Brahmamudi September 21st Episode: అనామిక డెవిల్ ప్లాన్- కావ్యతోనే రాజ్ కంపెనీ పడగొట్టేలా స్కెచ్- కళావతికి యాక్సిడెంట్-brahmamudi serial september 21st episode anamika wicked move plan to get fall down raj company brahmamudi today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi September 21st Episode: అనామిక డెవిల్ ప్లాన్- కావ్యతోనే రాజ్ కంపెనీ పడగొట్టేలా స్కెచ్- కళావతికి యాక్సిడెంట్

Brahmamudi September 21st Episode: అనామిక డెవిల్ ప్లాన్- కావ్యతోనే రాజ్ కంపెనీ పడగొట్టేలా స్కెచ్- కళావతికి యాక్సిడెంట్

Sanjiv Kumar HT Telugu
Sep 21, 2024 11:36 AM IST

Brahmamudi Serial September 21st Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 21వ తేది ఎపిసోడ్‌లో శాంత వంటతో కావ్య లేని స్థానాన్ని భర్తీ చేయాలని అనుకుంటాడు రాజ్. కానీ, శాంత వంట తిని బెదిరిపోతాడు. మరోవైపు రాజ్ కంపెనీని పడగొట్టేందుకు సామంత్‌తో అనామిక కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో

బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 21వ తేది ఎపిసోడ్‌
బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 21వ తేది ఎపిసోడ్‌

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో మీరు ఎలా కష్టపడుతున్నారో మీ మొహాలోన్నే తెలుస్తోంది అని కల్యాణ్, అప్పును అవమానిస్తుంది అనామిక. నన్ను కాదని నువ్వు రోడ్డుమీద పడ్డావ్.. నేను ఓ రాకుమారుడుని పెళ్లి చేసుకోబోతున్నాను అని అనామిక అంటుంది. ఏంటీ బ్రో.. నిజమా.. పెళ్లి చేసుకోవాలనుంకుంటున్నావా అని అప్పు అంటుంది. నిజమైతేనే నా బేబీ చెబుతుంది అని సామంత్ అంటాడు.

అయితే, నీకు అమ్మాయిల్లో ఫ్రెండ్స్ ఉంటే వారిని ఇప్పుడే కట్ చేసుకో. లేకుంటే వాళ్లకు నీతో అక్రమసంబంధం అంటగట్టి కోర్టుకు లాగుతుంది. అప్పుడు నువ్ లాక్కో లేక పీక్కోలేక చావాలి అని అప్పు అంటుంది. ఏయ్.. అని అనామిక అంటే.. అరవకు అని అప్పు బదులిస్తుంది. నువ్ అరిస్తే పడటానికి ఇది నీ అత్తిల్లు కాదు. నా ఏరియా. మాటలో మర్యాద పోతే.. నలుగురిలో నీ పరువు పోతుంది. సామంత్.. నేను చెప్పినట్లు నువ్ జాగ్రత్త పడకపోతే.. తను చేసే అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ ఉండాలి అని అప్పు అంటుంది.

నోరు మూయిస్తాను

అలా నా బేబీ చేయదు. మా ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ఉంది అని సామంత్ అంటాడు. అయితే, పూర్తిగా దీని మాయలో పడిపోయావన్నమాట. నిన్ను ఎవరు ఏం చేయలేరు. సరే వస్తా సూర్పణక. అదే అనామిక అని వెళ్లిపోతారు అప్పు, కల్యాణ్. మరోవైపు ఆ కావ్య వంట చేయకపోతే ఎవ్వరూ చేయలేరన్నట్లు బిల్డప్ ఇస్తున్నారు కదా అందరూ. ఈరోజు శాంతతో వంట చేయించి వీళ్ల నోరు మూయిస్తాను అని రాజ్ అనుకుంటాడు.

శాంతను పిలిచి నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. ఈరోజు నుంచి ఇంట్లో శాంతనే వంట చేస్తుంది అని రాజ్ అంటాడు. దాంతో అంతా షాక్ అయి లేచి నిల్చుంటారు. ఎందుకింత బలమైన నిర్ణయం తీసుకున్నావు రాజ్ అని రుద్రాణి అంటుంది. ఎవరో ఒకరు లేకపోతే ఇంట్లో వంట చేయడానికి లేరన్నట్లుగా ఉన్నారు కదా. దానికి ఇదే సమాధానం అని రాజ్ అంటాడు. అది సమాధానం కాదు.. ఆరోగ్య దానం అని ప్రకాశం అంటాడు.

శాంత వంట వద్దన్నట్లుగా అంతా మాట్లాడుతారు. శాంత వంట బాగుంటుందని రాజ్ అంటే.. నువ్వెప్పుడు తిన్నావని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. తిన్నాడులో ఓరోజు అని అపర్ణ అంటే.. చూశారా.. అమ్మే సాక్ష్యం అని రాజ్ అంటాడు. శాంత వంట తిని ఆరోగ్యంగా ఉన్నావారా అని ప్రకాశం అంటాడు. శాంత వంట చేయడం నాకు ఓకే కానీ, ముందుగా దాన్ని మా అత్తతో తినిపించాలి. తను ఆరోగ్యంగా ఉంటే.. మిగతావాళ్లం తిందాం అని స్వప్న అంటుంది.

శాంత వంటపై ప్రశంసలు

మీరంతా సైంటిస్ట్‌లు నేను ఎలకనా నా మీద ప్రయోగం చేయడానికి అని రుద్రాణి అంటుంది. అంతగా ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు అత్త. కావాలంటే ముందు నేనే తింటాను అని రాజ్ అంటాడు. వాడెందుకు అంత సాహసం చేస్తున్నాడని ప్రకాశం అంటాడు. చేయనిరా.. ఎవరి వంట ఎలా ఉంటుందో తెలిసి వస్తుందని సుభాష్ అంటాడు. దాంతో శాంత వంటను పొగుడుతాడు రాజ్. దానికి తన భర్త కూడా అంత గొప్పగా చెప్పలేదని శాంత తెగ సంబరపడిపోతుంది.

నా కొడుకు అంత ముచ్చటపడుతున్నాడు కదా. వెళ్లి వంట చేయు అని అపర్ణ అంటుంది. అలాగే అమ్మ.. ఇరగదీస్తాను. బాబు గారు వంటలు కుమ్మేస్తాను అని శాంత వెళ్లిపోతుంది. మరోవైపు వినాయక చవితికి ఆర్డర్స్ వచ్చాయా అని కావ్య అడుగుతుంది. నువ్ ఉన్నప్పుడు వచ్చినన్ని ఆర్డర్స్ తీసుకోలేదు. కొంతే తీసుకున్నాను అని మట్టి కలుపుతు చెబుతాడు కృష్ణమూర్తి. తను కూడా కలుపుతానని కూర్చుంటుంది. ఏసీ గదుల్లో పని చేస్తున్నావ్. ఇది ఎందుకు అని కృష్ణమూర్తి అంటాడు.

ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని కావ్య కూడా మట్టి కలుపుతుంది. దాంతో కనకం కోప్పడుతుంది. అత్తింట్లో ఉండాల్సిన దానివి నువ్ కూడా మట్టి పిసుకుతున్నావా. మీ నాన్నను అనాలి. నీకు ఏం చెప్పట్లేదు అని కనకం అంటుంది. నా మాట నువ్వెప్పుడు విన్నావ్ అని. నీ నోట్లోంచి ఊడిపడ్డ కూతురు మాత్రం ఎందుకు వింటుంది అని పంచ్ వేస్తాడు కనకం. కావాలంటే తనను అనమని కావ్య అంటుంది. తర్వాత కావ్య అత్తింటికి వెళ్లి హాస్పిటల్‌కు వచ్చిన అపర్ణను చూసి వస్తాను అని కనకం చెబుతుంది.

తినకముందే ఎందుకు

అత్తగారిని చూడాలని, తనతో ఉండాలని అనిపించింది. కానీ, మీ అల్లుడు గారు చేసినపనికి వెళ్లలేకపోతున్నాను అని తండ్రితో కావ్య అంటుంది. మరోవైపు అందరికీ శాంత భోజనం వడ్డిస్తుంది. ఆహా ఘుమఘుమలాడిపోతుందని రాజ్ అంటాడు. ప్రకాశం కౌంటర్ వేస్తాడు. దానికి వచ్చినట్లు చేసింది. తినకముందే ఎందుకు అనడం ఇందిరాదేవి అంటుంది. నీ వంట తెలీక అందరూ ఇలా అంటున్నారు అని రాజ్ అంటాడు.

అన్నం వేసుకోడానికి అందరూ ఎస్కేప్ అవుతారు. దాంతో నీకెవరు వంట చేయమని చెప్పారో వాళ్లకే వడ్డించమని అపర్ణ చెబుతుంది. దాంతో పాలకూర పప్పు, వంకాయ కర్రీలతో రాజ్‌కు అన్నం వండిస్తుంది శాంత. నోట్లో ముద్ద పెట్టుకున్న రాజ్ అలాగే ఉండిపోతాడు. అంతా ఏమైందిరా అంటారు. రేయ్ పనిమనిషి వంట గెలిపించడానికి నీ ప్రాణాలతో నువ్వే చెలగాటం ఆడుతున్నావురా అని ఇందిరాదేవి అంటుంది. రేయ్ అని అంతా పిలవడంతో.. కారం తట్టులేక అవస్థ పడతాడు రాజ్. దాంతో నీళ్లు తాగిస్తారు.

శాంత.. ఆరోజు అంత అద్భుతంగా వంట చేశావ్. ఇప్పుడేంటీ ఇలా చేశావ్ అని రాజ్ అంటే.. ఆరోజు వంట చేసింది కావ్య అని జరిగింది చెబుతుంది అపర్ణ. ఇంట్లో అందరికీ వంట చేసి కడుపునింపేది కావ్య అని ఇందిరాదేవి అంటుంది. శాంత వంట బాగా చేయలేదని చెప్పట్లేదు కాస్తా కారం ఎక్కువైందని రాజ్ అంటాడు. తిను.. నీకు ఆలి విలువే కాదు.. అన్నం విలువైనా తెలుస్తుంది అని అపర్ణ అంటుంది. కావ్యను రాజ్ తీసుకురానని అంటాడు.

దొందు దొందే

నువ్ కావ్యను ఎప్పుడు తీసుకొస్తావా అని ఎదురుచూస్తున్నాను. ఎంతో కాలం చూడటం కుదరదు. అప్పుడు నేను తీసుకునే నిర్ణయం నీకు ఇప్పుడు తెలియదు అని అపర్ణ అంటుంది. దాంతో రాజ్ వెళ్లిపోతాడు. మరోవైపు అనామిక, సామంత్ ఆఫీస్‌లోకి చేయి పట్టుకుని వెళ్తారు. అక్కడ మొగుడుని రోడ్డు మీద పడేసింది. ఇక్కడ బాస్‌ను పట్టుకుంది అని ఆఫీస్ లేడి ఎంప్లాయ్ అంటే.. మన బాస్‌ను కూడా రోడ్డుమీద పడేస్తుందా అని మరోకతను అంటాడు.

డబ్బు కోసం గడ్డి తినే మన బాస్‌కు ఇదే కరెక్ట్. దొందు దొందే అని లేడి ఎంప్లాయ్ అంటుంది. అనామికని తన చెయిర్‌లో కూర్చోబెడతాడు సామంత్. దాంతో సంబరపడిపోతుంది అనామిక. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కాలేజీలో ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా లవ్ చేయలేదు. ఇప్పుడు నా చాంబర్‌లో ఉంటే మిరాకిల్‌గా ఉందని సామంత్ అంటాడు. మనిద్దరం కలిసి బిజినెస్ చేస్తే ఎన్నో మిరాకిల్స్ చేయొచ్చు అని అనామిక అంటుంది.

ఏం చేసిన కంపెనీ రెండో ప్లేస్‌లోనే ఉంటుంది. వందేళ్ల చరిత్ర ఉన్న కంపెనీని పడగొట్టడం అంతా తేలిక కాదు సామంత్ అంటాడు. ఇప్పుడు దుగ్గిరాల ఉంట్లో పరిస్థితులు మారాయి. రాజ్ భార్య కావ్య వెళ్లిపోయింది. ట్రెండీగా ఉంటూనే ట్రెడిషనల్‌గా ఉండే డిజైన్స్ అందరూ కోరుకుంటున్నారు. అలా వేసే కావ్యను మనవైపుకు తిప్పుకోవాలి. కావ్య అంత రిచ్ కాదు. సొంతంగా బతకాలనుకుంటుంది. కావ్యను మనం అప్రోచ్ అవ్వలేం. అందుకు ఒకడు ఉన్నాడు. సందీప్ అని అనామిక చెబుతుంది.

కావ్యను ఒప్పించాలి

ఇంతలో ఒకతను వస్తాడు. ఇతను పేరు సందీప్. కావ్య డిజైన్స్‌ను ఇతనే అమ్మి పెట్టేవాడు. మన సిస్టర్ కంపెనీ ఉందిగా. ఈ మీడియేటర్‌ను ముందు పెట్టి వెనుక నుంచి మనం నడిపిస్తాం. నువ్ ఏం చేస్తావో నాకు తెలియదు. కావ్యను జాబ్‌లో ఒప్పించేలా చేయాలి అని అతనికి చెబుతుంది అనామిక. దాంతో సరేనని అతను వెళ్లిపోతాడు. కల్యాణ్‌కు నువ్ డివోర్స్ ఇచ్చి మంచి పని చేశావ్. లేకుంటే మనం ఒక్కటయ్యేవాళ్లం కాదు అని సామంత్ అంటాడు. దాంతో అనామిక నవ్వుతుంది.

మరోవైపు కావ్య వినాయకుడి విగ్రహానికి రంగులు వేస్తుంది. లేట్ అవుతుందని, పొద్దున చేసుకోవచ్చుకదా అని కృష్ణమూర్తి అంటాడు. తర్వాత వినాయకుడి పూజకు కావాల్సిన ఏర్పాట్లన్ని రాజ్‌తో చేయించాలని ఇందిరాదేవి అంటుంది. మంచి వినాయకుడి విగ్రహం తీసుకురావాలని చెబుతుంది ఇందిరాదేవి. కట్ చేస్తే సైకిల్‌పై వస్తున్న కావ్యను కారుతో ఢీ కొడతాడు రాజ్. ఇద్దరూ చూసుకుంటారు.