Mathu Vadalara 2 Teaser: మత్తు వదలరా 2 టీజర్ వచ్చేసింది.. మరిన్ని నవ్వులు, థ్రిల్ పంచుతూ..
Mathu Vadalara 2 Teaser: మత్తు వదలరా మూవీకి సీక్వెల్ గా వస్తున్న మత్తు వదలరా 2 టీజర్ శుక్రవారం (ఆగస్ట్ 30) రిలీజైంది. ఈ సినిమా మరింత ఫన్, థ్రిల్ పంచుతూ సాగనున్నట్లు టీజర్ చూస్తేనే స్పష్టమవుతోంది. ఈ మూవీ సెప్టెంబర్ 13న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.
Mathu Vadalara 2 Teaser: మత్తు వదలరా.. ఐదేళ్ల కిందట ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజై సంచలన విజయం సాధించిన సినిమా ఇది. ఊహించని ట్విస్టులతో ఏదో సాదాసీదా సినిమా కాదని నిరూపించింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ గా మత్తు వదలరా 2 వస్తోంది. తాజాగా శుక్రవారం (ఆగస్ట్ 30) ఈ మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
మత్తు వదలరా 2 టీజర్
శ్రీ సింహను టాలీవుడ్ లో హీరోగా లాంచ్ చేసిన డైరెక్టర్ రితేష్ రాణా. మత్తు వదలరా మూవీతోనే ఐదేళ్ల కిందట అతడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా అసలు అంచనాలు లేకుండా వచ్చి ఊహించని విజయం సాధించింది. సరిగ్గా ఇదే డైలాగుతో మత్తు వదలరా 2 టీజర్ కూడా ప్రారంభం కావడం విశేషం.
అయితే ఈసారి అదే శ్రీసింహ, సత్య తమ కామెడీని డబుల్ చేయడంతోపాటు.. వెన్నెల కిశోర్, సునీల్, ఫరియా అబ్దుల్లాలాంటి వాళ్లు సీక్వెల్ కు మరింత బలం కానున్నారు. టీజర్ మొత్తం కామెడీనే నమ్ముకొని సాగింది. సెప్టెంబర్ 13న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కడుపుబ్బా నవ్వించడం ఖాయం అని టీజర్ చూస్తేనే తెలుస్తోంది.
వెల్‌కమ్ టు హి టీమ్
మత్తు వదలరా మూవీని చాలా సింపుల్ గా ఓ అపార్ట్‌మెంట్‌లో ఊహించని ట్విస్టులతో తీశాడు డైరెక్టర్ రితేష్ రాణా. అయితే ఈ సీక్వెల్ ను మాత్రం అతడు మరింత ఘనంగా తీసుకురాబోతున్నాడు. తొలి పార్ట్ లో ఫుడ్ డెలివరీ ఏజెంట్లుగా నవ్వులు పంచిన శ్రీ సింహ, సత్య ఈ సీక్వెల్లో హి టీమ్ అనే ఓ కొత్త టీమ్ లో చేరతారు.
అక్కడ అదనపు ఆదాయం కోసం దొంగతనాలకు పాల్పడతారు. ఇందులోనూ హి టీమ్ ఏజెంట్లుగా ఉన్నా.. ఆ దొంగతనాలను మాత్రం వదలరు. వీళ్లకు తోడు వెన్నెల కిశోర్, టీవీ సీరియల్ ఎపిసోడ్లు ఈ టీజర్ లో మరింత నవ్వులు పూయించాయి. కాల భైరవ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదనపు ఆకర్షణగా చెప్పొచ్చు. క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించాయి. ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ సెప్టెంబర్ 13న థియేటర్లలో రిలీజ్ కానుంది.