Brahmamudi May 27th Episode: బ్రహ్మముడి- అపర్ణను నిలదీసిన సీతారామయ్య- అత్తపై విరుచుకుపడిన కావ్య- రాజ్ ప్రేమకథ మొదలు-brahmamudi serial 27th episode aparna shocking move seetharamayya fire on aparna support kavya brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi May 27th Episode: బ్రహ్మముడి- అపర్ణను నిలదీసిన సీతారామయ్య- అత్తపై విరుచుకుపడిన కావ్య- రాజ్ ప్రేమకథ మొదలు

Brahmamudi May 27th Episode: బ్రహ్మముడి- అపర్ణను నిలదీసిన సీతారామయ్య- అత్తపై విరుచుకుపడిన కావ్య- రాజ్ ప్రేమకథ మొదలు

Sanjiv Kumar HT Telugu
May 27, 2024 07:38 AM IST

Brahmamudi Serial May 27th Episode: బ్రహ్మముడి సీరియల్ మే 27వ తేది ఎపిసోడ్‌లో అపర్ణకు పెద్ద షాక్ ఇస్తాడు మావయ్య సీతారామయ్య. రాజ్ విడాకుల నిర్ణయం నువ్వు ఎలా తీసుకుంటావ్ అని గట్టిగానే క్లాస్ పీకుతూ నిలదీస్తాడు. అలాగే కావ్య కూడా ప్రశ్నలతో అత్తపై విరుచుకుపడుతుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

బ్రహ్మముడి సీరియల్ మే 27వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ మే 27వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో కావ్య చాలా లేట్ రావడంతో రాజ్ ఫైర్ అవుతాడు. ఎక్కడికెళ్లవ్.. బుద్ధుందా, బాధ్యత ఉందా. ఎప్పుడెళ్లావ్ ఎప్పుడొస్తున్నావ్. మళ్లీ ఏ దరిద్రాన్ని వెతుక్కుంటూ వెళ్లావ్. అసలు నా గురించి పట్టించుకుంటున్నావా. నా పరిస్థితి గురించి ఆలోచించకుండా వెళ్లిపోతే ఎలా అని రాజ్ అరుస్తాడు. ఏమైంది మీ పరిస్థితికి ఇప్పుడు అని కావ్య అడుగుతుంది.

దొంగ మాయ అని చెప్పలేం

నీకు తెలియదా. టీ నుంచి టిఫిన్ వరకు లంచ్ నుంచి డిన్నర్ వరకు అన్ని మీద పడి చేస్తుంది. నువ్ అడవికి వెళ్లి పులిని తీసుకొచ్చి ఈ మేక మీద పడేశావ్. ఈ మేక గురించి ఆలోచించావా అని రాజ్ అంటాడు. అది మేకలాగే కనిపించిందండి. ఇక్కడికి వచ్చాకే పులిలా చేసింది. కానీ, మీ బెడ్ రూమ్ వసకు తను రాదు అని కావ్య అంటుంది. ఆ.. అంటే ఆ ప్రమాదం కూడా ఉందా బుజ్జి. అది దొంగ మాయ అని చెప్పలేం. ఆ బాబుకు తల్లి కాదని చెప్పలేం. దాని ఓవరాక్షన్ భరించలేం ఏం చేయడమే అని రాజ్ భయంతో అంటాడు.

కంగారుపడకండి. అన్ని రోజులు ఇలాగే ఉండవు. తానేంటో నిజం బయటపడిపోతుంది. నాక్కూడా నష్టం జరిగింది. నేను అరుస్తున్నానా. తన గురించి అసలు నిజం తెలుస్తుంది. అంతవరకు మీ శీలం కాపాడుకోండి అని కావ్య వెళ్లిపోతుంది. ఇది చెప్పింది కూడా కరెక్టే అని రాజ్ అనుకుంటాడు. మరోవైపు లాయర్‌కు కాల్ చేస్తుంది అపర్ణ. ఇప్పుడు నేను చెప్పేది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఎవరికీ తెలియకూడదు అని అపర్ణ అంటుంది.

మీరు చెప్పేది నిజమేనా

నేను ఇప్పటివరకు మీ కంపెనీకి సంబంధించిన లీగల్ కేసులు అన్ని చూశాను. నా విషయంలో ఎలాంటి పొరపాటు జరగలేదు. మీరు చెప్పేది మూడో కంటికి తెలియదు అని లాయర్ అంటాడు. దాంతో అపర్ణ ఏదో చెబుతుంది. అది విని లాయర్ షాక్ అవుతాడు. రేపు ఉదయంకల్లా పేపర్స్ అన్ని రెడీ చేసుకుని తీసుకురండి అని అపర్ణ అంటుంది. మేడమ్ మీరు చెప్పేది నిజమేనా. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇది చాలా పెద్ద విషయం. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారా అని లాయర్ అడుగుతాడు.

నేను ఈ టైమ్‌లో జోక్స్ వేస్తానా. మూడో మనిషి మీరే ఇంతలా అంటున్నారంటే నేను ఎంత ఆలోచించి ఉంటాను. నాకు సలహాలు ఇవ్వడం మానేసి నేను చెప్పింది చేయండి అని అపర్ణ అంటుంది. దాంతో సరేనని లాయర్ అంటాడు. కట్ చేస్తే ఉదయం హాల్లో అంతా ఉంటారు. ఏంటీ వదినా అందరినీ హాజరవ్వమని చెప్పి ఏం మాట్లాడట్లేదు. దేని గురించి మాట్లాడాలి అని రుద్రాణి అడుగుతుంది. ఆ సమయం వచ్చినప్పుడు మాట్లాడుతాను అని అపర్ణ అంటుంటే లాయర్ ఎంట్రీ ఇస్తాడు.

విడాకుల పత్రాలు

లాయర్ వచ్చి పేపర్స్ ఇస్తాడు. మీరు బయలుదేరండి. మీ అవసరం వచ్చినప్పుడు పిలుస్తాను అని లాయర్‌ను పంపిస్తుంది అపర్ణ. ఏంటవి అని సుభాష్ అడుగుతాడు. ఈ ఇంటి భవిష్యత్ నిర్ణయించే పత్రాలు. ఈ ఇంట్లో జరుగుతున్న గందరగోళం నుంచి బయటపడానికి, న్యాయం జరిపించడానికి అని అపర్ణ అంటుంది. అవేం పేపర్స్ అని ప్రకాశం అడిగితే.. విడాకుల పత్రాలు అని అపర్ణ చెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. సుభాష్, ప్రకాసం, ఇందిరాదేవి, సీతారామయ్య, అపర్ణ లేచి నిల్చుంటారు.

విడాకుల.. ఆ మాట ఎవరి నోటి నుంచి రాకూడదని మీ మావయ్య గారు చెప్పారు కదా అని ఇందిరాదేవి అంటుంది. తప్పట్లేదు. తప్పటడుగు వేసినవాళ్లకు అని అపర్ణ అంటుంది. ఎవరి గురించి మమ్మీ నువ్ మాట్లాడేది అని రాజ్ అంటాడు. నీకు అర్థమైంది. నువ్ కావ్య విడాకులు తీసుకోవాలి అని అపర్ణ చెబుతుంది. దాంతో అంతా అవాక్కవుతారు. మాయగా వచ్చిన చిత్ర, రుద్రాణి సంతోషిస్తారు. ఈ నిర్ణయం నువ్వెందుకు తీసుకున్నావ్ అని ఇందిరాదేవి అడుగుతుంది.

ఇంతకుమించిన పరిష్కారం లేదు

మాయకు పుట్టిన బిడ్డ ఈ ఇంటి వారసుడు కాబట్టి. వాడికి ఇంటి వారసత్వం కల్పించాలంటే.. మాయను రాజ్ పెళ్లి చేసుకోవాలి కాబట్టి. అలా పెళ్లి చేసుకోవాలంటే ముందుగా కావ్యతో విడాకులు తీసుకోవాలి అని అపర్ణ అంటుంది. ఒకరికి న్యాయం చేయాలనుకుంటే ఇంకొకరికి అన్యాయం చేస్తావా అని సుభాష్ అడుగుతాడు. ఇంతకుమించిన పరిష్కారం లేదని అపర్ణ అంటుంది. లేదని నువ్వెలా అనుకుంటావ్ అని సుభాష్ అంటాడు.

ఉందని మీరెలా అనుకుంటున్నారు. ఉంటే చెప్పండి అని అపర్ణ అంటుంది. కావ్యను రాజ్ నుంచి విడదీస్తే.. మాయకు న్యాయం జరుగుతుంది. మరి కావ్యకు అన్యాయం జరగదా అని స్వప్న ప్రశ్నిస్తుంది. ఏడాది నుంచి మీ చెల్లెలికి ఈ ఇంట్లో న్యాయం జరుగుతుందనుకుంటున్నావా. అన్యాయమే, అవమానమే జరుగుతుంది. కానీ, అందులో ఇంటి సభ్యుల తప్పే లేదు. నా కొడుకుకి ఇష్టం లేని పెళ్లి చేసింది మీ అమ్మ. కాబట్టి, అన్యాయం గురించి అడిగే హక్కు మీ కుటుంబం కోల్పోయింది అని అపర్ణ అంటుంది.

బలమైన బంధం ఉంది కాబట్టే

రాజ్ నిజంగా కావ్యను ఇష్టపడుంటే ఈపాటికే బిడ్డను కనేవాడు. కానీ, వాళ్లిద్దరి మధ్య సక్యతలేదు. అందుకే విడిపోవాలని అంటున్నారు. ఇష్టం లేని భార్యాభర్తలు కుటుంబం కోసం కలిసి ఉన్నంతమాత్రానా లాభం లేదు. వాడు మాయను ప్రేమించాడు. చెప్పలేక నలిగిపోయాడు. బిడ్డ పుట్టాకా వాడికి న్యాయం చేయాలనిపించింది. అందుకే ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మాయ కూడా తెరచాటు నుంచి వచ్చింది. వారిద్దరి మధ్య బలమైన బంధం ఉంది కాబట్టే పెళ్లి చేద్దామనుకుంటున్నాను అని అపర్ణ అంటుంది.

ఇది ఇప్పటికిప్పుడు తేలిపోవాల. సమయం తీసుకోకూడదా. ఎవరు ఎలాంటి వారో పూర్తిగా తెలుసుకునే పనేలేదా అని సుభాష్ అంటాడు. ఇంకా ఎంత టైమ్ తీసుకోవాలండి. శ్రీరామనవమి అప్పుడు బిడ్డ గురించి మీడియా అడిగితే ఎంత ఇబ్బంది పడ్డామో మర్చిపోయారా. ఇప్పుడు మాయ గురించి అడిగితే ఏమని సమాధానం చెబుతారు. అందుకే ఎవరికీ తెలియకుండా కావ్యకు విడాకులు ఇప్పించి.. గుట్టు చప్పుడు కాకుండా మాయ మెడలో మూడు ముళ్లు వేయిద్దామని అనుకుంటున్నాను అని అపర్ణ అంటుంది.

షాక్ ఇచ్చిన సీతారామయ్య

నువ్ ఇంటి బాధ్యతను సంబాలించే సమర్థత ఉన్నదానివని ఈ ఇంటి బాధ్యత మా తర్వాత నీ చేతుల్లో పెట్టాం. ఏనాడైనా మా అభిప్రాయాన్ని చెప్పాం కానీ నీ నిర్ణయానికి అడ్డు రాలేదు. కానీ, ఇప్పుడు కావ్యకు విడాకులు ఇప్పించాలని నిర్ణయించడానికి నువ్వు ఎవరమ్మా అని సీతారామయ్య పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. దాంతో అపర్ణ షాక్ అవుతుంది. నీకేం హక్కు ఉంది. నీకేం అధికారం ఉంది. ఎవరిచ్చారు నీకు ఆ అధికారం అని సీతారామయ్య నిలదీస్తాడు.

వాడు గతికేం బాసికం కట్టలేదు. కనకం చేసిన పనికో, రుద్రాణి పన్నాగం వల్లో అమాయకురాలైన కావ్య మెడలో తాళి కట్టాడు. ఈ ఇంటి పరువు నిలబెట్టాడు. అయినా సరే అది అగ్ని సాక్షిగా జరిగిన పెళ్లి. ఆ సంస్కృతిని వేరే ఎవరికీ లేదు. నేను మావయ్యగా మాట్లాడట్లేదు. మనిషిగా మాట్లాడుతున్నాను. అందుకే పరుషంగా మాట్లాడటం తప్పట్లేదు అని సీతారామయ్య అంటాడు. నువ్ మావయ్యగా, వాడి తాతయ్యగా మాట్లాడొచ్చు బావ. నీ నిర్ణయం ఏంటో నిక్కచ్చిగా చెప్పు అని ఇందిరాదేవి అంటుంది.

అభిప్రాయాలు కనుక్కున్నావా

భర్తలు చవటలు అయితే పెళ్లాలు నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులేదు. కానీ, నా కొడుకులు సమర్ధులే కాదు. సంస్కారవంతులు కూడా. అందుకే ఇంతమందిలో నీ పరువు తీయకుండా మౌనంగా నిలబడ్డారు. ఇంతపెద్ద నిర్ణయం నువ్ ఎవరి అనుమతి, ఎవరి అభిప్రాయం అడిగి తీసుకున్నావమ్మా. అసలు విడాకులు ఇప్పిద్దామనుకుంటున్నవాళ్లను అయినా సంప్రదించావా. చెప్పమ్మా. వాళ్ల అభిప్రాయాలు కనుక్కున్నావా అని సీతారామయ్యా నిలదీస్తాడు.

నువ్ చెప్పు కావ్య. మాయను దృష్టిలో పెట్టుకుని కాదు. రాజ్‌ను దృష్టిలో పెట్టుకుని చెప్పు. నీకు విడాకులు ఇవ్వడం ఇష్టమా. అత్త లేదు. పత్రాలు లేదు. నీ ఇష్టం చెప్పు అని ఇందిరాదేవి అడుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. కనీసం మీరు ఇద్దరైనా నేను ఈ ఇంట్లో నేను మనిషిని అని, నాది ఒక జీవితం అని గుర్తించారు. ఇప్పటిదాకా ఈ ఇంట్లో నా ఉనికి ఒక ప్రశ్నార్థకంగా కనిపించింది. నా వ్యక్తిత్వం, నా ఆత్మ గౌరవం నా అస్థిత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయని కావ్య చెబుతుంది.

నా మీద జాలిపడి

నాకంటూ ఓ మనసు లేదా. మా అత్తగారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకునేటప్పుడు నేను ఒక ఆడదాన్ని అని, తనకు అభిప్రాయాలు ఉంటాయని మర్చిపోయారు. మూసి ఉన్న గదివెనుక మేము ఉండే తీరు ఆమెకు ఎలా తెలుసు. మేము పడక పంచుకోవడం గురించి ఆమెకు ఎలా తెలుసు. దీన్ని అందరిముందు బహిర్గతం చేశారు. ఆవిడ ఏదో ఊహించుకుని నా మీద జాలి పడి నాకు న్యాయం చేయాలనే ఉబలాటంలో చివరికీ మేము విడిపోవడమే న్యాయం, ధర్మం అని అంటున్నారని కావ్య అంటుంది.

అందరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అది ఆవిడనే అడగాలని అనుకుంటున్నాను అని కావ్య అంటే.. మొహమాటమే లేదు అడుగు అని ఇందిరాదేవి అంటుంది. చెప్పండి అత్తయ్య.. నేను మా ఆయన సవ్యంగా కాపురం చేసుకోవట్లేదని, మా ఇద్దరి మధ్య సక్యత లేదని విడాకులు ఇప్పించాలనుకుంటున్నారు. మాకు పెళ్లయి సంవత్సరం అయింది. బిడ్డ పుట్టి తొమ్మిది నెలలు అవుతుంది. అప్పుడు వాళ్లకు పరిచయమై రెండేళ్లు అయింది అని కావ్య వివరిస్తుంది.

అక్కతో పెళ్లికి

మీ కొడుకే గనుక మాయను ఇష్టపడితే అంత రహస్యంగా కాపురం చేయాల్సిన అవసరం ఏంటీ. ఆమెను ఆమె బిడ్డను ఇంతకాలం అజ్ఞాతంలో ఉంచాల్సిన అవసరం ఏంటీ. మాయే ఉంటే మా అక్కను చేసుకుంటానని ఎందుకు అంటాడు. ఆ తర్వాత నా మెడలో ఎందుకు తాళి కట్టారు అని తాళి చూపిస్తూ కావ్య ప్రశ్నిస్తుంది. దానికి అపర్ణ మౌనంగా ఉండిపోతుంది. సరే ఇవన్నీ ఎవరికీ తెలియకుండా జరిగిపోయాయి. కాబట్టి కుటుంబ పరువు కోసం దాచి ఉంచొచ్చు. మరి అందులో నా తప్పు ఉందా అని కావ్య అడుగుతుంది.

ఆయన చేసిన తప్పుకు నేనెందుకు విడాకులు తీసుకుని వెళ్లిపోవాలి. అంటే, మీ కొడుకు తప్పు చేసి దారినపోయేదానికి బిడ్డను కన్నా కోడలి తప్పేనా. మీ కొడుకు చేసిన నేరానికి కోడలికి శిక్ష వేస్తారా. ఏ న్యాయస్థానం ఇవ్వని తీర్పు మీరెలా ఇస్తారండి. పోనీ.. తప్పు చేశారు. ఆయన్నేమైనా అడిగారా. నీకు నీ పెళ్లాంతో సుఖం లేదు కాబట్టి. ఆ బిడ్డ తల్లిని చేసుకో అని చెప్పారా అని కావ్య ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

భయపడ్డారా

బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో థ్యాంక్స్ అని రాజ్ చెబుతాడు. దేనికి అని కావ్య అడిగితే.. అది విడాకులు ఇవ్వనని అన్నావ్ కదా అని రాజ్ అంటాడు. అంటే నేను ఎక్కడ వెళ్లిపోతాననో భయపడ్డారా అని కావ్య అడుగుతుంది. దానికి రాజ్ నిజమే అన్నట్లుగా ఉండిపోతాడు. నాకు విడాకులు ఇష్టంలేదు కాబట్టి చెప్పాను. మీరు మాత్రం ఎందుకు మౌనంగా వెళ్లిపోయారు అని కావ్య అడుగుతుంది. అదంతా అక్కడే చెప్పాను కదా అని రాజ్ అంటాడు. అదంతా కారణం మాత్రమే మీరు నిజం చెప్పండి అని రాజ్‌ను అడుగుతుంది కావ్య. దీన్నిబట్టి రాజ్, కావ్యల ప్రేమకథ మొదలైనట్లు తెలుస్తోంది.

టీ20 వరల్డ్ కప్ 2024