Shruti Haasan: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా నవీన్ చంద్ర లెవెన్.. పాట పాడిన శ్రుతి హాసన్.. కమల్ హాసన్‌తో సాంగ్ రిలీజ్-kamal haasan launch shruti haasan song the devil is waiting from eleven movie naveen chandra investigative thriller ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shruti Haasan: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా నవీన్ చంద్ర లెవెన్.. పాట పాడిన శ్రుతి హాసన్.. కమల్ హాసన్‌తో సాంగ్ రిలీజ్

Shruti Haasan: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా నవీన్ చంద్ర లెవెన్.. పాట పాడిన శ్రుతి హాసన్.. కమల్ హాసన్‌తో సాంగ్ రిలీజ్

Sanjiv Kumar HT Telugu

Shruti Haasan The Devil Is Waiting Song Release By Kamal Haasan: శ్రుతి హాసన్ పాట పాడిన ది డెవిల్ ఈజ్ వెయిటింగ్ సాంగ్‌ను హీరోయిన్ తండ్రి కమల్ హాసన్ రిలీజ్ చేశారు. హీరో నవీన్ చంద్ర నటించిన రేసీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ లెవెన్‌‌లోని ఈ పాట ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా నవీన్ చంద్ర లెవెన్.. పాట పాడిన శ్రుతి హాసన్.. కమల్ హాసన్‌తో సాంగ్ రిలీజ్

Shruti Haasan The Devil Is Waiting Song Release: వరుస సినిమాలు, ఓటీటీ వెబ్ సిరీసులతో అలరిస్తున్న హీరో నవీన్ చంద్ర నటించిన లేటెస్ట్ రేసీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ లెవెన్. ఈ సినిమాకు లోకేశ్ అజ్ల్స్‌ దర్శకత్వం వహించారు.

పాట పాడిన శ్రుతి హాసన్

ఈ లెవెన్ సినిమాను ఎఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మిస్తున్నారు. అయితే, లెవెన్ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో బైలింగువల్ మూవీగా రూపొందించారు. ఇప్పటికే విడుదలైన లెవెన్ టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ శ్రుతి హాసన్‌ పాట పాడారు.

సాంగ్ రిలీజ్ చేసిన కమల్ హాసన్

తాజాగా శ్రుతి హాసన్ పాట పాడిన 'ది డెవిల్ ఈజ్ వెయిటింగ్' సాంగ్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. అది కూడా శ్రుతి హాసన్ తండ్రి, ఉలగ నాయగన్ కమల్ హాసన్ చేతుల మీదుగా ది డెవిల్ ఈజ్ వెయిటింగ్ సాంగ్‌ రిలీజ్ అయింది. సాంగ్‌ని లాంచ్ చేసిన తర్వాత మూవీ టీమ్‌కు తమ బెస్ట్ విషెస్ అందించారు యూనివర్సల్ హీరో కమల్ హాసన్.

జేమ్స్ బాండ్ తరహాలో

మ్యూజిక్ కంపోజర్ డి. ఇమ్మాన్ ఈ సాంగ్‌ని ఎలక్ట్రిఫైయింగ్ బీట్స్‌తో టెర్రిఫిక్ నెంబర్‌గా ట్యూన్ చేశారు. లోకేశ్ అజ్ల్స్ రాసిన లిరిక్స్ స్టొరీ, హీరో క్యారెక్టర్ ఎసెన్స్‌ని ప్రజెంట్ చేశాయి. శ్రుతి హాసన్ తన ఎనర్జిటిక్ వోకల్స్‌తో మెస్మరైజ్ చేశారు. ఆమె వాయిస్ లిజనర్స్‌ని కట్టిపడేసింది. అంతేకాకుండా ఈ పాట సేమ్ హాలీవుడ్ స్పై ఫ్రాంఛైజీ జేమ్స్ బాండ్ టైటిల్ ట్రాక్‌ వంటి అనుభూతిని కలిగించింది.

సోషల్ మీడియాలో ట్రెండ్

ప్రస్తుతం శ్రుతి హాసన్ పాడిన ది డెవిల్ ఆజ్ వెయిటింగ్ సాంగ్ సోషల్ మీడియా, మ్యూజిక్ చార్ట్స్‌లో ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉంటే, ‘సిల నెరంగళిల్ సిల మణిధర్గళ్’ చిత్రంలో నటించిన రేయా హరి లెవెన్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో ‘విరుమండి’ ఫేమ్ అభిరామి, ‘వత్తికూచి’ ఫేమ్ దిలీపన్, ‘మద్రాస్’ ఫేమ్ రిత్విక ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఎడిటర్‌గా నేషనల్ అవార్డ్ విన్నర్

లెవెన్ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తుండగా, బాలీవుడ్‌లో అనుభవం ఉన్న కార్తీక్ అశోక్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకాంత్ ఎన్.బి ఎడిటర్ బాధ్యతలు చేపట్టారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఇంతవరకు లెవెన్ రిలీజ్ డేట్‌ను అయితే ప్రకటించలేదు.

డిజాస్టర్‌గా

ఇక లెవెన్ సినిమాలో నవీన్ చంద్ర, రేయా హరి, అభిరామి, దిలీపన్, రిత్వికతోపాటు శశాంక్, ఆడుకాలం నరేన్, రవివర్మ, అర్జై, కిరీటి దామరాజు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇటీవల కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలింది. అలాగే, ఇండియన్ 2 ఓటీటీ రిలీజ్ తర్వాత కూడా పెద్దగా ప్రశంసలు రాలేదు.

నేరుగా ఓటీటీలోనే

దాంతో ఇండియన్ 3 మూవీని నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక శ్రుతి హాసన్ తెలుగులో చివరిగా వాల్తేరు వీరయ్య, సలార్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం శ్రుతి హాసన్ రజనీకాంత్ కూలీ, అడవి శేష్ డెకాయిట్ చిత్రాలతో బిజీగా ఉంది.