Amaran Collection: అమరన్ డే 1 కలెక్షన్స్ ఇవే.. విజయ్, రజనీకాంత్, కమల్ హాసన్ రికార్డ్స్ బద్దలు కొట్టిన శివ కార్తికేయన్!
Amaran Day 1 Worldwide Box Office Collection: సాయి పల్లవి, శివ కార్తికేయన్ జోడీగా నటించిన అమరన్ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతోంది. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన బయోగ్రాఫికల్ మూవీ అమరన్ తమిళనాడు బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది. మరి అమరన్ డే 1 కలెక్షన్స్ చూస్తే..
Amaran Box Office Collection: తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన బయోపిక్ మూవీ అమరన్ తొలి రోజే తమిళనాడులో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా తెరకెక్కిన అమరన్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
అత్యధిక కలెక్షన్స్ మూవీ
అక్టోబర్ 31న విడుదలైన అమరన్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో అమరన్ కలెక్షన్స్ అదిరిపోయాయి. మొదటి రోజు అయిన దీపావళి నాడు అమరన్ చిత్రానికి భారతదేశంలో రూ. 21 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. దీంతో శివకార్తికేయన్ సినీ కెరీర్‌లోనే తొలి రోజు అత్యధికంగా కలెక్షన్స్ సాధించిన సినిమాగా అమరన్ నిలిచింది.
అమరన్ డే 1 కలెక్షన్స్
అమరన్‌కు ఓపెనింగ్ డే వచ్చిన రూ. 21 కోట్లల్లో తమిళనాడు నుంచి రూ. 17.7 కోట్లు రాగా.. కర్ణాటక నుంచి 2 లక్షలు, హిందీ వెర్షన్ ద్వారా 12 లక్షలు, మలయాళం నుంచి లక్ష, తెలుగు నుంచి 3.8 కోట్ల కలెక్షన్స్ ఉన్నాయి. అంటే, తమిళం తర్వాత తెలుగులోనే అమరన్‌కు అధిక కలెక్షన్స్ వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అమరన్ మూవీకి తొలి రోజు రూ. 4.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది.
అమరన్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్
అలాగే, ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం అమరన్ సొంత రాష్ట్రమైన తమిళనాడులో రూ. 16.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇలా మొత్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి దేశవ్యాప్తంగా అమరన్ చిత్రానికి ఓపెనింగ్ డే రూ. 25 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. ఓవర్సీస్‌లో రూ. 9 కోట్ల గ్రాస్ రాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ. 34 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి.
విజయ్ ది గోట్ రికార్డ్ బ్రేక్
తమిళనాడులో అమరన్ సినిమాకు మొదటి రోజు మొత్తంగా 77.94 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఇదిలా ఉంటే, తమిళ స్టార్ హీరో విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రికార్డ్‌ను బ్రేక్ చేసింది మీడియం రేంజ్ హీరో శివకార్తికేయన్ మూవీ అమరన్. ఈ ఏడాది రిలీజ్ డే రోజున బుక్ మై షోలో ఒక గంట గ్యాప్‌లో అత్యధిక టికెట్ సేల్స్ అందుకున్న సినిమాగా విజయ్ ది గోట్ రికార్డ్ క్రియేట్ చేసింది.
డామినేట్ చేసిన అమరన్
ఇప్పుడు ఆ రికార్డ్‌ను అమరన్ డామినేట్ చేసింది. ది గోట్ మూవీ ఒక గంటలో 32.16 వేల టికెట్స్ అమ్ముడుపోతే.. అమరన్ సినిమా టికెట్స్ గంటలో 32.57 వేలు సేల్ అయిపోయాయి. దీంతో ఇళయ దళపతి విజయ్ సినిమా రికార్డ్‌ను అమరన్ బ్రేక్ చేసింది.
రజనీకాంత్, కమల్ హాసన్‌ను కూడా
ది గోట్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ వేట్టయన్ 31.86 వేల టికెట్స్ సేల్స్‌తో మూడో స్థానంలో, కమల్ హాసన్ భారతీయుడు 2 25.78 వేలతో నాలుగో స్థానంలో నిలిచాయి. అంటే, విజయ్, రజనీకాంత్, కమల్ హాసన్ సినిమాల రికార్డ్‌ను బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు శివకార్తికేయన్.