OTT: 15 కోట్ల బడ్జెట్, బోల్డ్ సీన్స్ ఏం లేవు.. అయినా బాక్సాఫీస్ షేక్, నేషనల్ అవార్డ్ సొంతం.. ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే?
777 Charlie OTT Streaming: రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 777 చార్లీ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడమే కాకుండా నేషనల్ అవార్డ్ సైతం అందుకుంది. ఒక్క స్టార్ హీరో తప్పా బోల్డ్ సీన్స్, యాక్షన్, రొమాన్స్ వంటి స్పైసీ అంశాలు ఏం లేకుండా అవార్డ్ కొల్లగొట్టిన 777 చార్లీ మూవీ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఉందంటే..
National Award Film OTT Platform: 2024లో, ఆవేశం, మహారాజ, హనుమాన్‌తోపాటు మరిన్ని ప్రాంతీయ చిత్రాలు సంచలనం సృష్టించాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులతో ప్రశంసలు పొందాయి. అయితే, ఈ సినిమాలకంటే ముందు 2022 సవంత్సరంలో కూడా ఓ సినిమా ఇలా వరల్డ్ వైడ్‌గా అనేక ప్రశంసలు పొందింది.
బోల్డ్ సీన్స్
అలాగే బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టి, జాతీయ అవార్డును (National Award) కూడా గెలుచుకుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమాలో ఒక్క సూపర్ స్టార్ తప్పా ఇంకో లీడ్ హీరోయిన్ లేదు. అంతేకాకుండా ఆ సినిమాలో యాక్షన్, రొమాన్స్ లేదా ఐటెం సాంగ్, బోల్డ్ సీన్స్ వంటి స్పైసీ అంశాలు ఏవి లేవు.
అవేవి లేకున్నప్పటికీ కూడా ఈ చిత్రం బడ్జెట్ కంటే 7 రెట్లు బాక్సాఫీస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా ఏదో కాదు.. కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నటించిన 777 చార్లీ. ఈ మూవీ భారతీయ కన్నడ-భాష అడ్వెంచర్ డ్రామా చిత్రం. ఈ సినిమాను కిరణ్ రాజ్ కె. రచించడంతోపాటు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను పరమవా స్టూడియోస్ నిర్మించింది.
15 కోట్ల బడ్జెట్
ఈ సినిమాలో టైటిల్ రోల్ అయిన చార్లీగా లాబ్రడార్ అనే పెట్ డాగ్ కీ రోల్ పోషించింది. ఇక మరో ప్రధాన పాత్రలో రక్షిత్ శెట్టి నటించారు. ఆయనతోపాటు సంగీత శృంగేరి, రాజ్ బి. శెట్టి, డానిష్ సైత్, బాబీ సింహా, అనిరుద్ధ్ రాయ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఒంటరిగా జీవించే ఫ్యాక్టరీ కార్మికుడు, విచ్చలవిడిగా తిరిగే లాబ్రడార్ కుక్క మధ్య ప్రయాణం, ఇద్దరి మధ్య బంధం కథాశంగా నడుస్తుంది.
777 చార్లీ సినిమాను రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరెక్కించారు. ఈ సినిమా 2022 జూన్ 2న అతి తక్కువ థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత జూన్ 10న అధిక థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాలోని పాత్రల (ముఖ్యంగా రక్షిత్ శెట్టి, చార్లీ) నటనకు, రచన, ఎమోషనల్ సీన్స్, దర్శకత్వం పట్ల విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి.
102 కోట్ల కలెక్షన్స్
ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు, ప్రధాన నటీనటుల మధ్య రొమాన్స్ లేకుండా ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంది. ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్స్ నివేదిక ప్రకారం, 777 చార్లీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 102 కోట్లు వసూలు చేసిందని సమాచారం. ఈ సినిమా విడుదలైనప్పుడు అత్యధిక వసూళ్లు సాధించిన ఐదో కన్నడ చిత్రంగా నిలిచింది.
అంతేకాకుండా 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో (69th National Film Awards) 777 చార్లీ సినిమా కన్నడలో ఉత్తమ చలనచిత్రంగా అవార్డును గెలుచుకుంది. ఇదిలా ఉంటే, ఇందులో హీరోగా మేకర్స్ మొదట అరవింద్ అయ్యర్‌ని తీసుకుందామని అనుకున్నారట. కిరిక్ పార్టీలో తనతో కలిసి పని చేసిన అరవింద్‌ను సిఫార్సు చేశారట రక్షిత్ శెట్టి.
కరోనా కారణంగా
దాంతో ఈ సినిమాకు మొదట అరవింద్ హీరోగా సెలెక్ట్ అయ్యారు. కానీ, కోవిడ్-19 కారణంగా సినిమా నిర్మాణం ఆలస్యం అవుతూ వచ్చింది. దాంతో ఆ నటుడు చిత్రం నుంచి తప్పుకున్నాడు. 2017లో ఈ సినిమాను ప్రకటించినప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా విడుదలకు 5 సంవత్సరాలు పట్టింది.
కాగా.. 777 చార్లీ సినిమా విడుదలైన తర్వాత లాబ్రడార్ పెట్ డాగ్స్‌కు డిమాండ్ చాలా పెరిగిందని సమాచారం. ఈ సినిమా తర్వాతే చార్లీ అనే స్నిఫర్ డాగ్‌ను మంగళూరు పోలీసు శాఖలో చేర్చారు. ఇదిలా ఉంటే, ఎంతో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 777 చార్లీ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ సినిమా ప్రైమ్‌లో కేవలం కన్నడ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది.