Month Of Madhu Review: మంత్ ఆఫ్ మధు రివ్యూ.. కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర మూవీ ఎలా ఉందంటే?-naveen chandra swathi reddy month of madhu review in telugu and rating ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Month Of Madhu Review: మంత్ ఆఫ్ మధు రివ్యూ.. కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర మూవీ ఎలా ఉందంటే?

Month Of Madhu Review: మంత్ ఆఫ్ మధు రివ్యూ.. కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర మూవీ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu
Nov 04, 2023 05:53 AM IST

Month Of Madhu Movie Review: తెలుగులో ఫీల్ గుడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మంత్ ఆఫ్ మధు. థియేటర్లలో విడుదలైన నెలకు ఓటీటీలోకి వచ్చేసిన మంత్ ఆఫ్ మధు రివ్యూలోకి వెళితే..

మంత్ ఆఫ్ మధు రివ్యూ.. కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర మూవీ ఎలా ఉందంటే?
మంత్ ఆఫ్ మధు రివ్యూ.. కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర మూవీ ఎలా ఉందంటే?

టైటిల్: మంత్ ఆఫ్ మధు

నటీనటులు: నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి (కలర్స్ స్వాతి), శ్రేయా నవిలే, మంజుల ఘట్టమనేని, హర్ష చెముడు, జ్ఞానేశ్వరి కండ్రేగుల, రాజా చెంబోలు, రాజా రవీంద్ర తదితరులు

సినిమాటోగ్రఫీ: రాజీవ్ ధరావత్

ఎడిటింగ్: రవికాంత్ పెరెపు

సంగీతం: అచ్చు రాజమణి

నిర్మాత: యశ్వంత్ ములుకుట్ల

రచన, దర్శకత్వం: శ్రీకాంత్ నాగోతి

థియేటర్ విడుదల తేది: అక్టోబర్ 6, 2023

ఓటీటీ రిలీజ్ డేట్: నవంబర్ 3, 2023

ఓటీటీ వేదిక: ఆహా

నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి, శ్రేయా నవిలే ప్రధాన పాత్రధారులుగా నటించిన లేటెస్ట్ మూవీ మంత్ ఆఫ్ మధు. పోస్టర్స్, ట్రైలర్స్ తో అట్రాక్ట్ చేసిన మంత్ ఆఫ్ మధు సినిమా అక్టోబర్ 6న విడుదలై మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. భానుమతి అండ్ రామకృష్ణ మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది, కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర నటన ఎలా ఉంది అనే విషయాలు మంత్ ఆఫ్ మధు రివ్యూలో చూడాల్సిందే.

కథ:

మధు.. మధుసూదన్ రావు (నవీన్ చంద్ర) ఎలాంటి బాధ్యత లేకుండా తాగుడుకు బానిసగా మారతాడు. అతని నుంచి తన భార్య లేఖ (స్వాతి రెడ్డి) విడిపోయి మూడేళ్లుగా విడాకులు కోసం కోర్టు చుట్టూ తిరుగుతుంటుంది. ప్రేమించి పెళ్లాడిన మధుతో లేఖ ఎందుకు విడిపోయింది. అందుకు గల కారణాలు ఏంటీ? మరి వారు కలుసుకున్నారా? విడాకులు తీసుకున్నారా? అలాగే మరోవైపు తన కజిన్ సిస్టర్ పెళ్లి కోసం అమెరికా నుంచి ఇండియాకు వస్తుంది మధు.. మధుమతి (శ్రేయా నివేలి).

ట్విస్టులు

ఇండియా వచ్చిన మధు తన తండ్రిని ఒప్పించి నెల రోజుల పాటు ఉండిపోతుంది. ఈ క్రమంలో మధుకు మధుసూదన్ రావు పరిచయం అవుతాడు. వీరి పరిచయం స్నేహంగా ఎలా సాగింది? మధుమతి పరిచయం మధు, లేఖ దంపతుల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? మధుకు ఇంకా ఎవరెవరు పరిచయం అయ్యారు? ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? చివరికీ మధుమతి ఏం తెలుసుకుంది? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే మంత్ ఆఫ్ మధు చూడాల్సిందే.

విశ్లేషణ:

మంత్ ఆఫ్ మధు సినిమాలో ప్రధానంగా ముగ్గురి పాత్రలకు సంబంధించిన జీవితాలను ఆవిష్కరించారు. ప్రేమించి పెళ్లాడిన భర్త బాధ్యత లేకుండా, తాగుడుకు బానిసైతే ఆ భార్య ఎలాంటి మానసిక పరిస్థితిని ఎదుర్కొంది, మారతాడన్న భర్తపై ఓపిక నశించి విడాకుల కోసం ఎంత మొండిగా మారిందో చూపించారు. కాలేజీ రోజుల్లో హీరోలా ఉండే వ్యక్తి పెళ్లయ్యాక కూడా అలాంటి భావనతోనే బతికితే జీవితం ఎలా ఉంటుందో సినిమా ద్వారా తెలియజేశారు.

మెయిన్ పాయింట్స్

ఇక జీవితంలో అన్ని చూడాలి, అందరితో కలిసిపోవాలి అనుకున్న 19 ఏళ్ల అమెరికా అమ్మాయికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో చూపించారు. ముగ్గురి జీవితాలను లింక్ చేస్తూ మహిళలు, వారి హక్కులు, కట్టుబాట్లు, కోరికలు, సాంప్రదాయాలు, ప్రేమ, పెళ్లి, సెక్స్, అబార్షన్, డివోర్స్, స్వేచ్ఛ, అమ్మాయిల మనస్తత్వం వంటి విషయాలను టచ్ చేసి ఆవిష్కరించారు. మధుమతి ఇండియాలో నెల రోజులు ఉన్న సమయంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఉండటంతో టైటిల్ అలా పెట్టినట్లుగా మేకర్స్ చెప్పారు. దానికి తగినట్లుగానే సినిమా ఉంది.

క్లైమాక్స్ అదుర్స్

అయితే, మధుసూదన్ రావు, లేఖ లవ్ ట్రాక్ బాగుంది. కానీ, భార్యాభర్తల ట్రాక్ మాత్రం సాదాసీదాగా ఉంది. కొత్తదనం లేదు. మధుమతి క్యారెక్టర్, బిహేవియర్, ఆమె ట్రాక్ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. కొన్ని చోట్ల రెగ్యులర్, బోరింగ్ సీన్లు ఉన్నాయి. మరికొన్ని చోట్ల అర్జున్ రెడ్డి సినిమా చాయలు కనిపిస్తాయి. క్లైమాక్స్ మాత్రం ఊహించని విధంగా ట్విస్టుతో షాకింగ్‌గా ఉంటుంది. డైలాగ్స్ కూడా పర్వాలేదు.

ఎవరెలా చేశారంటే..

బీజీఎమ్ బాగుంది. పాటలు కూడా కొన్ని బాగున్నాయి. నిర్మాణ విలువలు, సాంకేతిక వర్గం అంతా చక్కగా కుదిరాయి. పాత్రల వైజాగ్ స్లాంగ్ బాగుంది. కానీ, వాటికి అర్థం తెలియనివారు ఇబ్బంది పడొచ్చు. నవీన్ చంద్ర, స్వాతి, శ్రేయా నటన అదిరిపోయింది. వారి యాక్టింగ్ సినిమాకు చాలా ప్లస్ పాయింట్. ఎప్పుడూ మాట్లాడే కాలేజీ అమ్మాయిగా, భర్త వల్ల సైలెంట్ అయిపోయిన భార్యగా స్వాతి చాలా ఆకట్టుకుంది. తన నటనతో బాగా మెప్పించింది.

ఫైనల్‌గా చెప్పాలంటే..

Review Of Manth Of Madhu: యారగంట్‌గా, ప్రేమించే యువకుడిగా, తాగుబోతుగా నవీన్ చంద్ర జీవించేశాడు. ఇక 19 ఏళ్ల యువతి పాత్రలో శ్రేయ నివేలి చాలా బాగా ఆకట్టుకుంటుంది. డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ తో అలరిస్తుంది. మంజుల ఘట్టమనేని, హర్ష చెముడు, జ్ఞానేశ్వరి మిగతా పాత్రలు అంతా బాగా చేశారు. ఫైనల్‌గా చెప్పాలంటే వీకెండ్‌లో టైమ్ పాస్‌కు మంత్ ఆఫ్ మధు సినిమాపై లుక్ వేయొచ్చు.

రేటింగ్: 2.5/5

Whats_app_banner