంటూ రుద్రాణి పిలిచి దీనికి రెమెడీ ఎక్కడ దొరుకుతుందని అడుగుతారు. కానీ, స్వప్న చెప్పకుండా వెళ్లిపోతుంది. మరుసటి రోజు ఉదయం కావ్య అలారంతో నిద్ర లేస్తుంది. కావ్య బెడ్ పై నుంచి లేచాక వెనుక నుంచి కొంగు లాగినట్లు కావ్యకు అనిపిస్తుంది. దాంతో సిగ్గుపడిపోతుంది కావ్య.
వెనక్కి చూసేసరికి రాజ్ పడుకుంటాడు. కావ్య చీరకొంగుపై పడుకుంటాడు. మళ్లీ బూత్ బంగ్లా గుర్తొచ్చిందనుకున్నా. నాకు అంత రాతనా అని కావ్య అనుకుంటుంది. తన కొంగు తీసుకుంటుండగా రాజ్ నిద్రలేస్తాడు. ఏంటీ చీర కొంగా అని రాజ్ అంటే.. కాదు నా పైట చెంగు అని కావ్య అంటాడు. కావ్య వెళ్తుంటే.. ఇక్కడే ఉండు. ఇవాళ పని వద్దు అని రాజ్ అంటాడు. ఇద్దరు రాత్రి మాట్లాడుకున్నదాని గురించి గొడవపడుతుంటారు.
చీర కొంగు లాగిన రాజ్
నాకు ఇవాళ పని లేదు. నన్ను పీకేసారు అని రాజ్ అంటాడు. మీరేం మాట్లాడలేదు అప్పుడు. కానీ, నాకు పని ఉంది. నన్నెవరు పీకేయలేదు అని కావ్య అంటుంది. అన్ని పనులు శాంత చేస్తుంది అని రాజ్ ఉండిపోమ్మంటాడు. ఆ పనులు అందరికీ నచ్చవు. నేను చేయకుంటే అంతా అంటారు. అంతా కాఫీ కోసం ఎదురుచూసే దృశ్యం కళ్లముందు క్యాలెండర్‌లా కనపడుతుంది అని కావ్య వెళ్లిపోతుంటే.. రాజ్ కావ్య చీర కొంగు పట్టుకుని లాగుతాడు.
మెల్లిగా చీర కొంగును ముడుస్తూ కావ్య దగ్గరికి వస్తాడు. కావ్యను గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇద్దరూ రొమాంటిక్‌గా ఫీల్ అవుతారు. బ్యాక్‌గ్రౌండ్‌లో మదన అంటూ రొమాంటిక్ సాంగ్ ప్లే అవుతుంది. తర్వాత కావ్య వద్దంటూ చిలిపిగా వారిస్తూ రాజ్‌ను వెనక్కి నెడుతుంది. రాజ్ వినకుండా అలాగే పట్టుకుంటాడు. తర్వాత రాజ్‌ను విడిపించుకున్న కావ్య అక్కడే ఉండిపోతుంది. అది అర్థం చేసుకున్న రాజ్ కావ్యను బెడ్‌పై పడేస్తాడు. ఇద్దరూ దుప్పటి కప్పుకుంటారు. అలా వాళ్లిద్దరూ కామకేళిలో (శృంగారం) పాల్గొంటారు.
మరోవైపు కాఫీకి కావాల్సిన ఏం కావాలి అని కల్యాణ్ అడిగితే.. కాఫీ పొడి, పాలు అని అప్పు చెబుతుంది. అమ్మో అన్ని కావాల అని కల్యాణ్ అంటాడు. కాఫీ తాగాలని ఉందా కూచి. ఇవాళ ఏం తిందాం అని అప్పు అంటే.. ప్రాస పాయసం, పదాల పరమాన్నం అంటూ సెటైర్లు వేస్తాడు కల్యాణ్. ఇంతలో ఒకావిడ వచ్చి నిన్న వరలక్ష్మీ వ్రతం చేసుకున్నాం. నువ్ లేవు. నీ వాయనం ఇద్దామని వచ్చామని ఇస్తుంది. అందులో పాయసం, పరమాన్నం ఉండటంతో అప్పు, కల్యాణ్ జోకులు వేసుకుంటారు.
సెనగలతో టిఫిన్
ఇంతలో కనకం, కృష్ణమూర్తి వస్తారు. ఎలా ఉన్నారని అడిగితే.. చాలా సంతోషంగా ఉన్నాం అని అప్పు చెబుతుంది. మొదటిసారి అత్త మామ ఇంటికి వచ్చారు. వాళ్లకు ఏం చేయాలో తెలియట్లేదు అని కల్యాణ్ అనుకుంటాడు. ఉండంటి టిఫిన్ చేస్తాను అప్పు అంటుంది. 20 నిమిషాల్లో పూర్తయ్యే టిఫిన్ ఏంటే అని కనకం అడుగుతుంది. చూస్తారు కదా అని కిచెన్‌లోకి అప్పు వెళ్తుంది. సెనగలు వెయించి తీసుకెళ్లి ఇస్తుంది. హమ్మయ్య పరువు కాపాడింది అని కల్యాణ్ అనుకుంటాడు.
ఇదేం టిఫిన్ అమ్మా.. చాలా బాగుంది అని కృష్ణమూర్తి అంటాడు. స్ప్రౌట్స్ నాన్న. మేము డైట్ పాటిస్తున్నాం. ఉదయం ఇదే తింటాం అని అప్పు అంటుంది. కానీ, కనకంకు అనుమానం వస్తుంది. పక్కనే ఉన్న వాయనం చూస్తుంది కనకం. ఇంట్లో ఇద్దరమే ఉంటున్నాం. మీరు ఇంటికి వస్తే కొడుకునై అల్లుడు అయినా మీరే అనుకుంటాం అని కృష్ణమూర్తి అంటాడు. కల్యాణ్ ఏదో చెప్పబోతుంటే.. వద్దు నాన్న మేము రాము ఇక్కడే ఉంటాం అని అప్పు చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
రాహుల్ దొంగ బంగారం
బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో ఏదో దొంగ బంగారం అట మన కంపెనీని అడ్డు పెట్టుకుని కొనాలని చూస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే కంపెనీకు సమస్య అవుతుంది అని కావ్యకు స్వప్న చెబుతుంది. తర్వాత రాహుల్ దొంగబంగారం కొంటున్నట్లు సుభాష్, ప్రకాశంకు చెబుతుంది కావ్య. దానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా అని రాహుల్ అడిగితే.. అది నీ చేతుల్లోనే ఉందని బ్యాగ్ చూపిస్తుంది. తర్వాత స్వప్న వచ్చి ఓ ఫైల్ రాజ్‌కు చూపిస్తుంది.