Ambajipeta Marriage Band OTT: ఫేమస్ ఓటీటీలోకి అంబాజీపేట మ్యారేజి బ్యాండు.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్!
Ambajipeta Marriage Band OTT Streaming: హీరో సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఫిబ్రవరి 2న విడుదలైన ఈ సినిమా ఓటీటీ విడుదలపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఓటీటీ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన ఇచ్చింది.

Ambajipeta Marriage Band OTT Official: కలర్ ఫొటో మూవీతో తెలుగు రాష్ట్రాల్లో హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు సుహాస్. క్యారెక్టర్, నెగెటివ్ పాత్రలతోపాటు హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్. ఇటీవలే రైటర్ పద్మభూషణ్ మూవీతో మంచి హిట్ కొట్టాడు. అలా ఈ మధ్యే అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి.
నిర్మాత ధీరజ్ మొగిలినేని దొరసాని, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బేబి వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్నారు. ఆయనే అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అలాగే ఈ సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలైంది. అయితే, టీజర్, ట్రైలర్, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ మొదట్లో మంచి కలెక్షన్స్ రాబట్టింది.
అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీ మూడు రోజుల్లోనే రూ. 8 కోట్లకుపైగా కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. రూ. 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్‌లోనే అది పూర్తి చేసి లాభాల్లోకి అడుగుపెట్టినట్లు సమాచారం. అనంతరం, రవితేజ ఈగల్, రజనీకాంత్ లాల్ సలామ్ సినిమాలు రిలీజ్ కావడంతో అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాకు థియేటర్స్ తగ్గాయి. కానీ, అప్పటికే మంచి పాజిటివ్ టాక్‌తో సినిమా టార్గెట్ రీచ్ అయినట్లే తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ ఓటీటీ విడుదలపై ఇప్పటికీ అనేక పుకార్లు వచ్చాయి. కానీ, తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ అధికారికంగా అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఓటీటీ విడుదలపై అప్డేట్ ఇచ్చింది. అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాను ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
తాజాగా అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఓటీటీ విడుదలపై ఆహా ఓ పోస్టర్ విడుదల చేసింది. "మల్లిగాడు మాయా ప్రపంచంలోకి అడుగు పెట్టండి" అంటూ అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాను త్వరలో ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా సంస్థ తెలిపింది. అంటే, ఇప్పటివరకు వచ్చిన రూమర్స్‌కు చెక్ పెడుతూ ఆహాలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఓటీటీ రిలీజ్ డేట్ మాత్రం ఆహా ఇంకా ప్రకటించలేదు.
ఆహాలో అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాను మార్చి 1 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తారని ప్రస్తుతం ఉన్న సమాచారం. మొన్నటివరకు మార్చి 8 లేదా 15న రిలీజ్ చేస్తారని టాక్ నడిచింది. కానీ, ప్రస్తుతం ఉన్న బజ్ ప్రకారం ఆహా ఓటీటీలో అంబాజీపేట మ్యారేజి బ్యాండు మార్చి 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో సుహాస్‌కు జోడీగా శివాని నాగరం హీరోయిన్‌గా నటించింది. అలాగే శరణ్య ప్రదీప్ కీలక పాత్ర పోషించింది. ఆమె ఇటీవల ప్రియమణి భామాకలాపం 2లో ఆకట్టుకుంది.