Brahmamudi September 19th Episode: భార్యగా నటిస్తే డబ్బులిస్తానన్న రాజ్, కావ్య 6 లక్షల పంచ్- అత్తింటికి వచ్చేసిన కళావతి
Brahmamudi Serial September 19th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 19వ తేది ఎపిసోడ్‌లో కోడలిగా నటించేందుకు కావ్యకు ఎంత కావాలో చెప్పమని చెక్ బుక్ తీస్తాడు రాజ్. దానికి తగ్గాఫర్ కౌంటర్ ఇచ్చి ఘోరంగా అవమానిస్తుంది కావ్య. తనకు బొమ్మను పంపిస్తానని కావ్య చెప్పిందని ఇంట్లో చెబుతాడు రాజ్.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో రాజ్ వెళ్లి కావ్యను ఇంటికి రమ్మని అడిగితే.. కావ్య రాదు. సరే అదే మాట మీద నిలబడి ఉండు, ఎప్పటికీ అదే మాట నిలబడి ఉండు. నువ్ రాకపోతే ఏం చేస్తాను. మా అమ్మ ఎన్ని అన్న పడతాను. నేను బుద్ధిలేక వచ్చానే అని రాజ్ అంటాడు. అవును అని కావ్య అంటుంది.
నువ్ తగ్గొచ్చు కదే
అవునా అని రాజ్ షాక్ అవుతాడు. ఇది కూడా మీరు చెబితేనే తెలిసింది అని కావ్య కౌంటర్ ఇస్తుంది. ఇంతలో కంగారుగా కృష్ణమూర్తి, కనకం వస్తారు. మీ అమ్మాయికి చెప్పండి జీవితంలో మీ ఇంటి గడప తొక్కను అని రాజ్ అంటే.. మీ అమ్మగారికి చెప్పండి జీవితంలో ఆ ఇంటి గడప తొక్కనని అని కావ్య బదులిస్తుంది. దాంతో రాజ్ వెళ్లిపోతాడు. ఒసేయ్.. ఏంటే ఇది. నువ్ తగ్గొచ్చు కదా అని కనకం అడుగుతుంది. ఆయన మనసులో ప్రేమ ఉంటే తగ్గేదాన్నే అని కావ్య అంటుంది.
వెళ్లిపోతున్న రాజ్ తల్లి అపర్ణ అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు. కారులో నుంచి చెక్ బుక్ తీసుకుని మళ్లీ కావ్య ఇంటికి వస్తాడు రాజ్. కనకం, కృష్ణమూర్తి బయట ఉంటారు. లోపల కూర్చున్న కావ్య దగ్గరికి రాజ్ వెళ్తాడు. అనాల్సిన మాటలు ఏమైనా ఉన్నాయా అని కావ్య అడుగుతుంది. నేను అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చాను. ఏ భర్త ఏ భార్యకు ఇవ్వని అమోఘమైన అవకాశం అని రాజ్ అంటాడు. అదేంటో ముందు చెప్పండి.. అమోఘమో, అద్భుతమో, చెండాలమో నేను చెబుతాను అని కావ్య అంటుంది.
రాజ్, కావ్య మాటలను కనకం, కృష్ణమూర్తి వింటూ ఉంటారు. నాకు మా అమ్మ ముఖ్యం. మా అమ్మకు నువ్ కోడలిగా ఆ ఇంట్లో ఉండటం ముఖ్యం. నువ్ రానని అంటున్నావు కాబట్టి.. ఒక సెన్సేషనల్ ఆఫర్ ఇద్దామనుకుంటున్నాను. నువ్ మా ఇంట్లో కోడలిగా నటించడానికి ఎంత కావాలి అని చెక్ బుక్, పెన్ తీస్తాడు రాజ్. అది విని కావ్య షాక్ అవుతుంది. కనకం నోరెళ్లబెడుతుంది. ప్యాకెజ్ కావాలా.. ఇన్‌స్టాల్‌మెంట్‌లో కావాలా.. నెల నెల జీతం కావాలా.. ఎలా కావాలంటే అలా ఇస్తా.. అడ్వాన్స్ పడేస్తే అని రాజ్ అంటాడు.
ఐదు లక్షలు డ్రామా చేస్తాను
ఎంత కావాలన్న ఇస్తారా అని కావ్య అంటుంది. బ్లాంక్ చెక్‌పై సంతకం చేశా.. ఎలా కావాలంటే అలా తీసుకో అని రాజ్ అంటాడు. ఒక్క నిమిషం అని లోపలికి వెళ్లిన కావ్య ఒక కవర్ తీసుకొస్తుంది. ఇంతకీ మీ నెల జీతం ఎంత అని కావ్య అడుగుతుంది. నా కంపెనీలో నాకు జీతమేంటీ.. కాకపోతే నెలకు ఓ ఐదు లక్షలు డ్రా చేస్తాను అని రాజ్ అంటాడు. హో.. మీ నెల జీతం ఐదు లక్షలు అన్నమాట అని కావ్య అంటుంది.
కవర్‌లో ఉన్న బంగారం బయటపెట్టి ఇదంతా ఒక ఆరు లక్షలు ఉంటుంది. ఇది అమ్ముకుంటారో.. దాచుకుంటారో.. ఇది తీసుకుని మా ఇంట్లో నెల రోజులు ఇంటి అల్లుడిగా నటించండి అని కావ్య అంటుంది. దాంతో రాజ్ షాక్ అవుతాడు. మీరు ఒక అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు. పరాయి మొగుడు కిరాయి పెళ్లాం అని కాన్సెప్ట్ తెచ్చారు. ఆరు లక్షలు అంటే మీరన్నదానికంటే ఎక్కువే. కానీ, మీలా పడేస్తా అని అనలేదు అని కావ్య దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తుంది.
అంతే బ.. అనబోయే.. అహంకారం అని రాలేదు అని కావ్య అంటుంది. నీకెంత ధైర్యం. ఈ దుగ్గిరాల వారసుడునే నెలకు కొనాలనుకుంటావా అని రాజ్ కోప్పడతాడు. అవసరం మీది. ఇంటి గడప తొక్కనని చెప్పి తొక్కారు. నాతో మీకే అవసరం ఉంది. మీరు నటించడానికి సిద్ధమంటే.. నెల రోజుల పాటు ఇంటి అల్లుడిగా మా ఇంట్లో ఉండి బొమ్మలకు రంగులు వేయండి. వచ్చే నెల సేమ్ ప్యాకెజ్‌తో మీ ఇంటికి వస్తాను. మీ అమ్మకు కోడలిగా ఎక్కువగానే చేస్తాను. ఎలా ఉంది నా సెన్సేషనల్ ఆఫర్ అని కావ్య అంటుంది.
ఒక్క మెట్టు దిగను
నన్ను అంతమాట అంటావా. నువ్వు నేను ఒక్కటేనా అని రాజ్ అంటాడు. మీకేమైనా కొమ్ములు ఉన్నాయా. సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటే ఎవరైతే ఏంటీ.. దుగ్గిరాల వారసుడు అయితే ఏంటీ.. సింపుల్‌గా ఐ డోంట్ కేర్ అని కావ్య ఘోరంగా అవమానిస్తుంది. ఇప్పటివరకు మా అమ్మ కోసం వంద మెట్లు దిగివచ్చాను. ఇక నుంచి జీవితంలో నీకోసం ఒక్క మెట్టు దిగను అని రాజ్ అంటాడు. మెట్లు దిగి దిగి ఆయాసపడుతున్నారు. నీళ్లు తాగుతార.. మూడు చెరువుల నీళ్లు గ్లాసులో పట్టవు లేండి అని కావ్య అంటుంది.
ఛీ ఇప్పటిదాకా నీతో మాట్లాడినందుకు అని రాజ్ అంటుంటే.. సిగ్గుపడుతూ వెళ్లండి.. ఇంకా ఇక్కడే ఉండి మీరు నోరు జారితే.. మీరు ఎన్ని మాటలు అంటారో.. నేను ఒకటి ఎక్కువే అంటాను. అంత రగిలిపోతుంది నాకు అని కావ్య అంటుంది. ఛీ.. అనుకుంటూ రాజ్ వెళ్లిపోతూ.. విన్నారా.. అంత విన్నారా.. బాగా.. అని అత్తమామలతో కోపంగా అని వెళ్లిపోతాడు రాజ్. ఏంటమ్మా ఇది అని కృష్ణమూర్తి అడిగితే.. పెళ్లాన్ని కిరాయిగా రమ్మన్న భర్తకు ఇంతకన్న సంస్కారంగా సమాధానం చెప్పడం రాదు అని కావ్య వెళ్లిపోతుంది.
ఇంటికి రాజ్ కోపంగా వస్తాడు. కావ్య రాలేదని రుద్రాణి, రాహుల్ సంతోషిస్తారు. నీ భార్య ఏదని ఇందిరాదేవి అడిగితే.. రాలేదని రాజ్ అంటాడు. రానని అంది. దానికి బదులు మట్టి బొమ్మ ఇస్తుందట. దాన్ని పెళ్లాం అనుకోవాలట అని రాజ్ అంటే.. అర్థమైందని ఇందిరాదేవి, అపర్ణ అంటారు. నువ్ తనను ఒక బొమ్మలా చూశావ్ అని ఇందిరాదేవి అంటుంది. నేను ఇప్పటికీ తప్పు చేయలేదనే అనుకుంటున్నాను అని రాజ్ అంటే.. అందుకే అది రానని అంది అని అపర్ణ అంటుంది.
బోడి సలహా ఎవరడిగారు
నీకు తీసుకురావాలని లేకపోతే అదెందుకు వస్తుందని అపర్ణ అంటే.. అవును, తీసుకురావాలని లేదు అని రాజ్ కోపంగా వెళ్లిపోతాడు. వీడు ఎంత బాధపెడితే.. అంత పట్టుదలగా ఉంటుంది అని అపర్ణ అంటుంది. కావ్య మనసు విరిగిపోయింది అపర్ణ. ఏం చేస్తే వాళ్లిద్దరు కలుస్తారు అని ఇందిరాదేవి అంటుంది. వాళ్లకు కలవడం ఇష్టంలేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి అని రుద్రాణి అంటుంది. అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే అలాగే ఉంటుంది. మీ బోడి సలహా ఎవరడిగారు అని స్వప్న అంటుంది.
కావ్యను వెళ్లగొట్టమని వంద సార్లు అంది మా అత్తే. కాబట్టి మా అత్తనే పంపిద్దాం. కావ్య కాళ్లపై తల పెట్టి నువ్ వస్తేనే నన్ను ఇంట్లోకి రానిస్తారని చెప్పిద్దాం అని స్వప్న అంటుంది. ఇది కాళ్లు లాగే టైప్ అని చచ్చినా అలా చేయనివ్వదు. భర్తకు గౌరవం ఇచ్చేవాళ్లు కావాలి. భర్తను ఎగిరి తన్ని వచ్చి పుట్టింట్లో పడే వాళ్లను కాదు ప్రకాశం అంటాడు. నా కొడుకు జీవితం ఇలా కావడానికి వీళ్లేదు.. ఇద్దరిలోనూ ఒకరిపై ఒకరికి ఇష్టం ఉంది. కానీ, బయటపడకుండా గొడవ పడుతున్నారు. ఏం చేసైనా సరే నా కోడలిని ఇంటికి తీసుకురావాలి అని అపర్ణ అంటుంది.
మరోవైపు పొట్టి నీకు గుడ్ న్యూస్ అని కల్యాణ్ అంటే.. కొంపదీసి నువ నెల తప్పావా అని అప్పు కౌంటర్ ఇస్తుంది. కావ్య ఇంటికి రాజ్ వెళ్లడం, గొడవ పడటం గురించి కల్యాణ్ చెబుతాడు. వదిన ఇంటికి వచ్చేవరకు పెద్దమ్మ ఊరుకోదు. ఆ నమ్మకం నాకుందని కల్యాణ్ అంటుంటే.. కానీ, నాకు నమ్మకం పోయిందని ఇంటి ఓనర్ భర్త ఎంట్రీ ఇస్తాడు. నెల తిరిగేసరికి ఇంటి రెంట్ కట్టాలని ముందే రూల్ పెట్టా. రెండు రోజులు అవుతుంది. ఎక్కడ రెంట్ అని ఓనర్ అడుగుతాడు.
రాజ్ అంతరాత్మ
ప్రస్తుతానికి డబ్బులు లేవు. కొంచెం టైమ్ ఇవ్వమని అడుగుతారు. ఓనర్‌పై అప్పు సెటైర్లు వేస్తుంది. కంగారుపడకు బాబాయ్.. రెండు రోజుల్లో రెంట్ ఇస్తాను అని కల్యాణ్ అంటాడు. దాంతో ఇంటి ఓనర్ వెళ్లిపోతాడు. రెంట్ గురించి ఏం చేద్దామని అప్పు అంటే.. జాబ్ చేస్తున్నా కదా. మా మేనెజర్ దగ్గర అడ్వాన్స్ అడుగుతాలే అని కల్యాణ్ చెబుతాడు. మరోవైపు రాత్రి రాజ్ ఆలోచిస్తుంటాడు. రాజ్ అంతరాత్మ బయటకు వస్తుంది.
రాజ్ మాట్లాడినా అలాగే చూస్తూ ఉంటుంది అంతరాత్మ. నేను తప్పు చేయను. తప్పు చేసిన వాళ్లను క్షమించను. సరే, కళావతి ఇంటికి వెళ్లి తప్పుగా మాట్లాడననేగా అని రాజ్ అంటాడు. కట్ చేస్తే పడుకున్న రాజ్‌ను కావ్య నిద్రలేపుతుంది. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న పెనిమిటీ గారు లేవండి అని కావ్య అంటుంది. కావ్యను చూసి రాజ్ షాక్ అవుతాడు. నువ్ వచ్చావా.. ఓహో.. నేను నిన్న అన్నమాటలకు భయపడి, హడలిపోయి, బాధపడి వచ్చావన్నమాట అని రాజ్ అంటాడు.