Neti Charitra Review: నేటి చరిత్ర రివ్యూ.. మామతో కోడలు అక్రమసంబంధం.. అమలా పాల్ తమిళ బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?
Neti Charitra Movie Review In Telugu: 14 ఏళ్ల క్రితం అమలా పాల్ నటిచిన బోల్డ్ మూవీ సింధు సామవేళికి తెలుగు వెర్షన్‌గా వచ్చిన సినిమానే నేటి చరిత్ర. కేవలం యూట్యూబ్‌లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న ఈ బోల్డ్ మూవీ ఎలా ఉందో నేటి చరిత్ర రివ్యూలో తెలుసుకుందాం.
Neti Charitra Review In Telugu: హీరోయిన్‌గా తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చుకుంది అమలా పాల్. మలయాళ సినిమాత నీల తామరతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అమలా పాల్ ఆ తర్వాత తమింళంలో డెబ్యూ చేసిన మూవీ సింధు సామవేళి. 2010లో వచ్చిన ఈ సినిమా కాంట్రవర్సీ కూడా అయింది.
14 ఏళ్లకు తెలుగులో
మృగం వంటి డిఫరెంట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ సామి సింధు సామవేళి చిత్రానికి దర్శకత్వం వహించారు. అమలా పాల్, హరీష్ కల్యాణ్, గజిని, గంజా కరుప్పు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా దాదాపు 14 ఏళ్లకు తెలుగులో విడుదలైంది. సింధు సామవేళి చిత్రాన్ని తెలుగులో నేటి చరిత్ర అనే టైటిల్‌తో డబ్ చేసినప్పటికీ అప్పట్లో విడుదల కాలేదు.
కానీ, 14 ఏళ్లకు నేటి చరిత్ర సినిమాను నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. లవ్, ఎఫైర్, థ్రిల్లింగ్ సీన్లతో సాగే ఈ సినిమా ఎలా ఉందో నేటి చరిత్ర రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
పండు (హరీష్ కల్యాణ్), సౌందర్య (అమలా పాల్) క్లాస్‌మేట్స్. గొడవలతో పరిచయమైన వీరిద్దరు ప్రేమలో పడతారు. 18 ఏళ్లు ఆర్మీలో సేవలందించిన పండు తండ్రి వీరయ్య (గజిని) ఇకనుంచి కుటుంబసభ్యులతో జీవితం గడుపుదామని వీఆర్ఎస్ తీసుకుని ఇంటికి వస్తాడు. పాము కాటుతో పండు తల్లి మరణిస్తుంది. ఈ క్రమంలో పండు సౌందర్యల ప్రేమ తెలుసుకున్న వీరయ్య రెండు కుటుంబాలను ఒప్పించి ఇద్దరికి పెళ్లి చేస్తాడు.
వీరయ్య ఇంటికి సౌందర్య కోడలిగా వెళ్లిన తర్వాత ఏం జరిగింది..? పెళ్లైన నాలుగు రోజులకే పండు ఇల్లు ఎందుకు విడిచిపెట్టి వెళ్లాడు..? కొడుకు లేని సమయంలో మామకోడల్ల మధ్య చోటు చేసుకున్న పరిస్థితులు ఏంటీ? వాళ్లిద్దరు ఎందుకు అక్రమసంబంధం పెట్టుకోవాల్సి వచ్చింది? తండ్రి, భార్య అఫైర్ గురించి పండుకు తెలిసిందా? చివరికీ ఏం జరిగింది? అనేది తెలియాలంటే నేటి చరిత్ర సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
సినిమా ప్రారంభంలో పండును చూపించడం, తన తండ్రి ఎక్కడికో వెళ్లిపోయారని ఓ పెద్దాయనకు చెప్పడంతో కథ స్టార్ట్ అవుతుంది. తన తండ్రి మాయమైపోవడానికి తానే కారణం అని చెప్పిన పండు తన ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తాడు. ఆ తర్వాత పండును ఫ్యామిలీని చూపించడం, పండు తండ్రి వీరయ్య ఆర్మీకి వెళ్లడం, టీచర్‌గా పని చేయడం చూపిస్తారు.
కథలో కొత్త టర్న్
స్కూల్‌లో సౌందర్యతో పండు గొడవలు, అది కాస్తా ప్రేమగా మారడం వంటి సీన్లతో సాగిపోతుంది. అనంతరం ఆర్మీ నుంచి పండు తండ్రి తిరిగి రావడం, తండ్రికొడుకుల మధ్య ఉన్న ఎమోషన్, బాండింగ్, చిన్నప్పటి విషయాలతో ఓ పాటతో చూపించేశారు దర్శకుడు. అనంతరం పాము కాటుతో తల్లి చనిపోవడంతో సినిమాలో కొత్త టర్న్ తీసుకుంటుంది.
తండ్రి బైక్‌పై నుంచి పడి హాస్పిటల్ పాలు అవ్వడం, అక్కడే పండు, సౌందర్య ప్రేమ విషయం తెలిసి వాళ్లిద్దరికి పెళ్లి చేస్తాడు తండ్రి వీరయ్య. పెళ్లైన నాలుగు రోజులకు పై చదువుల నిమిత్తం పండు పొరుగూరికి వెళ్లడంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. కోడలు, మామ మధ్య వచ్చే సన్నివేశాలు, పరిస్థితులు, వారిలో మెదిలే కోరికలతో ఊహించని విధంగా కథ నడుస్తుంది.
బోల్డ్ సీన్స్, డైలాగ్స్
మామ, కోడలు కోరికలను ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్న కుదరకపోవడంతో ఒక్కటవుతారు. ఆ తర్వాత గిల్టీగా ఫీల్ అవ్వడం, కొడుకు అసలు విషయం చెప్పాలని ప్రయత్నించి విఫలం అవుతారు. తర్వాత మామపై కోడలుకు కోరిక కలగడం, ఇద్దరు కలవడం, మామ కోడళ్లే భార్యాభర్తలుగా, లవర్స్‌గా ఉండటం, దానికి సంబంధించి వచ్చే సీన్స్, డైలాగ్స్‌తో సెకండాఫ్ సాగుతుంది.
అనంతరం తండ్రి, భార్యల అక్రమసంబంధం గురించి తెలిసిన కొడుకు పండు ఏం చేశాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. అయితే, నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు బోర్‌గా ఫీల్ అవ్వొచ్చు. కానీ, పదేళ్ల క్రితం ఇలాంటి బోల్డ్ కథను సినిమాగా తీసిన దర్శకుడు ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.
బీజీఎమ్, యాక్టింగ్
తప్పులు జరగడానికి కారణాలు సినిమాలో వివరిస్తూనే.. పదిరోజులు చూస్తే ఎలాంటి ఆడదైన అందగానే కనపడుతుందని, అలా చేయొద్దని ఓ పాత్రతో చెప్పించే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక నిజం తెలిసిన పండు తండ్రి, భార్యను ఏం చేశాడన్నదే ట్విస్ట్. ఇది సినిమా చూసే తెలుసుకోవాలి. సినిమాటోగ్రఫీ, బీజీఎమ్ బాగున్నాయి. సాంగ్స్ పర్వాలేదు.
మరి మితిమీరిన బోల్డ్ సీన్స్ కాకుండా కథ డెప్త్ చెప్పేలా సన్నివేశాలు ఉన్నాయి. ఇక అమలా పాల్, గజిని యాక్టింగ్ చాలా బాగుంది. లవర్‌గా, భార్యగా నటించిన అమలా పాల్ మామతో అఫైర్ నడిపే యువతిగా కూడా బాగా ఎక్స్‌ప్రెషన్స్ పలికించింది. పండు పాత్రలో హరీష్ కల్యాణ్ కూడా బాగా చేశాడు. నటీనటుల యాక్టింగ్ బాగుంది. అయితే, మరి బోల్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన నేటి చరిత్ర సినిమాను ఫ్యామిలీతో చూడటం మాత్రం కష్టమే.