Kamal Haasan: అది చూసి కమల్ హాసన్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.. అమరన్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి కామెంట్స్-director rajkumar periyasamy comments on kamal haasan get emotional after watching sai pallavi amaran before release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kamal Haasan: అది చూసి కమల్ హాసన్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.. అమరన్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి కామెంట్స్

Kamal Haasan: అది చూసి కమల్ హాసన్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.. అమరన్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Nov 06, 2024 10:20 AM IST

Rajkumar Periasamy About Kamal Haasan Emotional: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్‌ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నట్లు అమరన్ మూవీ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి తెలిపారు. సాయి పల్లవి, శివ కార్తికేయన్ నటించిన మూవీ అమరన్ బస్టర్ హిట్ అందుకున్న నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు.

అది చూసి కమల్ హాసన్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.. అమరన్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి కామెంట్స్
అది చూసి కమల్ హాసన్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.. అమరన్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి కామెంట్స్

Rajkumar Periasamy About Kamal Haasan Emotional: ప్రిన్స్ శివ కార్తికేయన్, సాయి పల్లవి నటించిన సినిమా అమరన్. నేషన్ ప్రైడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. అలాగే, ఈ చిత్రాన్ని ఉలగ నాయగన్ కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు.

హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి అమరన్ సినిమాను తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్‌గా విడుదల చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన అమరన్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి ఘన విజయాన్ని సాధించి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

'అమరన్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. కంగ్రాట్యులేషన్స్

-థాంక్యూ. అమరన్‌కి యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. సినిమాని ఇంత గొప్పగా ఆదరిస్తున్న తెలుగు ఆడియన్స్‌కి థాంక్ యూ సో మచ్. మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తారు. 'అమరన్'తో అది మరోసారి ప్రూవ్ అయింది.

కమల్ హాసన్ ఎలాంటి సపోర్ట్ చేశారు?

-కమల్ హాసన్ గారు వండర్ ఫుల్ పర్సన్. ఈ సినిమాకి బిగినింగ్ నుంచి చివరి వరకూ చాలా సపోర్ట్ ఇచ్చారు. నాపై ఎంతో నమ్మకం ఉంచారు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఈ సినిమా విడుదలకు ముందు కమల్ హసన్ గారికి మూవీ చూపించాను. అది చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. చాలా చోట్ల ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి.

-ఫిమేల్ పర్స్‌పెక్టివ్ నుంచి ఈ కథని డ్రైవ్ చేయడం ఆయనకు చాలా నచ్చింది. 'ఫ్యామిలీ, ఎమోషన్, యాక్షన్‌ని చాలా అద్భుతంగా తీసావ్' అని మెచ్చుకున్నారు. ఆయన ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోను.

శివ కార్తికేయన్, సాయి పల్లవి క్యారెక్టర్స్ గురించి?

-ఈ కథ రాస్తున్నప్పుడే ఇందు క్యారెక్టర్‌కి సాయి పల్లవి అయితే చాలా బాగుంటుందని అనుకున్నాను. రియల్ ఇందు మేడంని కలిసిన తర్వాత ఆ క్యారెక్టర్‌కి సాయి పల్లవి అయితేనే పర్ఫెక్ట్ అనుకున్నాను. ఎందుకంటే చాలా జెన్యూన్, ఎమోషన్ హై ఉన్న క్యారెక్టర్ అది.

-ఈ కథ రాస్తున్నప్పుడు హీరో ఎవరనేది నా మైండ్‌లో లేదు. ఈ కథని శివ కార్తికేయన్ గారికి చెప్పాను. ఆయనకి ఈ కథ చాలా నచ్చింది. చాలా కనెక్ట్ అయ్యారు. ఇంతకుముందు ఆయన ఇలాంటి సినిమాలు చేయలేదు. అమరన్ లాంటి ఫుల్‌ప్లెడ్జ్ యాక్షన్ రోల్ చేయలేదు. అందుకే సినిమా చాలా ఫ్రెష్‌గా కనిపించింది. ఆయన ఈ కథ విన్న వెంటనే ఈ ప్రాజెక్టు చేసేస్తానని చెప్పారు. తర్వాత కమల్ సార్‌ని కలిసాం. అలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది.

ఈ సినిమా చేస్తున్నప్పుడు మీకు ఛాలెంజింగ్‌గా అనిపించిన అంశాలు ఏంటి?

- ఇది రియల్ కథ. ఈ కథకు ప్రారంభం, ముగింపు తెలుసు. అలాంటి కథని ఆడియన్స్‌కి ఎంగేజింగ్‌గా చెప్పడం, రియాల్టీని, ఫిక్షన్‌ని బ్యాలెన్స్ చేయడం, ఒరిజినల్ ఇన్సిడెంట్‌ని రీ క్రియేట్ చేయడం ఇవన్నీ ఛాలెంజెస్ అనుకోను గాని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాను. నాకు రియలిజం ఉన్న సినిమాలు ఇష్టం. చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను.

-యాక్షన్స్ సీక్వెన్స్‌లు చేయడం, అలాగే కాశ్మీర్‌లో తీసిన సీక్వెన్సులు ఇవన్నీ ఛాలెంజ్‌తో కూడినవి. నేను ప్రతి యాక్షన్ పార్ట్‌ని క్లియర్‌గా రాసుకున్నాను. ప్రతి షాట్‌ని పేపర్ మీద ప్లాన్ చేసుకున్నాను. అవన్నీ స్క్రీన్ మీదకు అచీవ్ చేయడం అనేది రియల్లీ ఛాలెంజింగ్.

జీవి ప్రకాష్ మ్యూజిక్ గురించి?

-జీవి ప్రకాష్ ఈ సినిమాకి పిల్లర్ స్ట్రెంత్. చాలా కొత్త మ్యూజిక్ ఇచ్చారు. సోల్ ఫుల్ మ్యూజిక్ ప్రొడ్యూస్ చేశారు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్‌తో పని చేయడం నిజంగా అదృష్టం.

నిర్మాతల గురించి ?

-కమల్ హాసన్ గారు, ఆర్ మహేంద్రన్, సోనీ పిక్చర్స్ చాలా సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్ తోనే సినిమా ఇంత గ్రాండ్‌గా వచ్చింది. అలాగే ఈ సందర్భంగా మేజర్ ముకుంద్ వరదరాజన్ ఫ్యామిలీకి థాంక్స్ చెబుతున్నాను.

ఇందు రెబకా వర్గీస్ గారు సినిమా చూసిన తర్వాత ఎలా ఫీలయ్యారు?

-ఇందు గారికి అమరన్ సినిమా చాలా నచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో చెన్నైలో చూశారు. సినిమా చివరకు వచ్చేసరికి చాలా ఎమోషనల్ అయ్యారు.

మీ నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ?

-ప్రస్తుతం చర్చల్లో జరుగుతున్నాయి. త్వరలోనే చెబుతాను.

Whats_app_banner