Bigg Boss Telugu 8 Launch Guest: ఇవాళ బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్‌కి నానితోపాటు ముగ్గురు గెస్టులు.. మాజీలతో హోమ్ టూర్-bigg boss telugu 8 launch guests nani rana daggubati nivetha thomas anil ravipudi and bigg boss ex contestants home tour ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Telugu 8 Launch Guest: ఇవాళ బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్‌కి నానితోపాటు ముగ్గురు గెస్టులు.. మాజీలతో హోమ్ టూర్

Bigg Boss Telugu 8 Launch Guest: ఇవాళ బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్‌కి నానితోపాటు ముగ్గురు గెస్టులు.. మాజీలతో హోమ్ టూర్

Sanjiv Kumar HT Telugu
Sep 01, 2024 07:42 AM IST

Bigg Boss Telugu 8 Launch Guest Nani Rana: ఇవాళ చాలా గ్రాండ్‌గా బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ లాంచ్ కానుంది. షో ఓపెనింగ్ రోజున స్టార్ సెలబ్రిటీలు గెస్టులుగా వచ్చి సందడి చేస్తారన్న విషయం తెలిసిందే. అలా ఈ బిగ్ బాస్ 8 తెలుగు లాంచ్‌కు అతిథిగా నాని, దగ్గుబాటి రానాతో పాటు మరో ఇద్దరు గెస్టులుగా రానున్నారు.

ఇవాళ బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్‌కి నానితోపాటు ముగ్గురు గెస్టులు.. మాజీలతో హోమ్ టూర్
ఇవాళ బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్‌కి నానితోపాటు ముగ్గురు గెస్టులు.. మాజీలతో హోమ్ టూర్ ((Bigg Boss Telugu 7 File Photo))

Bigg Boss Telugu 8 Launch Guest List: ఎట్టకేలకు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ లవర్స్ కోరుకునే సమయం వచ్చేసింది. ఇవాళ (సెప్టెంబర్ 1) చాలా గ్రాండ్‌గా బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ప్రారంభం కానుంది. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి బిగ్ బాస్ తెలుగు 8 స్టార్ట్ కానుంది.

20 మంది కంటెస్టెంట్స్

అయితే, దీనికి సంబంధించిన షూటింగ్, డ్యాన్స్ పర్ఫామెన్సెస్, గెస్టుల ఎంట్రీ, హోస్ట్ నాగార్జునతో వారి మాట ముచ్చట్లు, చేసే సందడి అంతా శనివారం (ఆగస్ట్ 31) నాడే అయిపోయింది. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో మొత్తంగా సుమారు 20 మంది కంటెస్టెంట్స్‌ వరకు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. వారిలో 14 మంది లాంచింగ్ మొదటి రోజు ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది.

ఆదివారం (సెప్టెంబర్ 1) నాడు 14 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ 8 తెలుగు ఎంట్రీని స్టార్ మా ఛానెల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ప్రసారం చేయనున్నారు. ఆ తర్వాత నుంచి 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్‌ను ఓటీటీలో మాత్రం టెలీకాస్ట్ చేయనున్నారు. అయితే, బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ అంటే స్టార్ సెలబ్రిటీలు అతిథులుగా రావడం పరిపాటే.

స్టేజ్‌పై ఇద్దరు హోస్ట్‌లు

బిగ్ బాస్ 8 తెలుగు కోసం కూడా కొంతమంది సెలబ్రిటీలు హాజరు అయినట్లు సమాచారం. వారిలో నేచురల్ స్టార్ నాని ఉన్నారు. సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాని బిగ్ బాస్ తెలుగు 8కు గెస్ట్‌గా వచ్చి స్టేజ్‌పై నాగార్జునతో సందడి చేశారు. బిగ్ బాస్ తెలుగు 2 సీజన్‌కు నాని హోస్ట్‌గా చేసిన విషయం తెలిసిందే. దీంతో బిగ్ బాస్ స్టేజ్‌పై ఇద్దరూ హోస్ట్‌లు ఉండటం విశేషంగా ఉండనుంది.

అంతేకాకుండా గతంలో కూడా నాని చాలా సార్లు బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చారు. ఇక నానితోపాటు దగ్గుబాటి రానా, నివేదా థామస్ కూడా అతిథులుగా హాజరయ్యారు. నివేదా థామస్ ప్రధాన పాత్రలో రానా నిర్మించిన 35 చిన్న కథ కాదు మూవీని ప్రమోట్ చేసేందుకు గెస్టులుగా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 6న రిలీజ్ కానుంది.

మాజీల హోమ్ టూర్

ఈ ముగ్గురితోపాటు బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా అతిథిగా బిగ్ బాస్ స్టేజీపైకి హాజరయ్యారని సమాచారం. కామెడీ యాక్షన్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి గతంలో కూడా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ ఫైనల్‌లో హౌజ్‌లోకి వెళ్లి బోల్డ్ బ్యూటి అరియానా గ్లోరికి భారీ మనీ ఆఫర్ చేసి బయటకు తీసుకొచ్చారు.

ఇలా నలుగురు గెస్టులతోపాటు సెలబ్రిటిల డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో బిగ్ బాస్ తెలుగు 8 లాంచ్ సందడిగా సాగినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా బిగ్ బాగ్ తెలుగు 8 హౌజ్‌ను మాజీ కంటెస్టెంట్స్ అయిన గీతూ రాయల్ (బిగ్ బాస్ తెలుగు 6), ఆర్జే చైతూ (బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్) ద్వారా హోమ్ టూర్ చేయించారట. బిగ్ బాస్ హౌజ్ ఎలా ఉంటుందో ఈ ఇద్దరితోపాటు మరికొంతమంది మాజీ కంటెస్టెంట్స్‌తో చూపించి వివరించారని సమాచారం.