Mathu Vadalara 2 OTT: ఓటీటీలోకి అప్పుడే కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ మత్తు వదలరా 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?-telugu comedy movie mathu vadalara 2 likely to ott streaming on netflix faria abdullah sri simha mathu vadalara 2 review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mathu Vadalara 2 Ott: ఓటీటీలోకి అప్పుడే కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ మత్తు వదలరా 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mathu Vadalara 2 OTT: ఓటీటీలోకి అప్పుడే కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ మత్తు వదలరా 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Sep 13, 2024 01:56 PM IST

Mathu Vadalara 2 OTT Streaming: తాజాగా థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటున్న తెలుగు కామెడీ సినిమా మత్తు వదలరా 2. సెప్టెంబర్ 13న రిలీజైన మత్తు వదలరా 2 ఓటీటీ స్ట్రీమింగ్‌పై క్యూరియాసిటీ నెలకొంది. ఈ నేపథ్యంలో కడుపుబ్బా నవ్వించే మత్తు వదలరా 2 డిజిటల్ స్ట్రీమింగ్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌‌పై లుక్కేస్తే..

ఓటీటీలోకి అప్పుడే కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ మత్తు వదలరా 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి అప్పుడే కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ మత్తు వదలరా 2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Mathu Vadalara 2 OTT Release: హారర్ తర్వాత కామెడీ సినిమాలకు మంచి బజ్ ఉంటుంది. ఎలాంటి క్రింజ్ లేకుండా నవ్వించే హెల్తీ కామెడీ చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తుంటారు. అలా 2019లో కామెడీ జోనర్‌కు క్రైమ్ యాడి చేసి సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా మత్తు వదలరా.

ప్రభాస్ రిలీజ్ చేయడంతో

ఆ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మత్తు వదలరాకు సీక్వెల్‌గా తెరకెక్కిన సినమానే మత్తు వదలరా 2. ఎమ్ఎమ్ కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీకి రితేష్ రానా దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మత్తు వదలరా 2 ట్రైలర్‌ను ప్రభాస్ రిలీజ్ చేయడంతో హ్యూజ్ బజ్ క్రియేట్ అయింది.

కడుపుబ్బా నవ్వించే కామెడీ

మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన మత్తు వదలరా 2 సినిమా సెప్టెంబర్ 13న అంటే ఇవాళ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. మీమ్స్‌ను కామెడీగా వాడుకుంటూ కడుపుబ్బా నవ్వించేలా మూవీ ఉందని ట్విటర్‌లో నెటిజన్స్ చెబుతున్నారు.

ఫరియా అబ్దుల్లా స్క్రీన్ ప్రజెన్స్

అలాగే, సత్య, వెన్నెల కిశోర్ కామెడీ అదిరిపోయిందని చెబుతున్నారు. అలాగే, జాతి రత్నాలు చిట్టి ఫరియా అబ్దుల్లా, సునీల్, అజయ్ స్క్రీన్ ప్రజన్స్ చాలా అట్రాక్ట్ చేసిందని, యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగున్నాయని అంటున్నారు. ఇలా ఫుల్ పాజిటివ్ టాక్‌ తెచ్చుకుంటున్న మత్తు వదలరా 2 ఓటీటీ రిలీజీ, డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌పై మంచి క్యూరియాసిటీ నెలకొంది.

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో

మత్తు వదలరా 2 ఓటీటీ రైట్స్ కోసం భారీగానే డిజిటల్ సంస్థలు పోటీ పడిటనట్లు సమాచారం. కానీ, వాటన్నింటిని దాటుకుని మంచి ధరకు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ మత్తు వదలరా 2 హక్కులు కొనుగోలు చేసిందట. మత్తు వదలరా 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ అని మూవీ టైటిల్ కార్డ్స్‌లో ప్రకటించినట్లు సమాచారం. దీంతో ఈ సినిమా ఓటీటీ పార్టనర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

4 వారాల తర్వాతే

ఇక థియేట్రికల్ రిలీజ్ డేట్‌కు నాలుగు వారాల తర్వాతే మత్తు వదలరా 2ను ఓటీటీ స్ట్రీమింగ్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ సంస్థతో మేకర్స్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ లెక్కన ఇవాళ (శుక్రవారం) థియేటర్లలో విడుదలైన మత్తు వదలరా 2 అక్టోబర్ మూడో వారంలో ఓటీటీ రిలీజ్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అమెజాన్ ప్రైమ్‌లో మత్తు వదలరా

ఈ విషయంపై ఇప్పటికీ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. మూవీ టాక్, బాక్సాఫీస్ కలెక్షన్స్ అన్ని చూసుకుని నాలుగు వారాల తర్వాత కానీ దానికంటే ముందు కూడా మత్తు వదలరా 2 ఓటీటీ రిలీజ్ చేసేందుకు కూడా ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా మొదటి పార్ట్ మత్తు వదలరా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. రెండో పార్ట్‌కు మాత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్ మారడం గమనార్హం.