Nithin Prasanna: నాని పిల్ల జమీందార్‌కు పోలిక ఉండొచ్చు.. అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ విలన్ నితిన్ కామెంట్స్
Nithin Prasanna About Narudi Brathuku Natana: సుహాస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాలో విలన్‌గా నటించిన యాక్టర్ నితిన్ ప్రసన్న కొత్త మూవీ నరుడి బ్రతుకు నటన. ఇవాళ (అక్టోబర్ 25) థియేటర్లలో విడుదలైన నరుడు బ్రతుకు నటన మూవీపై నితిన్ ప్రసన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Actor Nithin Prasanna Comments: శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్ ఇతరలు మరో కీలక పాత్రలు పోషించారు. రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించిన ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి నిర్మించారు.
నరుడి బ్రతుకు నటన హైలెట్స్
అలాగే, ఈ సినిమాకు వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. సుధీర్ కుమార్ ప్రాజెక్ట్ హెడ్‌గా ఉన్న ‘నరుడి బ్రతుకు నటన’ సినిమా ఇవాళ అంటే అక్టోబర్ 25న గ్రాండ్‌గా థియెట్రికల్ రిలీజ్ అయింది. అయితే, సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నరుడి బ్రతుకు నటన మూవీ హైలైట్స్‌ను అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‌లో విలన్‌గా నటించిన యాక్టర్ నితిన్ ప్రసన్న తెలిపారు.
పూర్తిగా అపోజిట్
- నేను అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా తర్వాత చేస్తున్న చిత్రమిది. ‘నరుడి బ్రతుకు నటన’ స్క్రిప్ట్ దర్శకుడు రిషికేశ్వర్ చెప్పగానే హార్ట్ టచింగ్‌గా అనిపించింది. అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాలో నేను నెగిటివ్ రోల్ చేశాను. కానీ ఈ సినిమాలో కంప్లీట్ అపోజిట్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాను. ‘నరుడి బ్రతుకు నటన’ మూవీలో నటించడం మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది.
మన లైఫ్‌లో కూడా
- ‘నరుడి బ్రతుకు నటన’ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు మనుషులు ఇలా ఉంటే మన సమాజం ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే మన లైఫ్‌లో ఇలాంటి స్నేహితుడు ఉండాలని కోరుకుంటారు. హ్యూమన్ ఎమోషన్స్ గురించి హార్ట్ టచింగ్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు రిషికేశ్వర్.
కంప్లీట్‌గా డిఫరెంట్
- లైట్‌గా చూస్తే నాని పిల్ల జమీందార్ సినిమాకు మా ‘నరుడి బ్రతుకు నటన’తో కొంత పోలిక ఉండొచ్చు. కానీ, మూవీ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. కేరళ బ్యాక్ డ్రాప్‌లో చాలా అందంగా సినిమాను చిత్రీకరించారు. శివకుమార్‌తో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది. షూటింగ్ టైమ్‌లో మేము మంచి ఫ్రెండ్స్‌గా మారాం.
లీడ్ రోల్ ద్వారా
- నటుడు అంటే అన్ని రకాల ఎమోషన్స్ లైఫ్‌లో చూసి ఉండాలి. అప్పుడే గొప్ప నటుడిగా ఎదుగుతాడు. ఈ కథలో లీడ్ రోల్ ద్వారా ఈ విషయం ఆకట్టుకునేలా చూపించాం. దర్శకుడు రిషికేశ్వర్ ఎంతో ప్రతిభావంతంగా సినిమాను రూపొందించాడు.
చాలా హెల్ప్ అవుతుంది
- పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి గొప్ప సంస్థ మా చిన్న సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్తుండటం సంతోషంగా ఉంది. పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఇలా ముందుకు వస్తే మాలాంటి చిన్న మూవీస్, అప్ కమింగ్ హీరోలకు చాలా హెల్ప్ అవుతుంది.
తమిళ, మలయాళంలో కూడా
- నేను తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తున్నాను. మంచి ఆఫర్స్ వస్తున్నాయి. నటుడిగా మీ ఆదరణ మరింతగా పొందుతానని కోరుతున్నాను. ఈ సినిమాను థియేటర్‌లో చూడండి. థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ కోసమే స్పెషల్‌గా సౌండ్ డిజైన్ చేయించాం. సినిమాను చూసి తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నా.